← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమ్యక్ బోధము samyak bōdhamu

Original — తెలుగు
  1. పరమాత్మ తత్వాతీత రహస్యము సమ్యగ్బోధము - “బృహత్వాత్ బృంహణత్వాచ్చ తత్ బ్రహ్మేత్యభిధీయతే” అత్రా యం పురుషః స్వయం జ్యోతిః - పరమాత్మ స్వయం ప్రకాశం -

(పరమార్థ తత్వమునకు అతీతమైన రహస్యము సమ్యక్ బోధము - ఉదాహరణకు - “పెద్దగా పెరుగుటచేత - వృద్ధి పొందుటచేత, ఎందులోనుండిన దానిని వృద్ధిపొందించునది బ్రహ్మ అని చెప్పబడుచున్నది -” ఈ పురుషుడు స్వయముగా ప్రకాశించువాడు -“స్వయముగా ప్రకాశించువాడు” -

  1. “వ. దేహంబునకు బీజంబు లింగంబనియు, లింగంబునకు మూలంబు గుణంబులనియు, గుణంబులకు నిదానంబు ప్రకృతి యనియును, బ్రహ్మమనియెడు జ్ఞానంబున లీనమై ప్రకృతి లేకుండుననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియు, నైర్గుణ్యంబువలన గార్యలింగనాశనం బగుననియు, గార్యలింగనాశనంబున నసంభవంబగుననియు, బ్రకృతిబాసి క్రమ్మర స్థూల శరీరప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును, నిశ్చయించి యర్జనుండు విరక్తుండై యూరకుండె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 - 343)
Transliteration
  1. paramātma tatvātīta rahasyamu samyagbōdhamu - “bṛhatvāt bṛṃhaṇatvācca tat brahmētyabhidhīyatē” atrā yaṃ puruṣaḥ svayaṃ jyōtiḥ - paramātma svayaṃ prakāśaṃ -

(paramārtha tatvamunaku atītamaina rahasyamu samyak bōdhamu - udāharaṇaku - “peddagā peruguṭacēta - vṛddhi poṃduṭacēta, eṃdulōnuṃḍina dānini vṛddhipoṃdiṃcunadi brahma ani ceppabaḍucunnadi -” ī puruṣuḍu svayamugā prakāśiṃcuvāḍu -“svayamugā prakāśiṃcuvāḍu” -

  1. “va. dēhaṃbunaku bījaṃbu liṃgaṃbaniyu, liṃgaṃbunaku mūlaṃbu guṇaṃbulaniyu, guṇaṃbulaku nidānaṃbu prakṛti yaniyunu, brahmamaniyeḍu jñānaṃbuna līnamai prakṛti lēkuṃḍunaniyu, prakṛti yaḍaṃguṭaya nairguṇyaṃbaniyu, nairguṇyaṃbuvalana gāryaliṃganāśanaṃ bagunaniyu, gāryaliṃganāśanaṃbuna nasaṃbhavaṃbagunaniyu, brakṛtibāsi krammara sthūla śarīraprāptuṃḍu gāka puruṣuṃḍu samyagbhōgaṃbuna nuṃḍu naniyunu, niścayiṃci yarjanuṃḍu viraktuṃḍai yūrakuṃḍe”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 - 343)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.