← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాకారబ్రహ్మ sākārabrahma

Original — తెలుగు
  1. ఆకారముతో, రూపముతో - “భక్తులు గోరినభంగి నే రూపైన బొందువానికి”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. -)

  2. “శబ్ద స్పర్శ రూప రస గంధంబులనియెడు గుణంబులచేత పరిగ్రహింపబడిన మంగళ సుందర విగ్రహుండు:

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా.-)

  1. “విశ్వరూప సందర్శనానంతరం”

“నాహం దైః న తపసా, న దానేన, న చేజ్యయా |

శక్య ఏవం విధోద్రష్టుం దృష్టవానసి మాం యథా ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 53)

ఇతి సాకారం వస్తు.

“భక్త్యా త్వనన్య యా శక్య అహమేవంవిధోర్జున |

జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 54)

యది ద్రష్టు మ శక్యస్త్వం తపో వేదాధ్విరాధిభిః |

కేనోపాయేన తత్తర్హి ద్రష్టుం శక్యో ని చేతిచేత్ |

సాధనాంతర వ్యావృత్యైతు శబ్దో బోద్ధ్య ఉత్తమైః ||

మదేక నిష్ఠయా ప్రేమ భక్త్యైవాహం మహేశ్వరః |

దివ్య రూపధరో జ్ఞాతుం శక్యశ్శాస్త్రాన్నరోత్తమైః |

సాక్షాత్కర్తుం స్వరూపేణ వేదవాక్యోత్థయా ధియా |

శక్యశ్చాస్మి సదా సదా ప్రేమ భక్త్వై వారాధితో జనైః |

సాక్షాత్కారా దవిద్యా తత్కార్య హాన్యాచ తత్వతః |

మత్స్వరూపతయై వాప్తుం శక్యోహం హే పరంతప |

అనన్య యైవ భక్త్యాత్వం మా మాశ్రయార్జున ||. (గీతాభావప్రకాశము - 11 - 211- 216)

(శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపమును అర్జునునకు చూపించిన తర్వాత ఇట్లు చెప్పెను - వేదములను అధ్యయనము చేయుటచేతగాని, దానముచేతగాని, యజ్ఞయాగాదులచేతగాని ఇప్పుడు నీవు చూచిన నా రూపము - విశ్వరూపము - ప్రపంచమే అయిన తన రూపము - చూచుటకు శక్యముకాదు. అనన్య భక్తి చేతనే ఇట్లు నన్ను చూచుటగాని, తెలుసుకొనుటకు గాని (నా తత్వమును తెలుసుకొనుటకుగాని) నాలో ఏకమగుటకుగాని, శక్యమగును. వేదాధ్యయనము, తపస్సు మొదలగువాటిచేత భగవంతుని స్వరూపము - కంటికి కనబడు రూపముతో నున్నవాడిని - విశ్వరూపుని - స్థూలరూపము గలవానిని చూచుటకు శక్యము కానియడల ఇకనేయుపాయము వలన చూచుటకు శక్యమగునో అనగా నా యందే నిష్ఠ కలిగియుండి, నాయందు ప్రేమ భక్తి కలవాడు మహేశ్వరుడు, దివ్యరూపధరుడు అయిన నన్ను తెలుసుకొనగలడు - వేద వాక్యములవలన కలిగిన జ్ఞానముచేత నన్ను సాక్షాత్కరించుకో గలడు నా సాక్షాత్కారము వలన అవిద్యా (అజ్ఞానము) దాని కార్యములు తొలగిపోవును - అందుచేత నీవు అనన్య భక్తితో నన్ను ఆశ్రయించుము - భజింపుము).

  1. “ఏవం మత్కర్మకృత్” ఇత్యాద్యనంతరప్రకారేణ సతత యుక్తాః వైరంతేర్యేణ భగవత్కర్మాదౌ సావధానతయా ప్రవృత్తాః భక్తాః సాకారవస్త్వేక శరణాః సంతః యత్ పర్యుపాసతే సతతం చింతయంతి తత్.

“గీతా శాస్త్రస్య సర్వస్య సారభూతో అర్థ ఆదరాత్ |

నిఃశ్రేయసార్ధినాం సమ్యక్ అనుష్ఠానాయ చాధునా పుంజీ కృత్యోచ్యతే శ్రీమద్ధరిణా కరుణాబ్దినా |

మదర్థం కర్మ వేదోక్తం కుర్వన్యో మత్పరాయణః |

సుప్రాప్యత్వేన యస్యాహం నిశ్చితో నాపరోర్థకః |

మదవాప్త్యా శయానశ్చ మద్భక్తః సర్వధోత్తమః |

మామేవ సర్వథా ప్రీత్త్యా సర్వోత్సాహేన సర్వదా |

సర్వాత్మనా యో భజతే మత్ప్రేమ్ణా (ఆ)విష్టమానసః |

పుత్ర విత్త కళత్రాదౌ భోగేషు స్నేహ వర్జితః |

సర్వ భూతేషు మద్బుద్ధ్యా త్యక్త శత్రుమతిః పుమాన్ |

స్వస్యాత్యం తాపకారాది వృత్తేష్వప్యుపకారకృత్ |

ఈదృశో దంభ శూన్యో యో మద్భక్తో మాముపైతి సః |

పరాగతి రహం తస్యా హరిరేవ న చాపరా |

అయమర్థస్త్వయా జ్ఞాతు మిష్టో (అ)తస్తే మయోదితః |

నాతః పరంచ కర్తవ్యం కించి దిత్యాశయో హరేః ||“. (గీతాభావప్రకాశము - 11 - 216 to 223)

(శ్రీమద్భగవద్గీతా శాస్త్రమంతటికి సారమైన అర్థమును నిఃశ్రేయస్సును కోరువారు అనుష్టించుటకు దయా సముద్రుడైన శ్రీకృష్ణభగవానుని చేత పుంజీకృతము చేయబడి చెప్పబడినది - నా నిమిత్తమై - నా కొఱకు - వేదములో చెప్పబడిన కర్మ చేయుచు మత్పరాయణుడైనవాడు (నేనే పరమ మోక్షస్థానమని తలచువాడు); పొంద తగిన వాడనని తలచువాడు, ఇంతకంటె పురుషార్థము లేదని తలచువాడు, నన్ను పొందుటే ఆశయముగా గలవాడు నా భక్తుడు, అన్ని విధముల ఉత్తముడు, నన్నే అన్ని ప్రకారముల భక్తితో. ఉత్సాహముతో, నేనే అన్నింటికి ఆత్మయని నన్ను భజించువాడు, నా భక్తితో నిండిన మనస్సు కలవాడు, భార్యా పుత్రులందు, ధనధాన్యములందు, భోగములందు అనురాగము లేనివాడు, భూతములన్నియు నేనే యను బుద్ధితో - జ్ఞానముతో నమ్మకముతో నుండుటవలన, దేనియందును, ఎవరియందును శతృత్వబుద్ధి లేనివాడు, తనకు గొప్ప అపకారము చేసినప్పటికీ ఉపకారము చేయువాడు, దంభము లేనివాడు, అయిన నా భక్తుడు నన్ను చేరును - అట్టివానికి నేను పరమగతి - ఉత్తమమై పొందతగిన వస్తువు - మోక్షస్థానము - నాకు ఇష్టుడవుకాన ఈ విషయము నీకు తెలియ చేసితిని. ఇంతకంటె చేయవలసినది లేదు -

  1. యస్యాగ్నిరాస్యం, ద్యౌ ర్మూర్ధా, ఖం నాభిః చరణౌ క్షితిః, సూర్యశ్చక్షుః, దితశ్శ్రోత్రం, తస్మై లోకాత్మనే నమః.

