(సంఖ్యా అనగా బుద్ధి - బుద్ధి ద్వారా తెలుసుకొనతగినది. ఆత్మతత్వము)
(తెలుసుకొనవలసిన పదార్థములు ఏ శాస్త్రమందు తెలుసుకొనబడుచున్నవో ఆ శాస్త్రము సాంఖ్యము - అదియే వేదాంతము - ఉపనిషత్).
(నీలకంఠవ్యాఖ్యా)
(వస్తు తత్వము ఈ శాస్త్రములో బాగుగా చెప్పబడుచున్నది కనుక ఇది సంఖ్యా - ఉపనిషత్ - ఉపనిషత్తులో తెలియచేయబడినది బ్రహ్మ విషయము).
(పరమాత్మ తత్వము ఏ విధమైన ఉపాధియు లేనిది యని ఈ శాస్త్రము బాగుగా తెలియచేయునది కనుక ఇది సంఖ్యా - అది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు చేతనే పరబ్రహ్మ తాత్పర్యము - స్పష్టముగా తెలియబడుచున్నది - కనుక ఈ శాస్త్రము సాంఖ్యము).
(దీనిచేత పరమార్థ తత్వము చక్కగా తెలుపబడుచున్నది, గాన ఇది సంఖ్యా).
(దీనివలన చక్కగా తెలియబడుచున్నది - అనగా, బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము కలుగచేయునది బుద్ధి, సంఖ్యా. దాని వలన కలిగినది సాంఖ్యము)
(పరమార్థ వస్తువును గుఱించి వివేకము - జ్ఞానము - విషయముగా గలది - శాస్త్రము).
(శుద్ధాత్మయొక్క - నిర్మలమైన ఆత్మ యొక్క తత్వమును గుఱించి అయిన జ్ఞానము సాంఖ్యము అని చెప్పబడుచున్నది - అని వ్యాసమహర్షులు వ్రాసిన శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు).
సంఖ్యోపనిషదే తస్యాం ప్రతిపాద్యః పరః పుమాన్ |
సాంఖ్య స్తన్మాత్ర విషయం జ్ఞానమజ్ఞాన నాశకం ||“. (గీతాభావప్రకాశము - 2 - 425 to 426)
(ఏ విధమైన ఉపాధియు లేనటువంటి పరమాత్మ తత్వమును బాగుగా తెలియచేయునది సంఖ్యా. ఈ సంఖ్యోపనిషత్తులో ప్రతిపాదింపబడినది - చెప్పబడినది పరమాత్మ తత్వము - ఆ శాస్త్రములోని విషయము కనుక సాంఖ్యము)
(సంఖ్యా అనగా దేహము కంటె వేఱు లక్షణములు గల ఆత్మ గుఱించి అయిన జ్ఞానము. అట్టి జ్ఞానము ద్వారా పొందతగినది సాంఖ్యము - శ్రీమద్భగవద్గీతలోని మొదటి ఆరు అధ్యాయములలో చెప్పబడిన విషయము).
(ఆత్మ తత్వమును గుఱించి కృషి చేయుట)
(ప్రకృతి, పురుషుడు - ఈ రెండు తత్వముల గుఱించి కలుగు జ్ఞానము).
(బ్రహ్మజ్ఞానమును గుఱించి అయిన శాస్త్రము)
(తత్వముల వివేకము).
(ఆత్మనునది ఏది ? అనాత్మ యనునదేది ? అని వివేకించిన పిమ్మట కలుగు జ్ఞానము).
(సంసారమునకు - జననమరణరూపమైన సంసారమునకు - కారణమైన శోకము, మోహము మొదలగు దోషములను పోగొట్టుటకు కారణమైన బుద్ధి - జ్ఞానము).
(తత్వముల నిర్ణయము - చేయు శాస్త్రము).
