(సమస్త భూతములందు సమానమైన దృష్టి - అభిమానము కలవాడు).
(శత్రువులను, మిత్రులను సమముగా చూచువాడు).
(ఈ ప్రపంచమంతయు - అందులోనున్న వస్తువులన్నియు - ఏ విధమైన తేడా ఉన్నను - వాసుదేవుడుగా వాటిని చూచువాడు).
(అంతటను, అన్నింటిలోను భగవంతుడు సమముగానే - ఒకే రీతిగ - నున్నాడు అని చూచువాడు - తలచువాడు).
(ఈశ్వరుడు - భగవంతుడు - అచ్ఛిన్నుడుగా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కడుగా - లేడు - (అన్నింటిలో నున్న వాడు ఒక్కడే) అని తలచువాడు).
(పరమేశ్వరుని రూపములన్నింటియందును సామ్యము - చూచుట సమదర్శనము).
(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవఱకు గల హెచ్చు తక్కువలుగా నుండు సమస్త భూతములందు నిర్విశేషబ్రహ్మ ఒకటే ఆత్మగా నున్నాడు - అను జ్ఞానము కలవాడు -)
(ఆత్మకు ఉపాధులయిన మానుష పశు శరీరములందు, ఉత్తమ, మధ్యమ, అధమ శరీరములందు, అన్నింటియందు నిర్విశేషమగుటవలన పరబ్రహ్మ సమముగానే ప్రవేశించి యున్నాడని పండితులు తెలుసుకొనెదరు - ఎరుగుదురు - వారు తమలోనున్న ఆత్మయే పరమాత్మయని తెలుసుకొనెదరు).
విశేషో నైవ ధీరస్య సర్వత్ర సమదర్శనః ||“. (అష్టావక్రగీత - 17 - 15)
(సుఖమందు, దుఃఖమందు, పురుషునందు, స్త్రీయందు, సంపదలోను, ఆపత్తులలోను విశేషము - తేడాకు కారణము సమదర్శనుడు చూడడు).
“తనయందు నిఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 -)
“స్వ శరీరే, (అ)న్యదేహేషు సమం నిశ్చిత్యతం దృఢం |
అధ ధీరా న జాయంతే హ్యచ్యూతాశ్చ భవంతుహి ||“. (సూతసంహితాయాం)
“యే నామప్రాజ్ఞా స్వకీయ శరీరే దేహాంతరేషు సోపాదిషు ఘట శరావాది షు చంద్రస్య రూపవత్ సామ్యే నావస్థితం సచ్ఛిదానందాఖండైకరసం బ్రహ్మాత్మ తత్వం శ్రవణమననాది భిః సాక్షాత్కృత్య ధీరాః ధైర్యవంతో దృఢ నిశ్చయాః సంసార భయ రహితాః వర్తంతే, తే పునరేత ద్దేహ పతనానంతరం న జాయంతే, విద్యయా సకల సంసార విధాన భూతా విద్యాయాః సమూల కాషం కి తత్వాత్, న కేవలం సర్వ శరీరేష్వవ సమః, అపితు సర్వ తంత్రేష్వపి సమ ఏవాత్మా ప్రతిపాద్యతే”.
(ప్రాజ్ఞులగువారు ఉపాధులయిన కుండ, మూకుడులో ప్రతిబింబించిన చంద్రబింబమువలె వారి దేహమందు, ఇతర శరీరములందు సచ్చిదానందము, అఖండైకరసము అగు బ్రహ్మను - బ్రహ్మతత్వమును -, శ్రవణము మననము, మొదలగువాటిచేత సాక్షాత్కరించుకొని, దృఢ నిశ్చయముతో సంసారము వలన కలుగు భయము లేనివారై యుందురు. అట్టివారు ఈ దేహమును నదలిన తర్వాత - చనిపోయినతర్వాత - మరల జన్మించరు - విద్యచేత - జ్ఞానముచేత - సమస్త సంసారమునకు నిధానమైన అవిద్య - అజ్ఞానము - పూర్తిగా నశింపచేయబడుటచేత - తంత్రములన్నింటియందు పరబ్రహ్మ సమముగా అన్నింటియందు ఉన్నాడని ప్రతిపాదింపబడినది - చెప్పబడినది).
