(వేరు వేరు సత్తా కల రెండు పదార్ధములు సమాన విభక్తికి చెందినవగుటచేత రెండునూ ఒకటే యని ప్రతిపాదించు వాక్యములోని రెండు పదములకు సామాన్యాధికరణ సంబంధము స్థాణువునకును పురుషునకును, బింబ ప్రతిబింబములకును బ్రహ్మకును జగత్తునకును గల సంబంధము).
(ఏ వస్తువునకు ఏ వస్తువుతో భేదము లేకుండునో ఆ వస్తువునకు ఆ వస్తువుతో సామాన్యాధి కరణమని చెప్పబడినది. ఘటాకాశమునకు మహాకాశముతో భేదము లేని సత్తా కలిగియుండుటచేత ఘటాకాశము మహాకాశమే - అందుచేత ఘటాకాశమునకు మహాకాశముతో సమానాధికరణ్యము - ఈప్రకారముగానే కూటస్థునకు పరబ్రహ్మకున్నూ బేధము లేకపోవుటవలన అ యిద్దఱికి సామానాధికరణ్యమున్నది).
(ఏ వస్తువునకు - అది నశించుటకు ముందు - ఏ వస్తువుతో భేదము లేక యుండునో ఆ వస్తువునకు ఆ వస్తువుతో నశించుటలో సమాన్యాధికరణ్యము అని చెప్పబడును - ముఖము యొక్క ప్రతిబింబము దాని బింబము కనబడకపోవకముందు రెండింటికి భేదము లేనట్లు ప్రతిబింబము, బింబము ఒకటే అయినట్లు - (ప్రతిబింబము బింబమేకాని, ఇతరము కానట్లు - అందుచేత ప్రతిబింబమునకు బింబముతో సామానాధికరణ్యము అగుచున్నది. చీకటిలో స్థాణువుని చూచి పురుషుడనుకొనిన తర్వాత విచారించగా (ఆలోచించగా) అది స్థాణువేగాని పురుషుడు కాదని జ్ఞానము కలిగిన తర్వాత పురుషునకు స్థాణువుతో సామానాధికరణ్యము కలుగును. ఆ ప్రకారమే ఆభాస విషయములో బాధానంతరమే బ్రహ్మతో భేదము లేకుండుట సంభవించును).
ప్రకృతి రూపమగు మహాభూత సంఘాతము జీవునకెట్లు శరీరమో అట్లే జీవుడునూ పరమాత్మకు శరీరము. ఇదియే సామానాధికరణ్యము - విడదీసిన ప్రకృతి వేరు జీవుడువేరు సర్వేశరుడు వేరు; కలిసినచో నొకే స్వరూపము - సూక్ష్మ చిదచిద్విశిష్టుడు సర్వేశ్వరుడును, స్థూల చిదచిద్వశిష్టుడగు సర్వేశ్వరుడును ఒకటే).
“సమాన విభక్తికత్వేసతి ఏకార్థబోధకత్వం యయోః పదయో రస్తి తౌ పదౌ పరస్పర సామానాధికరణే ఇతి. తయోః పదయోః పరస్పర సంబంధః సమానాధి కరణ్య సంబంధిః ఇతి చ ఉచ్యతే - ఇదం చ సామానాధికరణ్యం జీవబ్రహ్మైక్యబోధక సమాన విభక్తి మత్పద ఘటిత చతుర్వేదాంతర్గత చతుర్విధ మహా వాక్యేషు ఉపలభ్యతే - తథా అన్యత్రాపి లౌకిక దైవిక వాక్యేషు బోధ్యం”.
(సమాన విభక్తి యొక్క బలముచేత సమానము - అనగా, ఏకము, అధికరణము అనగా, అర్థరూపాశ్రయము, ఇవి దేనికి గలవో అట్టి ఏ రెండు శబ్దములు గలవో వానిని సమానాధికరణమందురు - ఈ రెండు శబ్దములయొక్క ఏ పరస్పర సంబంధము గలదో అది సమానాధికరణ్య - ఈ రెండు శబ్దములయొక్క ఏ పరస్పర సంబంధముగలదో అది సమానాధికరణ్యము - ఏకార్థత్వము - అనబడును. ఈ సమానాధికరణ్య రూప సంబంధము జీవేశ్వరులయొక్క ఏకతా బోధకమైన ఏక విభక్తిగల పదములచేత గూడిననాలుగు వేదములయొక్క నాలుగు మహావాక్యములందు తెలియవలయును - ఘటకాశము మహాకాశముగా నున్నది, కూటస్థుడు బ్రహ్మముగా నున్నాడు).