“తత్వ జ్ఞాన నిర్ణయంబు గల సాంఖ్యంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 26)
“సం ఇత్యేకీ భావే ఇతి ఏకీ భావేన ఆత్మా నాన్యత్వేన ఖ్యాయతే ప్రకాశ్యతే వస్తుస్వరూపం అనయా ఇతి సంఖ్యా - స్థూల సూక్ష్మ కారణ ప్రపంచస్య నిర్వికల్పే ప్రత్యగాత్మని ప్రవిలాపకేన ఉదితా చేతో వృత్తిః తత్సాధన భూతో యః సాంఖ్యః సన్యాసః, స చ దారాది బుద్ధ్యంతానాం పదార్థానాం ఆత్మని ఏకీ భావేన వ్యసనః త్యాగః ప్రవిలాపనం”. (నీలకంఠవ్యాఖ్యా)
(‘సం’ అనగా ఒకటే అని అభిప్రాయము. అందుచేత సంఖ్యా అనగా ఆత్మ కంటె వేఱు వస్తువు లేదు, అంతా ఏకమే - ఒకటే - అని వస్తువుల స్వరూపమును తెలియచేయునది సంఖ్యా. స్థూల సూక్ష్మ కారణ రూపములు గల ఈ ప్రపంచము నిర్వికల్పుడగు ప్రత్యగాత్మ ఒకటే (అంతా ప్రత్యగాత్మయే) అను మనోవృత్తి కలిగియుండుట సాంఖ్యము - దారాదులు మొదలగు పదార్థములు ఒకటే యని వాటిని ఆత్మయందు విడుచుట సన్యాసము).
(ఉపనిషత్తు లన్నింటిచేతను తాత్పర్య సహితముగ బోధింపబచున్న నిర్విశేష పరబ్రహ్మము సాంఖ్యము)
(శోక మోహములు మొదలగునవి సంసారమునకు - జననమరణరూపమైన సంసారమునకు - కారణములు. వీటికి కారణము తన నిజస్థితి తెలియకపోవుట - ఆత్మజ్ఞానము లేకుండుట, తానే ఆత్మయను జ్ఞానము లేకుండుట. అత్మజ్ఞానము కలిగినంతనే యీ అజ్ఞానము తొలగి పోవును. అట్టి ఆత్మజ్ఞానమే సాంఖ్యము).
(సంఖ్యా అనుమాట బుద్ధి, మతి, సంవిత్ అను వాటిని చెప్పుటకు ఉపయోగింపబడుచున్నది. సంఖ్యా అనగా బుద్ధి, మతి, సంవిత్ అని అర్థమని నిఘంటువు వ్రాసినవారు చెప్పుచున్నారు. నిర్గుణుడు పురుషుడు సాంఖ్యము అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. వీటిని బట్టి సంఖ్యా అనగా పరమాత్మయందువలె ఆత్మయందు కూడ అర్థమగుచున్నది).
(ఈ సత్యరజస్తమములు గుణములు, వాటి వ్యాపారమునకు సాక్షి అయి వాటికంటె వేరు లక్షణములు గలవాడు, నిత్యుడు అయినవాడు ఆత్మ అను అభిప్రాయము కలిగియుండుట).
(ఆత్మ ఏదో, అనాత్మ ఏదో తెలుసుకో కలుగు జ్ఞానము).
తత్వ జ్ఞానము -
సాంఖ్యాయంతే జ్ఞాతవ్య విషయాః యేవ తత్సాంఖ్యం.
(తెలుసుకోతగు విషయములను తెలియచేయునది).
(ఉపనిషత్తులలో ముఖ్యముగా చెప్పబడిన అభిప్రాయమువలన కలుగు సమ్యక్ జ్ఞానము).