(ఎవనికి అగ్ని ముఖమో, ద్యులోకము శిరస్సో, ఆకాశము నాభియో, భూమి పాదములో, సూర్యుడు నేత్రములో, దిక్కులు చెవులో అట్టి లోకాత్మునకు - లోకమే శరీరముగా గావానికి నమస్కారము).

  1. “యస్య పృధివీ శరీరం”, “యస్యాత్మ శరీరం”, “యస్యావ్యక్తం శరీరం”, “యస్యాక్షరం శరీరం”, “ఏష సర్వభూతాంతరాత్మా, అపహతపాప్మా, దివ్యో దేవః, ఏకోనారాయణః” ఇత్యాది భిర్వాక్యైః, చిదచిదోః, సర్వావస్థావస్థిత యోః పరమాత్మ శరీరతాం, పరమాత్మనః తాదాత్మ్యతాం చ ప్రతిపాద్య శరీరభూత పరమాత్మాభిదా యిభిః స బ్రహ్మాది శబ్దైః కారణావస్థః కార్యావస్థశ్చ పరమాత్మా ఏక ఏవేతి పృథక్ ప్రతిపన్నం. వస్తుతి తయం - “సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్”; “ఏతదాత్మ్యమిదం సర్వం” “సర్వం ఖిల్విదం బ్రహ్మ” ఇత్యాది వాక్యం ప్రతిపాదయతి. చిదచిద్వస్తు శరీరిణః పరమాత్మనః శబ్దేన అభిధానే నాస్య విరోధః, యధా మనుష్య పిండశరీర కస్యాత్మ విశేషస్య - ” అయమాత్మా సుఖీ” ఇత్యాత్మ శబ్దేనాభిదానేన ఇత్యలమితి విస్తరేణ (శ్రీమాన్ రామానుజః)

(ఎవనికి భూమి శరీరమో, ఎవనికి ఆత్మ శరీరమో, ఎవనికి అవ్యక్తము (ప్రకృతి) శరీరమో, ఎవనికి అక్షరము శరీరమో అట్టివాడు సమస్త భూతములందు అంతరాత్మగా నున్నాడు, పాపములు లేనివాడు, దివ్యమైన దేవుడు ప్రకాశించువాడు ఒకడేయగు నారాయణుడు అగునట్టి వాక్యములతో ఏ అవస్థలోనున్న వైనను చిత్ అచిత్ (ఆత్మ, అనాత్మ వస్తువులు పరమాత్మ శరీరములు పరమాత్మ తాదాత్మ్యములు అని ప్రతిపాదించి (చెప్పి) శరీరమైన పరమాత్మయని బ్రహ్మ మొదలగు శబ్దములచే కారణావస్థలోను, కార్యావస్థలోను ఉన్న - (అనగా, కారణములు, కార్యములు - మట్టి, కుండ) తానేయగు పరమాత్మ ఒకడే అని ప్రతిపాదించబడినది. సౌమ్యుడా, ఈ సృష్టి అంతయు, సృష్టికి ముందు, ఒక్క ‘సత్’ పదార్థముగానే - పరమాత్మగానే ఉండెను అనిన్నీ - “ఇదంతయు ఆత్మయే - ఈ ప్రపంచమంతయు బ్రహ్మయే” అను మొదలగు వాక్యములు ప్రతిపాదింపబడినవి. చిదచిద్వస్తువులన్నియు (ఆత్మ అనాత్మ వస్తువులన్నియు) పరమాత్ముని శరీరములే అని చెప్పుటవలన విరోధము లేదు. మనుష్య శరీరముగల ఆత్మ గుఱించి “ఈ ఆత్మ సుఖముగా నున్నది” అని వ్యవహరించుచున్నట్లే.

  1. వైకుంఠస్సాకారో నారాయణస్సాకారశ్చ తురీయం తు నిరాకారం; సాకారస్సావయవః - నిరవయవం నిరాకారం తస్మాత్సాకార మనిత్యం - ” నిత్యం నిరాకరమితి శ్రుతేః - యద్యత్సావయవం తదనిత్యమిత్యనుమానాచ్చేతి ప్రత్యక్షేణ దృష్టత్వా చ్చ అతః తయోరనిత్య త్వమేవ వక్తుముచితం భవతి. కథ ముక్తం నిత్యత్వమితి తురీయమక్షరమితి శ్రుతే స్తురీయస్య నిత్యత్వం ప్రసిద్ధం, నిత్యానిత్యత్వే పరస్పర విరుద్ధ ధర్మౌ తయోరే కస్మిన్ బ్రహ్మణి అత్యంత విరుద్ధం భవతి. తస్మాత్ వైకుంఠస్య నారాయణస్య చ నిత్యత్వమేవ వక్తుముచితం భవతి.

“సాకారస్తు ద్వివిధః - సోఫాధికో నిరుపాధికశ్చ - తత్ర సోపాధి కస్సాకారః కథమితి? ఆవిద్యకమఖిలకార్య కారణ జాలమ విద్యా పాద ఏవ, నాన్యత్ర. తస్మాత్సమస్తా విద్యోపాధి స్సాకార స్సావయవ ఏవ. సావయవత్వాత్ అవశ్యమనిత్యం భవత్యేవ. సోపాధిక సాకారో వర్ణితః - తర్హి నిరుపాధిక సాకారః కథమితి ? నిరుపాధిక సాకారస్త్రివిధః - బ్రహ్మ విద్యా సాకారశ్చానంద సాకార, ఉభయాత్మ సాకారశ్చేతి త్రివిధ సాకారో పి పునర్వివిధో భవతి - నిత్య సాకారో, ముక్త సాకారశ్చేతి. నిత్య సాకరస్తు ఆద్యంత శూన్య శ్శాశ్వతః ఉపాసనయా యే ముక్తిం గతాః తేషాం సాకారో ముక్త సాకారః ఉపాసనయా యే ముక్తిం గతాః తేషాం సాకారో ముక్తసాకారః తదఖండ జ్ఞానేనా విర్భావో భవతి, సోపి శాశ్వతః - ముక్త సాకార స్త్విచ్ఛిక ఇత్యన్యే వదంతి, శాశ్వతత్వం కథమితి. అద్వైతాఖండ పరిపూర్ణ నిరతిశయ పరమానంద శుద్ధ బుద్ధి ముక్త సత్యాత్మక బ్రహ్మ చైతన్య సాకారత్వాత్ నిరుపాధిక సాకారస్య నిరవయవత్వాత్ స్వాధికమపి దూరుతో నిరస్తమేవ.