(సమాన భక్తి యొక్క బలముచత సమానము - అనగా, ఏకము - అధికరణము అనగా, అర్థరూపాశ్రయము - ఇవి వేనికి గలవో అట్టి రెండు శబ్దములు గలవో వానిని సమానాధికరణమందురు - ఈరెండుశబ్దములయొక్క ఏ పరస్పర సంబంధము గలదో అది సమానాధీక్రణయ్ము - ఏకార్థత్వము - అనబడును. ఈ సమానాధికరణ్యరూప సంబంధము జీవేశ్వరులయొక్క ఏకతా బోధకమైనఏక విభక్తి గల పదములచేత గూడిన నాలుగు వేదముల యొక్క నాలుగు మహావాక్యములందు తెలియవలయును - ఘటాకాశము మహాకాశముగా నున్నది, కూటస్థుడు బ్రహ్మముగా నున్నాడు).
(సమానాధికరణ్య సంబంధమనగా “సః అయం దేవ దత్తః” (ఇతడు ఆ దేవదత్తుడు అను వాక్యమందు పూర్వ కాలముతో సంబంధము కల ఆదేవదత్తుని తెలుపు ‘సః’ (ఆ)(వాడు) శబ్దమునకును, వర్తమానకాలముతోసంబంధముగల ఈ దేవదత్తుని తెలుపు ‘అయం’ శబ్దమునకును, వర్తమానకాలముతో సంబంధముగల ఈ దేవదత్తుని తెలుపు ‘అయం’ శబ్దముకున్నూ ఒకే వ్యక్తియందు తాత్పర్యము కలిగి యుండుటయే సంబంధము - అదే విధముగా ‘తత్వమసి’అను వాక్యమునందును పరోక్షత్వాది లక్షణములు గల చైతన్యమును చెప్పు ’తత్’ శబ్దమునకును అపరోక్షత్వాది లక్షణములుగల చైతన్యమును తెలుపు ‘త్వం’ పదమునకును ఒకే చైతన్యమునందు తాత్పర్య సంబంధమున్నది. కావున రెండు పదములున్నూ సమానాధికరణ్యసంబంధము కలివి యగుచున్నవి.
(ఈ సామానాధికరణ్యము రెండు విధములు - ముఖ్య సామానాధికరణ్యము, బాధయందు సామానాధికరణ్యము సమాన సత్తా కలవి యగుటచేతను, సమాన స్వరూపము కలిగియుండుట చేతను వాస్తవముగా భేదము లేని రెండు పదార్థములను తెలియచేయు రెండు పదములు ముఖ్య సామనాధికరణ్యమని చెప్పబడుచున్నది. ఉదాహరణకు కూటస్థుడగు కీవుడు, పరబ్రహ్మ అను రెండు పదములకున్నూ ఘటాకాశ మహాకాశములను రెండు పదములకు నుండు సంబంధము).
(vēru vēru sattā kala reṃḍu padārdhamulu samāna vibhaktiki ceṃdinavaguṭacēta reṃḍunū okaṭē yani pratipādiṃcu vākyamulōni reṃḍu padamulaku sāmānyādhikaraṇa saṃbaṃdhamu sthāṇuvunakunu puruṣunakunu, biṃba pratibiṃbamulakunu brahmakunu jagattunakunu gala saṃbaṃdhamu).
(ē vastuvunaku ē vastuvutō bhēdamu lēkuṃḍunō ā vastuvunaku ā vastuvutō sāmānyādhi karaṇamani ceppabaḍinadi. ghaṭākāśamunaku mahākāśamutō bhēdamu lēni sattā kaligiyuṃḍuṭacēta ghaṭākāśamu mahākāśamē - aṃducēta ghaṭākāśamunaku mahākāśamutō samānādhikaraṇyamu - īprakāramugānē kūṭasthunaku parabrahmakunnū bēdhamu lēkapōvuṭavalana a yiddaṟiki sāmānādhikaraṇyamunnadi).
(ē vastuvunaku - adi naśiṃcuṭaku muṃdu - ē vastuvutō bhēdamu lēka yuṃḍunō ā vastuvunaku ā vastuvutō naśiṃcuṭalō samānyādhikaraṇyamu ani ceppabaḍunu - mukhamu yokka pratibiṃbamu dāni biṃbamu kanabaḍakapōvakamuṃdu reṃḍiṃṭiki bhēdamu lēnaṭlu pratibiṃbamu, biṃbamu okaṭē ayinaṭlu - (pratibiṃbamu biṃbamēkāni, itaramu kānaṭlu - aṃducēta pratibiṃbamunaku biṃbamutō sāmānādhikaraṇyamu agucunnadi. cīkaṭilō sthāṇuvuni cūci puruṣuḍanukonina tarvāta vicāriṃcagā (ālōciṃcagā) adi sthāṇuvēgāni puruṣuḍu kādani jñānamu kaligina tarvāta puruṣunaku sthāṇuvutō sāmānādhikaraṇyamu kalugunu. ā prakāramē ābhāsa viṣayamulō bādhānaṃtaramē brahmatō bhēdamu lēkuṃḍuṭa saṃbhaviṃcunu).
prakṛti rūpamagu mahābhūta saṃghātamu jīvunakeṭlu śarīramō aṭlē jīvuḍunū paramātmaku śarīramu. idiyē sāmānādhikaraṇyamu - viḍadīsina prakṛti vēru jīvuḍuvēru sarvēśaruḍu vēru; kalisinacō nokē svarūpamu - sūkṣma cidacidviśiṣṭuḍu sarvēśvaruḍunu, sthūla cidacidvaśiṣṭuḍagu sarvēśvaruḍunu okaṭē).
