(సర్వార్థములను ప్రకాశింపచేయువాడు)
(చైతన్యరూపముతోను, జ్ఞానరూపముతోను అంతట నుండువాడు).
సర్వ వ్యాపీచ భగవాన్ తస్మాత్ సర్వగతశ్శివః“. (వాయువీయ సంహితాయాం)
(శివుడు అన్ని ముఖములు, శిరస్సు, కంఠములు తనవే అయినవాడు, సమస్త భూతముల హృదయమను గుహ యందండువాడు, అన్నింటిలోను వ్యాపించియుండువాడు. అందుచేత భగవంతుడు అయిన శివుడు సర్వగతుడు)
(అన్నింటికి అధిష్ఠామనమగుటవలన ఆకాశము వలె అన్నింటిలోను వ్యాపించియుండునది).
(విభుడగుటవలనను ఆకాశమువలె వ్యాపించియుండుటవలనను సర్వగతుడు).
(చతుర్ముఖ బ్రహ్మ మొదలు పిపీలికములవరకు సమస్త శరీరములందుండునది. ధర్మభూత జ్ఞానముచేత - తన ధర్మమైన జ్ఞానముచేత స్వతః (తనంతట తానే, ఇతర సహాయము లేకనే) అన్నింటిలోను వ్యాపించి యుండు శక్తి గల దేవి)
(జగత్తు అంతయు తనకు అధిష్ఠానమగుటచేత, జగత్తు అంతటిని ఆశ్రయించి యుండువాడు - వస్తు పరిచ్ఛేదము - క వస్తువులో నుండి ఇంకొక ఇంకొక వస్తువులో లేకుండుట - లేనివాడు).
(అంతటనుండువాడు కనుక దేశ పరిచ్ఛేదము లేక నుండువాడు - ఒక చోటనుండి, ఇంకొక చోట లేకుండనుండుట అనునది లేక అన్ని చోట్ల నుండువాడు).
(శ్రీ శంకరః)
(ఆకాశమెంతవఱకు వ్యాపించియున్నదో అంతవఱకు హృదయాకాశములో ఇతను (ఆత్మ) వ్యాపించి యున్నాడు - ఆకాశమువలె అన్నింటిలోను వ్యాపించియుండువాడు నిత్యుడు - దివముకంటె పెద్దవాడు, ఆకాశముకంటె పెద్దవాడు, అన్నింటిని పొందియున్నవాడు; స్థాణువు వకె నున్నవాడు: అను శృతి, స్మృతలలోని వాక్యములు ఆత్మ సర్వ గతమని, అన్నింటిలోను వ్యాపించి యున్నదని చెప్పుచున్నవి).
“సర్వ భూత స్థితం యో మాం భజత్యేకత్వమా స్థితః”. (శ్రీమద్భగవద్గీత - 6 - 31,32)
(సమస్త భూతములందు ఉన్నవాడొక్కడే యని నన్ను ఎవడు భావించునో - - - )
“సర్వగతత్వం చాస్యా యామ శబ్దాదిభ్యో విజ్ఞాయతే - ఆయామ శబ్దో వ్యాప్తి వచన శబ్దః -”.
(భగవంతుని సర్వగతత్వము ఆయామ శబ్దము మొదలగువాటి వలన కలిగినది - ఆయామమనగా వ్యాప్తి అని అర్థము).
(మార్పులు చెందుచుండు ఘట పటాదులుమొదలగు వాటియందు మార్పుచెందక సద్రూపముతో - స్థిరముగా నుండు ఒకే రూపముతో వ్యాపించి యుండునది. అన్నింటికీ సత్త స్ఫూర్తి - చైతన్య శక్తి - Energy ని - ఇచ్చునదగుటచేత శూన్యము కానిది).
(శ్రీమద్భగవద్గీత - 3 - 15).
