(సంఖ్యా అనగా బుద్ధి - బుద్ధి లేక జ్ఞానము కలవారు సాంఖ్యులు; ఆత్మ ఒకటే విషయముగా గలవారు సాంఖ్యులు - బుద్ధితో సంబంధముగలవారు).
(సాంఖ్యము అనగా ఆత్మ గుఱించి తెలియచేయు శాస్త్రము - ఆత్మజ్ఞానమునకు సంబంధించిన శాస్త్రము. ఆ శాస్త్రము తెలిసినవారు సాంఖ్యులు - లేక, - సంఖ్యా అనగా బుద్ధిజ్ఞానయోగము - జ్ఞానయోగమందు నిష్ఠగలవారు సాంఖ్యులు -, లేక, సాంఖ్యము అనగా ఆత్మ, - ఆత్మను తెలుసుకొనినవారు సాంఖ్యులు.
(ఆత్మ యేదో, అనాత్మ యేదో అను విషయమును గుఱించి వివేకజ్ఞానము కలవారు - బ్రహ్మచర్యాశ్రమమందుండగనే సన్యసించినవారు, ఉపనిషత్తులు చదువుటవలన కలిగిన జ్ఞానమువలన నిశ్చయము చేసుకొనినవారు, సిద్ధాంతము చేసుకొనినవారు; పరమహంస పరివ్రాజకులగు సన్యాసులు, పరబ్రహ్మమందే నిష్ఠ కలిగి యుండువారు).
“సాంఖ్య శబ్దస్య అత్ర సిద్ధాంత విశేష నిష్టపరత్వం; జ్ఞానినః -”
(సాంఖ్యులు అను దానిలోని సాంఖ్య శబ్దమునకు తత్వ సిద్ధాంతమందు నిష్ట కలిగియుండుట యని యర్థము - అందుచేత సాంఖ్యము అనగా జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు -).
బ్రహ్మచర్యాశ్రమాదేవ వేదాంత శ్రవణాదిభిః |
జ్ఞాన భూమే ప్రవిష్ఠానాం సాంఖ్యానాం శుద్ధచేతసాం |
యజ్యతే బ్రహ్మణానేన జ్ఞానం తద్యోగ ఈరితిః |
జ్ఞానయోగే తేనైవ నిష్ఠా తేషాముదాహృతా ||, (గీతాభావప్రకాశము - 3 - 34 to 36)
(సమ్యగాత్మబుద్ధి సంఖ్య - సంఖ్యకు సంబంధించినది సాంఖ్యము. అట్టి బుద్ధి - లేక, ఆత్మ గుఱించి అయిన బుద్ధి లేక జ్ఞానము గలవారు సాంఖ్యులు. బ్రహ్మచర్యాశ్రమమందున్నపుడే ఉపనిషత్తుల శ్రవణము మొదలగు వాటివలన జ్ఞానభూమియందు (సన్యాసమందు) ప్రవేశించినవారు) నిష్కల్మషమైన మనస్సు కలవారు, జ్ఞానయోగమందు నిష్ఠ కలవారు సాంఖ్యులు)
(శ్రీమద్భగవద్గీతలో శోకింపతగనివాటి గుఱించి నీవు శోకించుచున్నావు (శ్రీమద్భగవద్గీత - 2 -11) అను శ్లోకము మొదలు “నీ ధర్మమును చూచి” అను శ్లోకము (గీత - 2 - 31) వరకు చెప్పబడిన పరమాత్మ తత్వ నిరూపణము సాంఖ్యము - “సమ్యక్ ఖ్యాయతే ఇతి సంఖ్యా” (బాగుగా బోధపఱచబడినట్టిది - సమ్యక్ జ్ఞానము సంఖ్యా. అట్టి ఆత్మజ్ఞాన విషయమైన బుద్ధి - అనగా, ఆత్మకు పుట్టుట, పుట్టుటవలన కలుగు అస్తిత్వము, పుట్టినది పుట్టినట్లే ఉండిపోకుండా వృద్ధి పొందుట వృద్ధి పొందుటలో మార్పులు చెందుట, క్షీణించుట, నశించుట అను ఆరు విధములైన వికారములు ఆత్మకు లేనందున ఆత్మ అకర్త యని నిరూపించుటవలన కలిగిన బుద్ధి సాంఖ్య బుద్ధి - ఇట్టి సాంఖ్య బుద్ధి కలవారు సాంఖ్యులు)
(ఉపనిషత్తులన్నింటిలోను తాత్పర్య సహితముగా బోధింపబడుచున్న నిర్విశేష పరబ్రహ్మము సాంఖ్యము. అదియే తన స్వరూపమని తెలుసుకొనువారు సాంఖ్యులు).
