← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంకల్పః saṃkalpaḥ

Original — తెలుగు
  1. చింతనం; విచారం -

(చింతించుట, విచారించుట)

  1. మనోరథః, మానస వృత్తిః

(మనసులో కోరుకొనినవి, మనస్సుయొక్క వ్యాపారము)

  1. సం ఇత్యే కీ కారే దేహాదిభి రాత్మనో పృధక్త్వేన చింతనం -

(‘సం’ అనగా ఒకటిగా కలుపుట - దేహము మొదలగునవి ఆత్మయొక్క పరిణామములే - మార్పులే యని చింతించుట)

  1. “ప్రకృత్యా తద్గుణైక్యశ్చ ఆత్మానం ఏకీకృత్య అనుసంథానం సంకల్పః” (శ్రీశంకరః)

(సత్వ రజస్తమములను త్రిగుణములుగల ప్రకృతితో ఆత్మను ఒకటిగా కలిపి అనుసంధానము చేయుట సంకల్పము)

సం ఇత్యేకీకారే, కల్పో భ్రాంతి జ్ఞానం, ప్రకృత్యా ఇతి దేహ రూపేణ పరిణతయా ఇతి జ్ఞేయం, తద్గుణైః ఆత్మనః ఏకీకరణం నామ గుణహేతుకే కర్మ విశేషే స్వహేతుత్వాను సంధానం, యద్వా ప్రకృతి గుణరూపాణాం సత్వరజస్తమసాం దేవత్వ మనుష్యత్వాది సన్ని వేశానాం స్థౌల్య కార్శ్య శుక్ల కృష్ణాదీనాం చ స్వమాత్మానం ప్రతి గుణత్వేన అనుసంధానం.

(‘కల్పనము’ అనగా భ్రాంతి జ్ఞానము; ‘సం’ అనగా ఒకటిగా కలుపుట. ప్రకృతితో; అనగా ‘దైవరూపముగా మారినది’ అని తెలుసుకొనవలెను. ప్రకృతి గుణములతో ఆత్మను అనుసంధానము చేయుట)

(అనగా ఏకీకరణమనగా కర్మవిశేషమందు గుణముల కారణముతో పాటు తనుకూడా హేతువు అని రెండింటిని కలిపి ఊహించుట, లేక, ప్రకృతి గుణములైన సత్వరజస్తమములయొక్క దేవత్వము, మనుష్యత్వము మొదలగు వాటి సన్నివేశములందు స్థూలము, సన్నము, తెల్లని, నల్లనిది యను దానితో ఆత్మను - తనను - ప్రతిగుణమని అనుసంధానము చేసుకొనుట - తనదికాని దానియందు తనది యను బుద్ధి కలిగియుండుట).

  1. “శుక్ల కేష్ణాది భావేన సంకల్పనం రూపా దీనాం” (శ్రీశంకరః)

(రూపములకు తెల్లనిది, నల్లనిది అను భావము సంకల్పించుకొనుట)

  1. “సామాన్యేన ప్రతిపన్నానాం రూపాదీనాం శుక్లాది రూపేణ సమ్యక్ కల్పన మిత్యర్థః” (శ్రీ ఆనందగిరి)

(సామాన్యముగా కనపడు రూపములకు తెల్లనిది అను మొదలగు రూపములను కల్పించుట)

  1. “సంకల్ప మూలః కామోవై యజ్ఞాః సంకల్ప సంభవాః”

(కామము సంకల్ప మూలము - యజ్ఞము సంకల్పమువలన కలిగినది).

“కామః జానామితే మూలం సంకల్పాత్త్వం హి జాయసే |

సత్వం సంకల్ప యిష్యామి తేనమే న భవిష్యసి” |.

(ఓ కామమా ! నీ మూలము (కారణము) నాకు తెలుసును - నువ్వు సంకల్పమువలన కలుగుచున్నావు - నేను నిన్ను గుఱించి సంకల్పించను. అందుచేత నాకు నీవు కలుగవు - నాకు కామములేదు)

  1. “మాయామయ, అవిద్యా, సంసృతి, చిత్త, మోహ, తమస్సులనెడి షట్సంకల్పాలు”.

  2. సమంతాత్ కల్ప్యతే అనేన ఇతి సంకల్పః - అవిద్యా -

(అంతటను సంకల్పించునది కనుక సంకల్పము - అవిద్య).

  1. అనుకొనుట యనినను, తలంచుట యనినను నొక్కటే యనియే చెప్పనగును. అనుకొనుట, లేక తలంచుట యనునది లోన జరుగు బుద్ధి వికారము, అనుట అద్దాని వెలుపలి స్వరూపము.