(చూడుము “సర్వగతం బ్రహ్మ”)
కలుగదు మద్వియోగము, చరాచర రూపములలో మహాభూతములుం వసించు
కరణి నుండుదు సర్వగతుండనై నే మనః ప్రాణ బుద్ధి గుణేంద్రియాశ్రయుండ
- - - ||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -1473)
గలండగ్నిన్ దిశలం బగళ్ళు నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం
గలడీశుండుగలండు తండ్రి, వెదకంగానే లయీ యా యడన్“,
“క. ఇందుగలడందులేడని
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
డెందెందు వెతకి చూచిన
నందండే కలడు, దానవాగ్రణి, వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 274,275)
“వ. ఏ ప్రకారంబున మహా భూతంబులు భౌతికంబులయిన ఘటపటాదులందు బ్రవేశించియుండు నా ప్రకారంబున నేను నీ భూత భౌతికంబులయిన సర్వ కార్యములందు సత్వాది రూపంబులం బ్రవేశించియుండుదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 -253)
“చరాచర రూపములలో మహాభూతములు వసించు
కరణినుండుదు, సర్వగతుడనై - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 -)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 7)
“పరమేశ్వరుడు సర్వవ్యాపకుడే అయినను అనాదియగు అవిద్య యొక్క తారతమ్యమువలన నాయా యుపాధులందు తారతమ్యముతో గాన వచ్చుచున్నాడు - పర్వతములు, వృక్షములు మొదలగు స్థావర భూతములందు బొత్తిగానే లేనివాడుగును, పశువులు మొదలగు తిర్య గ్జంతువులందు మిగుల నీచుడగను, మనుష్యులయందు మధ్యమ ప్రకాశము గలవాడుగను, గంధర్వాదులయందు నంతకంటె నధికుడుఘను, దేవతలయందు సర్వోత్కృష్టుడుగను గాన వచ్చుచున్నాడు” -
“యథా అగ్నిః స్వతః తార తమ్య హీనోపి తృణ కాష్టాద్యనుసారేణ తథా ప్రకాశతే, తద్వత్ (తథా) స్వేనకృతాసు (నిర్మితాసు) విచిత్ర యోనిషు (దేవ మనుష్యాది విచిత్ర కృత శరీర కేషు జీవేషు) అంతరాత్మతయా ప్రవిశన్ (దేవాది శరీరేషు ఇవ ఉపాసకానుగ్రహేణ ఉపాసనార్థం విశన్ తిష్టన్ న్యూనాదిక భావేన స్వకృతా యోనీరను కరోతి. అవభాసతే -”.
“యథా అగ్నిః స్వతః తారతమ్య హీనోపి కాష్తానుసారేణ న్యూనాధిక ఇవ తథా తథా ప్రకాశతే, యథా ఉత్త ప్రకాశస్సవితా ద్యుమండలం ఏక రూపేణ ప్రకాశేన ఆపూర యన్నపి వర్షాను నికృష్త ప్రకాస ఇవ ప్రతీయతే, శరది ప్రకృష్త ప్రకాస ఇవ. తద్వత్”.
(అగ్ని స్వతః తారతమ్యములేని వాడైనను కట్టె విషయములోను, గడ్డిపోచ విషయములోను వాటి అనుసరించే ప్రకాశించును - ఆ ప్రకారముగానే తాను సృష్టించినటువంటి దేవతలు, మనుష్యులు మొదలగు వాటి విచిత్ర శరీరములు గల జీవులందు అంతరాత్మగా ప్రవేశించి - అనగా, దేవతులు మొదలగు వాటి శరీరములందు ఉపాసకుని అనుగ్రహించుటకు ఉపాసన చేయుటకు ఉండి, న్యూనాధిక భావేన - హెచ్చు తగ్గులతో - తాను సృష్టించిన వాటియందు వాటివలె అనుకరించును - వాటి వలె ప్రవర్తించును).
(అగ్ని స్వతహాగా తారతమ్యము లేనిదైనను - కట్టెను అనుసరించి దాని రీతిగా ప్రకాశించును - ఉత్తమ ప్రకాశవంతుడైన - సూర్యుడు - ఆకాశమండలమును ఒకే విధమైన ప్రకాసము కలదిగా చేయునప్పటికి, వర్షా కాలసమయమున తక్కువ కాంతి కలవాడగును, శరత్కాలమందు మంచి ప్రకాశము గలవాడుగను కనుపించును).
