← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాక్షి sākṣi

Original — తెలుగు
  1. సాక్షాత్పశ్యతే తి సాక్షీ -

(తన కండ్లతో చూచు వాడు సాక్షి)

  1. సాక్షాత్ ద్రష్టత్వమేవహి సాక్షిత్వం -

(కళ్ళతో చూచుటే సాక్షి యగుట)

  1. సాక్షాత్ ద్రష్టా సాక్షీ తస్య కర్మ సాక్ష్యం.

(తన కండ్లతో చూచువాడు సాక్షి, అతను చేయు ఆకర్మ సాక్ష్యము).

  1. సాక్షాత్ ద్రష్టా ప్రత్యక్ష తయా అనుభవితా -

(స్వయముగా తన కళ్ళతో చూచువాడు, ప్రత్యక్షముగా అనుభవించువాడు)

  1. సాక్షా దీక్షతే ఇతి సాక్షీ - - - తదుక్తం “సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞయాం” ఇతి.

(తనకంటితోనే చూచువాడు సాక్షి - తన కళ్ళతో చూచువాడే సాక్షి అని చెప్పబడినది).

  1. “ప్రాణినాం కృతాకృతస్య సాక్షీ” (శ్రీశంకరః)

(ప్రాణులు చేయుకర్మలకు సాక్షి అయినవాడు). “సాక్షీ శుభా శుభ ద్రష్టా సర్వేషాం ప్రాణనాం సదా |” (గీతాభావప్రకాశము - 9 - 125) ఎల్లపుడు సమస్త ప్రాణులయొక్క పుణ్య పాపకర్మలను చూచువాడు).

  1. “సాక్షా దవ్యవ ధానేన స్వరూప బోధేన చ ఈక్షతే పశ్యతి సర్వమితి సాక్షీ”

(సాక్షాత్తుగా వ్యవధానము లేకుంద జ్ఞానరూపుడగుటచేత అన్నింటిని చూచువాడు).

  1. సర్వ భూతానాం అధిష్టానం భూత్వా సాక్షీ భవతి, సాక్ష్యం అధిష్టానే సాక్షిణి కల్పితం ఇతి భావః

(సమస్త భూతములకు అధిష్టానముగా నుండుటచేత సాక్షియగువాడు - భగవంతుడు).

  1. తనవల్లనైన ప్రపంచాన్ని తానే యెఱుంగుచున్నాడు గనుగ ద్రష్టు భావ యుక్తుడు - “సవేత్తి వేద్యం, న చతస్యాస్తివేత్తా”. (తెలుసుకోవలసిన దానిని తాను తెలుసుకొనును, కాని అతనిని తెలుసుకొనగలవాడు లేడు) అనిన్నీ, “త్రిథామసు యద్భోజ్యం, భోక్తా, భోగశ్చ యద్భవేత్. తేభ్యో విలక్షణస్సాక్షీ చినమాత్రో హం సదా శివః” (త్రిథామములందు భోజ్యము, భోక్త, భోగము అనువాటికంటె వేఱు లక్షణములు గలవాడు, చైతన్యమాత్రుడు అయిన సదాశివుడను నేనే).

(తెలియవలసిన దానిని తాని తెలుసుకొనును, కాని అతనిని తెలుసుకొనగలిగినవాడు మఱి యొకడు లేడు - భోగ్య వస్తువు దానిని భోగించువాడు, భోగించుట అనునీ మూడింటికంటె వేఱు లక్షణములు గలవాడు, సాక్షి అయినవాడు, చిన్మాత్రుడు అయిన సదాశివుడను నేనే అని శ్రుతి (కైవల్యోపనిషత్) చెప్పుచున్నది).

త్రిషు థామసు - జాగరణ, స్వప్న, సుషుప్తేషు స్థానేషు యత్ ప్రసిద్ధం భోజ్యం స్థూల ప్రవివిక్తానంద రూపం భోక్తాం విశ్వతైజస ప్రాజ్ఞాః, భోగశ్చ స్థూల ప్రవివక్తానంద భోగోపి యత్ యుక్తం త్రిధామభోగ్యాది ప్రపంచ జాతం భవేత్. తేభ్యః త్రిధామాదిభ్యః విలక్షణః విపరీత లక్షణః సాక్షీ స్వాధ్యస్తస్య విశ్వస్య ద్రష్టా, చిన్మాత్రః, చిదేకరసః, అహం - అహంప్రత్యయ వ్యవహార యోగ్యః సదిశివః, కైవల్యాత్మా. నిత్య కల్యాణరూపో మహేశ్వరః).