“ఇత్యేత దంతేన గ్రంధేన యత్పరమార్థాత్మతత్వ నిరూపణకృతం తత్సాఖ్యం” (శ్రీ శంకరః)
(శ్రీమద్భగవద్గీతలో “శోకింప తగనివాటిని గుఱించి నీవు శోకించుచున్నావు” (గీత - 2 - 11) అను శ్లోకము మొదలు, ‘నీ ధర్మము చూచి’ అను శ్లోకమువఱకు (2 - 31) చెప్పబడిన పరమాత్మ తత్వ నిరూపణము సాంఖ్యము; “సమ్యక్ ఖ్యాయతే ఇతి సంఖ్యా” (లెస్సగా బోధపఱచబడినట్టి సమ్యక్ జ్ఞానము సాంఖ్యము).
(వేదములో చెప్పబడిన భగవంతుని యొక్క స్వరూపజ్ఞానము).
సంఖ్యతో కూడినది సాంఖ్యము. సాంఖ్యమనగా జ్ఞానము - జ్ఞాన విచారణయందు అనాత్మ వస్తువులను లెక్కించినపుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చును. కనుక అయ్యది సాంఖ్యమని చెప్పబడినది. ప్రకృతి యందు గల 24 తత్వములను లెస్సగా శోధించి, అవి అనాత్మ రూపములని త్యజించి, వాటికి సాక్షిగా నున్నట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్య విద్య. ఆత్మనాత్మ రూపమగు విజ్ఞానమే సాంఖ్యము.
“పృధివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అను మహా భూత పంచకమును గంధ.రస,రూప, స్పర్శ శబ్దంబులు అను మహాభూత గుణ పంచకంబును, త్వక్కు, చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు అను జ్ఞానేంద్రియ పంచకమును, వాక్పాణి పాదపాయు, ఉపస్థు అను కర్మేంద్రీయ పంచకమును, మనస్సు, బుద్ధి, అహంకారము ప్రకృతియు గూడి చతుర్వింశతి తత్వంబులయ్యె; జీవుండు పంచ వింశకుండయ్యె. ఇట్టి పంచవింశతి తత్వంబుల గూడిపరమాత్మ షడ్వింశకుండయ్యె. ఇట్టి పరమాత్మ యందు నిష్ట కలుగుట సాంఖ్యంబు అన నొప్పు”.
జ్ఞానయోగము -
“యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 5)
(సాంఖ్యలు పొందు స్థానమునే యోగులు కూద పొందుదురు - సాంఖ్యము, యోగము అను రెండునూ ఒకటే యని తెలుసుకొనినవాడే జ్ఞాని).
“సాంఖ్య యోగౌ పృధక్ బాలాః ప్రవదమ్య్తిన పండితాః |
ఏకమస్యాస్థితః సమ్య గుభియోర్విందతే ఫలం” (శ్రీమద్భగవ్దగీత - 5 - 4)
(శాస్త్ర జ్ఞానము లేనివాడు సాంఖ్యము వేరు, యోగము వేరు అని చెప్పును. పండితులైనవారు అట్లు చెప్పరు. ఈ రెండింటిలో దేనినైనను శ్రద్ధతో అవలంభించిన యడల చిత్త శుద్ధి కలుగును. దాని వలన నిశ్రేయస ఫలము లభించును. ఈ రెండింటికిని ఫలము ఒకటే).
జ్ఞానాంతరంగ హేతుత్వాత్ సాంఖ్యః సన్యాస ఉచ్యతే ||“. (గీతాభావప్రకాశము - 5 - 45)
“సంఖ్యా సమ్యగాత్మ బుద్ధిః, తాం వహతీతి జ్ఞానాంతరంగ సాధనతయా సాంఖ్యః సన్యాసః” (మధుసూధనీవ్యాఖ్యా)
(సమ్యగాత్మ బుద్ధి కలిగియుండుట సంఖ్యా. అట్టి ఆత్మ బుద్ధిని జ్ఞానంతరంగ సాధనముగా భవించుట సన్యాసము).
జ్ఞానశాస్త్రం - తత్ర అపాణి పాదః అచక్షు అశ్రోత్రం ఇతి చ పాదాది నాస్తీతి నిషిద్యతే.