శుని చైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః |
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 18, 19)
గవి సంస్కార హీనాయాం రాజస్యాం మధ్యమాకృతా |
అత్యంత తామసే సర్వాధమే హస్త్యాదికత్రయే |
సత్యాదిక గుణై స్త ద్ఙైః సంస్కారై రత్య సంగికం |
ద్రష్టుం శీలం సమం బ్రహ్మ యేషాం తే జ్ఞానినో బుధాః |
సూర్యో గాంగే జలే కౌపే సరాయాం ప్రతిబింబితం |
తద్గుణై ర్దోష సంబంధైః అసం స్పృష్టో యథా భవేత్ |
తధా బ్రహ్మ చిదాభాస ద్వారేణ ప్రతిబింబితం |
సోపాధి గుణదోషాభ్యాం సంబంధం యాతి చిద్ఘనం |
ఇత్యేవం మన్య మానాస్తే సర్వత్ర సమదర్శినః |
నీరాగాః స్వసుఖస్పూర్త్యా జీవన్ముక్తిం భజంతి వై ||
- - - తైర్జీ వద్భిరితి క్రాంతిః పండితైః సమ దర్శిభిః |
సర్గో ద్వైత ప్రపంచో యం భూతేషు విషమే ష్వపి |
బ్రహ్మణో వర్త మానస్య సామ్యే యేషాం స్థిరం మనః |
యస్మాత్తద్బ్రహ్మ కూటస్థః నిత్యమే కరసః సమం |
తస్తాత్తే (అ)వస్థితా నిత్యం బ్రహ్మణ్యేవ వివశ్చితః |
పామరై ర్దోషవత్స్వేషు శ్వపాకా విషు యద్యపి |
తద్దోషై ర్దోషవన్మూఢైః పరం బ్రహ్మ విభావ్యతే |
తధాపి దోషా సంసృష్టమేవ బ్రహ్మా స్వ భావతః |
తద్రూపా పండితా జీవన్ముక్తా దోషైర్వివర్జితాః |
స్మృస్త్వజ్ఞ గృహస్తస్య దోష మహాన్యథా కృతే |
న తు బ్రహ్మవిదో దోషం వక్తు మర్హతి కించన ||“. (గీతాభావప్రకాశము - 5 - 152 to 157)
(సాత్వికుడు, వినీతుడు, తత్వ దర్శి అగుటవలన శ్రేష్టుడైన బ్రాహ్మణునందును, రాజస గుణము కలిగి ఏ విధమైన సంస్కారము లేని గోవునందును, ఎక్కువగా తామస గుణము కలిగి అన్నింటికంటె అధమమైన ఏనుగు, కుక్క, కుక్కలను తినువాడు మొదలగు వాటియందును, త్రిగుణములు వాటి వలన కలుగు సంస్కారములు లేనివాటివలే - యీ మూడింటియందును ఉన్న బ్రహ్మ సమమే అను దృష్టి గల బుధులు - జ్ఞానులు, పండితులు సమదర్శినులు. గంగా జలములోను, బావి నీటిలోను, జక్కు కుండలోను ప్రతిబింబించినను సూర్యుడు వాటి గుణములకు సంబంధించిన దోషములతో సంబంధము లేనివాడే. ఆ ప్రకారముగానే బ్రహ్మ చిదాభాసరూపముగా ఉపాధులలో ప్రతిబింబించినప్పటికీ ఆయా ఉపాధి దోషముల సంబంధమును పొందడు. ఈ ప్రకారముగా యలుచువారు అన్నింటి యందును సమదర్శినులు - అట్టివారే పండితులు).