(జాగరణ, స్వప్న, సుషుప్తి యను మూడు అవస్థలయందు భోజ్యమగు స్థూల ప్రపంచము, వాటిని అనుభవించు విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు - వీరికంటె వేరు లక్షణములు గలవాడు, తనయందు అధ్యస్తమయిన ప్రపంచమునకు సాక్షి అయినవాడు (ద్రష్ట అయినవాడు), చైతన్య మాత్రుడు - చైతన్యము అను ఒకే తత్వముగలవాడు, అహం = నేను అని వ్యవహరించుటకు యోగ్యుడైనవాడు, సదాశివుడు, కైవల్యమే రూపముగా గలవాడు, నిత్య కల్యాణరూపుడు అగు మహేశ్వరుడే సాక్షి యను పదమునకు అర్థము).

  1. సాక్షా త్క్రియా వ్యవధానమంతరేణ స్వాత్మన్యేవ సర్వం సమీక్షతే ఇతి సాక్షీ -

(అంతయు తానే కనుక తనలోనున్న దానినే తాను సాక్షిగా చూచువాడు)

  1. “మాయా సన్నిహితో (అ)ప్రవిష్ట వ పుషా సాక్షీతి గీతో భవాన్ ||” (నారాయణీయము)

(మాయతో గూడియు దాని దోషములనంటనివాడవై సాక్షియని చెప్పబడుచుందువు).

  1. ప్రకాశకః అభివ్యక్తం తిరోహితం (లీనం) కార్యం, కారణం తదుభయం సమీక్షతే ఇతి సాక్షీ - సాక్షాత్ పశ్యతి ఇతి సాక్షీ.

(ప్రకాశింపచేయువాడు, కార్యవస్తువులను, కారణవస్తువులను - ఈ రెండింటిని చూచువాడు - స్వయముగా కండ్లతో చూచువాడు, కనిపెట్టుచుండువాడు).

  1. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు మొదలగు వాటియందు ఆవిర్భా తిరో భావములను తెలుసుకొను వాడు, స్వయం జ్యోతియు, చతనుడు - చైతన్యమే రూపముగ గలవాడు - సాక్షియని చెప్పబడుచున్నాడు).

  2. జాగ్రదాద్యవస్థా లక్షణస్య సాక్ష్యస్య ద్రష్టా సాక్షీ ప్రత్యక్ చైతన్య రూపేణావ స్థితః ఇత్యర్థః.

(జాగ్రత్త మొదలగు అవస్థలు లక్షణములుగా గల సాక్ష్యమైన ఈ ప్రపంచమును చూచువాడు సాక్షి - చైతన్యరూపముతోనుండు పరమాత్మ).

  1. సీ ||. - - -

- - -

అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరు డఖిల జీవుల హృదయములనుండి

బుద్ధి వృత్తులనెల్ల బోధియై వీక్షించు; బద్ధుండు కాడు ప్రాభవమువలన. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -1 - 18)

  1. “వ. - - - నీవు దేహ గతుండవై దేహియందు నంతర్యామివయ్యుం గర్మ ఫలంబులం బొరయక, కర్మ ఫల భోక్తయైన జీవునకు సాక్షి భూతంబవైయుండుదువు - అట్టి నిన్ను సజ్ఞులైన మానవులు నిజకంఠ లగ్నంబైన కంఠికామణి నిత్య సన్నిహితంబయి వెలుగుచుండినను గానక వర్తించు తెఱంగున హృదయ పద్మ మధ్యంబున ననంత తేజో విరాజ మానుండవై ప్రకాశించు నిన్ను దెలియలేరు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భా - 1230)

  2. “సాక్షీత్వాత్మ ధ్రువస్సదా” -

(ఆత్మయే సాక్షి).

(జాగ్రత్స్వప్న దశలయందీ ద్రష్టృ, దర్శన, దృశ్యముల యొక్క సద్భావమును సుషుప్తి కైవల్య దశల యందు ఈ మూడింటియొక్క అభావమును తెలియచేయుచు అన్ని దశలందు అనువర్తించి, నిత్యమై, నిర్వికారమై యున్న చైతన్యము సాక్షి యనబడును).

  1. జ్ఞానాశ్రయః, జ్ఞానగుణః ఇత్యర్థః -

(జ్ఞానమునకు ఆశ్రయమైనవాడు - జ్ఞానము గుణముగా గలవాడు).