(జ్ఞానశాస్త్రము - చేతులు, కాళ్ళు లేనిది, కళ్ళు చెవులు లేనిది అని శాస్త్రములో చెప్పబడినట్లు పాదము మొదలగు అవయవములు లేనిది (బ్రహ్మ) అని నిషేధించు శాస్త్రము)
(దేహము మొదలగు వాటికంటె వేఱైన ఆత్మ గుఱించి అయిన జ్ఞానము).
(saṃkhyā anagā buddhi - buddhi dvārā telusukonataginadi. ātmatatvamu)
(telusukonavalasina padārthamulu ē śāstramaṃdu telusukonabaḍucunnavō ā śāstramu sāṃkhyamu - adiyē vēdāṃtamu - upaniṣat).
(nīlakaṃṭhavyākhyā)
(vastu tatvamu ī śāstramulō bāgugā ceppabaḍucunnadi kanuka idi saṃkhyā - upaniṣat - upaniṣattulō teliyacēyabaḍinadi brahma viṣayamu).
(paramātma tatvamu ē vidhamaina upādhiyu lēnidi yani ī śāstramu bāgugā teliyacēyunadi kanuka idi saṃkhyā - adi upaniṣattu. ī upaniṣattu cētanē parabrahma tātparyamu - spaṣṭamugā teliyabaḍucunnadi - kanuka ī śāstramu sāṃkhyamu).
(dīnicēta paramārtha tatvamu cakkagā telupabaḍucunnadi, gāna idi saṃkhyā).
(dīnivalana cakkagā teliyabaḍucunnadi - anagā, brahmasākṣātkāra jñānamu kalugacēyunadi buddhi, saṃkhyā. dāni valana kaliginadi sāṃkhyamu)
(paramārtha vastuvunu guṟiṃci vivēkamu - jñānamu - viṣayamugā galadi - śāstramu).
(śuddhātmayokka - nirmalamaina ātma yokka tatvamunu guṟiṃci ayina jñānamu sāṃkhyamu ani ceppabaḍucunnadi - ani vyāsamaharṣulu vrāsina śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu).
saṃkhyōpaniṣadē tasyāṃ pratipādyaḥ paraḥ pumān |
sāṃkhya stanmātra viṣayaṃ jñānamajñāna nāśakaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 425 to 426)
(ē vidhamaina upādhiyu lēnaṭuvaṃṭi paramātma tatvamunu bāgugā teliyacēyunadi saṃkhyā. ī saṃkhyōpaniṣattulō pratipādiṃpabaḍinadi - ceppabaḍinadi paramātma tatvamu - ā śāstramulōni viṣayamu kanuka sāṃkhyamu)
(saṃkhyā anagā dēhamu kaṃṭe vēṟu lakṣaṇamulu gala ātma guṟiṃci ayina jñānamu. aṭṭi jñānamu dvārā poṃdataginadi sāṃkhyamu - śrīmadbhagavadgītalōni modaṭi āru adhyāyamulalō ceppabaḍina viṣayamu).
(ātma tatvamunu guṟiṃci kṛṣi cēyuṭa)
(prakṛti, puruṣuḍu - ī reṃḍu tatvamula guṟiṃci kalugu jñānamu).
(brahmajñānamunu guṟiṃci ayina śāstramu)
(tatvamula vivēkamu).
(ātmanunadi ēdi ? anātma yanunadēdi ? ani vivēkiṃcina pimmaṭa kalugu jñānamu).
(saṃsāramunaku - jananamaraṇarūpamaina saṃsāramunaku - kāraṇamaina śōkamu, mōhamu modalagu dōṣamulanu pōgoṭṭuṭaku kāraṇamaina buddhi - jñānamu).
(tatvamula nirṇayamu - cēyu śāstramu).
