← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమష్టి రూపము samaṣṭi rūpamu

Original — తెలుగు
  1. “సమస్త స్వరూపం”. (శ్రీరామకర్ణామృతం - 2 - 85)

(కలిసియుండునది - సమస్తము ఒకే చోట రూపము చెందియుండునది - మొత్తముగా నుండునది).

  1. “అనేక వృక్షంబులు గూడి వనంబను చందంబున ననేక జీవులనెల్లను తన యాత్మ యను నభిమానంబు ఈశ్వరునికి సమష్టి రూపంబగు -. (వివేకచింతామణి - 1)

  2. యధా వృక్షాణాం సమష్ట్యభిప్రాయేణ వనం ఇత్యేకత్వ వ్యపదేశః, యథావా జలానాం సమష్ట్యభిప్రాయేణ జలాశయః ఇతి - తథా నానాత్వేన ప్రతిభా సమానానాం జీవ గతాజ్ఞానానాం సమష్ట్యభిప్రాయేణ తదేకత్వ వ్యపదేశః - “అజామేకాం” ఇత్యాది శ్రుతేః -

(వృక్షములు సమష్టిగా నొకచోట నుండునపుడు దానిని వనమని వ్యవహరించినట్లున్నూ - జలములు కలిసి యున్నపుడు అజ్ఞానమువలన సముద్రము అని వ్యవహరించినట్లు - అనేకములైన అజ్ఞానులైన జీవులు కలిసి ఒకే చోట - భగవంతునిలో, తిరిగి పుట్టుటకు కారణరూపములో నున్నవి అన్నియు ఒకే రూపముగా కలిసి సమష్టిగా నుండు భగవంతుని రూపము).

Transliteration
  1. “samasta svarūpaṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 85)

(kalisiyuṃḍunadi - samastamu okē cōṭa rūpamu ceṃdiyuṃḍunadi - mottamugā nuṃḍunadi).

  1. “anēka vṛkṣaṃbulu gūḍi vanaṃbanu caṃdaṃbuna nanēka jīvulanellanu tana yātma yanu nabhimānaṃbu īśvaruniki samaṣṭi rūpaṃbagu -. (vivēkaciṃtāmaṇi - 1)

  2. yadhā vṛkṣāṇāṃ samaṣṭyabhiprāyēṇa vanaṃ ityēkatva vyapadēśaḥ, yathāvā jalānāṃ samaṣṭyabhiprāyēṇa jalāśayaḥ iti - tathā nānātvēna pratibhā samānānāṃ jīva gatājñānānāṃ samaṣṭyabhiprāyēṇa tadēkatva vyapadēśaḥ - “ajāmēkāṃ” ityādi śrutēḥ -

(vṛkṣamulu samaṣṭigā nokacōṭa nuṃḍunapuḍu dānini vanamani vyavahariṃcinaṭlunnū - jalamulu kalisi yunnapuḍu ajñānamuvalana samudramu ani vyavahariṃcinaṭlu - anēkamulaina ajñānulaina jīvulu kalisi okē cōṭa - bhagavaṃtunilō, tirigi puṭṭuṭaku kāraṇarūpamulō nunnavi anniyu okē rūpamugā kalisi samaṣṭigā nuṃḍu bhagavaṃtuni rūpamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.