  1. “జాగ్రత్స్వప్న సుషుప్త్యాభ్యాః యా (అ)వస్థా భాతి దేహినాం |

అస్యాః అపి మహదేవః సాక్షీ భిన్నః స్వయం ప్రభవః ||“. (సూతసంహితాయాం)

(దేహులకు - దేహము కలవారికి అవస్థలకు స్వయం ప్రభువైన మహాదేవుడు సాక్షియై యున్నాడు).

  1. “యస్సర్వప్రాణినాం దేహే సాక్షి భూతో వ్యవస్థితః |

అక్షరః క్షరమాణానాం తస్మై సాక్ష్యాత్మనే నమః ||“. (మహాభారతము)

(సమస్త ప్రాణుల శరీరమందును సాక్షిగా నుండువాడు, నశించువాటిలో నశించక యుండువాడు, ఆత్మ అయినవాని గుఱించి నమస్కారము).

  1. “అంతఃకరణమునందు వర్తించునట్టి ఏ చైతన్యము కలదో దానిని సాక్షియందురు. ఒకే చైతన్యము అంతఃకరణముతో కూడి సంసారి యనబడును - అంతఃకరణ భాగము త్యజించి కేవల చైతన్యభాగము సాక్షి యనబడును”.

  2. “యస్సమస్త జగతః చేతనా చేతనస్య చ |

సాక్షీ సర్వాంతరశ్శం భుక్తం వందే సాంబమీశ్వరం ||“.

(చేతనములు, అచేతనములు గల యీ సమస్త జగత్తునకు సాక్షియు, అన్నింటిలోనుండువాడున్నూ, పార్వతితో కూడియుండువాడున్నూ అయిన ఈశ్వరునకు నమస్కారము).

  1. “సకారాయ స శబ్దార్థ స్వరూపాయ సదాత్మనే |

సాక్షిణే (అ)సాక్షి రూపాణాం నమస్సాధూపకారిణే ||”

“సహజ శక్తి సహితో భృంగీశ స్సకారార్థః; అసాక్షి స్వరూపాణాం విషయా సంగినాం సంసారిణాం; సాధూపకారిణే భోగ మోక్ష ప్రదానేన సమ్యగవకర్త్రే ||”.

(స శబ్దార్థమునకు రూపమగువాడు - అనగా, సహజ శక్తిగల శివుడు అని అర్థము. విషయలోలురైన సంసారులకు సాక్షియై భోగము, మోక్షమునిచ్చుచు ఉపకారము చేయువాడు అగు శివునకు నమస్కారము).

  1. ఆదిత్య చందావనిలో నలశ్చద్యౌర్బూమిరాపో హృదయం యమశ్చ |

అహశ్చ రాత్రశ్చ ఉభే చ సంధ్యే ధర్మోహి జానాతి నరస్య వృత్తిం ||.

(సూర్య చంద్రులు, వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, జలము, హృదయము, యముడు, పగలు రాత్రి, రెండు సంధ్యలు,ధర్మము - ఇవి నరుని వృత్తిని - వ్యాపారమును, కర్మలను, తెలుసుకొనుచున్నవి - మానవుడు పుణ్య పాపములు గాని, ఏ కర్మలు గాని చేసినను అవి ఎవరికిని తెలియ కుండగనే చేసితినని అభిప్రాయపడును - కాని అతని చర్యలు పంచభూతములు, సూర్య చంద్రులు, కాలము, యముడు చూచుచునే యుందురు. ఇవన్నియు అతని కర్మలకు సాక్షులే, వీటి అన్నింటిలోను భగవంతుడున్నాడు, ఇవన్నియు భగవంతుని రూపములే).

  1. “ఇద్దరు జగడమాడి జయాప జయములనొంది, వానివలన సుఖ దుఃఖములను పొందు చుండగా ఆ సుఖదుఃఖములను తాను పొందక నిర్వికారుడై చూచువాడు సాక్షి”.

  2. సాక్షినే ప్రత్యగాత్మయని, క్షేత్రజ్ఞుడని, కూటస్థుడని, ద్రష్టయని, తురీయుడని చెప్పుదురు -

  3. అన్నింటిలోను అంతరాత్మగానుండుటచేత అన్నింటినిప్రత్యక్షముగా చూచువాడు - సాక్షి, భగవంతుడు.

