మట్టిగడ్డ, ఱాయి, బంగారము, వీనిని సమముగా చూచుట. మట్టిని ఱాతిని సమముగా చూచుటలో ఏ కష్టము లేదు; కాని, ఱాతిని బంగారమును సమముగా చూచుటలో ప్రయాసము కలదు - కొన్ని ఉపాయములచేత అట్టి స్థితి చేకూరగలదు - అవి యేవి యనిన –
ఈ ప్రపంచమున సమస్త పదార్థములున్నూ పంచభూతములయొక్క వికారములే అయి యున్నవి. చెట్టు, పుట్ట. సూర్యుడు, చంద్రుడు, దేహము, ఱాయి, బంగారము - అన్నియు పంచభూతాత్మకములే. ఈ సత్యమును బాగుగా నెఱిగిన విజ్ఞానికి ప్రపంచములో ఏ వస్తువును చూచినను వెంటనే వాని యధిష్ఠానములగు పృధివ్యాది పంచభూతములుకాని, లేక, పంచభూతములకు ఆధారమగు పరమాత్మకాని జ్ఞప్తికి వచ్చుటవలన వాని యందు సమత్వముకే వీక్షించును.
ఈ ప్రపంచమునందు ఒక వస్తువునందు విలువను, మఱియొక వస్తువునందు విలువ లేమిని కల్పించినది వారి వారి మనస్సే. మట్టి అధికముగ లభించుటచేత దానికి మూల్యరాహిత్యమున్నూ, బంగారం తక్కువగా లభించుటచేత దానికి గొప్ప మూల్యమున్నూ మనస్సే కల్పించినది. చంటి పిల్లవాని యెదుట బంగారు పెట్టినచో అట్టి మనః కల్పన లేనందున దానినతడు లెక్క సేయకుండును. అట్లే జ్ఞానికి భేదజనకమగు మనః కల్పన లేనందువలన మట్టి, ఱాయి, బంగారము అను మూడు వస్తువులే కాక సమస్త పదార్థములును అతనికి సమముగనే తోచును –
ఆరూఢస్థితిని బడసిన యోగికి మ్రహ్మము (ఆత్మ) ఒక్కటియే సత్యముగను, దృశ్యమంతయు స్వప్నమువలె మిధ్యగను తోచును - కావున లేని యీ జగత్తునందు ఒకటి అల్పమేమిటి, ఒకటి అధికమేమిటి ? స్వప్నమందు రాజు, సామాన్య పౌరుడు, ఒకటియే యగునట్లు ఉత్తమ యోగికి ఱాయి బంగారు మొదలైన మిధ్యారూప దృశ్య వస్తువులన్నిటి యందును సమత్వమే గోచరించును –
ఆత్మ ప్రాప్తికి మట్టి ఉపయోగింపదు. అట్లే బంగారమున్నూ ఉపయోగపడదు. ఈ సత్యమెఱిగినందువలన యోగి దృష్టిలో ఈ రెండునూ సమముగానే ఉండును.
maṭṭigaḍḍa, ṟāyi, baṃgāramu, vīnini samamugā cūcuṭa. maṭṭini ṟātini samamugā cūcuṭalō ē kaṣṭamu lēdu; kāni, ṟātini baṃgāramunu samamugā cūcuṭalō prayāsamu kaladu - konni upāyamulacēta aṭṭi sthiti cēkūragaladu - avi yēvi yanina –
ī prapaṃcamuna samasta padārthamulunnū paṃcabhūtamulayokka vikāramulē ayi yunnavi. ceṭṭu, puṭṭa. sūryuḍu, caṃdruḍu, dēhamu, ṟāyi, baṃgāramu - anniyu paṃcabhūtātmakamulē. ī satyamunu bāgugā neṟigina vijñāniki prapaṃcamulō ē vastuvunu cūcinanu veṃṭanē vāni yadhiṣṭhānamulagu pṛdhivyādi paṃcabhūtamulukāni, lēka, paṃcabhūtamulaku ādhāramagu paramātmakāni jñaptiki vaccuṭavalana vāni yaṃdu samatvamukē vīkṣiṃcunu.
ī prapaṃcamunaṃdu oka vastuvunaṃdu viluvanu, maṟiyoka vastuvunaṃdu viluva lēmini kalpiṃcinadi vāri vāri manassē. maṭṭi adhikamuga labhiṃcuṭacēta dāniki mūlyarāhityamunnū, baṃgāraṃ takkuvagā labhiṃcuṭacēta dāniki goppa mūlyamunnū manassē kalpiṃcinadi. caṃṭi pillavāni yeduṭa baṃgāru peṭṭinacō aṭṭi manaḥ kalpana lēnaṃduna dāninataḍu lekka sēyakuṃḍunu. aṭlē jñāniki bhēdajanakamagu manaḥ kalpana lēnaṃduvalana maṭṭi, ṟāyi, baṃgāramu anu mūḍu vastuvulē kāka samasta padārthamulunu ataniki samamuganē tōcunu –
ārūḍhasthitini baḍasina yōgiki mrahmamu (ātma) okkaṭiyē satyamuganu, dṛśyamaṃtayu svapnamuvale midhyaganu tōcunu - kāvuna lēni yī jagattunaṃdu okaṭi alpamēmiṭi, okaṭi adhikamēmiṭi ? svapnamaṃdu rāju, sāmānya pauruḍu, okaṭiyē yagunaṭlu uttama yōgiki ṟāyi baṃgāru modalaina midhyārūpa dṛśya vastuvulanniṭi yaṃdunu samatvamē gōcariṃcunu –
ātma prāptiki maṭṭi upayōgiṃpadu. aṭlē baṃgāramunnū upayōgapaḍadu. ī satyameṟiginaṃduvalana yōgi dṛṣṭilō ī reṃḍunū samamugānē uṃḍunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.