← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంధ్యా వందనము saṃdhyā vaṃdanamu

Original — తెలుగు
  1. “ఓం కేశవాయస్వాహా” ఇత్యేవం త్రినామభిరపః పీత్వా గోవిందాయనమః, విష్ణవేనమః ఇతి కరౌ ప్రక్షాల్య, “మధుసూదన, త్రివిక్రమేతి” ద్వాభ్యాం అంగుష్టమూలే సోట్టౌ సమృజ్య, “వామన శ్రీదరేతి” ద్వాభ్యాం తదైవ ముఖమున్మార్జ్య,“ఋషీకేశేతి” వామకరం ప్రోక్ష్య, పద్మనా భేతి పాదౌ సంప్రోక్ష్య, దామోదరేతి మూర్థానాం సంప్రోక్ష్య, “సంకర్షణేతి” సంహిత మధ్యమాంగుళిత్రయేణ ఆస్యం సంస్పృశ్య, ” వాసుదేవ ప్రద్యుమ్నేతి ద్వాభ్యాం అంగుష్ట తర్జనీభ్యాం నాసా పుటే సంస్పృశ్య, అనిరుద్ధ పురుషోత్తమేతి ద్వాభ్యాం అంగుష్టానామికాభ్యాం చక్షుషీ సంస్పృశ్య, “అధోక్షజ నారసింహేతి” ద్వాభ్యాం తధైవ శ్రోత్రే సంస్పృశ్య, “అచ్యుతేతి కనిష్టాంగుష్టాభ్యాం నాభిం సంస్పృశ్య,” జనార్దనేతి పాణికలేన హృదయం సంస్పృశ్య, ” ఉపేంద్రేతి శిరః సంస్పృశ్య, “హరయేనమః, కృష్ణాయనమః” ఇతి ద్వాభ్యాం దక్షిణ వామ బాహుమూలే స్పృశేత్ ఇతి ఏతచ్చ ఆచారాహ్నికే స్పష్టం”

(“ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా” అని భగవంతుని మూడు నామములతో నీరు పురుషిడితో త్రాగి, గోవిందాయనమః, విష్ణువేనమః (గోవిందుని గుఱించి నమస్కారము, విష్ణువు గుఱించి నమస్కారము) అని చేతి మీద నీళ్ళు జల్లుకొని, “మధుసూదన, త్రివిక్రమ” అను రెండు నామములతో అంగుష్ట మూలముతో - బొటనవ్రేలి మూలముతో పెదవులను తడిపి, “వామన, శ్రీధర” అను నామములతో నోటిని పవిత్రము చేసుకొని, “హృషీకేశ” అని ఎడమ చేతిని సంప్రోక్షణము సేసి, “పద్మనాభ” అని పాదములను సంప్రోక్షణముచేసి, “దామోదర” అని శిరస్సుమీద సంప్రోక్షణము చేసుకొని, “సంకర్షణ” అను నామము నుచ్చరించుచు, ముడిచిన మధ్య మూడు వేళ్ళతోను మొగమును తాకి, “వాసుదేవ” ప్రద్యుమ్న అను రెండు నామములతోను అంగుష్ట తర్జనీ వ్రేళ్ళతో ముక్కును ముట్టుకొని, “అనిరుద్ధ, పురుషోత్తం” అను రెండు పేర్లతోను అంగుష్టముతో అనామిక అను వేలుతోను కండ్లను సంప్రోక్షణము చేసుకొని, “అధోక్షజ, నారసింహ” అను రెండు నామములతోను శ్రోత్రములను సంప్రోక్షించుకొని, అచ్యుతా అను నామముతో చిటికనవేలు బొటనవేలుతో బొడ్డును ముట్టుకొని, “జనార్ధన” అను పేరుతో చేతితో హృదయమును ముట్టుకొని, “హరయేనమః”, “కృష్ణాయనమః” అను రెండింటితోను కుడి యెడమ బాహు మూలములను ముట్టవలెను).

  1. “ప్రాతస్సంధ్యాం స నక్షత్రాం, మధ్యాహ్నే మధ్యభాస్కరాం |

నసూర్యాం పశ్చిమాం సంధ్యాం తిస్రస్సంధ్యా ఉపాసతే |

తద్భేదానపి వక్ష్యామి శృణు దేవర్షి సత్తమ |

ఉత్తమా తారకోపేతా మధ్యమా లుప్తతారకా |

అధమా సూర్యసహితా ప్రాతస్సంధ్యా త్రిధా మతా ||

ఉత్తమా సూర్య సహితా మధ్యమా అస్తమితే రవే |

అధమా తారకోపేతా సాయం సంధ్యా త్రథామితా ||

- - - ఉదయాస్తమయా దూర్థ్వం యావత్ స్యాత్ ఘటికా త్రయం |

తారత్సంధ్యాముపాసీత ప్రాయశ్చిత్తం తతః పరం |

కాలాతి క్రమణే జాతే చతుర్ధాఘ్యం ప్రవాప యేత్ |

అధవాష్ట శతం దేవీం జప్త్వా దేతాం సమాచరేత్ ||“. (దేవీ భాగవతము)

