(బంగారముచే చేయబడిన సమస్త వస్తువులు అన్నియు బంగారమయమైనట్లును, మట్టిచే చేయబడిన వస్తువులన్నియు మట్టిమయములే అయినట్లు పరబ్రహ్మచే నిర్మించబడినదంతయు పరబ్రహ్మ మయమే).
“నీవు సర్వ మయుండవై లోకమెల్లను నిండియుండగ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 -)
“క. సర్వము నీలో నిధిగా,
సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై
సర్వ మయుడవగు నీకును,
సర్వేశ్వర, లేవు సంధులు, వెలియున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా - 120)
సకల జంతులందు సంచరించు
నా మహాత్మునకు బరాంగన లెవ్వరు
సర్వ మయుడు లీల సలిపెగాక”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 44)
“వ. జీవాత్మకు బరుండైన సర్వ మయుండు దన మాయచేత రజంబున విశ్వంబు సృజింపం గోరి, సత్వంబున గ్రీడింపగోరి, తమంబున నిద్రంపం గోరి యుత్పాదించి, చరమైన కాలంబును సృజియించు” (శ్రీమదాంధ్రమహా భాగవతము - 7 - 1 - 7)
అన్నింటిలోను పూర్తిగా నిండియుండువాడు, అన్నింటితోను పూర్తిగా నిండియున్నవాడు.
(baṃgāramucē cēyabaḍina samasta vastuvulu anniyu baṃgāramayamainaṭlunu, maṭṭicē cēyabaḍina vastuvulanniyu maṭṭimayamulē ayinaṭlu parabrahmacē nirmiṃcabaḍinadaṃtayu parabrahma mayamē).
“nīvu sarva mayuṃḍavai lōkamellanu niṃḍiyuṃḍaga” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 -)
“ka. sarvamu nīlō nidhigā,
sarvātmuḍavātma vastu saṃpannuḍavai
sarva mayuḍavagu nīkunu,
sarvēśvara, lēvu saṃdhulu, veliyun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā - 120)
sakala jaṃtulaṃdu saṃcariṃcu
nā mahātmunaku barāṃgana levvaru
sarva mayuḍu līla salipegāka”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 44)
“va. jīvātmaku baruṃḍaina sarva mayuṃḍu dana māyacēta rajaṃbuna viśvaṃbu sṛjiṃpaṃ gōri, satvaṃbuna grīḍiṃpagōri, tamaṃbuna nidraṃpaṃ gōri yutpādiṃci, caramaina kālaṃbunu sṛjiyiṃcu” (śrīmadāṃdhramahā bhāgavatamu - 7 - 1 - 7)
anniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu, anniṃṭitōnu pūrtigā niṃḍiyunnavāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.