(saṃkhyā anagā buddhi - buddhi lēka jñānamu kalavāru sāṃkhyulu; ātma okaṭē viṣayamugā galavāru sāṃkhyulu - buddhitō saṃbaṃdhamugalavāru).
(sāṃkhyamu anagā ātma guṟiṃci teliyacēyu śāstramu - ātmajñānamunaku saṃbaṃdhiṃcina śāstramu. ā śāstramu telisinavāru sāṃkhyulu - lēka, - saṃkhyā anagā buddhijñānayōgamu - jñānayōgamaṃdu niṣṭhagalavāru sāṃkhyulu -, lēka, sāṃkhyamu anagā ātma, - ātmanu telusukoninavāru sāṃkhyulu.
(ātma yēdō, anātma yēdō anu viṣayamunu guṟiṃci vivēkajñānamu kalavāru - brahmacaryāśramamaṃduṃḍaganē sanyasiṃcinavāru, upaniṣattulu caduvuṭavalana kaligina jñānamuvalana niścayamu cēsukoninavāru, siddhāṃtamu cēsukoninavāru; paramahaṃsa parivrājakulagu sanyāsulu, parabrahmamaṃdē niṣṭha kaligi yuṃḍuvāru).
“sāṃkhya śabdasya atra siddhāṃta viśēṣa niṣṭaparatvaṃ; jñāninaḥ -”
(sāṃkhyulu anu dānilōni sāṃkhya śabdamunaku tatva siddhāṃtamaṃdu niṣṭa kaligiyuṃḍuṭa yani yarthamu - aṃducēta sāṃkhyamu anagā jñānulu, brahmajñānulu -).
brahmacaryāśramādēva vēdāṃta śravaṇādibhiḥ |
jñāna bhūmē praviṣṭhānāṃ sāṃkhyānāṃ śuddhacētasāṃ |
yajyatē brahmaṇānēna jñānaṃ tadyōga īritiḥ |
jñānayōgē tēnaiva niṣṭhā tēṣāmudāhṛtā ||, (gītābhāvaprakāśamu - 3 - 34 to 36)
(samyagātmabuddhi saṃkhya - saṃkhyaku saṃbaṃdhiṃcinadi sāṃkhyamu. aṭṭi buddhi - lēka, ātma guṟiṃci ayina buddhi lēka jñānamu galavāru sāṃkhyulu. brahmacaryāśramamaṃdunnapuḍē upaniṣattula śravaṇamu modalagu vāṭivalana jñānabhūmiyaṃdu (sanyāsamaṃdu) pravēśiṃcinavāru) niṣkalmaṣamaina manassu kalavāru, jñānayōgamaṃdu niṣṭha kalavāru sāṃkhyulu)
(śrīmadbhagavadgītalō śōkiṃpataganivāṭi guṟiṃci nīvu śōkiṃcucunnāvu (śrīmadbhagavadgīta - 2 -11) anu ślōkamu modalu “nī dharmamunu cūci” anu ślōkamu (gīta - 2 - 31) varaku ceppabaḍina paramātma tatva nirūpaṇamu sāṃkhyamu - “samyak khyāyatē iti saṃkhyā” (bāgugā bōdhapaṟacabaḍinaṭṭidi - samyak jñānamu saṃkhyā. aṭṭi ātmajñāna viṣayamaina buddhi - anagā, ātmaku puṭṭuṭa, puṭṭuṭavalana kalugu astitvamu, puṭṭinadi puṭṭinaṭlē uṃḍipōkuṃḍā vṛddhi poṃduṭa vṛddhi poṃduṭalō mārpulu ceṃduṭa, kṣīṇiṃcuṭa, naśiṃcuṭa anu āru vidhamulaina vikāramulu ātmaku lēnaṃduna ātma akarta yani nirūpiṃcuṭavalana kaligina buddhi sāṃkhya buddhi - iṭṭi sāṃkhya buddhi kalavāru sāṃkhyulu)
(upaniṣattulanniṃṭilōnu tātparya sahitamugā bōdhiṃpabaḍucunna nirviśēṣa parabrahmamu sāṃkhyamu. adiyē tana svarūpamani telusukonuvāru sāṃkhyulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.