(sarvārthamulanu prakāśiṃpacēyuvāḍu)
(caitanyarūpamutōnu, jñānarūpamutōnu aṃtaṭa nuṃḍuvāḍu).
sarva vyāpīca bhagavān tasmāt sarvagataśśivaḥ”. (vāyuvīya saṃhitāyāṃ)
(śivuḍu anni mukhamulu, śirassu, kaṃṭhamulu tanavē ayinavāḍu, samasta bhūtamula hṛdayamanu guha yaṃdaṃḍuvāḍu, anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu. aṃducēta bhagavaṃtuḍu ayina śivuḍu sarvagatuḍu)
(anniṃṭiki adhiṣṭhāmanamaguṭavalana ākāśamu vale anniṃṭilōnu vyāpiṃciyuṃḍunadi).
(vibhuḍaguṭavalananu ākāśamuvale vyāpiṃciyuṃḍuṭavalananu sarvagatuḍu).
(caturmukha brahma modalu pipīlikamulavaraku samasta śarīramulaṃduṃḍunadi. dharmabhūta jñānamucēta - tana dharmamaina jñānamucēta svataḥ (tanaṃtaṭa tānē, itara sahāyamu lēkanē) anniṃṭilōnu vyāpiṃci yuṃḍu śakti gala dēvi)
(jagattu aṃtayu tanaku adhiṣṭhānamaguṭacēta, jagattu aṃtaṭini āśrayiṃci yuṃḍuvāḍu - vastu paricchēdamu - ka vastuvulō nuṃḍi iṃkoka iṃkoka vastuvulō lēkuṃḍuṭa - lēnivāḍu).
(aṃtaṭanuṃḍuvāḍu kanuka dēśa paricchēdamu lēka nuṃḍuvāḍu - oka cōṭanuṃḍi, iṃkoka cōṭa lēkuṃḍanuṃḍuṭa anunadi lēka anni cōṭla nuṃḍuvāḍu).
(śrī śaṃkaraḥ)
(ākāśameṃtavaṟaku vyāpiṃciyunnadō aṃtavaṟaku hṛdayākāśamulō itanu (ātma) vyāpiṃci yunnāḍu - ākāśamuvale anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu nityuḍu - divamukaṃṭe peddavāḍu, ākāśamukaṃṭe peddavāḍu, anniṃṭini poṃdiyunnavāḍu; sthāṇuvu vake nunnavāḍu: anu śṛti, smṛtalalōni vākyamulu ātma sarva gatamani, anniṃṭilōnu vyāpiṃci yunnadani ceppucunnavi).
“sarva bhūta sthitaṃ yō māṃ bhajatyēkatvamā sthitaḥ”. (śrīmadbhagavadgīta - 6 - 31,32)
(samasta bhūtamulaṃdu unnavāḍokkaḍē yani nannu evaḍu bhāviṃcunō - - - )
“sarvagatatvaṃ cāsyā yāma śabdādibhyō vijñāyatē - āyāma śabdō vyāpti vacana śabdaḥ -”.
(bhagavaṃtuni sarvagatatvamu āyāma śabdamu modalaguvāṭi valana kaliginadi - āyāmamanagā vyāpti ani arthamu).
(mārpulu ceṃducuṃḍu ghaṭa paṭādulumodalagu vāṭiyaṃdu mārpuceṃdaka sadrūpamutō - sthiramugā nuṃḍu okē rūpamutō vyāpiṃci yuṃḍunadi. anniṃṭikī satta sphūrti - caitanya śakti - Energy ni - iccunadaguṭacēta śūnyamu kānidi).
(śrīmadbhagavadgīta - 3 - 15).