నిరవయవం బ్రహ్మ చైతన్యమితి సర్వోపనిషత్సు సర్వ శాస్త్ర సిద్ధాంతేషు శ్రూయతే. అధచ విద్యా ఆనందతురీయాణాం అభేద ఏవ శ్రూయతే - సర్వత్ర విద్యాది సాకార భేదః కథమితి? సత్యమే వోక్తమితి దేశికః పరిహారతి -

“విద్యా ప్రాధాన్యేన విద్యా సాకారః ఆనంద ప్రకారేణ సాకారశ్చేతి ప్రాధాన్యేనా త్రిభేద ఏవ. సభేదో వస్తుతస్త్వ భేద ఏవ భగవన్న ఖండాద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణస్సాకార నిరాకారే విరుద్ధ ధర్మే విరుద్ధో భయాత్మకం కథమితి ? సత్యమే వేతి గురః పరిహరతి - యథా సర్వగతస్య నిరాకారస్య మహావాయు దేవస్య చా భేద ఏవ శ్రూయతే సర్వత్ర యథా పృదివ్యాదీనాం వ్యాపక శరీరాణాంచ దేవ విశేషాణాం తద్విలక్షణ తద భిన్న వ్యాపకా పరిచ్ఛిన్నాః నిజ మూర్త్యాకార దేవతాః శ్రూయంతే సర్వత్ర. తద్వత్పరబ్రహ్మణ స్సార్వాత్మ కస్య సాకార నిరాకార భేద విరోధో నాస్త్యేవ వివిద విచిత్రానంత శక్తేః పరబ్రహ్మణ స్వరూప జ్ఞానేన విరోధో విద్యతే - తదభావే సత్యనంత విరోధో విభాతి అన్యథా సర్వ పరిపూర్ణస్య పరబ్రహ్మణః పరమార్థ తస్సాకారం వినా కేవల నిరాకారత్వం యద్యభిమతం, తర్హి నిరాకారస్య గగనస్యేవ పరబ్రహ్మణో పి జడత్వ మాపాద్యతే. తస్మాత్ పరబ్రహ్మణః పరమార్థ తస్సాకార నిరాకారౌ స్వభావ సిద్ధౌ - తథా విధిస్య అద్వైత పరమానంద లక్షణస్య ఆదినారాయణస్య ఉన్మేష న్మేషాభ్యాం మూలా విద్యోదయ స్థితిలయా జాయతే. కదా - విదాత్మ రామస్య అఖిల పరిపూర్నస్య ఆదినారాయణస్య స్వేచ్ఛాను సారేణోన్మిషో జాయతే. తస్మాత్ పరబ్రహ్మణో (అ)ధిస్తనపాదే సర్వకారణే మూల కారణావ్యక్తా విర్భావో భవతి. అవ్యక్తా న్మూలావిర్భావో మూలా విద్యా విర్భావశ్చ, తస్మాదేవ సచ్చబ్ద వాచ్యం బ్రహ్మ విద్యా శబ్దం భవతి, తతో మహత్, మహతో (అ)హంకారః, అహంకారాత్ పంచ తన్మాత్రాణి, పంచ తన్మాత్రేభ్యః పంచ మహాభూతాని, పంచ మహాభూతేభ్యో బ్రహ్మైక పాదం వ్యాప్తం ఏకం అవిద్యాండం జాయతే. తత్ర తత్వతో గుణాతీత శుద్ధ సత్వ మయో లీలా గృహీత నిరతిశయానంద లక్షణో మాయోపాధికో నారాయణ ఆసీత్. స ఏవ నిత్య పరిపూర్ణః పాద విభూతి వైకుంఠ నారాయణః. సచానంతకోటి బ్రహ్మాండానాం ఉదయ స్థితిలయాద్యఖిల కార్యకరణ జాలః పరమకారణ భూతో మహా మాయా తీతస్తురీయ పరమేశ్వరో జాయతి. తస్మాత్ స్థూల విరాడ్రూపో జాయతే. స సర్వకారణ మూల విరాట్స్వరూపో భవతి. సో (అ)నంత శీర్షా పురుషః, అనంతాక్షిపాణి పాదో భవతి. అనంత శ్రవణ స్సర్వ మావృత్య తిష్టతి, సర్వవ్యాపకో భవతి. సగుణ నిర్గుణ స్వరూపో భవతి, వివిధ విచిత్రానంత జగదాకారో భవతి - - -”.

(వైకుంఠము సాకారము - ఆకారము గలది, రూపము గలది; నారాయణుడు కూడ సాకారమే - ఆకారము గలవాడు. తురీయము (పరబ్రహ్మ) ఆకారము లేనిది. ఆకారము గలది అవయవములు గలది, ఆకారము లేనిది అవయవములు లేనిది. అందుచేత ఆకారము గలది నిత్యమైనదికాదు, ఆకారము లేనిది నిత్యమైనది “అని శ్రుతి చెప్పుచున్నది ఏది అవయవములు గలదో అది నిత్యమైనది కాదు అని అనుమానప్రమాణమువలన ప్రత్యక్ష ప్రమాణముచేత తెలియుచున్నది. అందుచేత ఆ రెండింటిని ఆకారము కలదానిని, అవయవములు గలదానిని - నిత్యములు కానివే - నిత్యముగా నుండనివే, నశించునవియే యని చెప్పుట ఉచితము - నిత్యముగా నుండునది యని యెట్లు చెప్పవచ్చును?”తురీయము (పరబ్రహ్మ) అక్షరము (క్షీణించునదికాదు, నశించునదికాదు) అని శ్రుతి చెప్పుచున్నది. కనుక తురీయము (పరబ్రహ్మ) నిత్యమైనదనుట సిద్ధము - నిత్యానిత్యములు (శాశ్వతముగా నుండుట, క్షీణించి నశించుట అనునవి రెండును విరుద్ధ ధర్మములు - ఒకదానికొకటి విరుద్ధములు - అందులో ఒకటి పరబ్రహ్మయందుండుట అత్యంత విరుద్ధము - అందుచేత వైకుంఠము, నారాయణుడు నిత్యము అనే చెప్పవలెను).

(సాకారము - ఆకారము గలది - రెండు విధములు - ఉపాధి గలది, ఉపాధి లేనిది. ఉపాధిగల సాకారమెట్లనగా సమస్త కారణ కార్య వస్తువులన్నియు కలిసి అవిద్యా పాదమైనది - ఉపాధితో కూడిన సాకారము. అందుచేత అవిద్యోపాధి సాకారమంతయు అవయవములతో కూడినదే. అవయవములు కలది కనుక అనిత్యమైనదే యగును. ఉపాధిలేని సాకారమెట్లనిన - మూడు విధములు - బ్రహ్మ విద్యా సాకరము, ఆనందసాకారము, ఉభయము కలిసిన సాకారము - ఈ మూడు విధముల సాకారము - మరల రెండు విధములు - నిత్యసాకారము, ముక్తి సాకారము, నిత్యసాకారమనునది మొదలు కొస లేనిది - శాశ్వతమైనది, ఎల్లపుడు ఉండునది. ఉపాసనద్వారా ముక్తిని పొందినవారి సాకారము ముక్త సాకారము. అది అఖండజ్ఞానముచేత - (ఈ సృష్టి అంతయు ఒకటే) ఒక భగవంతుడే, మఱి యే వస్తువును లేదు - అను జ్ఞానము కలిగియుండుట) కలుగును. అది శాశ్వతమైనది. ముక్తసాకారము ఐచ్ఛికము అని కొందఱు చెప్పుదురు, అది శాశ్వతమైనది. ఎట్లనగా - అద్వైతాఖండ పరిపూర్ణ నిరతిశయ పరమానంద శుద్ధ బుద్ధి ముక్త సత్యాత్మక బ్రహ్మ చైతన్య సాకారముగనుక. ఉపాధి లేనటువంటి సాకారము నిత్యమైనదనుట సిద్ధమే. అందుచేతనే ఉపాధికసాకారము అవయవములు లేనిదగుటచేత నిరాకరించబడినది).