(భూతములన్నియు వాటి వాటి ధర్మ విశేషమువలన విషమముగానున్నను - వేరు వేరుగా నున్నను - వాటి అన్నింటిలో నున్న బ్రహ్మ సమానమే. ఉపాధులు వేరు వేరు స్వభావములు కలిగియున్నప్పటికీవాటిలో నున్న బ్రహ్మలో తేడా లేదు - ఎందుచేతననగా - బ్రహ్మ ఎప్పుడూ, ఎందులోనున్నను ఏకరసమే. ఒకే మోస్తరుగా నుండువాడు, మార్పులు పొందనివాడు, ఒకే తత్వము గలవాడు. ఈ ప్రకారము ఎవరి మనసు స్థిరముగానుండునో, - అనగా, ఈ ప్రకారము ఎవరి మనసులో ఎల్లపుడు అభిప్రాయము కలిగియుండునో - వారు ఈ ప్రపంచమును, స్వర్గమును అతిక్రమించినవారు, వారే పండితులు, వారే సమదర్శినులు).
(ఉత్తముడైన బ్రాహ్మణుని యందు, చండాలుడు మొదలగు వారియందును సమముగానే పరబ్రహ్మ సద్రూపముతోను - స్ఫురణరూపముతోను (చైతన్య రూపముతోను - తానున్నట్లు స్ఫురించునట్లుగాను) ప్రకాశించుచున్నాడు అని చూచు - భావించు - శీలముగలవారు సమదర్శినులు -)
(హెచ్చు తక్కువలు గలవారియందును, బీదలందును, గొప్పవారు కొద్దిపాటివారు అయినను అందఱి యందును అందఱి యడల పరబ్రహ్మ సమానముగా నున్నట్లు చూచు స్వభావము కలవారు సమదర్శినులు).
(బ్రాహ్మణునియందు - నేను అనేకమందికి శుశ్రూష చేసినందువలన పుణ్యాత్ముడనైతిని అను అభిప్రాయము లేనివానియందు - గోవునందు ఇది పావనము కాదు అనిన్నీ; చండాలునియందు వీడు పాపి, అపవిత్రుడు అను అభిప్రాయమున్ను, ఏనుగు గుఱించి ఇది ధనము సంపాదించునదికాదు అనియు; కుక్కయందు ఇది అపవిత్రము అనిన్నీ - ఇటువంటి విషమ బుద్ధి;ఏకుండ పైన చెప్పిన వాటి అన్నింటిలోను భగవంతుడు సమముగా నున్నందున వాటిని సమముగానే చూచు పండితులు సమదర్శినులు).
(విద్య యనగా వేదార్థ పరిజ్ఞానము, లేక, బ్రహ్మవిద్య, వినయము అనగా అహంకారము లేకుండుట - ఈ రెండును గలవాడు బ్రహ్మవేత్త; అట్టి బ్రహ్మ వేత్తయు, సాత్వికుడు (సత్వగుణము కలవాడు) సర్వోత్తముడు (అందఱికన్న ఉత్తముడు) అయిన బ్రాహ్మణునందును; బ్రాహ్మణునివలె సంస్కారము లేనిదిన్నీ, రజోగుణము గలదిన్నీ (బ్రాహ్మణునివలె ఉత్తమమైనదికాక) మధ్యమమైనదిన్నీ, అగు గోవునందు, అన్నింటిలోను అధమమనదిన్నీ, మిక్కిలి తమోగుణము కలదిన్నీ అయిన ఏనుగు, కుక్క, చండాలుడు - ఈ మూడింటియందును - సంస్కారము గలవారైనను, వాటిని అంటనివారైనను, వాటిలో పండితులు - జ్ఞానులు - పరబ్రహ్మ సమముగా - నిష్పక్షపాతముగా - వైషమ్యము లేకుండునట్లు చూచెదరు - గంగా నదీ జలములోను, చెరువు నీటిలోను, కల్లు కుండలోను - సూర్యుని ప్రతిబింబము కనబడినను ఆ జలముల దోషము ఆ సూర్యునకు గాని, దాని ప్రతిబింబమునకుగాని అంటదు. ఆ ప్రకారముగానే పరబ్రహ్మయొక్క ప్రతిబింబము అగు చిదాభాసునకు (జీవికి) తానున్న ఉపాధికి (శరీరమునకు) సంబంధించిన గుణములు అతనికి అంటవు. ఇట్లు ఉపాధి యే గుణము కలదైనను, భగవంతుడు అన్నింటిలోను సమముగానే యున్నాడు అబి నమ్మియుండువారు రాగద్వేషములు లేనివారై పమానందమువంటిది యగు జీవన్ముక్తిని అనుభవించెదరు).