(cūḍumu “sarvagataṃ brahma”)
kalugadu madviyōgamu, carācara rūpamulalō mahābhūtamuluṃ vasiṃcu
karaṇi nuṃḍudu sarvagatuṃḍanai nē manaḥ prāṇa buddhi guṇēṃdriyāśrayuṃḍa
- - - ||” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -1473)
galaṃḍagnin diśalaṃ bagaḷḷu niśalan khadyōta caṃdrātmalaṃ
galaḍōṃkāramunaṃ drimūrtula driliṃga vyaktulaṃ daṃtaṭaṃ
galaḍīśuṃḍugalaṃḍu taṃḍri, vedakaṃgānē layī yā yaḍan”,
“ka. iṃdugalaḍaṃdulēḍani
saṃdēhamu valadu, cakri sarvōpagatuṃ
ḍeṃdeṃdu vetaki cūcina
naṃdaṃḍē kalaḍu, dānavāgraṇi, viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 274,275)
“va. ē prakāraṃbuna mahā bhūtaṃbulu bhautikaṃbulayina ghaṭapaṭādulaṃdu bravēśiṃciyuṃḍu nā prakāraṃbuna nēnu nī bhūta bhautikaṃbulayina sarva kāryamulaṃdu satvādi rūpaṃbulaṃ bravēśiṃciyuṃḍudu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 -253)
“carācara rūpamulalō mahābhūtamulu vasiṃcu
karaṇinuṃḍudu, sarvagatuḍanai - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 -)
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 7)
“paramēśvaruḍu sarvavyāpakuḍē ayinanu anādiyagu avidya yokka tāratamyamuvalana nāyā yupādhulaṃdu tāratamyamutō gāna vaccucunnāḍu - parvatamulu, vṛkṣamulu modalagu sthāvara bhūtamulaṃdu bottigānē lēnivāḍugunu, paśuvulu modalagu tirya gjaṃtuvulaṃdu migula nīcuḍaganu, manuṣyulayaṃdu madhyama prakāśamu galavāḍuganu, gaṃdharvādulayaṃdu naṃtakaṃṭe nadhikuḍughanu, dēvatalayaṃdu sarvōtkṛṣṭuḍuganu gāna vaccucunnāḍu” -
“yathā agniḥ svataḥ tāra tamya hīnōpi tṛṇa kāṣṭādyanusārēṇa tathā prakāśatē, tadvat (tathā) svēnakṛtāsu (nirmitāsu) vicitra yōniṣu (dēva manuṣyādi vicitra kṛta śarīra kēṣu jīvēṣu) aṃtarātmatayā praviśan (dēvādi śarīrēṣu iva upāsakānugrahēṇa upāsanārthaṃ viśan tiṣṭan nyūnādika bhāvēna svakṛtā yōnīranu karōti. avabhāsatē -”.
“yathā agniḥ svataḥ tāratamya hīnōpi kāṣtānusārēṇa nyūnādhika iva tathā tathā prakāśatē, yathā utta prakāśassavitā dyumaṃḍalaṃ ēka rūpēṇa prakāśēna āpūra yannapi varṣānu nikṛṣta prakāsa iva pratīyatē, śaradi prakṛṣta prakāsa iva. tadvat”.
(agni svataḥ tāratamyamulēni vāḍainanu kaṭṭe viṣayamulōnu, gaḍḍipōca viṣayamulōnu vāṭi anusariṃcē prakāśiṃcunu - ā prakāramugānē tānu sṛṣṭiṃcinaṭuvaṃṭi dēvatalu, manuṣyulu modalagu vāṭi vicitra śarīramulu gala jīvulaṃdu aṃtarātmagā pravēśiṃci - anagā, dēvatulu modalagu vāṭi śarīramulaṃdu upāsakuni anugrahiṃcuṭaku upāsana cēyuṭaku uṃḍi, nyūnādhika bhāvēna - heccu taggulatō - tānu sṛṣṭiṃcina vāṭiyaṃdu vāṭivale anukariṃcunu - vāṭi vale pravartiṃcunu).
(agni svatahāgā tāratamyamu lēnidainanu - kaṭṭenu anusariṃci dāni rītigā prakāśiṃcunu - uttama prakāśavaṃtuḍaina - sūryuḍu - ākāśamaṃḍalamunu okē vidhamaina prakāsamu kaladigā cēyunappaṭiki, varṣā kālasamayamuna takkuva kāṃti kalavāḍagunu, śaratkālamaṃdu maṃci prakāśamu galavāḍuganu kanupiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.