“tatva jñāna nirṇayaṃbu gala sāṃkhyaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 26)
“saṃ ityēkī bhāvē iti ēkī bhāvēna ātmā nānyatvēna khyāyatē prakāśyatē vastusvarūpaṃ anayā iti saṃkhyā - sthūla sūkṣma kāraṇa prapaṃcasya nirvikalpē pratyagātmani pravilāpakēna uditā cētō vṛttiḥ tatsādhana bhūtō yaḥ sāṃkhyaḥ sanyāsaḥ, sa ca dārādi buddhyaṃtānāṃ padārthānāṃ ātmani ēkī bhāvēna vyasanaḥ tyāgaḥ pravilāpanaṃ”. (nīlakaṃṭhavyākhyā)
(‘saṃ’ anagā okaṭē ani abhiprāyamu. aṃducēta saṃkhyā anagā ātma kaṃṭe vēṟu vastuvu lēdu, aṃtā ēkamē - okaṭē - ani vastuvula svarūpamunu teliyacēyunadi saṃkhyā. sthūla sūkṣma kāraṇa rūpamulu gala ī prapaṃcamu nirvikalpuḍagu pratyagātma okaṭē (aṃtā pratyagātmayē) anu manōvṛtti kaligiyuṃḍuṭa sāṃkhyamu - dārādulu modalagu padārthamulu okaṭē yani vāṭini ātmayaṃdu viḍucuṭa sanyāsamu).
(upaniṣattu lanniṃṭicētanu tātparya sahitamuga bōdhiṃpabacunna nirviśēṣa parabrahmamu sāṃkhyamu)
(śōka mōhamulu modalagunavi saṃsāramunaku - jananamaraṇarūpamaina saṃsāramunaku - kāraṇamulu. vīṭiki kāraṇamu tana nijasthiti teliyakapōvuṭa - ātmajñānamu lēkuṃḍuṭa, tānē ātmayanu jñānamu lēkuṃḍuṭa. atmajñānamu kaliginaṃtanē yī ajñānamu tolagi pōvunu. aṭṭi ātmajñānamē sāṃkhyamu).
(saṃkhyā anumāṭa buddhi, mati, saṃvit anu vāṭini ceppuṭaku upayōgiṃpabaḍucunnadi. saṃkhyā anagā buddhi, mati, saṃvit ani arthamani nighaṃṭuvu vrāsinavāru ceppucunnāru. nirguṇuḍu puruṣuḍu sāṃkhyamu ani upaniṣattulu ceppucunnavi. vīṭini baṭṭi saṃkhyā anagā paramātmayaṃduvale ātmayaṃdu kūḍa arthamagucunnadi).
(ī satyarajastamamulu guṇamulu, vāṭi vyāpāramunaku sākṣi ayi vāṭikaṃṭe vēru lakṣaṇamulu galavāḍu, nityuḍu ayinavāḍu ātma anu abhiprāyamu kaligiyuṃḍuṭa).
(ātma ēdō, anātma ēdō telusukō kalugu jñānamu).
tatva jñānamu -
sāṃkhyāyaṃtē jñātavya viṣayāḥ yēva tatsāṃkhyaṃ.
(telusukōtagu viṣayamulanu teliyacēyunadi).
(upaniṣattulalō mukhyamugā ceppabaḍina abhiprāyamuvalana kalugu samyak jñānamu).
“ityēta daṃtēna graṃdhēna yatparamārthātmatatva nirūpaṇakṛtaṃ tatsākhyaṃ” (śrī śaṃkaraḥ)
(śrīmadbhagavadgītalō “śōkiṃpa taganivāṭini guṟiṃci nīvu śōkiṃcucunnāvu” (gīta - 2 - 11) anu ślōkamu modalu, ‘nī dharmamu cūci’ anu ślōkamuvaṟaku (2 - 31) ceppabaḍina paramātma tatva nirūpaṇamu sāṃkhyamu; “samyak khyāyatē iti saṃkhyā” (lessagā bōdhapaṟacabaḍinaṭṭi samyak jñānamu sāṃkhyamu).
