సందేహము -
“ఇయం రజ్జుర్వా సర్వోవా ఇతి కోటి ద్వయ విషయకం జ్ఞానం సం శయః” (విచారసాగరము)
(ఇది త్రాడా, పామా అని ఒకే వస్తువు గుఱించి రెండు అభిప్రాయములు కలిగియుండుట; ఒకే ధర్మము గల వస్తువు గుఱించి రెండు విధములైన ధర్మము గలదిగా తలంచుట - అట్టి జ్ఞానము)
అసంభావనా దయః (అసంభావన మొదలగునవి).
వికల్ప జ్ఞానం; బుద్ధి వృత్తి లక్షణం -
(వికల్పకజ్ఞానము - బుద్ధి వృత్తియొక్క లక్షణము)
(ఆత్మ, అనాత్మల గుఱించి అనేక విధములైన సంశయముకలదు - ఆత్మను గుఱించి అయిన సంశయము రెండు విధములు - ప్రమాణమును బట్టి కలుగు సంశయము, ప్రమేయమును బట్టి కలుగు సంశయము. ఉపనిషత్తులలో చెప్పబడిన వాక్యములు ద్వైతమును చెప్పుచున్నవా? లేక, అద్వైతమును చెప్పుచున్నవా అను సంశయము ప్రమాణమునకు (వేదాంతమునకు) సంబంధించిన సంశయము. ఈ సంశయము శ్రవణమునకు ముందు (ఉపనిషత్తులను చదివి అర్థము చేసుకొనక ముందు కలిగినవి. ఉపనిషత్తులద్వారా (ప్రమాణముద్వారా) తెలియతగిన మోక్షము మొదలగునవన్నియు ప్రమేయములు (ప్రమాణముద్వారా తెలియతగినవి). వీటి గుఱించి కలుగు సంశయము ప్రమేయ సంశయము - విషయముల భేదము ప్రకారము అనంతవిధము)
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
తస్మా దజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసి నాత్మనః |
భిత్వైనం సంశయం యోగమా తిష్టో త్తిష్ఠ భారత ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 41,42)
(అన్నింటియందు సమబుద్ధి కలిగియుండుటచేత కర్మలన్నియు భగవంతునికే సమర్పించుట అను యోగముచేతగాని, లేక, సర్వకర్మసన్యాసమను యోగముచేతగాని, బ్రహ్మజ్ఞానము కలిగియుండుటచేత సంశయములన్నియు పోగొట్టుకొనినవానిని కర్మలు బంధించవు. అందుచేత అజ్ఞానమువలన కలిగిన ఈ సంశయమును జ్ఞానమను కత్తిచేత ఛేధించి యోగము నవలంభించుము).
saṃdēhamu -
“iyaṃ rajjurvā sarvōvā iti kōṭi dvaya viṣayakaṃ jñānaṃ saṃ śayaḥ” (vicārasāgaramu)
(idi trāḍā, pāmā ani okē vastuvu guṟiṃci reṃḍu abhiprāyamulu kaligiyuṃḍuṭa; okē dharmamu gala vastuvu guṟiṃci reṃḍu vidhamulaina dharmamu galadigā talaṃcuṭa - aṭṭi jñānamu)
asaṃbhāvanā dayaḥ (asaṃbhāvana modalagunavi).
vikalpa jñānaṃ; buddhi vṛtti lakṣaṇaṃ -
(vikalpakajñānamu - buddhi vṛttiyokka lakṣaṇamu)
(ātma, anātmala guṟiṃci anēka vidhamulaina saṃśayamukaladu - ātmanu guṟiṃci ayina saṃśayamu reṃḍu vidhamulu - pramāṇamunu baṭṭi kalugu saṃśayamu, pramēyamunu baṭṭi kalugu saṃśayamu. upaniṣattulalō ceppabaḍina vākyamulu dvaitamunu ceppucunnavā? lēka, advaitamunu ceppucunnavā anu saṃśayamu pramāṇamunaku (vēdāṃtamunaku) saṃbaṃdhiṃcina saṃśayamu. ī saṃśayamu śravaṇamunaku muṃdu (upaniṣattulanu cadivi arthamu cēsukonaka muṃdu kaliginavi. upaniṣattuladvārā (pramāṇamudvārā) teliyatagina mōkṣamu modalagunavanniyu pramēyamulu (pramāṇamudvārā teliyataginavi). vīṭi guṟiṃci kalugu saṃśayamu pramēya saṃśayamu - viṣayamula bhēdamu prakāramu anaṃtavidhamu)
ātmavaṃtaṃ na karmāṇi nibadhnaṃti dhanaṃjaya |
tasmā dajñāna saṃbhūtaṃ hṛtsthaṃ jñānāsi nātmanaḥ |
bhitvainaṃ saṃśayaṃ yōgamā tiṣṭō ttiṣṭha bhārata ||“. (śrīmadbhagavadgīta - 4 - 41,42)
(anniṃṭiyaṃdu samabuddhi kaligiyuṃḍuṭacēta karmalanniyu bhagavaṃtunikē samarpiṃcuṭa anu yōgamucētagāni, lēka, sarvakarmasanyāsamanu yōgamucētagāni, brahmajñānamu kaligiyuṃḍuṭacēta saṃśayamulanniyu pōgoṭṭukoninavānini karmalu baṃdhiṃcavu. aṃducēta ajñānamuvalana kaligina ī saṃśayamunu jñānamanu katticēta chēdhiṃci yōgamu navalaṃbhiṃcumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.