(అరాధించు దేవతతో సమాన రూపమును కలిగియుండుట).
(సరూపమనగా తుల్యరూపము, సమానమైన రూపము - దాని భావము సారూప్యము)
(సమానరూపము - అనగా ఉపాసించు దేవతతో సమానమైన రూపము కలిగియుండుట).
(సామీప్యముక్తికంటె ఉత్కృష్టమైనది - రాజుగారి తమ్ముడు రాజుగారితో సమాన రూపము నొందినట్లు - ఈశ్వరునితో సమానరూపము నొందినట్లు).
(వారి వారి మనోభావముల ననుసరించి భగవంతునియొక్క ప్రతీకమును వారి వారి ఐశ్వర్య విశేషమును బట్టి ఉపాసనచేయువారు సారూప్యముక్తి నొందుదురు).
మయ సమాన రూపస్సన్ మమలోకే మహీయతే ||.
(సమస్త కోరికలను వదలివేసి నన్ను తెలుసుకొని ఎవడు నన్ను పూజించునో అట్టివాడు నా సమాన రూపము పొంది నా లోకములోనే యుండును).
“సత్వరజస్తమోగుణ విహీనుండయిన జనుండు మత్సమానాకారంబు బొందును”
శా. వక్రంబింతయు లేక సాయని మహా వైరంబునన్ నిత్య జా
త క్రోధ స్మరణంబులన్ విదళితోద్యత్పాప సంఘాతులై
చక్రచ్ఛిన్న శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై
చక్రిం జెందిరి వారు పార్శ్వ చరులై సారూప్యభావంబునన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -1- 25)
(arādhiṃcu dēvatatō samāna rūpamunu kaligiyuṃḍuṭa).
(sarūpamanagā tulyarūpamu, samānamaina rūpamu - dāni bhāvamu sārūpyamu)
(samānarūpamu - anagā upāsiṃcu dēvatatō samānamaina rūpamu kaligiyuṃḍuṭa).
(sāmīpyamuktikaṃṭe utkṛṣṭamainadi - rājugāri tammuḍu rājugāritō samāna rūpamu noṃdinaṭlu - īśvarunitō samānarūpamu noṃdinaṭlu).
(vāri vāri manōbhāvamula nanusariṃci bhagavaṃtuniyokka pratīkamunu vāri vāri aiśvarya viśēṣamunu baṭṭi upāsanacēyuvāru sārūpyamukti noṃduduru).
maya samāna rūpassan mamalōkē mahīyatē ||.
(samasta kōrikalanu vadalivēsi nannu telusukoni evaḍu nannu pūjiṃcunō aṭṭivāḍu nā samāna rūpamu poṃdi nā lōkamulōnē yuṃḍunu).
“satvarajastamōguṇa vihīnuṃḍayina januṃḍu matsamānākāraṃbu boṃdunu”
śā. vakraṃbiṃtayu lēka sāyani mahā vairaṃbunan nitya jā
ta krōdha smaraṇaṃbulan vidaḷitōdyatpāpa saṃghātulai
cakracchinna śiraskulai munivaca śāpāvadhi prāptulai
cakriṃ jeṃdiri vāru pārśva carulai sārūpyabhāvaṃbunan. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 -1- 25)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.