← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంవత్సరః saṃvatsaraḥ

Original — తెలుగు
  1. సమ్యక్ వసంతి సర్వభూతాని అస్మిన్ ఇతి సంవత్సరః.

(సమస్త భూతములు తనయందే నివసించియుండుట గలవాడు).

  1. ఆదిత్యస్య సంవత్సర శబ్ద వాచ్యత్వాత్ తత్ స్థ పురుషస్యాపి “(ఆదిత్యే పురుషః)” సంవత్సర శబ్ద వాచ్యః.

(ఆదిత్యుడు - సూర్యుడు - సంవత్సరము అని చెప్పబడుటచేత సంవత్సరమనగా సూర్యమండల మధ్యమందుగల పురుషుడు)

  1. “ప్రజాపతిః సంవత్సరో మహాన్ యః” ఇతి ప్రసిద్ధో అండాధిపతిః

(ప్రజాపతి లేక బ్రహ్మాండాధిపతి)

  1. సంవత్సరోపలక్షితః కృత్స్నుః కాలః సముత్పన్నః -

(సంవత్సరమనగా కాలము అనునది అంతయు అని గ్రహించవలెను).

  1. “వ. - - - అయనంబులు రెండు గూడి ద్వాదశ మాసంబులైన నొక్క సంవత్సరంబగు ఇట్లు సంవత్సర శతంబు నరులకు పరమాయువైయుండు”. (శ్రీమహాభాగవతము - 3 - 11 - 346)

  2. “వ. - - - సంవత్సర పరీవత్సరేడావత్సరాను వత్సర వత్సర నామంబులు -” (శ్రీమహాభాగవతము - 3 - 11 - 346)

  3. కాలాత్ముండును నశ్వరుండును నైన సూర్యుండా గ్రహ నక్షత్ర తారా చక్రస్థుండై పరమాణ్వాది సంవత్సరాత్మకంబైన కాలంబునం జేసి ద్వాదశరాశ్యాత్మకంబైన జగంబున సౌర బార్హస్పత్య సావనా చాంద్ర నక్షత్ర మాన భేదంబులం గానంబడుచున్నవాడై సంవత్సరేడావత్సరాను వత్సర వత్సర నామంబుల సృజ్యంబైన బీజాంకురంబుల శక్తిం గాల రూపంబైన స్వశక్తి చేత నభిముఖంబుగా జేయుచు పురుషులకు నాయురాది వ్యయంబులం జేసి విషయాసక్తి నివారింపం జేయుచు - - - గగనంబునం బరువు వెట్టు వత్సర పంచక ప్రవర్తకుండగు మార్తాండునకు బూజ గావింపుము).

Transliteration
  1. samyak vasaṃti sarvabhūtāni asmin iti saṃvatsaraḥ.

(samasta bhūtamulu tanayaṃdē nivasiṃciyuṃḍuṭa galavāḍu).

  1. ādityasya saṃvatsara śabda vācyatvāt tat stha puruṣasyāpi “(ādityē puruṣaḥ)” saṃvatsara śabda vācyaḥ.

(ādityuḍu - sūryuḍu - saṃvatsaramu ani ceppabaḍuṭacēta saṃvatsaramanagā sūryamaṃḍala madhyamaṃdugala puruṣuḍu)

  1. “prajāpatiḥ saṃvatsarō mahān yaḥ” iti prasiddhō aṃḍādhipatiḥ

(prajāpati lēka brahmāṃḍādhipati)

  1. saṃvatsarōpalakṣitaḥ kṛtsnuḥ kālaḥ samutpannaḥ -

(saṃvatsaramanagā kālamu anunadi aṃtayu ani grahiṃcavalenu).

  1. “va. - - - ayanaṃbulu reṃḍu gūḍi dvādaśa māsaṃbulaina nokka saṃvatsaraṃbagu iṭlu saṃvatsara śataṃbu narulaku paramāyuvaiyuṃḍu”. (śrīmahābhāgavatamu - 3 - 11 - 346)

  2. “va. - - - saṃvatsara parīvatsarēḍāvatsarānu vatsara vatsara nāmaṃbulu -” (śrīmahābhāgavatamu - 3 - 11 - 346)

  3. kālātmuṃḍunu naśvaruṃḍunu naina sūryuṃḍā graha nakṣatra tārā cakrasthuṃḍai paramāṇvādi saṃvatsarātmakaṃbaina kālaṃbunaṃ jēsi dvādaśarāśyātmakaṃbaina jagaṃbuna saura bārhaspatya sāvanā cāṃdra nakṣatra māna bhēdaṃbulaṃ gānaṃbaḍucunnavāḍai saṃvatsarēḍāvatsarānu vatsara vatsara nāmaṃbula sṛjyaṃbaina bījāṃkuraṃbula śaktiṃ gāla rūpaṃbaina svaśakti cēta nabhimukhaṃbugā jēyucu puruṣulaku nāyurādi vyayaṃbulaṃ jēsi viṣayāsakti nivāriṃpaṃ jēyucu - - - gaganaṃbunaṃ baruvu veṭṭu vatsara paṃcaka pravartakuṃḍagu mārtāṃḍunaku būja gāviṃpumu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.