← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శారీరః śārīraḥ

Original — తెలుగు
  1. శరీరే భవః శారీరః

(శరీరమందుండువాడు - జీవుడు)

  1. శరీర సంబంధీ; జీవాత్మా; ఆత్మ.

(శరీరముతో సంబంధము కలవాడు - శరీరమునకు సంబంధించినవాడు - జీవాత్మ)

  1. శరీరభిమానీ - ఆత్మా -

(శరీరమునందు - ‘నేను, నాది’ యను అభిమానము కలవాడు) (ఆత్మ)

  1. దుఃఖ మిశ్ర పరిమిత సుఖలవ భాక్ శారీరీ -

(దుఃఖముతో కూడిన తగుమాత్రము సుఖము ననుభవించువాడు)

  1. శారీరః ఇతి శరీరే భవః ఇత్యర్థః - జీవస్తు శరీర ఏవ భవతి. తస్య భోగాధిష్ఠానాత్, శరీరాదిన్యత్ర వృత్య భావాత్.

(శారీరి అనగా శరీరమందుండువాడు అని అర్థము - జీవుడే శరీరి. ఎందుచేతననగా జీవునియొక్క భోగమునకు అధిష్ఠానము శరీరము కాక మరియొకటిలేదు - శరీరముతోడి కాక ఈతరత్ర తన వృత్తిచేయుటకవకాసము లేనందున)

  1. “పరం ఏవ ఆత్మా దేహేంద్రియ మనో బుద్ధ్యుపాదిభిః పరిచ్ఛిద్యమానో చాలైః శారీరః ఇత్యుప చర్యతే - యథా ఖటకరకాద్యుపాధివశాత్ అపరిచ్ఛిన్నమపినభ్యః పరిచ్ఛిన్నవదనభాసతే, తద్వత్ -” (శ్రీశంకరః) (బ్రహ్మసూత్రభాష్యే)

(ఆకాశము పరిమితి లేనిదైనను ఘటములోనున్నది ఘటాకాశము అని ఆ ఉపాధులను బట్టి పరిమితి కలదిగా చెప్పబడినట్లు భగవంతుడు అపరిచ్ఛిన్నుడైనను - ఉపాధులైన మనస్సు, బుద్ధి, ఇంద్రియములతోనుండునపుడు ఆ ఉపాధులు శరీరముగా గలవాడని, శారీరి యని, చెప్పబడుచున్నాడు)

  1. శరీరమేవ సరీరకం, శరీరకే భవః శారీరకో జీవః; శరీరమేవ సరీరకం, తత్ర నివాసీ శారీరకో జీవాత్మా -

(శరీరము అనినను, శరీరకమనినను ఒకటే - శరీరములోనుండువాడు శారీరకుడు - జీవుడు.

“జగచ్ఛరీరకః పరమాత్మా శారీరః” -

(జగత్తు శరీరముగా గలవాడు)

Transliteration
  1. śarīrē bhavaḥ śārīraḥ

(śarīramaṃduṃḍuvāḍu - jīvuḍu)

  1. śarīra saṃbaṃdhī; jīvātmā; ātma.

(śarīramutō saṃbaṃdhamu kalavāḍu - śarīramunaku saṃbaṃdhiṃcinavāḍu - jīvātma)

  1. śarīrabhimānī - ātmā -

(śarīramunaṃdu - ‘nēnu, nādi’ yanu abhimānamu kalavāḍu) (ātma)

  1. duḥkha miśra parimita sukhalava bhāk śārīrī -

(duḥkhamutō kūḍina tagumātramu sukhamu nanubhaviṃcuvāḍu)

  1. śārīraḥ iti śarīrē bhavaḥ ityarthaḥ - jīvastu śarīra ēva bhavati. tasya bhōgādhiṣṭhānāt, śarīrādinyatra vṛtya bhāvāt.

(śārīri anagā śarīramaṃduṃḍuvāḍu ani arthamu - jīvuḍē śarīri. eṃducētananagā jīvuniyokka bhōgamunaku adhiṣṭhānamu śarīramu kāka mariyokaṭilēdu - śarīramutōḍi kāka ītaratra tana vṛtticēyuṭakavakāsamu lēnaṃduna)

  1. “paraṃ ēva ātmā dēhēṃdriya manō buddhyupādibhiḥ paricchidyamānō cālaiḥ śārīraḥ ityupa caryatē - yathā khaṭakarakādyupādhivaśāt aparicchinnamapinabhyaḥ paricchinnavadanabhāsatē, tadvat -” (śrīśaṃkaraḥ) (brahmasūtrabhāṣyē)

(ākāśamu parimiti lēnidainanu ghaṭamulōnunnadi ghaṭākāśamu ani ā upādhulanu baṭṭi parimiti kaladigā ceppabaḍinaṭlu bhagavaṃtuḍu aparicchinnuḍainanu - upādhulaina manassu, buddhi, iṃdriyamulatōnuṃḍunapuḍu ā upādhulu śarīramugā galavāḍani, śārīri yani, ceppabaḍucunnāḍu)

  1. śarīramēva sarīrakaṃ, śarīrakē bhavaḥ śārīrakō jīvaḥ; śarīramēva sarīrakaṃ, tatra nivāsī śārīrakō jīvātmā -

(śarīramu aninanu, śarīrakamaninanu okaṭē - śarīramulōnuṃḍuvāḍu śārīrakuḍu - jīvuḍu.

“jagaccharīrakaḥ paramātmā śārīraḥ” -

(jagattu śarīramugā galavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.