(సంధ్యోపాసన మూడు విధములుగా చేయబడుచున్నది - నక్షత్రములు కనబడుచుండగనే చేయునది ప్రాతస్సంధ్య, మధ్యాహ్నమందు సూర్యుడుండగా చేయునది మధ్యాహ్నసంధ్య, సాయంకాలము సూర్యుడుండగనే చేయునది సాయంసంధ్య - దీనిలో భేదములిట్లున్నవి : - ప్రాతఃకాలమందు చేయు సంధ్య మూడు విధములు - నక్షత్రములు కనబడుచుండగనే చేయునది ఉత్తమము; నక్షత్రములు కానరాకుండునపుడు చేయునది మధ్యమము; సూర్యోదయము అయినపుడు చేయునది అధమము - సాయం సంధ్య మూడు విధములు - సూర్యుడుండగా చేయునది ఉత్తమము; సూర్యుడస్తమించిన తర్వాత చేయునది మధ్యమము; నక్షత్రములు కనబడిన తర్వాత చేయునది అధమము. ఉదయము తర్వాత, అస్తమయము తర్వాత మూడు ఘటికల కాలములో సంధ్యోపాసన చేయవలెను - ఈ కాలము మించిపోయిన తర్వాత ప్రాయశ్చిత్తము నిమిత్తము నాలుగవ అర్ఘ్య ప్రదానాము చేయవలెను, లేక ఆరువందలమార్లు సంధ్యా దేవిని జపించి తర్వాత సంధ్యోపాసన చేయవలయును. అర్ఘ్యత్రయానంతరం ప్రాయశ్చిత్తార్థం అర్ఘ్యాంతరం దేయం ఆదౌ ప్రథమతః ప్రాయశ్చిత్తార్థం దేవీం గాయత్రీం జప్త్వా సంధ్యాం సమాచరేత్ ఇత్యర్థః (మూడుసార్లు అర్ఘ్యప్రదానము చేసిన తర్వాత ప్రాయశ్చిత్తముకొఱకు నాలుగవసారి అర్ఘ్యమివ్వవలెను. మొదట ప్రాయశ్చిత్తముకొఱకు గాయత్రీ దేవిని జపించి సంధ్య చేయవలయును. కొద్ది మాత్రము నిర్ణీతకాలమతిక్రమించినయడల ఎనిమిది వందల మార్లు జపము చేయవలయును.

  1. “సంధ్యా హీనః అశుచిః నిత్య మనర్హః సర్వ కర్మసు”

(సంధ్యావందనము నాచరించనివాడు అశుచి యగుటవలన ఏ విధమైన కర్మ చేయుటకు నైనను అర్హుడుకాడు)

Transliteration
  1. “ōṃ kēśavāyasvāhā” ityēvaṃ trināmabhirapaḥ pītvā gōviṃdāyanamaḥ, viṣṇavēnamaḥ iti karau prakṣālya, “madhusūdana, trivikramēti” dvābhyāṃ aṃguṣṭamūlē sōṭṭau samṛjya, “vāmana śrīdarēti” dvābhyāṃ tadaiva mukhamunmārjya,“ṛṣīkēśēti” vāmakaraṃ prōkṣya, padmanā bhēti pādau saṃprōkṣya, dāmōdarēti mūrthānāṃ saṃprōkṣya, “saṃkarṣaṇēti” saṃhita madhyamāṃguḷitrayēṇa āsyaṃ saṃspṛśya, ” vāsudēva pradyumnēti dvābhyāṃ aṃguṣṭa tarjanībhyāṃ nāsā puṭē saṃspṛśya, aniruddha puruṣōttamēti dvābhyāṃ aṃguṣṭānāmikābhyāṃ cakṣuṣī saṃspṛśya, “adhōkṣaja nārasiṃhēti” dvābhyāṃ tadhaiva śrōtrē saṃspṛśya, “acyutēti kaniṣṭāṃguṣṭābhyāṃ nābhiṃ saṃspṛśya,” janārdanēti pāṇikalēna hṛdayaṃ saṃspṛśya, ” upēṃdrēti śiraḥ saṃspṛśya, “harayēnamaḥ, kṛṣṇāyanamaḥ” iti dvābhyāṃ dakṣiṇa vāma bāhumūlē spṛśēt iti ētacca ācārāhnikē spaṣṭaṃ”

