నిత్యం సంధ్యాంచ హేరాజన్ కరిష్యసి దినే దినే |
మధ్యాహ్నే పి సాయాహ్నే పాతరేవ శుచిస్సదా |
సంధ్యా హీనో అశుచిర్నిత్యం అనర్హః సర్వ కర్మసు |
యదాహ్నత్ కురుతే కర్మ నతస్య ఫల భాగ్భవేత్ | నోపి తిష్టతి యః పూర్వాం నోపాస్తే యస్తు పశ్చిమాం |
స శూద్ర వద్భిః కార్యః - సర్వస్మాద్ద్విజ కర్మణః |
యావజ్జీవన పర్యంతం త్రి సంధ్యాం యః కరోతి చ |
స చ సూర్యసమో విప్రః తేజసా తపసా సదా |
తత్పాదపద్మ రజసా సద్యః పూ తా వసుంధరా |
జీవన్ముక్తః సః తేజస్వీ సంధ్యా పూతో హి యో ద్విజః |
తీర్థాని చ పవిత్రాణి తస్య సంస్పర్శ మాత్ర తః |
తతః పాపాని యాంత్యేవ వైన తేయా దివోరిగాః |. (దేవీ భాగవతము)
(ప్రతిరోజు మధ్యాహ్నకాలమందు, సాయంకాలమందు, ప్రాతఃకాలమందు సంధ్యావందనము చేసినవాడు ఎల్లపుడు శుచియే యగును - సంధ్యావందనము చేయనివాడు ఎప్పుడు శుచి అయినవాడు కాడు - ఏ కర్మ చేయుటకైనను అర్హుడు కాడు - తగినవాడు కాడు - అట్టివాడు ఏ రోజున ఏ పని చేసినను దాని ఫలమును పొందడు - ఎవడు ప్రాతస్సంధ్యను, సాయన్సంధ్యను ఆచరించడో వాడు శూద్రుడువలె ద్విజకర్మల నన్నింటినీ బహిష్కరింపబడినవాడే - జీవించునంతకాలము ఎవడు ప్రాతస్సంధ్యను, మధ్యాహ్న సంధ్యను, సాయంసంధ్యను చేయునో వాడు ఎల్లపుడు తేజస్సులోను, తపస్సులోను (వేడిమి, చైతన్యశక్తిలోను) - అట్టి విప్రుడు సూర్యునితో సమానము - అట్టివాని పాదధూళి వలన భూమియే అప్పటికప్పుడే పవిత్రమగును - తేజశ్శాలి అయిన వాడు జీవన్ముక్తుడు - అతని వలన తీర్థములు పవిత్రమగును - గరుడుని చూచిన పాము పారిపోవునట్లు అతని పాపములన్నియు పారిపోవును.
nityaṃ saṃdhyāṃca hērājan kariṣyasi dinē dinē |
madhyāhnē pi sāyāhnē pātarēva śucissadā |
saṃdhyā hīnō aśucirnityaṃ anarhaḥ sarva karmasu |
yadāhnat kurutē karma natasya phala bhāgbhavēt | nōpi tiṣṭati yaḥ pūrvāṃ nōpāstē yastu paścimāṃ |
sa śūdra vadbhiḥ kāryaḥ - sarvasmāddvija karmaṇaḥ |
yāvajjīvana paryaṃtaṃ tri saṃdhyāṃ yaḥ karōti ca |
sa ca sūryasamō vipraḥ tējasā tapasā sadā |
tatpādapadma rajasā sadyaḥ pū tā vasuṃdharā |
jīvanmuktaḥ saḥ tējasvī saṃdhyā pūtō hi yō dvijaḥ |
tīrthāni ca pavitrāṇi tasya saṃsparśa mātra taḥ |
tataḥ pāpāni yāṃtyēva vaina tēyā divōrigāḥ |. (dēvī bhāgavatamu)
(pratirōju madhyāhnakālamaṃdu, sāyaṃkālamaṃdu, prātaḥkālamaṃdu saṃdhyāvaṃdanamu cēsinavāḍu ellapuḍu śuciyē yagunu - saṃdhyāvaṃdanamu cēyanivāḍu eppuḍu śuci ayinavāḍu kāḍu - ē karma cēyuṭakainanu arhuḍu kāḍu - taginavāḍu kāḍu - aṭṭivāḍu ē rōjuna ē pani cēsinanu dāni phalamunu poṃdaḍu - evaḍu prātassaṃdhyanu, sāyansaṃdhyanu ācariṃcaḍō vāḍu śūdruḍuvale dvijakarmala nanniṃṭinī bahiṣkariṃpabaḍinavāḍē - jīviṃcunaṃtakālamu evaḍu prātassaṃdhyanu, madhyāhna saṃdhyanu, sāyaṃsaṃdhyanu cēyunō vāḍu ellapuḍu tējassulōnu, tapassulōnu (vēḍimi, caitanyaśaktilōnu) - aṭṭi vipruḍu sūryunitō samānamu - aṭṭivāni pādadhūḷi valana bhūmiyē appaṭikappuḍē pavitramagunu - tējaśśāli ayina vāḍu jīvanmuktuḍu - atani valana tīrthamulu pavitramagunu - garuḍuni cūcina pāmu pāripōvunaṭlu atani pāpamulanniyu pāripōvunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.