(శ్రీమాన్ రామానుజః)
(విద్యా వినయములుకలిగినటువంటి బ్రాహ్మణుడు, గోవు, కుక్క, చండాలుడు - వీరి శరీరములలో ఒకదానినుండి ఒకటి ఎంతో హెచ్చు తక్కువలు కలిగియున్నవి. వీటి శరీరములలోని యీ తేడా ప్రకృతివలన కలిగినది - ఆత్మవలన కాదు. ఆత్మ జ్ఞానైకాకారము కలదగుటచేత - జ్ఞానమే చైతన్యశక్తి అను ఒకే ఆకారము కలదగుటచేత - అన్ని శరీరములందును ఒకే లాగున నున్నదని చూచువారు పండితులు - అనగా ఆత్మయాధాత్మ్యామును తెలుసుకొనినవారు ఆత్మను యథాతథముగా తెలుసుకొనినవారు, ఆత్మయొక్క వాస్తవ పరిస్థితి - తత్వము - ను తెలిసినవారు సమదర్శినులు అని చెప్పబడుదురు).
(వినయము అనగా ఉపశమము; విద్యావినయములుగల విద్వాంసుడైన - వినీతుడైన బ్రాహ్మణునియందు, ఆవు, కుక్క, చండాలుడు - అను ముగ్గురి యందు, పండితులు సమదర్శినులు - విద్యా వినయము గల బ్రాహ్మణుడు, ఉత్తముడు, సంకారము గలవాడు, సత్వగుణము కలవాడు. సంస్కారములేక మధ్యమమైన రాజసగుణము లేనిది ఆవు. అధమమునకు చెందినది అయి కేవలము తామసగుణము కలది ఏనుగు మొదలగునవి. వీటి అన్నింటిలోను ఒకడే యగు పరబ్రహ్మ ఏ విధమైన మార్పు లేకుండ సమముగానే యున్నాడని చూచు స్వభావముకలవారు సమదర్శినులు).
ఈక్షితే యోగయుక్తాత్మా సర్వత్ర సమ్నదర్శినః “. (శ్రీమద్భగవద్గీత - 6 - 29)
“ఆబ్రహ్మ స్థావరాంతేషు, సర్వభూతేషు చిద్ఘనం |
స్వాత్మానమేక మద్వైత మనున్యూతం ప్రపశ్యతి |
తథా సర్వాణి భూతాని బ్రహ్మ దీన్యా త్మవస్తుని ఐక్యంగతాని యుక్తాత్మా పశ్యత్యాత్మైక దృఙ్మునః | సాక్ష్యేభ్యో(అ)నృతదుః ఖేభ్యో వివేకేన వివిచ్యయః |
సాక్షిణం ప్రత్యగాత్మానం అసంగం పరిపశ్యతి |
సాక్షిణ్యఖిలభూతాని కల్పితాన్యాత్మ మాయయా |
సాథ్యా సిరో హి సంబంధో మాయయా సాక్షి సాక్షయోః |
తన్నిరస్య వివేకేన మిధ్యా భూతాని పశ్యతి |
యోగే నైకాగ్ర్య రూపేణ చిత్తం యస్య సమాహితం |
సర్వత్రాస్తి సమం యస్య దర్శినః బ్రహ్మ గోచరం |
స యోగీ బ్రహ్మ విద్బ్రహ్మ పశ్య త్యన్యన్న పశ్యతి ||“. (గీతాభావప్రకాశము - 6 - 137 to 143)
(అన్నింటిలోను, అంతట నుండు ఆత్మ ఒకటే యని చూచు యోగి చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గల సమస్త భూతములందు అద్వయుడు, చైతన్య ఘనుడు ఒకడే అయిన పరమాత్మ పూర్తిగా వ్యాపించి యున్నాడు అనిన్నీ, చతుర్ముఖబ్రహ్మ మొదలు సమస్త భూతములు పరమాత్మయందు ఐక్యమగునని చూచును - ఏకాగ్ర్య దృష్టితో సమాహితమైన మనస్సు గల యోగి అంతటను పరబ్రహ్మను సమముగాచూచును. అట్టివాడు సమదర్శినుడు). “సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం”
(శ్రీమద్భగవద్గీత - 13 - 27)
(సమస్త భూతములందు సమముగా భగవంతుడున్నాడు)
(samasta bhūtamulaṃdu samānamaina dṛṣṭi - abhimānamu kalavāḍu).