  4. “గతిర్భర్తా ప్రభుః సాక్షీ”. (శ్రీమద్భగవద్గీత - 9 - 18)

(గతి, భర్త, ప్రభువు, సాక్షి అయినవాడు భగవంతుడే).

Transliteration
  1. sākṣātpaśyatē ti sākṣī -

(tana kaṃḍlatō cūcu vāḍu sākṣi)

  1. sākṣāt draṣṭatvamēvahi sākṣitvaṃ -

(kaḷḷatō cūcuṭē sākṣi yaguṭa)

  1. sākṣāt draṣṭā sākṣī tasya karma sākṣyaṃ.

(tana kaṃḍlatō cūcuvāḍu sākṣi, atanu cēyu ākarma sākṣyamu).

  1. sākṣāt draṣṭā pratyakṣa tayā anubhavitā -

(svayamugā tana kaḷḷatō cūcuvāḍu, pratyakṣamugā anubhaviṃcuvāḍu)

  1. sākṣā dīkṣatē iti sākṣī - - - taduktaṃ “sākṣāt draṣṭari saṃjñayāṃ” iti.

(tanakaṃṭitōnē cūcuvāḍu sākṣi - tana kaḷḷatō cūcuvāḍē sākṣi ani ceppabaḍinadi).

  1. “prāṇināṃ kṛtākṛtasya sākṣī” (śrīśaṃkaraḥ)

(prāṇulu cēyukarmalaku sākṣi ayinavāḍu). “sākṣī śubhā śubha draṣṭā sarvēṣāṃ prāṇanāṃ sadā |” (gītābhāvaprakāśamu - 9 - 125) ellapuḍu samasta prāṇulayokka puṇya pāpakarmalanu cūcuvāḍu).

  1. “sākṣā davyava dhānēna svarūpa bōdhēna ca īkṣatē paśyati sarvamiti sākṣī”

(sākṣāttugā vyavadhānamu lēkuṃda jñānarūpuḍaguṭacēta anniṃṭini cūcuvāḍu).

  1. sarva bhūtānāṃ adhiṣṭānaṃ bhūtvā sākṣī bhavati, sākṣyaṃ adhiṣṭānē sākṣiṇi kalpitaṃ iti bhāvaḥ

(samasta bhūtamulaku adhiṣṭānamugā nuṃḍuṭacēta sākṣiyaguvāḍu - bhagavaṃtuḍu).

  1. tanavallanaina prapaṃcānni tānē yeṟuṃgucunnāḍu ganuga draṣṭu bhāva yuktuḍu - “savētti vēdyaṃ, na catasyāstivēttā”. (telusukōvalasina dānini tānu telusukonunu, kāni atanini telusukonagalavāḍu lēḍu) aninnī, “trithāmasu yadbhōjyaṃ, bhōktā, bhōgaśca yadbhavēt. tēbhyō vilakṣaṇassākṣī cinamātrō haṃ sadā śivaḥ” (trithāmamulaṃdu bhōjyamu, bhōkta, bhōgamu anuvāṭikaṃṭe vēṟu lakṣaṇamulu galavāḍu, caitanyamātruḍu ayina sadāśivuḍanu nēnē).

(teliyavalasina dānini tāni telusukonunu, kāni atanini telusukonagaliginavāḍu maṟi yokaḍu lēḍu - bhōgya vastuvu dānini bhōgiṃcuvāḍu, bhōgiṃcuṭa anunī mūḍiṃṭikaṃṭe vēṟu lakṣaṇamulu galavāḍu, sākṣi ayinavāḍu, cinmātruḍu ayina sadāśivuḍanu nēnē ani śruti (kaivalyōpaniṣat) ceppucunnadi).

triṣu thāmasu - jāgaraṇa, svapna, suṣuptēṣu sthānēṣu yat prasiddhaṃ bhōjyaṃ sthūla praviviktānaṃda rūpaṃ bhōktāṃ viśvataijasa prājñāḥ, bhōgaśca sthūla pravivaktānaṃda bhōgōpi yat yuktaṃ tridhāmabhōgyādi prapaṃca jātaṃ bhavēt. tēbhyaḥ tridhāmādibhyaḥ vilakṣaṇaḥ viparīta lakṣaṇaḥ sākṣī svādhyastasya viśvasya draṣṭā, cinmātraḥ, cidēkarasaḥ, ahaṃ - ahaṃpratyaya vyavahāra yōgyaḥ sadiśivaḥ, kaivalyātmā. nitya kalyāṇarūpō mahēśvaraḥ).