పరబ్రహ్మ చైతన్యము అవయవములు లేనిది అని ఉపనిషత్తులన్నింటియందును, అన్ని శాస్త్రములలోని సిద్ధాంతములందును చెప్పబడినది. అన్నింటిలోను విద్యా ఆనంద తురీయములకు భేదము లేదని చెప్పబడినది. విద్యాది సాకార భేదమెట్లనిన - విద్య (జ్ఞానము) ప్రథానముగా గలది విద్యాసాకారము - ఆనందము ప్రాథాన్యముగాగలది ఆనందసాకారము. ఈ రెండును ప్రాథాన్యముగాగలది ఉభయాత్మకసాకారము. ఈ రెండును గల సాకారము ప్రాథాన్యమనగా భేదము, అభేదము వస్తుతః (వాస్తవముగా) లేదు - అఖండాద్వైత పరమానంద లక్షణములుగల పరబ్రహ్మకు సాకారము, నిరాకారము అను రెండును విరుద్ధ ధర్మములు; అయిన విరుద్ధోభయాత్మకము లెట్లగును? అంతటను వ్యాపించియుండు మహావాయుదేవునకు భేదము లేదు. వ్యాపక శరీరముగల పృధివీ మొదలగు దేవ విశేషములకు వాటికి విలక్షణమైనవి - వాటికంటె వేఱు లక్షణములు గలవి, వాటికంటె వేఱుకానివి అయిన వ్యాపకములుగలవి వాటి ఆకారదేవతలే. ఆ ప్రకారముగానే సర్వాత్ముడు (అన్నింటికి ఆత్మ అయినవాడు, లేక, అన్నింటికి తానే శరీరమైనవాడు) అయిన పరబ్రహ్మకు సాకార వికారములను భేదము లేదు. అనేక విధములుగాను, విచిత్రముగాను పరిణమించు అంతములేని శక్తి గల పరబ్రహ్మయొక్క స్వరూపజ్ఞానమువలన ఈ భేదము కనబడుచున్నది. అది లేనప్పుడు అనంతవిరోధము కనబడుచుండును. అట్లు కాకపోయినయడల అన్నింటిలోను పూర్తిగా నిండియున్న పరమాత్మకు పరమార్థ దృష్ట్యా సాకారము గాక కేవలము నిరాకారమే అని చెప్పిన ఆకారములేని ఆకాశమువలె జడమే (చితన్యము లేనిది) అయి యుండవలెను - అందుచేత పరమార్థ దృష్టిలో పరమాత్మ సాకారము. నిరాకారము అను రెండునూ స్వభావసిద్ధములే. అటువంటి అద్వైతపరమానంద లక్షణములు గల ఆదినారాయణుని ఉన్మేష నిమేషముల (రెప్పపాటుల) వలన మూలావిద్యవలన కలుగు సృష్టి స్థితి లయములు కలుగు చున్నవి. ఒక్కొక్కప్పుడు ఆత్మారాముడు అఖిల పరిపూర్ణుడు అయిన ఆదినారాయణునికి స్వేచ్ఛాను సారముగ (తన ఇచ్చననుసరించి - కోరిక ప్రకారము) ఉన్మేషము కలుగును, దానినుండి మూలకారణమైన అవ్యక్తము (ప్రకృతి) కలుచున్నది. ఆవ్యక్తము నుండి మూలము (మూల ప్రకృతి) కలుగును - దానినుండి సత్ అనుపేరుతో చెప్పబడు శబళము కలుగును. దానినుండి మహత్తత్త్వము, మహత్తత్వమునుండి అహంకారము, అహంకారమునుండి పంచ తన్మాత్రలు, పంచతన్మాత్రలనుండి పంచమహా భూతములు, పంచమహా భూతములనుండి పరబ్రహ్మయొక్క ఒకపాదము అయిన యీ జగత్తు వ్యాపించి ఒక అవిద్యాండము కలిగినది. దానిలో తత్వరీత్యా త్రిగుణములకు అతీతుడైనవాడు శుద్ధ సత్వమయుడు, లీలగా దాల్చిన నిరతిశయానంద లక్షణములు కలవాడు, మాయ ఉపాధిగా కలవాడు అగు నారాయణుడుండెను - అతనే నిత్య పరిపూర్ణుడు, పాదవిభూతియగు వైకుంఠనారాయణుడు - అతనే అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయములకు, కార్యములకు పరమ కారణుడు, మహా మాయ కతీతుడైనవాడు, తురీయము. అగు పరమేశ్వరుడు - దానినుండి స్థూలవిరాడ్రూపము కలుగుచున్నది (పుట్టుచున్నది) అతనే అన్నింటికి కారణమయిన మూల విరాడ్రూపుడు - అగుచున్నాడు, అతనే వేలకొలది శిరస్సులుగల పురుషుడు, అంతములేని (లెక్కలేనన్ని) కండ్లు, చేతులు, పాదములు గలవాడగుచున్నాడు; లెక్కలేనన్ని చెవులు గలవాడై అన్నింటిని ఆవరించి యుండువాడు, సర్వ వ్యాపకుడు, సగుణ నిర్గుణ స్వరూపుడు అగుచున్నాడు, జ్ఞాన బలైశ్వర్యశక్తి తేజస్వరూపుడగు భగవచ్ఛబ్ద వాచ్యుడగుచున్నాడు. చిత్రమైన, అనేకవిధములైన అనంత జగదాకారుడగు చున్నాడు).

  1. “ఆశ్రయశ్చేతసో బ్రహ్మ ద్విథా తచ్చ స్వరూపతా |

భూప మూర్తమ మూర్తంచ, పరం చా పరమేవచ ||“.

(ఆశ్రయుడైన బ్రహ్మ స్వరూపములు రెండు - మూర్తము - (ఆకారము గలది, సాకారము), అమూర్తము)నిరాకారము - ఆకారము లేనిది); పరము, అపరము అని - దీనివలన సాకరము కూడబ్రహ్మరూపమే - అని తెలియవచ్చుచున్నది).

