← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంచితకర్మ saṃcitakarma

Original — తెలుగు
  1. సంపాదించిన కర్మ, సంపాదితము, కూడబెట్టబడినది.

  2. అతీతానంద శరీరానుష్టితం సత్ ఫలాయా నారబ్థం కర్మ సంచితం.

(గడచిపోయిన అనేక జన్మలలో చేసిన కర్మలు సత్ఫలములనీయుటకు ఆరంభించని కర్మ)

  1. “కు సూలస్థ ధాన్యం పునః పునః పూర్యమాణం క్రమేణ భుజ్యమానం యథా తథా అనేక జన్మార్జితం అంతఃకరణోపహితసాక్షి జ్ఞానావరణ శక్తి నిష్టం కర్మ సంచితం” (విచారసాగరము)

(గాదిలో వేసిన ధాన్యము తిరిగి నింపబడుచు భుజింపబడుచుండునట్లు అనేక జన్మములందార్జించబడిన కర్మ)

  1. జన్మహేతుభూతం స్థితం పూర్వజన్మ కృతం కర్మ సంచితముచ్యతే -

(జన్మకు కారణమైన పూర్వ జన్మలలో చేసిన కర్మ సంచితమని చెప్పబడును)

  1. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్ప కోటి శతార్జితం |

సంచితం విలయం యాతి ప్రభోదాత్ స్వప్న కర్మవత్ ||.

(కలలో చేసిన కర్మలన్నియు మేలుకొనగానే నశించినట్లు కోటి కల్పములందు ఆర్జించిన కర్మఫలము “అహం బ్రహ్మ” అను మహావాక్యము యొక్క అర్థమును తెలియుటచేత లేకుండపోవును)

  1. ఇంతకుముందు ఎన్నో జన్మలలో చేసిన కర్మ ఫలము నివ్వక మిగిలి యున్నది)

  2. కర్మలు వాటి ఫలము ననుభవింపచేసి క్షీణించును. “నా భుక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతైరపి” ఎన్ని యుగములు గడచినను చేసిన కర్మ ఫలము ననుభవింపచేయనిదే క్షీణించదు). “అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం”. (చేసిన కర్మ మంచిదైనను చెడ్డదైనను అనుభవించి తీరవలసినదే). దీనిని బట్టి సంచిత కర్మ అనుభవించవలసినదని యున్నది. కాని, బ్రహ్మజ్ఞానము కలిగినయడల - బ్రహ్మ సాక్షాత్కారము కలిగిన తోడనే - ప్రారబ్దకర్మ తప్ప మిగిలిన కర్మలన్నియు క్షీణించును - “క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే” (భగవత్సాక్షాత్కారము కలుగగనే కర్మలు క్షీణించును). (చూడుము - ప్రారబ్దకర్మ).

Transliteration
  1. saṃpādiṃcina karma, saṃpāditamu, kūḍabeṭṭabaḍinadi.

  2. atītānaṃda śarīrānuṣṭitaṃ sat phalāyā nārabthaṃ karma saṃcitaṃ.

(gaḍacipōyina anēka janmalalō cēsina karmalu satphalamulanīyuṭaku āraṃbhiṃcani karma)

  1. “ku sūlastha dhānyaṃ punaḥ punaḥ pūryamāṇaṃ kramēṇa bhujyamānaṃ yathā tathā anēka janmārjitaṃ aṃtaḥkaraṇōpahitasākṣi jñānāvaraṇa śakti niṣṭaṃ karma saṃcitaṃ” (vicārasāgaramu)

(gādilō vēsina dhānyamu tirigi niṃpabaḍucu bhujiṃpabaḍucuṃḍunaṭlu anēka janmamulaṃdārjiṃcabaḍina karma)

  1. janmahētubhūtaṃ sthitaṃ pūrvajanma kṛtaṃ karma saṃcitamucyatē -

(janmaku kāraṇamaina pūrva janmalalō cēsina karma saṃcitamani ceppabaḍunu)

  1. ahaṃ brahmēti vijñānāt kalpa kōṭi śatārjitaṃ |

saṃcitaṃ vilayaṃ yāti prabhōdāt svapna karmavat ||.

(kalalō cēsina karmalanniyu mēlukonagānē naśiṃcinaṭlu kōṭi kalpamulaṃdu ārjiṃcina karmaphalamu “ahaṃ brahma” anu mahāvākyamu yokka arthamunu teliyuṭacēta lēkuṃḍapōvunu)

  1. iṃtakumuṃdu ennō janmalalō cēsina karma phalamu nivvaka migili yunnadi)

  2. karmalu vāṭi phalamu nanubhaviṃpacēsi kṣīṇiṃcunu. “nā bhuktaṃ kṣīyatē karma kalpa kōṭi śatairapi” enni yugamulu gaḍacinanu cēsina karma phalamu nanubhaviṃpacēyanidē kṣīṇiṃcadu). “avaśyamanu bhōktavyaṃ kṛtaṃ karma śubhā śubhaṃ”. (cēsina karma maṃcidainanu ceḍḍadainanu anubhaviṃci tīravalasinadē). dīnini baṭṭi saṃcita karma anubhaviṃcavalasinadani yunnadi. kāni, brahmajñānamu kaliginayaḍala - brahma sākṣātkāramu kaligina tōḍanē - prārabdakarma tappa migilina karmalanniyu kṣīṇiṃcunu - “kṣīyaṃtē cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē” (bhagavatsākṣātkāramu kalugaganē karmalu kṣīṇiṃcunu). (cūḍumu - prārabdakarma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.