అనుకొనుట, తలంపు, బుద్ధి, కోరిక, భావము, సంకల్పము, భావన, చింతన మొదలగు పదములన్నియు సందర్భానుకూల ప్రయోగములైనను మనోవికార జాతములే యగుటవలన స్థూలముగ “తలంపులుగ పరిగణింపవచ్చును. ఎన్ని అవాంతర భేదములున్నను సూక్ష్మముగా చూచిన నన్నియు తలంపులేగదా.”

“మనతలంపులకు గల కారణములు వానియందు గోచరము లగును. సర్వజీవరాశియొక్క ప్రవృత్తియు సుఖాను భూతికి దుఃఖ నివృత్తికి జరుగుచున్నదనుట నిర్వివాదాంశము.”

“తలంపులు కార్యోన్ముఖములగుటవలనను, దానివలన ఏదో ఒక విధమైన సుఖము పొందుచుండుట వలనను తలంపులయొక్క శక్తి వ్యక్తమగుచున్నది. తలంపు అను విషయము ఒక మహాద్భుతశక్తి స్వరూపమని తోచకమానదు -”. ” సో (అ)కామయత బహుస్యాం ప్రజాయాయేతి“. పరమేష్టి తలంపు యొక్క భౌతిక స్వరూపమే ఈ సృష్టి విలాసమని శ్రుతి తెలుపుచున్నది.”యద్భావం తద్భవతి” - ఏ విధముగా తలంతువో యా విధముగ నగుదువు.

అన్ని కోరికలు సంకల్పమువలన కలుగును : అని మనువు తెలిపియున్నాడు. “కోరికవలన సంకల్పము, సంకల్పమువలన ప్రవృత్తి” - ఒక్కొక్క తలంపు ఒక్కొక్క భౌతికస్వరూపమును తెసుకొను శకి గలదు. ఈ సృష్టి చరాచరములన్నియు నొక్కొక్క తలంపు యొక్క భౌతికరూపమనుట నిరాక్షేపణీయము -

తలంపుల శక్తి ననుసరించి కార్యములగుచుండును. సుఖ దుఃఖ కారణము సంకల్పమనియే తెలియవలయును - సాధనవలన తలంపులు వార్థ్యత పొందగలవు. సాధనలేని తలంపులు శక్తిహీనములు.

అవియే మనతలంపులే కర్మప్రవృత్తి జనకములు, కారణభూతములు - దృష్టా అదృష్టములనునవి తలంపుల ప్రతిఫలములే గాని యన్యాధారములు కావు - దేహ బుద్ధీంద్రియములన్నియు మన తలంపుల యొక్క పరిణామ స్వరూపములు.

మన తలంపుల ననుసరించి మన ముఖ వర్చస్సు ఏర్పడుట, మారుట, తటస్థించుచుండును. సంతోషమగు తలంపువలన ముఖము విప్పారి ఆనందయుతముగ నుండును - రోష తాపముల తలంపులు గలిగినంతమాత్రమున ఆ యాకారమే భీషణమగును - ఏహ్యమగును, మారిపోవును. కామ క్రోధాది తలపులు హానికరములు - ప్రతి తలంపు మన మానసిక భౌతిక దేహములందు ప్రతిక్రియాస్వరూపమును (reaction) వదులుచుండును - సత్వ గుణజనకములగు తలంపులు మనస్సును స్వస్థతయందుంచి ఆత్మానందప్రతిభాసమును స్ఫురింపచేయుచుండును - కామక్రోధములతో కూడిన తలంపులు మనస్సును క్షోభపరచును - దానివలన వాయు పిత్తాది తత్వములు ప్రకోపించి ధాతు సామరస్యమును చెఱచి వ్యాధులనంకురింపచేయును),

  1. “మనసా వా అరే అగ్రే సంకల్పయతి, అధవా చా వ్యవహారయతి యద్ధి మనసా ధ్యాయతి తద్వాచా వదతి”.