  1. “మ. పరమ యోగీంద్రులు యోగమార్గముల భావంబందునేనీమనో

హరరూపంబు దలంచి, యే గుణ గణ ధ్యానంబు గావింతుర

ప్పురుష శ్రేష్ట పరిగ్రహంబునకు నై పొల్పార దద్ధ్యాన గో

చర మూర్తిన్ ధరియింతుగాదే పరమోత్సాహుండవై మాధవా” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 298)

పరబ్రహ్మ సాకార రూపము ఎట్లుండునంటే - చిన్న ఉదాహరణ –

సీ. నిఖిల మునీంద్ర వర్ణిత సన్మిత ప్రసన్నా ననాంబుజముచే నలరారువాడు

విశ్రుత స్నేహార్ధ్ర వీక్షణ నిజభక్త జన గుహాశయుడన దనరువాడు

మానిత శ్యామాయమాన వక్షమున నంచిత వైజయంతి రాజిల్లువాడు

నతజనావన కృపామృత తరంగితములై భాసిల్లు లోచనాబ్జములవాడు

- - -

“సీ. కటి విరాజిత పీత కౌశేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప

నాలంబి కంఠ హారావళి ప్రభలతో గౌస్తుభ రోచులు గ్రందు కొనగ

నిజకాంతి జిత తటి ద్ర్వజ కర్ణ కుండల రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ

మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయంబు దిక్కుల నిండ బర్వ

తే. వైన తేయాం స విన్యస్త వామ హస్త

కలిత కేయూర వలయు కంకణములొప్ప

నన్య కరతల భ్రమణీ కృతాను మోద

సుందరాకార లీలారవింద మదుర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 15 - 537, 538)

“మఱియు చక్షురింద్రుయ గ్రాహ్యంబగు దివ్యమంగళ విగ్రహంబు ధరించియున్న పురుషోత్తమునుదాత్త తేజో నిధిం జూచి - - -”.

Transliteration
  1. ākāramutō, rūpamutō - “bhaktulu gōrinabhaṃgi nē rūpaina boṃduvāniki”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. -)

  2. “śabda sparśa rūpa rasa gaṃdhaṃbulaniyeḍu guṇaṃbulacēta parigrahiṃpabaḍina maṃgaḷa suṃdara vigrahuṃḍu:

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā.-)

  1. “viśvarūpa saṃdarśanānaṃtaraṃ”

“nāhaṃ daiḥ na tapasā, na dānēna, na cējyayā |

śakya ēvaṃ vidhōdraṣṭuṃ dṛṣṭavānasi māṃ yathā ||“. (śrīmadbhagavadgīta - 11 - 53)

iti sākāraṃ vastu.

“bhaktyā tvananya yā śakya ahamēvaṃvidhōrjuna |

jñātuṃ draṣṭuṃ ca tattvēna pravēṣṭuṃ ca paraṃtapa ||“. (śrīmadbhagavadgīta - 11 - 54)

yadi draṣṭu ma śakyastvaṃ tapō vēdādhvirādhibhiḥ |

kēnōpāyēna tattarhi draṣṭuṃ śakyō ni cēticēt |

sādhanāṃtara vyāvṛtyaitu śabdō bōddhya uttamaiḥ ||

madēka niṣṭhayā prēma bhaktyaivāhaṃ mahēśvaraḥ |

divya rūpadharō jñātuṃ śakyaśśāstrānnarōttamaiḥ |

sākṣātkartuṃ svarūpēṇa vēdavākyōtthayā dhiyā |

śakyaścāsmi sadā sadā prēma bhaktvai vārādhitō janaiḥ |

sākṣātkārā davidyā tatkārya hānyāca tatvataḥ |

matsvarūpatayai vāptuṃ śakyōhaṃ hē paraṃtapa |

ananya yaiva bhaktyātvaṃ mā māśrayārjuna ||. (gītābhāvaprakāśamu - 11 - 211- 216)

(śrīkṛṣṇa bhagavānuḍu tana viśvarūpamunu arjununaku cūpiṃcina tarvāta iṭlu ceppenu - vēdamulanu adhyayanamu cēyuṭacētagāni, dānamucētagāni, yajñayāgādulacētagāni ippuḍu nīvu cūcina nā rūpamu - viśvarūpamu - prapaṃcamē ayina tana rūpamu - cūcuṭaku śakyamukādu. ananya bhakti cētanē iṭlu nannu cūcuṭagāni, telusukonuṭaku gāni (nā tatvamunu telusukonuṭakugāni) nālō ēkamaguṭakugāni, śakyamagunu. vēdādhyayanamu, tapassu modalaguvāṭicēta bhagavaṃtuni svarūpamu - kaṃṭiki kanabaḍu rūpamutō nunnavāḍini - viśvarūpuni - sthūlarūpamu galavānini cūcuṭaku śakyamu kāniyaḍala ikanēyupāyamu valana cūcuṭaku śakyamagunō anagā nā yaṃdē niṣṭha kaligiyuṃḍi, nāyaṃdu prēma bhakti kalavāḍu mahēśvaruḍu, divyarūpadharuḍu ayina nannu telusukonagalaḍu - vēda vākyamulavalana kaligina jñānamucēta nannu sākṣātkariṃcukō galaḍu nā sākṣātkāramu valana avidyā (ajñānamu) dāni kāryamulu tolagipōvunu - aṃducēta nīvu ananya bhaktitō nannu āśrayiṃcumu - bhajiṃpumu).

  1. “ēvaṃ matkarmakṛt” ityādyanaṃtaraprakārēṇa satata yuktāḥ vairaṃtēryēṇa bhagavatkarmādau sāvadhānatayā pravṛttāḥ bhaktāḥ sākāravastvēka śaraṇāḥ saṃtaḥ yat paryupāsatē satataṃ ciṃtayaṃti tat.

“gītā śāstrasya sarvasya sārabhūtō artha ādarāt |

niḥśrēyasārdhināṃ samyak anuṣṭhānāya cādhunā puṃjī kṛtyōcyatē śrīmaddhariṇā karuṇābdinā |

madarthaṃ karma vēdōktaṃ kurvanyō matparāyaṇaḥ |

suprāpyatvēna yasyāhaṃ niścitō nāparōrthakaḥ |

madavāptyā śayānaśca madbhaktaḥ sarvadhōttamaḥ |

māmēva sarvathā prīttyā sarvōtsāhēna sarvadā |

sarvātmanā yō bhajatē matprēmṇā (ā)viṣṭamānasaḥ |

putra vitta kaḷatrādau bhōgēṣu snēha varjitaḥ |

sarva bhūtēṣu madbuddhyā tyakta śatrumatiḥ pumān |

svasyātyaṃ tāpakārādi vṛttēṣvapyupakārakṛt |

īdṛśō daṃbha śūnyō yō madbhaktō māmupaiti saḥ |

parāgati rahaṃ tasyā harirēva na cāparā |

ayamarthastvayā jñātu miṣṭō (a)tastē mayōditaḥ |

nātaḥ paraṃca kartavyaṃ kiṃci dityāśayō harēḥ ||“. (gītābhāvaprakāśamu - 11 - 216 to 223)