(“ōṃ kēśavāyasvāhā, ōṃ nārāyaṇāyasvāhā, ōṃ mādhavāyasvāhā” ani bhagavaṃtuni mūḍu nāmamulatō nīru puruṣiḍitō trāgi, gōviṃdāyanamaḥ, viṣṇuvēnamaḥ (gōviṃduni guṟiṃci namaskāramu, viṣṇuvu guṟiṃci namaskāramu) ani cēti mīda nīḷḷu jallukoni, “madhusūdana, trivikrama” anu reṃḍu nāmamulatō aṃguṣṭa mūlamutō - boṭanavrēli mūlamutō pedavulanu taḍipi, “vāmana, śrīdhara” anu nāmamulatō nōṭini pavitramu cēsukoni, “hṛṣīkēśa” ani eḍama cētini saṃprōkṣaṇamu sēsi, “padmanābha” ani pādamulanu saṃprōkṣaṇamucēsi, “dāmōdara” ani śirassumīda saṃprōkṣaṇamu cēsukoni, “saṃkarṣaṇa” anu nāmamu nuccariṃcucu, muḍicina madhya mūḍu vēḷḷatōnu mogamunu tāki, “vāsudēva” pradyumna anu reṃḍu nāmamulatōnu aṃguṣṭa tarjanī vrēḷḷatō mukkunu muṭṭukoni, “aniruddha, puruṣōttaṃ” anu reṃḍu pērlatōnu aṃguṣṭamutō anāmika anu vēlutōnu kaṃḍlanu saṃprōkṣaṇamu cēsukoni, “adhōkṣaja, nārasiṃha” anu reṃḍu nāmamulatōnu śrōtramulanu saṃprōkṣiṃcukoni, acyutā anu nāmamutō ciṭikanavēlu boṭanavēlutō boḍḍunu muṭṭukoni, “janārdhana” anu pērutō cētitō hṛdayamunu muṭṭukoni, “harayēnamaḥ”, “kṛṣṇāyanamaḥ” anu reṃḍiṃṭitōnu kuḍi yeḍama bāhu mūlamulanu muṭṭavalenu).

  1. “prātassaṃdhyāṃ sa nakṣatrāṃ, madhyāhnē madhyabhāskarāṃ |

nasūryāṃ paścimāṃ saṃdhyāṃ tisrassaṃdhyā upāsatē |

tadbhēdānapi vakṣyāmi śṛṇu dēvarṣi sattama |

uttamā tārakōpētā madhyamā luptatārakā |

adhamā sūryasahitā prātassaṃdhyā tridhā matā ||

uttamā sūrya sahitā madhyamā astamitē ravē |

adhamā tārakōpētā sāyaṃ saṃdhyā trathāmitā ||

- - - udayāstamayā dūrthvaṃ yāvat syāt ghaṭikā trayaṃ |

tāratsaṃdhyāmupāsīta prāyaścittaṃ tataḥ paraṃ |

kālāti kramaṇē jātē caturdhāghyaṃ pravāpa yēt |

adhavāṣṭa śataṃ dēvīṃ japtvā dētāṃ samācarēt ||“. (dēvī bhāgavatamu)

(saṃdhyōpāsana mūḍu vidhamulugā cēyabaḍucunnadi - nakṣatramulu kanabaḍucuṃḍaganē cēyunadi prātassaṃdhya, madhyāhnamaṃdu sūryuḍuṃḍagā cēyunadi madhyāhnasaṃdhya, sāyaṃkālamu sūryuḍuṃḍaganē cēyunadi sāyaṃsaṃdhya - dīnilō bhēdamuliṭlunnavi : - prātaḥkālamaṃdu cēyu saṃdhya mūḍu vidhamulu - nakṣatramulu kanabaḍucuṃḍaganē cēyunadi uttamamu; nakṣatramulu kānarākuṃḍunapuḍu cēyunadi madhyamamu; sūryōdayamu ayinapuḍu cēyunadi adhamamu - sāyaṃ saṃdhya mūḍu vidhamulu - sūryuḍuṃḍagā cēyunadi uttamamu; sūryuḍastamiṃcina tarvāta cēyunadi madhyamamu; nakṣatramulu kanabaḍina tarvāta cēyunadi adhamamu. udayamu tarvāta, astamayamu tarvāta mūḍu ghaṭikala kālamulō saṃdhyōpāsana cēyavalenu - ī kālamu miṃcipōyina tarvāta prāyaścittamu nimittamu nālugava arghya pradānāmu cēyavalenu, lēka āruvaṃdalamārlu saṃdhyā dēvini japiṃci tarvāta saṃdhyōpāsana cēyavalayunu. arghyatrayānaṃtaraṃ prāyaścittārthaṃ arghyāṃtaraṃ dēyaṃ ādau prathamataḥ prāyaścittārthaṃ dēvīṃ gāyatrīṃ japtvā saṃdhyāṃ samācarēt ityarthaḥ (mūḍusārlu arghyapradānamu cēsina tarvāta prāyaścittamukoṟaku nālugavasāri arghyamivvavalenu. modaṭa prāyaścittamukoṟaku gāyatrī dēvini japiṃci saṃdhya cēyavalayunu. koddi mātramu nirṇītakālamatikramiṃcinayaḍala enimidi vaṃdala mārlu japamu cēyavalayunu.

  1. “saṃdhyā hīnaḥ aśuciḥ nitya manarhaḥ sarva karmasu”

(saṃdhyāvaṃdanamu nācariṃcanivāḍu aśuci yaguṭavalana ē vidhamaina karma cēyuṭaku nainanu arhuḍukāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.