(jāgaraṇa, svapna, suṣupti yanu mūḍu avasthalayaṃdu bhōjyamagu sthūla prapaṃcamu, vāṭini anubhaviṃcu viśvuḍu, taijasuḍu, prājñuḍu - vīrikaṃṭe vēru lakṣaṇamulu galavāḍu, tanayaṃdu adhyastamayina prapaṃcamunaku sākṣi ayinavāḍu (draṣṭa ayinavāḍu), caitanya mātruḍu - caitanyamu anu okē tatvamugalavāḍu, ahaṃ = nēnu ani vyavahariṃcuṭaku yōgyuḍainavāḍu, sadāśivuḍu, kaivalyamē rūpamugā galavāḍu, nitya kalyāṇarūpuḍu agu mahēśvaruḍē sākṣi yanu padamunaku arthamu).

  1. sākṣā tkriyā vyavadhānamaṃtarēṇa svātmanyēva sarvaṃ samīkṣatē iti sākṣī -

(aṃtayu tānē kanuka tanalōnunna dāninē tānu sākṣigā cūcuvāḍu)

  1. “māyā sannihitō (a)praviṣṭa va puṣā sākṣīti gītō bhavān ||” (nārāyaṇīyamu)

(māyatō gūḍiyu dāni dōṣamulanaṃṭanivāḍavai sākṣiyani ceppabaḍucuṃduvu).

  1. prakāśakaḥ abhivyaktaṃ tirōhitaṃ (līnaṃ) kāryaṃ, kāraṇaṃ tadubhayaṃ samīkṣatē iti sākṣī - sākṣāt paśyati iti sākṣī.

(prakāśiṃpacēyuvāḍu, kāryavastuvulanu, kāraṇavastuvulanu - ī reṃḍiṃṭini cūcuvāḍu - svayamugā kaṃḍlatō cūcuvāḍu, kanipeṭṭucuṃḍuvāḍu).

  1. jñātṛ jñāna jñēyamulu modalagu vāṭiyaṃdu āvirbhā tirō bhāvamulanu telusukonu vāḍu, svayaṃ jyōtiyu, catanuḍu - caitanyamē rūpamuga galavāḍu - sākṣiyani ceppabaḍucunnāḍu).

  2. jāgradādyavasthā lakṣaṇasya sākṣyasya draṣṭā sākṣī pratyak caitanya rūpēṇāva sthitaḥ ityarthaḥ.

(jāgratta modalagu avasthalu lakṣaṇamulugā gala sākṣyamaina ī prapaṃcamunu cūcuvāḍu sākṣi - caitanyarūpamutōnuṃḍu paramātma).

  1. sī ||. - - -

- - -

akhilāṃtarātmakuḍagu paramēśvaru ḍakhila jīvula hṛdayamulanuṃḍi

buddhi vṛttulanella bōdhiyai vīkṣiṃcu; baddhuṃḍu kāḍu prābhavamuvalana. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -1 - 18)

  1. “va. - - - nīvu dēha gatuṃḍavai dēhiyaṃdu naṃtaryāmivayyuṃ garma phalaṃbulaṃ borayaka, karma phala bhōktayaina jīvunaku sākṣi bhūtaṃbavaiyuṃḍuduvu - aṭṭi ninnu sajñulaina mānavulu nijakaṃṭha lagnaṃbaina kaṃṭhikāmaṇi nitya sannihitaṃbayi velugucuṃḍinanu gānaka vartiṃcu teṟaṃguna hṛdaya padma madhyaṃbuna nanaṃta tējō virāja mānuṃḍavai prakāśiṃcu ninnu deliyalēru - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bhā - 1230)

  2. “sākṣītvātma dhruvassadā” -

(ātmayē sākṣi).

(jāgratsvapna daśalayaṃdī draṣṭṛ, darśana, dṛśyamula yokka sadbhāvamunu suṣupti kaivalya daśala yaṃdu ī mūḍiṃṭiyokka abhāvamunu teliyacēyucu anni daśalaṃdu anuvartiṃci, nityamai, nirvikāramai yunna caitanyamu sākṣi yanabaḍunu).

  1. jñānāśrayaḥ, jñānaguṇaḥ ityarthaḥ -

(jñānamunaku āśrayamainavāḍu - jñānamu guṇamugā galavāḍu).