(vēdamulō ceppabaḍina bhagavaṃtuni yokka svarūpajñānamu).
saṃkhyatō kūḍinadi sāṃkhyamu. sāṃkhyamanagā jñānamu - jñāna vicāraṇayaṃdu anātma vastuvulanu lekkiṃcinapuḍu saṃkhyanu āśrayiṃcavalasi vaccunu. kanuka ayyadi sāṃkhyamani ceppabaḍinadi. prakṛti yaṃdu gala 24 tatvamulanu lessagā śōdhiṃci, avi anātma rūpamulani tyajiṃci, vāṭiki sākṣigā nunnaṭṭi paramātmanu grahiṃcuṭayē sāṃkhya vidya. ātmanātma rūpamagu vijñānamē sāṃkhyamu.
“pṛdhivi, appu, tējassu, vāyuvu, ākāśamu anu mahā bhūta paṃcakamunu gaṃdha.rasa,rūpa, sparśa śabdaṃbulu anu mahābhūta guṇa paṃcakaṃbunu, tvakku, cakṣu śrōtra jihvā ghrāṇamulu anu jñānēṃdriya paṃcakamunu, vākpāṇi pādapāyu, upasthu anu karmēṃdrīya paṃcakamunu, manassu, buddhi, ahaṃkāramu prakṛtiyu gūḍi caturviṃśati tatvaṃbulayye; jīvuṃḍu paṃca viṃśakuṃḍayye. iṭṭi paṃcaviṃśati tatvaṃbula gūḍiparamātma ṣaḍviṃśakuṃḍayye. iṭṭi paramātma yaṃdu niṣṭa kaluguṭa sāṃkhyaṃbu ana noppu”.
jñānayōgamu -
“yatsāṃkhyaiḥ prāpyatē sthānaṃ tadyōgairapi gamyatē |
ēkaṃ sāṃkhyaṃca yōgaṃca yaḥ paśyati sa paśyati ||“. (śrīmadbhagavadgīta - 5 - 5)
(sāṃkhyalu poṃdu sthānamunē yōgulu kūda poṃduduru - sāṃkhyamu, yōgamu anu reṃḍunū okaṭē yani telusukoninavāḍē jñāni).
“sāṃkhya yōgau pṛdhak bālāḥ pravadamytina paṃḍitāḥ |
ēkamasyāsthitaḥ samya gubhiyōrviṃdatē phalaṃ” (śrīmadbhagavdagīta - 5 - 4)
(śāstra jñānamu lēnivāḍu sāṃkhyamu vēru, yōgamu vēru ani ceppunu. paṃḍitulainavāru aṭlu cepparu. ī reṃḍiṃṭilō dēninainanu śraddhatō avalaṃbhiṃcina yaḍala citta śuddhi kalugunu. dāni valana niśrēyasa phalamu labhiṃcunu. ī reṃḍiṃṭikini phalamu okaṭē).
jñānāṃtaraṃga hētutvāt sāṃkhyaḥ sanyāsa ucyatē ||“. (gītābhāvaprakāśamu - 5 - 45)
“saṃkhyā samyagātma buddhiḥ, tāṃ vahatīti jñānāṃtaraṃga sādhanatayā sāṃkhyaḥ sanyāsaḥ” (madhusūdhanīvyākhyā)
(samyagātma buddhi kaligiyuṃḍuṭa saṃkhyā. aṭṭi ātma buddhini jñānaṃtaraṃga sādhanamugā bhaviṃcuṭa sanyāsamu).
jñānaśāstraṃ - tatra apāṇi pādaḥ acakṣu aśrōtraṃ iti ca pādādi nāstīti niṣidyatē.
(jñānaśāstramu - cētulu, kāḷḷu lēnidi, kaḷḷu cevulu lēnidi ani śāstramulō ceppabaḍinaṭlu pādamu modalagu avayavamulu lēnidi (brahma) ani niṣēdhiṃcu śāstramu)
(dēhamu modalagu vāṭikaṃṭe vēṟaina ātma guṟiṃci ayina jñānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.