(śrīmadbhagavadgītā śāstramaṃtaṭiki sāramaina arthamunu niḥśrēyassunu kōruvāru anuṣṭiṃcuṭaku dayā samudruḍaina śrīkṛṣṇabhagavānuni cēta puṃjīkṛtamu cēyabaḍi ceppabaḍinadi - nā nimittamai - nā koṟaku - vēdamulō ceppabaḍina karma cēyucu matparāyaṇuḍainavāḍu (nēnē parama mōkṣasthānamani talacuvāḍu); poṃda tagina vāḍanani talacuvāḍu, iṃtakaṃṭe puruṣārthamu lēdani talacuvāḍu, nannu poṃduṭē āśayamugā galavāḍu nā bhaktuḍu, anni vidhamula uttamuḍu, nannē anni prakāramula bhaktitō. utsāhamutō, nēnē anniṃṭiki ātmayani nannu bhajiṃcuvāḍu, nā bhaktitō niṃḍina manassu kalavāḍu, bhāryā putrulaṃdu, dhanadhānyamulaṃdu, bhōgamulaṃdu anurāgamu lēnivāḍu, bhūtamulanniyu nēnē yanu buddhitō - jñānamutō nammakamutō nuṃḍuṭavalana, dēniyaṃdunu, evariyaṃdunu śatṛtvabuddhi lēnivāḍu, tanaku goppa apakāramu cēsinappaṭikī upakāramu cēyuvāḍu, daṃbhamu lēnivāḍu, ayina nā bhaktuḍu nannu cērunu - aṭṭivāniki nēnu paramagati - uttamamai poṃdatagina vastuvu - mōkṣasthānamu - nāku iṣṭuḍavukāna ī viṣayamu nīku teliya cēsitini. iṃtakaṃṭe cēyavalasinadi lēdu -

  1. yasyāgnirāsyaṃ, dyau rmūrdhā, khaṃ nābhiḥ caraṇau kṣitiḥ, sūryaścakṣuḥ, ditaśśrōtraṃ, tasmai lōkātmanē namaḥ.

(evaniki agni mukhamō, dyulōkamu śirassō, ākāśamu nābhiyō, bhūmi pādamulō, sūryuḍu nētramulō, dikkulu cevulō aṭṭi lōkātmunaku - lōkamē śarīramugā gāvāniki namaskāramu).

  1. “yasya pṛdhivī śarīraṃ”, “yasyātma śarīraṃ”, “yasyāvyaktaṃ śarīraṃ”, “yasyākṣaraṃ śarīraṃ”, “ēṣa sarvabhūtāṃtarātmā, apahatapāpmā, divyō dēvaḥ, ēkōnārāyaṇaḥ” ityādi bhirvākyaiḥ, cidacidōḥ, sarvāvasthāvasthita yōḥ paramātma śarīratāṃ, paramātmanaḥ tādātmyatāṃ ca pratipādya śarīrabhūta paramātmābhidā yibhiḥ sa brahmādi śabdaiḥ kāraṇāvasthaḥ kāryāvasthaśca paramātmā ēka ēvēti pṛthak pratipannaṃ. vastuti tayaṃ - “sadēva sōmya idamagra āsīt”; “ētadātmyamidaṃ sarvaṃ” “sarvaṃ khilvidaṃ brahma” ityādi vākyaṃ pratipādayati. cidacidvastu śarīriṇaḥ paramātmanaḥ śabdēna abhidhānē nāsya virōdhaḥ, yadhā manuṣya piṃḍaśarīra kasyātma viśēṣasya - ” ayamātmā sukhī” ityātma śabdēnābhidānēna ityalamiti vistarēṇa (śrīmān rāmānujaḥ)

(evaniki bhūmi śarīramō, evaniki ātma śarīramō, evaniki avyaktamu (prakṛti) śarīramō, evaniki akṣaramu śarīramō aṭṭivāḍu samasta bhūtamulaṃdu aṃtarātmagā nunnāḍu, pāpamulu lēnivāḍu, divyamaina dēvuḍu prakāśiṃcuvāḍu okaḍēyagu nārāyaṇuḍu agunaṭṭi vākyamulatō ē avasthalōnunna vainanu cit acit (ātma, anātma vastuvulu paramātma śarīramulu paramātma tādātmyamulu ani pratipādiṃci (ceppi) śarīramaina paramātmayani brahma modalagu śabdamulacē kāraṇāvasthalōnu, kāryāvasthalōnu unna - (anagā, kāraṇamulu, kāryamulu - maṭṭi, kuṃḍa) tānēyagu paramātma okaḍē ani pratipādiṃcabaḍinadi. saumyuḍā, ī sṛṣṭi aṃtayu, sṛṣṭiki muṃdu, okka ‘sat’ padārthamugānē - paramātmagānē uṃḍenu aninnī - “idaṃtayu ātmayē - ī prapaṃcamaṃtayu brahmayē” anu modalagu vākyamulu pratipādiṃpabaḍinavi. cidacidvastuvulanniyu (ātma anātma vastuvulanniyu) paramātmuni śarīramulē ani ceppuṭavalana virōdhamu lēdu. manuṣya śarīramugala ātma guṟiṃci “ī ātma sukhamugā nunnadi” ani vyavahariṃcucunnaṭlē.

  1. vaikuṃṭhassākārō nārāyaṇassākāraśca turīyaṃ tu nirākāraṃ; sākārassāvayavaḥ - niravayavaṃ nirākāraṃ tasmātsākāra manityaṃ - ” nityaṃ nirākaramiti śrutēḥ - yadyatsāvayavaṃ tadanityamityanumānāccēti pratyakṣēṇa dṛṣṭatvā cca ataḥ tayōranitya tvamēva vaktumucitaṃ bhavati. katha muktaṃ nityatvamiti turīyamakṣaramiti śrutē sturīyasya nityatvaṃ prasiddhaṃ, nityānityatvē paraspara viruddha dharmau tayōrē kasmin brahmaṇi atyaṃta viruddhaṃ bhavati. tasmāt vaikuṃṭhasya nārāyaṇasya ca nityatvamēva vaktumucitaṃ bhavati.

“sākārastu dvividhaḥ - sōphādhikō nirupādhikaśca - tatra sōpādhi kassākāraḥ kathamiti? āvidyakamakhilakārya kāraṇa jālama vidyā pāda ēva, nānyatra. tasmātsamastā vidyōpādhi ssākāra ssāvayava ēva. sāvayavatvāt avaśyamanityaṃ bhavatyēva. sōpādhika sākārō varṇitaḥ - tarhi nirupādhika sākāraḥ kathamiti ? nirupādhika sākārastrividhaḥ - brahma vidyā sākāraścānaṃda sākāra, ubhayātma sākāraścēti trividha sākārō pi punarvividhō bhavati - nitya sākārō, mukta sākāraścēti. nitya sākarastu ādyaṃta śūnya śśāśvataḥ upāsanayā yē muktiṃ gatāḥ tēṣāṃ sākārō mukta sākāraḥ upāsanayā yē muktiṃ gatāḥ tēṣāṃ sākārō muktasākāraḥ tadakhaṃḍa jñānēnā virbhāvō bhavati, sōpi śāśvataḥ - mukta sākāra stvicchika ityanyē vadaṃti, śāśvatatvaṃ kathamiti. advaitākhaṃḍa paripūrṇa niratiśaya paramānaṃda śuddha buddhi mukta satyātmaka brahma caitanya sākāratvāt nirupādhika sākārasya niravayavatvāt svādhikamapi dūrutō nirastamēva.

niravayavaṃ brahma caitanyamiti sarvōpaniṣatsu sarva śāstra siddhāṃtēṣu śrūyatē. adhaca vidyā ānaṃdaturīyāṇāṃ abhēda ēva śrūyatē - sarvatra vidyādi sākāra bhēdaḥ kathamiti? satyamē vōktamiti dēśikaḥ parihārati -