  1. “jāgratsvapna suṣuptyābhyāḥ yā (a)vasthā bhāti dēhināṃ |

asyāḥ api mahadēvaḥ sākṣī bhinnaḥ svayaṃ prabhavaḥ ||“. (sūtasaṃhitāyāṃ)

(dēhulaku - dēhamu kalavāriki avasthalaku svayaṃ prabhuvaina mahādēvuḍu sākṣiyai yunnāḍu).

  1. “yassarvaprāṇināṃ dēhē sākṣi bhūtō vyavasthitaḥ |

akṣaraḥ kṣaramāṇānāṃ tasmai sākṣyātmanē namaḥ ||“. (mahābhāratamu)

(samasta prāṇula śarīramaṃdunu sākṣigā nuṃḍuvāḍu, naśiṃcuvāṭilō naśiṃcaka yuṃḍuvāḍu, ātma ayinavāni guṟiṃci namaskāramu).

  1. “aṃtaḥkaraṇamunaṃdu vartiṃcunaṭṭi ē caitanyamu kaladō dānini sākṣiyaṃduru. okē caitanyamu aṃtaḥkaraṇamutō kūḍi saṃsāri yanabaḍunu - aṃtaḥkaraṇa bhāgamu tyajiṃci kēvala caitanyabhāgamu sākṣi yanabaḍunu”.

  2. “yassamasta jagataḥ cētanā cētanasya ca |

sākṣī sarvāṃtaraśśaṃ bhuktaṃ vaṃdē sāṃbamīśvaraṃ ||“.

(cētanamulu, acētanamulu gala yī samasta jagattunaku sākṣiyu, anniṃṭilōnuṃḍuvāḍunnū, pārvatitō kūḍiyuṃḍuvāḍunnū ayina īśvarunaku namaskāramu).

  1. “sakārāya sa śabdārtha svarūpāya sadātmanē |

sākṣiṇē (a)sākṣi rūpāṇāṃ namassādhūpakāriṇē ||”

“sahaja śakti sahitō bhṛṃgīśa ssakārārthaḥ; asākṣi svarūpāṇāṃ viṣayā saṃgināṃ saṃsāriṇāṃ; sādhūpakāriṇē bhōga mōkṣa pradānēna samyagavakartrē ||”.

(sa śabdārthamunaku rūpamaguvāḍu - anagā, sahaja śaktigala śivuḍu ani arthamu. viṣayalōluraina saṃsārulaku sākṣiyai bhōgamu, mōkṣamuniccucu upakāramu cēyuvāḍu agu śivunaku namaskāramu).

  1. āditya caṃdāvanilō nalaścadyaurbūmirāpō hṛdayaṃ yamaśca |

ahaśca rātraśca ubhē ca saṃdhyē dharmōhi jānāti narasya vṛttiṃ ||.

(sūrya caṃdrulu, vāyuvu, agni, ākāśamu, bhūmi, jalamu, hṛdayamu, yamuḍu, pagalu rātri, reṃḍu saṃdhyalu,dharmamu - ivi naruni vṛttini - vyāpāramunu, karmalanu, telusukonucunnavi - mānavuḍu puṇya pāpamulu gāni, ē karmalu gāni cēsinanu avi evarikini teliya kuṃḍaganē cēsitinani abhiprāyapaḍunu - kāni atani caryalu paṃcabhūtamulu, sūrya caṃdrulu, kālamu, yamuḍu cūcucunē yuṃduru. ivanniyu atani karmalaku sākṣulē, vīṭi anniṃṭilōnu bhagavaṃtuḍunnāḍu, ivanniyu bhagavaṃtuni rūpamulē).

  1. “iddaru jagaḍamāḍi jayāpa jayamulanoṃdi, vānivalana sukha duḥkhamulanu poṃdu cuṃḍagā ā sukhaduḥkhamulanu tānu poṃdaka nirvikāruḍai cūcuvāḍu sākṣi”.

  2. sākṣinē pratyagātmayani, kṣētrajñuḍani, kūṭasthuḍani, draṣṭayani, turīyuḍani ceppuduru -

  3. anniṃṭilōnu aṃtarātmagānuṃḍuṭacēta anniṃṭinipratyakṣamugā cūcuvāḍu - sākṣi, bhagavaṃtuḍu.

  4. “gatirbhartā prabhuḥ sākṣī”. (śrīmadbhagavadgīta - 9 - 18)

(gati, bharta, prabhuvu, sākṣi ayinavāḍu bhagavaṃtuḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.