(śatruvulanu, mitrulanu samamugā cūcuvāḍu).
(ī prapaṃcamaṃtayu - aṃdulōnunna vastuvulanniyu - ē vidhamaina tēḍā unnanu - vāsudēvuḍugā vāṭini cūcuvāḍu).
(aṃtaṭanu, anniṃṭilōnu bhagavaṃtuḍu samamugānē - okē rītiga - nunnāḍu ani cūcuvāḍu - talacuvāḍu).
(īśvaruḍu - bhagavaṃtuḍu - acchinnuḍugā, okkokka dānilō okkokkaḍugā - lēḍu - (anniṃṭilō nunna vāḍu okkaḍē) ani talacuvāḍu).
(paramēśvaruni rūpamulanniṃṭiyaṃdunu sāmyamu - cūcuṭa samadarśanamu).
(caturmukhabrahma modalu sthāvaramulavaṟaku gala heccu takkuvalugā nuṃḍu samasta bhūtamulaṃdu nirviśēṣabrahma okaṭē ātmagā nunnāḍu - anu jñānamu kalavāḍu -)
(ātmaku upādhulayina mānuṣa paśu śarīramulaṃdu, uttama, madhyama, adhama śarīramulaṃdu, anniṃṭiyaṃdu nirviśēṣamaguṭavalana parabrahma samamugānē pravēśiṃci yunnāḍani paṃḍitulu telusukonedaru - eruguduru - vāru tamalōnunna ātmayē paramātmayani telusukonedaru).
viśēṣō naiva dhīrasya sarvatra samadarśanaḥ ||“. (aṣṭāvakragīta - 17 - 15)
(sukhamaṃdu, duḥkhamaṃdu, puruṣunaṃdu, strīyaṃdu, saṃpadalōnu, āpattulalōnu viśēṣamu - tēḍāku kāraṇamu samadarśanuḍu cūḍaḍu).
“tanayaṃdu nikhila bhūtamulaṃdu noka bhaṃgi samahitatvaṃbuna jaruguvāḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 -)
“sva śarīrē, (a)nyadēhēṣu samaṃ niścityataṃ dṛḍhaṃ |
adha dhīrā na jāyaṃtē hyacyūtāśca bhavaṃtuhi ||“. (sūtasaṃhitāyāṃ)
“yē nāmaprājñā svakīya śarīrē dēhāṃtarēṣu sōpādiṣu ghaṭa śarāvādi ṣu caṃdrasya rūpavat sāmyē nāvasthitaṃ sacchidānaṃdākhaṃḍaikarasaṃ brahmātma tatvaṃ śravaṇamananādi bhiḥ sākṣātkṛtya dhīrāḥ dhairyavaṃtō dṛḍha niścayāḥ saṃsāra bhaya rahitāḥ vartaṃtē, tē punarēta ddēha patanānaṃtaraṃ na jāyaṃtē, vidyayā sakala saṃsāra vidhāna bhūtā vidyāyāḥ samūla kāṣaṃ ki tatvāt, na kēvalaṃ sarva śarīrēṣvava samaḥ, apitu sarva taṃtrēṣvapi sama ēvātmā pratipādyatē”.
(prājñulaguvāru upādhulayina kuṃḍa, mūkuḍulō pratibiṃbiṃcina caṃdrabiṃbamuvale vāri dēhamaṃdu, itara śarīramulaṃdu saccidānaṃdamu, akhaṃḍaikarasamu agu brahmanu - brahmatatvamunu -, śravaṇamu mananamu, modalaguvāṭicēta sākṣātkariṃcukoni, dṛḍha niścayamutō saṃsāramu valana kalugu bhayamu lēnivārai yuṃduru. aṭṭivāru ī dēhamunu nadalina tarvāta - canipōyinatarvāta - marala janmiṃcaru - vidyacēta - jñānamucēta - samasta saṃsāramunaku nidhānamaina avidya - ajñānamu - pūrtigā naśiṃpacēyabaḍuṭacēta - taṃtramulanniṃṭiyaṃdu parabrahma samamugā anniṃṭiyaṃdu unnāḍani pratipādiṃpabaḍinadi - ceppabaḍinadi).
