← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శైవాగమములు śaivāgamamulu

Original — తెలుగు

ఈశ్వరుని అయిదు ముఖములనుండి పుట్టినవి. పతి, పశువు, పాశము అను వాటిని గుఱించి ప్రతిపాదించునవి. పతి అనగా శివుడు, (పశుపతి), పశువు అనగా జీవుడు - ఈ జీవుడు తాను పరమశివుని రూపమే అని తెలుసుకొనలేకుండునట్లు అజ్ఞానము (సంసారము) అను పాశముతో కట్టుబడియుండుటవలన పశువు అని చెప్పబడుచున్నాడు - అట్టి పశువులకు తనయందు భక్తి కల్పించి సంసారమునుండి మోక్షము నిచ్చువాడు కనుక శివుడు పశుపతి యని చెప్పబడుచున్నాడు.

Transliteration

īśvaruni ayidu mukhamulanuṃḍi puṭṭinavi. pati, paśuvu, pāśamu anu vāṭini guṟiṃci pratipādiṃcunavi. pati anagā śivuḍu, (paśupati), paśuvu anagā jīvuḍu - ī jīvuḍu tānu paramaśivuni rūpamē ani telusukonalēkuṃḍunaṭlu ajñānamu (saṃsāramu) anu pāśamutō kaṭṭubaḍiyuṃḍuṭavalana paśuvu ani ceppabaḍucunnāḍu - aṭṭi paśuvulaku tanayaṃdu bhakti kalpiṃci saṃsāramunuṃḍi mōkṣamu niccuvāḍu kanuka śivuḍu paśupati yani ceppabaḍucunnāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.