(ఈ కనబడు ప్రపంచమంతయు బ్రహ్మ స్వరూపము - ఎందుచేతననగా ఆ బ్రహ్మమునుండి పుట్టినవి, ఆ బ్రహ్మయందు లయమగుచున్నవి, ఆ బ్రహ్మయందు చలించునది కనుక నీ ప్రపంచమంతయి బ్రహ్మస్వరూపము అని రాగద్వేషములు లేక శాంతుడి ఉపాసించవకెను. ఈ లోకమందు పురుషుడు ఏ విధమగు నిశ్చయము కలవాడో ఈ లోకమునుండి చనిపోయి ఆలాగునే యగుచున్నాడు, అనగా, తన నిశ్చయమునకనురూపమగు ఫలము పొందుచున్నాడు. కనుక పురుషుడు నిశ్చయమును చేసుకొనవలయును - మనస్స్వరూపుడు ప్రాణమే - (ప్రజ్ఞయే) - శరీరముగా గలవాడు, చైతన్య స్వరూపుడు అగు నాత్మనా హృదయములో ఉన్నాడు - అతనే బ్రహ్మ, నేనతనిని పొందెదను - ను నిశ్చయము చేసుకొనవలయును. ఈ విషయము శాండిల్యుడు తెలుసుకొని ఉపాసన చేయుటచే దీనిని శాండిల్య విద్య యని యందురు).
మనో మయుడును, నిత్యుడును, ప్రకాసరూపుడును నగు నీ పురుషుడు హృదయమధ్యమున వడ్లగింజవలెను, యవ వలెను సూక్ష్మరూపుడై యున్నాడు - అతడే సర్వమును నియమించువాడు, సర్వమునకు నధిపతి, మన యెదుటనేది కలదో దానినంతయు స్వకార్యముల యందు ప్రవర్తింపచేయుచున్నాడు)
తం తమేవేతి కౌంతేయ - - - ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 6)
(చనిపోవుటకు ముందు ఏ ఏ భావమును తలంచునో దానినే తర్వాత ఒందును - అతనినే - భగన్వంతునే - పొందెదను చింత కలిగియున్నయదల అట్లే యగును).
(ī kanabaḍu prapaṃcamaṃtayu brahma svarūpamu - eṃducētananagā ā brahmamunuṃḍi puṭṭinavi, ā brahmayaṃdu layamagucunnavi, ā brahmayaṃdu caliṃcunadi kanuka nī prapaṃcamaṃtayi brahmasvarūpamu ani rāgadvēṣamulu lēka śāṃtuḍi upāsiṃcavakenu. ī lōkamaṃdu puruṣuḍu ē vidhamagu niścayamu kalavāḍō ī lōkamunuṃḍi canipōyi ālāgunē yagucunnāḍu, anagā, tana niścayamunakanurūpamagu phalamu poṃducunnāḍu. kanuka puruṣuḍu niścayamunu cēsukonavalayunu - manassvarūpuḍu prāṇamē - (prajñayē) - śarīramugā galavāḍu, caitanya svarūpuḍu agu nātmanā hṛdayamulō unnāḍu - atanē brahma, nēnatanini poṃdedanu - nu niścayamu cēsukonavalayunu. ī viṣayamu śāṃḍilyuḍu telusukoni upāsana cēyuṭacē dīnini śāṃḍilya vidya yani yaṃduru).
manō mayuḍunu, nityuḍunu, prakāsarūpuḍunu nagu nī puruṣuḍu hṛdayamadhyamuna vaḍlagiṃjavalenu, yava valenu sūkṣmarūpuḍai yunnāḍu - ataḍē sarvamunu niyamiṃcuvāḍu, sarvamunaku nadhipati, mana yeduṭanēdi kaladō dāninaṃtayu svakāryamula yaṃdu pravartiṃpacēyucunnāḍu)
taṃ tamēvēti kauṃtēya - - - ||“. (śrīmadbhagavadgīta - 8 - 6)
(canipōvuṭaku muṃdu ē ē bhāvamunu talaṃcunō dāninē tarvāta oṃdunu - ataninē - bhaganvaṃtunē - poṃdedanu ciṃta kaligiyunnayadala aṭlē yagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.