śuni caiva śvapākēca paṃḍitāḥ samadarśinaḥ |
ihaiva tairjitaḥ sargō yēṣāṃ sāmyē sthitaṃ manaḥ |
nirdōṣaṃ hi samaṃ brahma tasmāt brahmaṇi tē sthitāḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 18, 19)
gavi saṃskāra hīnāyāṃ rājasyāṃ madhyamākṛtā |
atyaṃta tāmasē sarvādhamē hastyādikatrayē |
satyādika guṇai sta dṅaiḥ saṃskārai ratya saṃgikaṃ |
draṣṭuṃ śīlaṃ samaṃ brahma yēṣāṃ tē jñāninō budhāḥ |
sūryō gāṃgē jalē kaupē sarāyāṃ pratibiṃbitaṃ |
tadguṇai rdōṣa saṃbaṃdhaiḥ asaṃ spṛṣṭō yathā bhavēt |
tadhā brahma cidābhāsa dvārēṇa pratibiṃbitaṃ |
sōpādhi guṇadōṣābhyāṃ saṃbaṃdhaṃ yāti cidghanaṃ |
ityēvaṃ manya mānāstē sarvatra samadarśinaḥ |
nīrāgāḥ svasukhaspūrtyā jīvanmuktiṃ bhajaṃti vai ||
- - - tairjī vadbhiriti krāṃtiḥ paṃḍitaiḥ sama darśibhiḥ |
sargō dvaita prapaṃcō yaṃ bhūtēṣu viṣamē ṣvapi |
brahmaṇō varta mānasya sāmyē yēṣāṃ sthiraṃ manaḥ |
yasmāttadbrahma kūṭasthaḥ nityamē karasaḥ samaṃ |
tastāttē (a)vasthitā nityaṃ brahmaṇyēva vivaścitaḥ |
pāmarai rdōṣavatsvēṣu śvapākā viṣu yadyapi |
taddōṣai rdōṣavanmūḍhaiḥ paraṃ brahma vibhāvyatē |
tadhāpi dōṣā saṃsṛṣṭamēva brahmā sva bhāvataḥ |
tadrūpā paṃḍitā jīvanmuktā dōṣairvivarjitāḥ |
smṛstvajña gṛhastasya dōṣa mahānyathā kṛtē |
na tu brahmavidō dōṣaṃ vaktu marhati kiṃcana ||“. (gītābhāvaprakāśamu - 5 - 152 to 157)
(sātvikuḍu, vinītuḍu, tatva darśi aguṭavalana śrēṣṭuḍaina brāhmaṇunaṃdunu, rājasa guṇamu kaligi ē vidhamaina saṃskāramu lēni gōvunaṃdunu, ekkuvagā tāmasa guṇamu kaligi anniṃṭikaṃṭe adhamamaina ēnugu, kukka, kukkalanu tinuvāḍu modalagu vāṭiyaṃdunu, triguṇamulu vāṭi valana kalugu saṃskāramulu lēnivāṭivalē - yī mūḍiṃṭiyaṃdunu unna brahma samamē anu dṛṣṭi gala budhulu - jñānulu, paṃḍitulu samadarśinulu. gaṃgā jalamulōnu, bāvi nīṭilōnu, jakku kuṃḍalōnu pratibiṃbiṃcinanu sūryuḍu vāṭi guṇamulaku saṃbaṃdhiṃcina dōṣamulatō saṃbaṃdhamu lēnivāḍē. ā prakāramugānē brahma cidābhāsarūpamugā upādhulalō pratibiṃbiṃcinappaṭikī āyā upādhi dōṣamula saṃbaṃdhamunu poṃdaḍu. ī prakāramugā yalucuvāru anniṃṭi yaṃdunu samadarśinulu - aṭṭivārē paṃḍitulu).
