← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర రూపుడు sahasra rūpuḍu

Original — తెలుగు
  1. అనేన పరవ్యూహ నిభవాద్యవచ్ఛేద కోడీకృతానాం తా ప్రాకృత నిగ్రహత్వం దర్శితం - యదేకాదిత్య మండలవర్తి రూపం తత్సమానం అనంత బ్రహ్మాండేషు ఆదిత్యమండల వర్త్య సంఖ్యాతం రూపం, ఏవం శ్రీ విశ్వరూపాది, రూపాంతరేష్వపి -

(పరవాసుదేవ వైభవము మొదలగు అనంతమైన ప్రాకృత రూపములను క్రోడీకృతముగా చేయబడిన రూపము అని అర్థము. సూర్యమండల మధ్యవర్తి యని చెప్పినపుడు ఏదో యొక సూర్యమండల మధ్యనున్నది యని కాదు. అనంత బ్రహ్మాండములలో నుండు సూర్యమండలములన్నింటియందు మధ్యనుండి వాటికి ఆ రశ్మిని తేజస్సును శక్తినిచ్చునది. ఆ ప్రకారముగానే విశ్వరూపడనినను, ఇతర రూపముల గుఱించి చెప్పినను అర్థము చేసుకొనవలెను).

  1. “పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప”, “త్వయాతతం విశ్వమనంతరూప” (శ్రీమద్భగవద్గీత - 11 - 16, 11 - 38)

(ప్రపంచమునకు ఈశ్వరుడైనవాడా, విశ్వమే, ప్రపంచమే రూపమైనవాడా - అనేక రూపములు నీవే అయినవాడుగ నిన్ను చూచుచున్నాను), (అనంత రూపములు గలవాడా, ఈ ప్రపంచమంతయు నీవే పూర్తిగా వ్యాపించియున్నావు).

Transliteration
  1. anēna paravyūha nibhavādyavacchēda kōḍīkṛtānāṃ tā prākṛta nigrahatvaṃ darśitaṃ - yadēkāditya maṃḍalavarti rūpaṃ tatsamānaṃ anaṃta brahmāṃḍēṣu ādityamaṃḍala vartya saṃkhyātaṃ rūpaṃ, ēvaṃ śrī viśvarūpādi, rūpāṃtarēṣvapi -

(paravāsudēva vaibhavamu modalagu anaṃtamaina prākṛta rūpamulanu krōḍīkṛtamugā cēyabaḍina rūpamu ani arthamu. sūryamaṃḍala madhyavarti yani ceppinapuḍu ēdō yoka sūryamaṃḍala madhyanunnadi yani kādu. anaṃta brahmāṃḍamulalō nuṃḍu sūryamaṃḍalamulanniṃṭiyaṃdu madhyanuṃḍi vāṭiki ā raśmini tējassunu śaktiniccunadi. ā prakāramugānē viśvarūpaḍaninanu, itara rūpamula guṟiṃci ceppinanu arthamu cēsukonavalenu).

  1. “paśyāmi viśvēśvara viśvarūpa”, “tvayātataṃ viśvamanaṃtarūpa” (śrīmadbhagavadgīta - 11 - 16, 11 - 38)

(prapaṃcamunaku īśvaruḍainavāḍā, viśvamē, prapaṃcamē rūpamainavāḍā - anēka rūpamulu nīvē ayinavāḍuga ninnu cūcucunnānu), (anaṃta rūpamulu galavāḍā, ī prapaṃcamaṃtayu nīvē pūrtigā vyāpiṃciyunnāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.