(మున్ముందు మనస్సుచేత సంకల్పించుచున్నాడు, పిదప వాక్కుచేత నుచ్చరించుచున్నాడు - దేనినైతే మనసులో చింతన చేయుచున్నాడో దానినే వాక్కుద్వారా మాట్లాడుచున్నాడు. సంకల్పము లేనిదే పని చేయడు)

  1. “స ఈక్షత లోకాన్ను సృజా” ఇతి (ఐతరేయోపనిషత్తు)

(అతను - ఆ పరబ్రహ్మ చూచెను - సంకల్పించెను - లోకములను సృజించెదను (ఐతరేయోపనిషత్ -1 - 3)

Transliteration
  1. ciṃtanaṃ; vicāraṃ -

(ciṃtiṃcuṭa, vicāriṃcuṭa)

  1. manōrathaḥ, mānasa vṛttiḥ

(manasulō kōrukoninavi, manassuyokka vyāpāramu)

  1. saṃ ityē kī kārē dēhādibhi rātmanō pṛdhaktvēna ciṃtanaṃ -

(‘saṃ’ anagā okaṭigā kalupuṭa - dēhamu modalagunavi ātmayokka pariṇāmamulē - mārpulē yani ciṃtiṃcuṭa)

  1. “prakṛtyā tadguṇaikyaśca ātmānaṃ ēkīkṛtya anusaṃthānaṃ saṃkalpaḥ” (śrīśaṃkaraḥ)

(satva rajastamamulanu triguṇamulugala prakṛtitō ātmanu okaṭigā kalipi anusaṃdhānamu cēyuṭa saṃkalpamu)

saṃ ityēkīkārē, kalpō bhrāṃti jñānaṃ, prakṛtyā iti dēha rūpēṇa pariṇatayā iti jñēyaṃ, tadguṇaiḥ ātmanaḥ ēkīkaraṇaṃ nāma guṇahētukē karma viśēṣē svahētutvānu saṃdhānaṃ, yadvā prakṛti guṇarūpāṇāṃ satvarajastamasāṃ dēvatva manuṣyatvādi sanni vēśānāṃ sthaulya kārśya śukla kṛṣṇādīnāṃ ca svamātmānaṃ prati guṇatvēna anusaṃdhānaṃ.

(‘kalpanamu’ anagā bhrāṃti jñānamu; ‘saṃ’ anagā okaṭigā kalupuṭa. prakṛtitō; anagā ‘daivarūpamugā mārinadi’ ani telusukonavalenu. prakṛti guṇamulatō ātmanu anusaṃdhānamu cēyuṭa)

(anagā ēkīkaraṇamanagā karmaviśēṣamaṃdu guṇamula kāraṇamutō pāṭu tanukūḍā hētuvu ani reṃḍiṃṭini kalipi ūhiṃcuṭa, lēka, prakṛti guṇamulaina satvarajastamamulayokka dēvatvamu, manuṣyatvamu modalagu vāṭi sannivēśamulaṃdu sthūlamu, sannamu, tellani, nallanidi yanu dānitō ātmanu - tananu - pratiguṇamani anusaṃdhānamu cēsukonuṭa - tanadikāni dāniyaṃdu tanadi yanu buddhi kaligiyuṃḍuṭa).

  1. “śukla kēṣṇādi bhāvēna saṃkalpanaṃ rūpā dīnāṃ” (śrīśaṃkaraḥ)

(rūpamulaku tellanidi, nallanidi anu bhāvamu saṃkalpiṃcukonuṭa)

  1. “sāmānyēna pratipannānāṃ rūpādīnāṃ śuklādi rūpēṇa samyak kalpana mityarthaḥ” (śrī ānaṃdagiri)

(sāmānyamugā kanapaḍu rūpamulaku tellanidi anu modalagu rūpamulanu kalpiṃcuṭa)

  1. “saṃkalpa mūlaḥ kāmōvai yajñāḥ saṃkalpa saṃbhavāḥ”

(kāmamu saṃkalpa mūlamu - yajñamu saṃkalpamuvalana kaliginadi).

“kāmaḥ jānāmitē mūlaṃ saṃkalpāttvaṃ hi jāyasē |

satvaṃ saṃkalpa yiṣyāmi tēnamē na bhaviṣyasi” |.

(ō kāmamā ! nī mūlamu (kāraṇamu) nāku telusunu - nuvvu saṃkalpamuvalana kalugucunnāvu - nēnu ninnu guṟiṃci saṃkalpiṃcanu. aṃducēta nāku nīvu kalugavu - nāku kāmamulēdu)

  1. “māyāmaya, avidyā, saṃsṛti, citta, mōha, tamassulaneḍi ṣaṭsaṃkalpālu”.

  2. samaṃtāt kalpyatē anēna iti saṃkalpaḥ - avidyā -

(aṃtaṭanu saṃkalpiṃcunadi kanuka saṃkalpamu - avidya).