(bhūtamulanniyu vāṭi vāṭi dharma viśēṣamuvalana viṣamamugānunnanu - vēru vērugā nunnanu - vāṭi anniṃṭilō nunna brahma samānamē. upādhulu vēru vēru svabhāvamulu kaligiyunnappaṭikīvāṭilō nunna brahmalō tēḍā lēdu - eṃducētananagā - brahma eppuḍū, eṃdulōnunnanu ēkarasamē. okē mōstarugā nuṃḍuvāḍu, mārpulu poṃdanivāḍu, okē tatvamu galavāḍu. ī prakāramu evari manasu sthiramugānuṃḍunō, - anagā, ī prakāramu evari manasulō ellapuḍu abhiprāyamu kaligiyuṃḍunō - vāru ī prapaṃcamunu, svargamunu atikramiṃcinavāru, vārē paṃḍitulu, vārē samadarśinulu).
(uttamuḍaina brāhmaṇuni yaṃdu, caṃḍāluḍu modalagu vāriyaṃdunu samamugānē parabrahma sadrūpamutōnu - sphuraṇarūpamutōnu (caitanya rūpamutōnu - tānunnaṭlu sphuriṃcunaṭlugānu) prakāśiṃcucunnāḍu ani cūcu - bhāviṃcu - śīlamugalavāru samadarśinulu -)
(heccu takkuvalu galavāriyaṃdunu, bīdalaṃdunu, goppavāru koddipāṭivāru ayinanu aṃdaṟi yaṃdunu aṃdaṟi yaḍala parabrahma samānamugā nunnaṭlu cūcu svabhāvamu kalavāru samadarśinulu).
(brāhmaṇuniyaṃdu - nēnu anēkamaṃdiki śuśrūṣa cēsinaṃduvalana puṇyātmuḍanaitini anu abhiprāyamu lēnivāniyaṃdu - gōvunaṃdu idi pāvanamu kādu aninnī; caṃḍāluniyaṃdu vīḍu pāpi, apavitruḍu anu abhiprāyamunnu, ēnugu guṟiṃci idi dhanamu saṃpādiṃcunadikādu aniyu; kukkayaṃdu idi apavitramu aninnī - iṭuvaṃṭi viṣama buddhi;ēkuṃḍa paina ceppina vāṭi anniṃṭilōnu bhagavaṃtuḍu samamugā nunnaṃduna vāṭini samamugānē cūcu paṃḍitulu samadarśinulu).
(vidya yanagā vēdārtha parijñānamu, lēka, brahmavidya, vinayamu anagā ahaṃkāramu lēkuṃḍuṭa - ī reṃḍunu galavāḍu brahmavētta; aṭṭi brahma vēttayu, sātvikuḍu (satvaguṇamu kalavāḍu) sarvōttamuḍu (aṃdaṟikanna uttamuḍu) ayina brāhmaṇunaṃdunu; brāhmaṇunivale saṃskāramu lēnidinnī, rajōguṇamu galadinnī (brāhmaṇunivale uttamamainadikāka) madhyamamainadinnī, agu gōvunaṃdu, anniṃṭilōnu adhamamanadinnī, mikkili tamōguṇamu kaladinnī ayina ēnugu, kukka, caṃḍāluḍu - ī mūḍiṃṭiyaṃdunu - saṃskāramu galavārainanu, vāṭini aṃṭanivārainanu, vāṭilō paṃḍitulu - jñānulu - parabrahma samamugā - niṣpakṣapātamugā - vaiṣamyamu lēkuṃḍunaṭlu cūcedaru - gaṃgā nadī jalamulōnu, ceruvu nīṭilōnu, kallu kuṃḍalōnu - sūryuni pratibiṃbamu kanabaḍinanu ā jalamula dōṣamu ā sūryunaku gāni, dāni pratibiṃbamunakugāni aṃṭadu. ā prakāramugānē parabrahmayokka pratibiṃbamu agu cidābhāsunaku (jīviki) tānunna upādhiki (śarīramunaku) saṃbaṃdhiṃcina guṇamulu ataniki aṃṭavu. iṭlu upādhi yē guṇamu kaladainanu, bhagavaṃtuḍu anniṃṭilōnu samamugānē yunnāḍu abi nammiyuṃḍuvāru rāgadvēṣamulu lēnivārai pamānaṃdamuvaṃṭidi yagu jīvanmuktini anubhaviṃcedaru).