“samāna vibhaktikatvēsati ēkārthabōdhakatvaṃ yayōḥ padayō rasti tau padau paraspara sāmānādhikaraṇē iti. tayōḥ padayōḥ paraspara saṃbaṃdhaḥ samānādhi karaṇya saṃbaṃdhiḥ iti ca ucyatē - idaṃ ca sāmānādhikaraṇyaṃ jīvabrahmaikyabōdhaka samāna vibhakti matpada ghaṭita caturvēdāṃtargata caturvidha mahā vākyēṣu upalabhyatē - tathā anyatrāpi laukika daivika vākyēṣu bōdhyaṃ”.
(samāna vibhakti yokka balamucēta samānamu - anagā, ēkamu, adhikaraṇamu anagā, artharūpāśrayamu, ivi dēniki galavō aṭṭi ē reṃḍu śabdamulu galavō vānini samānādhikaraṇamaṃduru - ī reṃḍu śabdamulayokka ē paraspara saṃbaṃdhamu galadō adi samānādhikaraṇya - ī reṃḍu śabdamulayokka ē paraspara saṃbaṃdhamugaladō adi samānādhikaraṇyamu - ēkārthatvamu - anabaḍunu. ī samānādhikaraṇya rūpa saṃbaṃdhamu jīvēśvarulayokka ēkatā bōdhakamaina ēka vibhaktigala padamulacēta gūḍinanālugu vēdamulayokka nālugu mahāvākyamulaṃdu teliyavalayunu - ghaṭakāśamu mahākāśamugā nunnadi, kūṭasthuḍu brahmamugā nunnāḍu).
(samāna bhakti yokka balamucata samānamu - anagā, ēkamu - adhikaraṇamu anagā, artharūpāśrayamu - ivi vēniki galavō aṭṭi reṃḍu śabdamulu galavō vānini samānādhikaraṇamaṃduru - īreṃḍuśabdamulayokka ē paraspara saṃbaṃdhamu galadō adi samānādhīkraṇaymu - ēkārthatvamu - anabaḍunu. ī samānādhikaraṇyarūpa saṃbaṃdhamu jīvēśvarulayokka ēkatā bōdhakamainaēka vibhakti gala padamulacēta gūḍina nālugu vēdamula yokka nālugu mahāvākyamulaṃdu teliyavalayunu - ghaṭākāśamu mahākāśamugā nunnadi, kūṭasthuḍu brahmamugā nunnāḍu).
(samānādhikaraṇya saṃbaṃdhamanagā “saḥ ayaṃ dēva dattaḥ” (itaḍu ā dēvadattuḍu anu vākyamaṃdu pūrva kālamutō saṃbaṃdhamu kala ādēvadattuni telupu ‘saḥ’ (ā)(vāḍu) śabdamunakunu, vartamānakālamutōsaṃbaṃdhamugala ī dēvadattuni telupu ‘ayaṃ’ śabdamunakunu, vartamānakālamutō saṃbaṃdhamugala ī dēvadattuni telupu ‘ayaṃ’ śabdamukunnū okē vyaktiyaṃdu tātparyamu kaligi yuṃḍuṭayē saṃbaṃdhamu - adē vidhamugā ‘tatvamasi’anu vākyamunaṃdunu parōkṣatvādi lakṣaṇamulu gala caitanyamunu ceppu ’tat’ śabdamunakunu aparōkṣatvādi lakṣaṇamulugala caitanyamunu telupu ‘tvaṃ’ padamunakunu okē caitanyamunaṃdu tātparya saṃbaṃdhamunnadi. kāvuna reṃḍu padamulunnū samānādhikaraṇyasaṃbaṃdhamu kalivi yagucunnavi.
(ī sāmānādhikaraṇyamu reṃḍu vidhamulu - mukhya sāmānādhikaraṇyamu, bādhayaṃdu sāmānādhikaraṇyamu samāna sattā kalavi yaguṭacētanu, samāna svarūpamu kaligiyuṃḍuṭa cētanu vāstavamugā bhēdamu lēni reṃḍu padārthamulanu teliyacēyu reṃḍu padamulu mukhya sāmanādhikaraṇyamani ceppabaḍucunnadi. udāharaṇaku kūṭasthuḍagu kīvuḍu, parabrahma anu reṃḍu padamulakunnū ghaṭākāśa mahākāśamulanu reṃḍu padamulaku nuṃḍu saṃbaṃdhamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.