  1. anukonuṭa yaninanu, talaṃcuṭa yaninanu nokkaṭē yaniyē ceppanagunu. anukonuṭa, lēka talaṃcuṭa yanunadi lōna jarugu buddhi vikāramu, anuṭa addāni velupali svarūpamu.

anukonuṭa, talaṃpu, buddhi, kōrika, bhāvamu, saṃkalpamu, bhāvana, ciṃtana modalagu padamulanniyu saṃdarbhānukūla prayōgamulainanu manōvikāra jātamulē yaguṭavalana sthūlamuga “talaṃpuluga parigaṇiṃpavaccunu. enni avāṃtara bhēdamulunnanu sūkṣmamugā cūcina nanniyu talaṃpulēgadā.”

“manatalaṃpulaku gala kāraṇamulu vāniyaṃdu gōcaramu lagunu. sarvajīvarāśiyokka pravṛttiyu sukhānu bhūtiki duḥkha nivṛttiki jarugucunnadanuṭa nirvivādāṃśamu.”

“talaṃpulu kāryōnmukhamulaguṭavalananu, dānivalana ēdō oka vidhamaina sukhamu poṃducuṃḍuṭa valananu talaṃpulayokka śakti vyaktamagucunnadi. talaṃpu anu viṣayamu oka mahādbhutaśakti svarūpamani tōcakamānadu -”. ” sō (a)kāmayata bahusyāṃ prajāyāyēti”. paramēṣṭi talaṃpu yokka bhautika svarūpamē ī sṛṣṭi vilāsamani śruti telupucunnadi. “yadbhāvaṃ tadbhavati” - ē vidhamugā talaṃtuvō yā vidhamuga naguduvu.

anni kōrikalu saṃkalpamuvalana kalugunu : ani manuvu telipiyunnāḍu. “kōrikavalana saṃkalpamu, saṃkalpamuvalana pravṛtti” - okkokka talaṃpu okkokka bhautikasvarūpamunu tesukonu śaki galadu. ī sṛṣṭi carācaramulanniyu nokkokka talaṃpu yokka bhautikarūpamanuṭa nirākṣēpaṇīyamu -

talaṃpula śakti nanusariṃci kāryamulagucuṃḍunu. sukha duḥkha kāraṇamu saṃkalpamaniyē teliyavalayunu - sādhanavalana talaṃpulu vārthyata poṃdagalavu. sādhanalēni talaṃpulu śaktihīnamulu.

aviyē manatalaṃpulē karmapravṛtti janakamulu, kāraṇabhūtamulu - dṛṣṭā adṛṣṭamulanunavi talaṃpula pratiphalamulē gāni yanyādhāramulu kāvu - dēha buddhīṃdriyamulanniyu mana talaṃpula yokka pariṇāma svarūpamulu.

mana talaṃpula nanusariṃci mana mukha varcassu ērpaḍuṭa, māruṭa, taṭasthiṃcucuṃḍunu. saṃtōṣamagu talaṃpuvalana mukhamu vippāri ānaṃdayutamuga nuṃḍunu - rōṣa tāpamula talaṃpulu galiginaṃtamātramuna ā yākāramē bhīṣaṇamagunu - ēhyamagunu, māripōvunu. kāma krōdhādi talapulu hānikaramulu - prati talaṃpu mana mānasika bhautika dēhamulaṃdu pratikriyāsvarūpamunu (reaction) vadulucuṃḍunu - satva guṇajanakamulagu talaṃpulu manassunu svasthatayaṃduṃci ātmānaṃdapratibhāsamunu sphuriṃpacēyucuṃḍunu - kāmakrōdhamulatō kūḍina talaṃpulu manassunu kṣōbhaparacunu - dānivalana vāyu pittādi tatvamulu prakōpiṃci dhātu sāmarasyamunu ceṟaci vyādhulanaṃkuriṃpacēyunu),

  1. “manasā vā arē agrē saṃkalpayati, adhavā cā vyavahārayati yaddhi manasā dhyāyati tadvācā vadati”.

(munmuṃdu manassucēta saṃkalpiṃcucunnāḍu, pidapa vākkucēta nuccariṃcucunnāḍu - dēninaitē manasulō ciṃtana cēyucunnāḍō dāninē vākkudvārā māṭlāḍucunnāḍu. saṃkalpamu lēnidē pani cēyaḍu)

  1. “sa īkṣata lōkānnu sṛjā” iti (aitarēyōpaniṣattu)

(atanu - ā parabrahma cūcenu - saṃkalpiṃcenu - lōkamulanu sṛjiṃcedanu (aitarēyōpaniṣat -1 - 3)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.