“vidyā prādhānyēna vidyā sākāraḥ ānaṃda prakārēṇa sākāraścēti prādhānyēnā tribhēda ēva. sabhēdō vastutastva bhēda ēva bhagavanna khaṃḍādvaita paramānaṃda lakṣaṇa parabrahmaṇassākāra nirākārē viruddha dharmē viruddhō bhayātmakaṃ kathamiti ? satyamē vēti guraḥ pariharati - yathā sarvagatasya nirākārasya mahāvāyu dēvasya cā bhēda ēva śrūyatē sarvatra yathā pṛdivyādīnāṃ vyāpaka śarīrāṇāṃca dēva viśēṣāṇāṃ tadvilakṣaṇa tada bhinna vyāpakā paricchinnāḥ nija mūrtyākāra dēvatāḥ śrūyaṃtē sarvatra. tadvatparabrahmaṇa ssārvātma kasya sākāra nirākāra bhēda virōdhō nāstyēva vivida vicitrānaṃta śaktēḥ parabrahmaṇa svarūpa jñānēna virōdhō vidyatē - tadabhāvē satyanaṃta virōdhō vibhāti anyathā sarva paripūrṇasya parabrahmaṇaḥ paramārtha tassākāraṃ vinā kēvala nirākāratvaṃ yadyabhimataṃ, tarhi nirākārasya gaganasyēva parabrahmaṇō pi jaḍatva māpādyatē. tasmāt parabrahmaṇaḥ paramārtha tassākāra nirākārau svabhāva siddhau - tathā vidhisya advaita paramānaṃda lakṣaṇasya ādinārāyaṇasya unmēṣa nmēṣābhyāṃ mūlā vidyōdaya sthitilayā jāyatē. kadā - vidātma rāmasya akhila paripūrnasya ādinārāyaṇasya svēcchānu sārēṇōnmiṣō jāyatē. tasmāt parabrahmaṇō (a)dhistanapādē sarvakāraṇē mūla kāraṇāvyaktā virbhāvō bhavati. avyaktā nmūlāvirbhāvō mūlā vidyā virbhāvaśca, tasmādēva saccabda vācyaṃ brahma vidyā śabdaṃ bhavati, tatō mahat, mahatō (a)haṃkāraḥ, ahaṃkārāt paṃca tanmātrāṇi, paṃca tanmātrēbhyaḥ paṃca mahābhūtāni, paṃca mahābhūtēbhyō brahmaika pādaṃ vyāptaṃ ēkaṃ avidyāṃḍaṃ jāyatē. tatra tatvatō guṇātīta śuddha satva mayō līlā gṛhīta niratiśayānaṃda lakṣaṇō māyōpādhikō nārāyaṇa āsīt. sa ēva nitya paripūrṇaḥ pāda vibhūti vaikuṃṭha nārāyaṇaḥ. sacānaṃtakōṭi brahmāṃḍānāṃ udaya sthitilayādyakhila kāryakaraṇa jālaḥ paramakāraṇa bhūtō mahā māyā tītasturīya paramēśvarō jāyati. tasmāt sthūla virāḍrūpō jāyatē. sa sarvakāraṇa mūla virāṭsvarūpō bhavati. sō (a)naṃta śīrṣā puruṣaḥ, anaṃtākṣipāṇi pādō bhavati. anaṃta śravaṇa ssarva māvṛtya tiṣṭati, sarvavyāpakō bhavati. saguṇa nirguṇa svarūpō bhavati, vividha vicitrānaṃta jagadākārō bhavati - - -”.

(vaikuṃṭhamu sākāramu - ākāramu galadi, rūpamu galadi; nārāyaṇuḍu kūḍa sākāramē - ākāramu galavāḍu. turīyamu (parabrahma) ākāramu lēnidi. ākāramu galadi avayavamulu galadi, ākāramu lēnidi avayavamulu lēnidi. aṃducēta ākāramu galadi nityamainadikādu, ākāramu lēnidi nityamainadi “ani śruti ceppucunnadi ēdi avayavamulu galadō adi nityamainadi kādu ani anumānapramāṇamuvalana pratyakṣa pramāṇamucēta teliyucunnadi. aṃducēta ā reṃḍiṃṭini ākāramu kaladānini, avayavamulu galadānini - nityamulu kānivē - nityamugā nuṃḍanivē, naśiṃcunaviyē yani ceppuṭa ucitamu - nityamugā nuṃḍunadi yani yeṭlu ceppavaccunu?”turīyamu (parabrahma) akṣaramu (kṣīṇiṃcunadikādu, naśiṃcunadikādu) ani śruti ceppucunnadi. kanuka turīyamu (parabrahma) nityamainadanuṭa siddhamu - nityānityamulu (śāśvatamugā nuṃḍuṭa, kṣīṇiṃci naśiṃcuṭa anunavi reṃḍunu viruddha dharmamulu - okadānikokaṭi viruddhamulu - aṃdulō okaṭi parabrahmayaṃduṃḍuṭa atyaṃta viruddhamu - aṃducēta vaikuṃṭhamu, nārāyaṇuḍu nityamu anē ceppavalenu).

(sākāramu - ākāramu galadi - reṃḍu vidhamulu - upādhi galadi, upādhi lēnidi. upādhigala sākārameṭlanagā samasta kāraṇa kārya vastuvulanniyu kalisi avidyā pādamainadi - upādhitō kūḍina sākāramu. aṃducēta avidyōpādhi sākāramaṃtayu avayavamulatō kūḍinadē. avayavamulu kaladi kanuka anityamainadē yagunu. upādhilēni sākārameṭlanina - mūḍu vidhamulu - brahma vidyā sākaramu, ānaṃdasākāramu, ubhayamu kalisina sākāramu - ī mūḍu vidhamula sākāramu - marala reṃḍu vidhamulu - nityasākāramu, mukti sākāramu, nityasākāramanunadi modalu kosa lēnidi - śāśvatamainadi, ellapuḍu uṃḍunadi. upāsanadvārā muktini poṃdinavāri sākāramu mukta sākāramu. adi akhaṃḍajñānamucēta - (ī sṛṣṭi aṃtayu okaṭē) oka bhagavaṃtuḍē, maṟi yē vastuvunu lēdu - anu jñānamu kaligiyuṃḍuṭa) kalugunu. adi śāśvatamainadi. muktasākāramu aicchikamu ani koṃdaṟu ceppuduru, adi śāśvatamainadi. eṭlanagā - advaitākhaṃḍa paripūrṇa niratiśaya paramānaṃda śuddha buddhi mukta satyātmaka brahma caitanya sākāramuganuka. upādhi lēnaṭuvaṃṭi sākāramu nityamainadanuṭa siddhamē. aṃducētanē upādhikasākāramu avayavamulu lēnidaguṭacēta nirākariṃcabaḍinadi).

