తెలియని స్థితి; అజ్ఞానము, అంధకారము, మంచి చెడ్డలు, పూర్వాపరములు తెలియకపోవుట. అవివేకము; తన శరీరము తనకు తెలియకపోవుట.
అవివేకః; కర్తవ్యాకర్తవ్య విషయే విభ్రమః -
(చేయవలసినదేదో, చేయకూడనిదేదో అను విషయము గుఱించి అవివేకము, తెలియకపోవుట, విభ్రమము)
కార్యాకార్య వివేక స్యాభావః సం మోహ ఉద్భవేత్ |
యే నాప్త గురుమిత్రా దీన్యథా కృశ్యతి మూఢధీః |
సం మోహాజ్జాయతే తస్మాత్ స్మృతేర్భ్రంశో హ్యనర్ధదః |
శాస్త్రా చార్యోపదిష్టార్దాను సంధానస్య విభ్రమః | “. (గీతాభావప్రకాశము - 2 - 613 to 615)
“క్రోధాద్భవతి సం మోపః సం మోహాత్ స్మృతి విభ్రమః” (శ్రీమద్భగవద్గీత - 2 - 63)
(క్రోధమువలన సం మోహము కలుగును, సం మోహము వలన స్మృతి విభ్రమము కలుగును. క్రోధమువలన ఇది చేయవలసినది, ఇది చేయరానిది అను విషయము గుఱించి వివేకము లేకుండునట్లు చేయు సం మోహము కలుగును - దీని వలన ఆప్తులను (తన క్షేమము కోరువారలను) గురువును మిత్రులను మొదలగువారిని కోపగించును - చేయకూడని పని చేయును - సం మోహము అనర్థము కలుగచేయు స్మృతి భ్రంశము కలుగును, అనగా, శాస్త్రములో చెప్పినదానిని, గురువు చెప్పినదానిని మఱచిపోవును)
(ధర్మము కానిదానియందు, చేయకూడని పనియందు కోరిక కలిగియుండుట)
teliyani sthiti; ajñānamu, aṃdhakāramu, maṃci ceḍḍalu, pūrvāparamulu teliyakapōvuṭa. avivēkamu; tana śarīramu tanaku teliyakapōvuṭa.
avivēkaḥ; kartavyākartavya viṣayē vibhramaḥ -
(cēyavalasinadēdō, cēyakūḍanidēdō anu viṣayamu guṟiṃci avivēkamu, teliyakapōvuṭa, vibhramamu)
kāryākārya vivēka syābhāvaḥ saṃ mōha udbhavēt |
yē nāpta gurumitrā dīnyathā kṛśyati mūḍhadhīḥ |
saṃ mōhājjāyatē tasmāt smṛtērbhraṃśō hyanardhadaḥ |
śāstrā cāryōpadiṣṭārdānu saṃdhānasya vibhramaḥ | “. (gītābhāvaprakāśamu - 2 - 613 to 615)
“krōdhādbhavati saṃ mōpaḥ saṃ mōhāt smṛti vibhramaḥ” (śrīmadbhagavadgīta - 2 - 63)
(krōdhamuvalana saṃ mōhamu kalugunu, saṃ mōhamu valana smṛti vibhramamu kalugunu. krōdhamuvalana idi cēyavalasinadi, idi cēyarānidi anu viṣayamu guṟiṃci vivēkamu lēkuṃḍunaṭlu cēyu saṃ mōhamu kalugunu - dīni valana āptulanu (tana kṣēmamu kōruvāralanu) guruvunu mitrulanu modalaguvārini kōpagiṃcunu - cēyakūḍani pani cēyunu - saṃ mōhamu anarthamu kalugacēyu smṛti bhraṃśamu kalugunu, anagā, śāstramulō ceppinadānini, guruvu ceppinadānini maṟacipōvunu)
(dharmamu kānidāniyaṃdu, cēyakūḍani paniyaṃdu kōrika kaligiyuṃḍuṭa)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.