← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంస్మృతి కారణము saṃsmṛti kāraṇamu

Original — తెలుగు
  1. సంసార వర్థికాః -

(సంసారమునకు కారణమైనవి; సంసారమును వృద్ధి చేయునవి, ముక్తి కలుగకుండ చేయునవి)

  1. సంసృతి కారణం కాల ఏవ ఇతి కాల విదోవదంతి - స్వభావః ఇతి లోకాయతికాః పుణ్యపాప నియతిరేవ కారణం ఇతి మీమాంసకాః; కల్పాదౌ ప్రాణి కర్మ సాపేక్షం ఈశ్వరేణ న కించిదపి సృష్టం, కింతు యదృచ్ఛయా ఇదం జాయతే ఇతి నిరీశ్వర వాదినః; జగన్నిత్యతా వాదినః భూతాని కారణమితి వదంతి; యోనిః ప్రకృతిః కారణమితి ప్రాకృతాః, శాక్తాః, పురుషో హిరణ్యగర్భః ఏవ కారణ మితి యోగినః, ఇత్థం కాలాది పురుషాంతం స్వాజ్ఞానానురోధేన చింత్యం చింతామాత్రమవ శిష్యతే -

(సంసారమునకు కారణము కాలమే యని కాలజ్ఞులు చెప్పుదురు; స్వభావమే యని లోకాయతికులు చెప్పుచున్నారు, పుణ్యపాపములే యని మీమాంసకులు అనుచున్నారు - కల్పము ప్రారంభమున ప్రాణుల కర్మలవలన సంసారము కలుగునట్లు ఈశ్వరుని సృష్టికాదు, కాని యిది యంతయు దానంతట అది యగుచున్నది యని అనీశ్వరవాదులు - దేవుడే లేడనువారు - చెప్పుచున్నారు - జగత్తు నిత్యమని వాదించువారు భూతములు కారణమనుచున్నారు; ప్రకృతి కారణమని ప్రాకృతులు - శాక్తులు అనుచున్నారు; ఫరిషుడు లేక హిరణ్యగర్భుడు కారణమని యోగులు అభిప్రాయపడుచున్నారు. ఇట్లు సంసారమునకు (సంసృతికి) కారణము కాలము మొదలు పురుషుడు వరకు పైన చెప్పిన ప్రకారము అజ్ఞానమువలన అనేక రీతులుగా చెప్పబడుచున్నది. ఇది యిట్లు ఆలోచనమాత్రముగనే మిగిలిపోయినది, స్పష్టము చేయబడలేదు, సిద్ధాంతీకరింపబడలేదు -

Transliteration
  1. saṃsāra varthikāḥ -

(saṃsāramunaku kāraṇamainavi; saṃsāramunu vṛddhi cēyunavi, mukti kalugakuṃḍa cēyunavi)

  1. saṃsṛti kāraṇaṃ kāla ēva iti kāla vidōvadaṃti - svabhāvaḥ iti lōkāyatikāḥ puṇyapāpa niyatirēva kāraṇaṃ iti mīmāṃsakāḥ; kalpādau prāṇi karma sāpēkṣaṃ īśvarēṇa na kiṃcidapi sṛṣṭaṃ, kiṃtu yadṛcchayā idaṃ jāyatē iti nirīśvara vādinaḥ; jagannityatā vādinaḥ bhūtāni kāraṇamiti vadaṃti; yōniḥ prakṛtiḥ kāraṇamiti prākṛtāḥ, śāktāḥ, puruṣō hiraṇyagarbhaḥ ēva kāraṇa miti yōginaḥ, itthaṃ kālādi puruṣāṃtaṃ svājñānānurōdhēna ciṃtyaṃ ciṃtāmātramava śiṣyatē -

(saṃsāramunaku kāraṇamu kālamē yani kālajñulu ceppuduru; svabhāvamē yani lōkāyatikulu ceppucunnāru, puṇyapāpamulē yani mīmāṃsakulu anucunnāru - kalpamu prāraṃbhamuna prāṇula karmalavalana saṃsāramu kalugunaṭlu īśvaruni sṛṣṭikādu, kāni yidi yaṃtayu dānaṃtaṭa adi yagucunnadi yani anīśvaravādulu - dēvuḍē lēḍanuvāru - ceppucunnāru - jagattu nityamani vādiṃcuvāru bhūtamulu kāraṇamanucunnāru; prakṛti kāraṇamani prākṛtulu - śāktulu anucunnāru; phariṣuḍu lēka hiraṇyagarbhuḍu kāraṇamani yōgulu abhiprāyapaḍucunnāru. iṭlu saṃsāramunaku (saṃsṛtiki) kāraṇamu kālamu modalu puruṣuḍu varaku paina ceppina prakāramu ajñānamuvalana anēka rītulugā ceppabaḍucunnadi. idi yiṭlu ālōcanamātramuganē migilipōyinadi, spaṣṭamu cēyabaḍalēdu, siddhāṃtīkariṃpabaḍalēdu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.