తంత్రోపాసకులు “సర్వం శక్తిమయం జగత్” అని శక్తియందు సర్వస్స్రష్టుత్వాదికర్తృత్వమును స్థాపించి అర్థనారీశ్వరుడగు శివుని యందలి శక్త్యంశమును విశేషము విశ్వసించి వామాచార సాంప్రదాయమును ననుసరించువారు.
ఆనందమే ఆత్మ, అనందోద్భోదకములైన మధుమాంస సంగమాదుల వలన కలుగు ఆనందప్రాప్తియె మోక్షమేయని తలచువారు -
శఖాచంద్రమస న్యాయము =చంద్రుని తెలియకోరునతనికి స్థూలముగ గోచరించు చెట్టు కొమ్మలు చూపించి, ఆ కొమ్మలకు మీదగల బింబమే చంద్రుడని తెలియ చెప్పుదురు - ఇట్లు చెప్పుటలఓ చంద్రునకు కొమ్మలతోడ సాక్షాత్ సంబంధములేదు - అయినను కొమ్మలకు పైన సూటిగా నంతరిస్ఖమున చంద్రుడుండుటచే జిజ్ఞాసువు చంద్రబింబమును తెలియుచున్నాడు - దీనిని శాఖాచంద్రమస న్యాయమందురు - ఇవ్విధమున పరబ్రహ్మమునకు చెప్పిన జన్మస్థితి భంగములకు కారణమగు లక్షణము పరబ్రహ్మమందు లేకున్నను చతుర్ముఖబ్రహ్మ కలదు కావున నా చతుతుర్ముఖుని ద్వారా తెలుపతగిన బ్రహ్మమును తెలుపజాలునని భావము.
“నిర్గుణబ్రహ్మము సూక్ష్మాతి స్జూక్ష్మము. ఏ విధమైన ద్వైతసబంధము ఈ పరబ్రహ్మకు లేకపోవుటచేత సర్గస్థితిలయములకు కారణమును లక్షణతోడ బ్రహ్మమునకు సంబంధము సంభవింపజలదు. అయినను అధ్యస్త సంబంధమున్నందున ఈ న్యాయముచేత సూచింపబడగలదనియు లక్ష్యముకాగలదనియు భావము”.
taṃtrōpāsakulu “sarvaṃ śaktimayaṃ jagat” ani śaktiyaṃdu sarvassraṣṭutvādikartṛtvamunu sthāpiṃci arthanārīśvaruḍagu śivuni yaṃdali śaktyaṃśamunu viśēṣamu viśvasiṃci vāmācāra sāṃpradāyamunu nanusariṃcuvāru.
ānaṃdamē ātma, anaṃdōdbhōdakamulaina madhumāṃsa saṃgamādula valana kalugu ānaṃdaprāptiye mōkṣamēyani talacuvāru -
śakhācaṃdramasa nyāyamu =caṃdruni teliyakōrunataniki sthūlamuga gōcariṃcu ceṭṭu kommalu cūpiṃci, ā kommalaku mīdagala biṃbamē caṃdruḍani teliya ceppuduru - iṭlu ceppuṭalaō caṃdrunaku kommalatōḍa sākṣāt saṃbaṃdhamulēdu - ayinanu kommalaku paina sūṭigā naṃtariskhamuna caṃdruḍuṃḍuṭacē jijñāsuvu caṃdrabiṃbamunu teliyucunnāḍu - dīnini śākhācaṃdramasa nyāyamaṃduru - ivvidhamuna parabrahmamunaku ceppina janmasthiti bhaṃgamulaku kāraṇamagu lakṣaṇamu parabrahmamaṃdu lēkunnanu caturmukhabrahma kaladu kāvuna nā catuturmukhuni dvārā telupatagina brahmamunu telupajālunani bhāvamu.
“nirguṇabrahmamu sūkṣmāti sjūkṣmamu. ē vidhamaina dvaitasabaṃdhamu ī parabrahmaku lēkapōvuṭacēta sargasthitilayamulaku kāraṇamunu lakṣaṇatōḍa brahmamunaku saṃbaṃdhamu saṃbhaviṃpajaladu. ayinanu adhyasta saṃbaṃdhamunnaṃduna ī nyāyamucēta sūciṃpabaḍagaladaniyu lakṣyamukāgaladaniyu bhāvamu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.