(śrīmān rāmānujaḥ)
(vidyā vinayamulukaliginaṭuvaṃṭi brāhmaṇuḍu, gōvu, kukka, caṃḍāluḍu - vīri śarīramulalō okadāninuṃḍi okaṭi eṃtō heccu takkuvalu kaligiyunnavi. vīṭi śarīramulalōni yī tēḍā prakṛtivalana kaliginadi - ātmavalana kādu. ātma jñānaikākāramu kaladaguṭacēta - jñānamē caitanyaśakti anu okē ākāramu kaladaguṭacēta - anni śarīramulaṃdunu okē lāguna nunnadani cūcuvāru paṃḍitulu - anagā ātmayādhātmyāmunu telusukoninavāru ātmanu yathātathamugā telusukoninavāru, ātmayokka vāstava paristhiti - tatvamu - nu telisinavāru samadarśinulu ani ceppabaḍuduru).
(vinayamu anagā upaśamamu; vidyāvinayamulugala vidvāṃsuḍaina - vinītuḍaina brāhmaṇuniyaṃdu, āvu, kukka, caṃḍāluḍu - anu mugguri yaṃdu, paṃḍitulu samadarśinulu - vidyā vinayamu gala brāhmaṇuḍu, uttamuḍu, saṃkāramu galavāḍu, satvaguṇamu kalavāḍu. saṃskāramulēka madhyamamaina rājasaguṇamu lēnidi āvu. adhamamunaku ceṃdinadi ayi kēvalamu tāmasaguṇamu kaladi ēnugu modalagunavi. vīṭi anniṃṭilōnu okaḍē yagu parabrahma ē vidhamaina mārpu lēkuṃḍa samamugānē yunnāḍani cūcu svabhāvamukalavāru samadarśinulu).
īkṣitē yōgayuktātmā sarvatra samnadarśinaḥ “. (śrīmadbhagavadgīta - 6 - 29)
“ābrahma sthāvarāṃtēṣu, sarvabhūtēṣu cidghanaṃ |
svātmānamēka madvaita manunyūtaṃ prapaśyati |
tathā sarvāṇi bhūtāni brahma dīnyā tmavastuni aikyaṃgatāni yuktātmā paśyatyātmaika dṛṅmunaḥ | sākṣyēbhyō(a)nṛtaduḥ khēbhyō vivēkēna vivicyayaḥ |
sākṣiṇaṃ pratyagātmānaṃ asaṃgaṃ paripaśyati |
sākṣiṇyakhilabhūtāni kalpitānyātma māyayā |
sāthyā sirō hi saṃbaṃdhō māyayā sākṣi sākṣayōḥ |
tannirasya vivēkēna midhyā bhūtāni paśyati |
yōgē naikāgrya rūpēṇa cittaṃ yasya samāhitaṃ |
sarvatrāsti samaṃ yasya darśinaḥ brahma gōcaraṃ |
sa yōgī brahma vidbrahma paśya tyanyanna paśyati ||“. (gītābhāvaprakāśamu - 6 - 137 to 143)
(anniṃṭilōnu, aṃtaṭa nuṃḍu ātma okaṭē yani cūcu yōgi caturmukhabrahma modalu sthāvaramulavaraku gala samasta bhūtamulaṃdu advayuḍu, caitanya ghanuḍu okaḍē ayina paramātma pūrtigā vyāpiṃci yunnāḍu aninnī, caturmukhabrahma modalu samasta bhūtamulu paramātmayaṃdu aikyamagunani cūcunu - ēkāgrya dṛṣṭitō samāhitamaina manassu gala yōgi aṃtaṭanu parabrahmanu samamugācūcunu. aṭṭivāḍu samadarśinuḍu). “samaṃ sarvēṣu bhūtēṣu tiṣṭaṃtaṃ paramēśvaraṃ”
(śrīmadbhagavadgīta - 13 - 27)
(samasta bhūtamulaṃdu samamugā bhagavaṃtuḍunnāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.