“యధా శుబద్ధ సువర్ణస్య కటక మకుటాంగదాది భేజః, యథా సముద్ర సలిలస్య స్థూల సూక్ష్మ తరంగ ఫేన బుద్దుద కరక లవణ పాషాణాద్యనంత వస్తు భేదః, తధైవ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః మమ సర్వాద్వైతం ఉపపన్నం భవత్యేవ మత్స్వరూపమేవ సర్వం, మద్వ్యతిరిక్తం అణుమాత్రం న విద్యతే”. (మహానారాయణోపనిషత్)
(మేలిమి బంగారమే మకుటము, కటకము, అంగదము మొదలగు రూపములతో భేదము కలిగియున్నది; సముద్రపు నీరే కెరటములు - చిన్నవి, పెద్దవిగాను - నురుగు, బుడగలు, ఉప్పు, ఱాయి మొదలగు ఆకారములతో అనేక భేదములతో ఎట్లు కనబడుచున్నదో, నేను తప్ప మఱొక వస్తువే లేనివాడు పరమానంద రూపుడను మోక్ష రూపుడను అను మొదలగు లక్షణములుగల పరబ్రహ్మమగు నా యందే సర్వాద్వైతమను మాట పొసగుచున్నది. ఎందుచేతననగా జగత్తులోనున్నదంతయు నా స్వరూపమే. లేశ మాత్రము (అణుమాత్రము) సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువైనను నాకు వ్యతిరిక్తమైనది (నేను కానిది) లేదు).
“yadhā śubaddha suvarṇasya kaṭaka makuṭāṃgadādi bhējaḥ, yathā samudra salilasya sthūla sūkṣma taraṃga phēna budduda karaka lavaṇa pāṣāṇādyanaṃta vastu bhēdaḥ, tadhaiva advaita paramānaṃda lakṣaṇa parabrahmaṇaḥ mama sarvādvaitaṃ upapannaṃ bhavatyēva matsvarūpamēva sarvaṃ, madvyatiriktaṃ aṇumātraṃ na vidyatē”. (mahānārāyaṇōpaniṣat)
(mēlimi baṃgāramē makuṭamu, kaṭakamu, aṃgadamu modalagu rūpamulatō bhēdamu kaligiyunnadi; samudrapu nīrē keraṭamulu - cinnavi, peddavigānu - nurugu, buḍagalu, uppu, ṟāyi modalagu ākāramulatō anēka bhēdamulatō eṭlu kanabaḍucunnadō, nēnu tappa maṟoka vastuvē lēnivāḍu paramānaṃda rūpuḍanu mōkṣa rūpuḍanu anu modalagu lakṣaṇamulugala parabrahmamagu nā yaṃdē sarvādvaitamanu māṭa posagucunnadi. eṃducētananagā jagattulōnunnadaṃtayu nā svarūpamē. lēśa mātramu (aṇumātramu) sūkṣmāti sūkṣmamaina vastuvainanu nāku vyatiriktamainadi (nēnu kānidi) lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.