← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వం sarvaṃ

Original — తెలుగు
  1. ఈశ్వర వ్యతిరిక్తుం భోగ్య భోక్తృరూపం సర్వం -

(ఈశ్వరుడు కానిది - పరబ్రహ్మకంటె వేరైనది భోగ్యము, భోక్త అనునదంతయు).

  1. “స్థితి నాశ క్రియా ఫలోపభోగ లక్షణం విక్రియా రూపం సర్వం జగత్” (శ్రీశంకరః)

(స్థితి వినాశము కలదిన్నీ, కర్మఫలమనుభవించు లక్షణము గలదిన్నీ, మార్పు చెందు చుండునది యగు ఈ జగత్తు అంతయు -).

  1. “విచిత్ర చిదచిత్ప్రపంచః” - (శ్రీమాన్ రామానుజః)

(విచిత్రమైన చిత్ అచిత్ వస్తువులుగల ప్రపంచము)

  1. “ఆత్మా వారే ద్రష్టవ్యః, శ్రోతవ్యో, మంతవ్యో. నిధిధ్యాసి తవ్యః - మైత్రే య్యాత్మనో నా అరే దర్శనేన, శ్రవణేన, మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితమితి” (బృహదారణ్యకోపనిషత్)

(ఆత్మ చూడతగినది, సాక్షాత్కారము చేసుకొన తగినది, వినతగినది, మననము చేయతగినది, ధ్యానము చేయతగినది. ఇట్లు ఆత్మను దర్శించుటవలన, వినుటవలన, మననము చేయుటవలన, తెలుసుకొనుటవలనను ఈ ప్రపంచము సర్వము తెలియబడుచున్నది).

  1. “ఓం తద్బ్రహ్మ - - - ఓం తత్స ర్వం” (మంత్రపుష్పం)

(ఈ చరాచర రూపమైన జగత్తు అంతయు భగవంతుడే - అతనిలోనుండి పుట్టినదే - అతనే సర్వ ప్రపంచముగా మారెను - “సర్వం నమాప్నోషి తతోపి సర్వః” (అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు కనుక అన్నీ అతనే) (శ్రీమద్భగవద్గీత - 11 - 40)

Transliteration
  1. īśvara vyatiriktuṃ bhōgya bhōktṛrūpaṃ sarvaṃ -

(īśvaruḍu kānidi - parabrahmakaṃṭe vērainadi bhōgyamu, bhōkta anunadaṃtayu).

  1. “sthiti nāśa kriyā phalōpabhōga lakṣaṇaṃ vikriyā rūpaṃ sarvaṃ jagat” (śrīśaṃkaraḥ)

(sthiti vināśamu kaladinnī, karmaphalamanubhaviṃcu lakṣaṇamu galadinnī, mārpu ceṃdu cuṃḍunadi yagu ī jagattu aṃtayu -).

  1. “vicitra cidacitprapaṃcaḥ” - (śrīmān rāmānujaḥ)

(vicitramaina cit acit vastuvulugala prapaṃcamu)

  1. “ātmā vārē draṣṭavyaḥ, śrōtavyō, maṃtavyō. nidhidhyāsi tavyaḥ - maitrē yyātmanō nā arē darśanēna, śravaṇēna, matyā vijñānēna idaṃ sarvaṃ viditamiti” (bṛhadāraṇyakōpaniṣat)

(ātma cūḍataginadi, sākṣātkāramu cēsukona taginadi, vinataginadi, mananamu cēyataginadi, dhyānamu cēyataginadi. iṭlu ātmanu darśiṃcuṭavalana, vinuṭavalana, mananamu cēyuṭavalana, telusukonuṭavalananu ī prapaṃcamu sarvamu teliyabaḍucunnadi).

  1. “ōṃ tadbrahma - - - ōṃ tatsa rvaṃ” (maṃtrapuṣpaṃ)

(ī carācara rūpamaina jagattu aṃtayu bhagavaṃtuḍē - atanilōnuṃḍi puṭṭinadē - atanē sarva prapaṃcamugā mārenu - “sarvaṃ namāpnōṣi tatōpi sarvaḥ” (anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu kanuka annī atanē) (śrīmadbhagavadgīta - 11 - 40)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.