parabrahma caitanyamu avayavamulu lēnidi ani upaniṣattulanniṃṭiyaṃdunu, anni śāstramulalōni siddhāṃtamulaṃdunu ceppabaḍinadi. anniṃṭilōnu vidyā ānaṃda turīyamulaku bhēdamu lēdani ceppabaḍinadi. vidyādi sākāra bhēdameṭlanina - vidya (jñānamu) prathānamugā galadi vidyāsākāramu - ānaṃdamu prāthānyamugāgaladi ānaṃdasākāramu. ī reṃḍunu prāthānyamugāgaladi ubhayātmakasākāramu. ī reṃḍunu gala sākāramu prāthānyamanagā bhēdamu, abhēdamu vastutaḥ (vāstavamugā) lēdu - akhaṃḍādvaita paramānaṃda lakṣaṇamulugala parabrahmaku sākāramu, nirākāramu anu reṃḍunu viruddha dharmamulu; ayina viruddhōbhayātmakamu leṭlagunu? aṃtaṭanu vyāpiṃciyuṃḍu mahāvāyudēvunaku bhēdamu lēdu. vyāpaka śarīramugala pṛdhivī modalagu dēva viśēṣamulaku vāṭiki vilakṣaṇamainavi - vāṭikaṃṭe vēṟu lakṣaṇamulu galavi, vāṭikaṃṭe vēṟukānivi ayina vyāpakamulugalavi vāṭi ākāradēvatalē. ā prakāramugānē sarvātmuḍu (anniṃṭiki ātma ayinavāḍu, lēka, anniṃṭiki tānē śarīramainavāḍu) ayina parabrahmaku sākāra vikāramulanu bhēdamu lēdu. anēka vidhamulugānu, vicitramugānu pariṇamiṃcu aṃtamulēni śakti gala parabrahmayokka svarūpajñānamuvalana ī bhēdamu kanabaḍucunnadi. adi lēnappuḍu anaṃtavirōdhamu kanabaḍucuṃḍunu. aṭlu kākapōyinayaḍala anniṃṭilōnu pūrtigā niṃḍiyunna paramātmaku paramārtha dṛṣṭyā sākāramu gāka kēvalamu nirākāramē ani ceppina ākāramulēni ākāśamuvale jaḍamē (citanyamu lēnidi) ayi yuṃḍavalenu - aṃducēta paramārtha dṛṣṭilō paramātma sākāramu. nirākāramu anu reṃḍunū svabhāvasiddhamulē. aṭuvaṃṭi advaitaparamānaṃda lakṣaṇamulu gala ādinārāyaṇuni unmēṣa nimēṣamula (reppapāṭula) valana mūlāvidyavalana kalugu sṛṣṭi sthiti layamulu kalugu cunnavi. okkokkappuḍu ātmārāmuḍu akhila paripūrṇuḍu ayina ādinārāyaṇuniki svēcchānu sāramuga (tana iccananusariṃci - kōrika prakāramu) unmēṣamu kalugunu, dāninuṃḍi mūlakāraṇamaina avyaktamu (prakṛti) kalucunnadi. āvyaktamu nuṃḍi mūlamu (mūla prakṛti) kalugunu - dāninuṃḍi sat anupērutō ceppabaḍu śabaḷamu kalugunu. dāninuṃḍi mahattattvamu, mahattatvamunuṃḍi ahaṃkāramu, ahaṃkāramunuṃḍi paṃca tanmātralu, paṃcatanmātralanuṃḍi paṃcamahā bhūtamulu, paṃcamahā bhūtamulanuṃḍi parabrahmayokka okapādamu ayina yī jagattu vyāpiṃci oka avidyāṃḍamu kaliginadi. dānilō tatvarītyā triguṇamulaku atītuḍainavāḍu śuddha satvamayuḍu, līlagā dālcina niratiśayānaṃda lakṣaṇamulu kalavāḍu, māya upādhigā kalavāḍu agu nārāyaṇuḍuṃḍenu - atanē nitya paripūrṇuḍu, pādavibhūtiyagu vaikuṃṭhanārāyaṇuḍu - atanē anaṃtakōṭi brahmāṃḍamula sṛṣṭi sthiti layamulaku, kāryamulaku parama kāraṇuḍu, mahā māya katītuḍainavāḍu, turīyamu. agu paramēśvaruḍu - dāninuṃḍi sthūlavirāḍrūpamu kalugucunnadi (puṭṭucunnadi) atanē anniṃṭiki kāraṇamayina mūla virāḍrūpuḍu - agucunnāḍu, atanē vēlakoladi śirassulugala puruṣuḍu, aṃtamulēni (lekkalēnanni) kaṃḍlu, cētulu, pādamulu galavāḍagucunnāḍu; lekkalēnanni cevulu galavāḍai anniṃṭini āvariṃci yuṃḍuvāḍu, sarva vyāpakuḍu, saguṇa nirguṇa svarūpuḍu agucunnāḍu, jñāna balaiśvaryaśakti tējasvarūpuḍagu bhagavacchabda vācyuḍagucunnāḍu. citramaina, anēkavidhamulaina anaṃta jagadākāruḍagu cunnāḍu).

  1. “āśrayaścētasō brahma dvithā tacca svarūpatā |

bhūpa mūrtama mūrtaṃca, paraṃ cā paramēvaca ||“.

(āśrayuḍaina brahma svarūpamulu reṃḍu - mūrtamu - (ākāramu galadi, sākāramu), amūrtamu)nirākāramu - ākāramu lēnidi); paramu, aparamu ani - dīnivalana sākaramu kūḍabrahmarūpamē - ani teliyavaccucunnadi).

  1. “ma. parama yōgīṃdrulu yōgamārgamula bhāvaṃbaṃdunēnīmanō

hararūpaṃbu dalaṃci, yē guṇa gaṇa dhyānaṃbu gāviṃtura

ppuruṣa śrēṣṭa parigrahaṃbunaku nai polpāra daddhyāna gō

cara mūrtin dhariyiṃtugādē paramōtsāhuṃḍavai mādhavā” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 298)

parabrahma sākāra rūpamu eṭluṃḍunaṃṭē - cinna udāharaṇa –

sī. nikhila munīṃdra varṇita sanmita prasannā nanāṃbujamucē nalarāruvāḍu

viśruta snēhārdhra vīkṣaṇa nijabhakta jana guhāśayuḍana danaruvāḍu

mānita śyāmāyamāna vakṣamuna naṃcita vaijayaṃti rājilluvāḍu

natajanāvana kṛpāmṛta taraṃgitamulai bhāsillu lōcanābjamulavāḍu

- - -

“sī. kaṭi virājita pīta kauśēya śāṭitō vitata kāṃcī guṇadyuti naṭiṃpa

nālaṃbi kaṃṭha hārāvaḷi prabhalatō gaustubha rōculu graṃdu konaga

nijakāṃti jita taṭi drvaja karṇa kuṃḍala ruculu gaṃḍadyutul prōdisēya

mahanīya navaratnamaya kirīṭa prabhānicayaṃbu dikkula niṃḍa barva

tē. vaina tēyāṃ sa vinyasta vāma hasta

kalita kēyūra valayu kaṃkaṇamuloppa

nanya karatala bhramaṇī kṛtānu mōda

suṃdarākāra līlāraviṃda madura”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 15 - 537, 538)

“maṟiyu cakṣuriṃdruya grāhyaṃbagu divyamaṃgaḷa vigrahaṃbu dhariṃciyunna puruṣōttamunudātta tējō nidhiṃ jūci - - -”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.