← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వత్ర సమదర్శనః sarvatra samadarśanaḥ

Original — తెలుగు
  1. “సర్వ భూతస్థం (సర్వేషు భూతేషు స్థితం) స్వం ఆత్మానం, సర్వభూతాని చ (బ్రహ్మాది స్తంబపర్యంతాదీని చ సర్వ భూతాని) ఆత్మని ఏకతాం గతాని ఇక్షతే (పశ్యతే), యోగయుక్తాత్మా (సమాహితానతః కరణస్సన్), సర్వత్ర సమదర్శనః (సర్వేషు బ్రహ్మాది స్థావరాంతేషం), సమం (నిర్విశేషం) బ్రహ్మాత్మైక విషయం దర్శనం జ్ఞానం యస్య సః”. (శ్రీ శంకరః)

(సమస్త భూతములందు ఆత్మ యున్నట్లు, ఆత్మలో సమస్త భూతములు ఉన్నట్లు, అనగా, ఈ రెండింటిని ఒకటిగ చూచువాడు సమాహితమైన మనస్సుగలవాడు - చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్థావరముల వఱకు గలవాటియందు ఏమియు తేడా లేనట్లు - అంతా ఒకటే అనగా బ్రహ్మ (పరమాత్మ), ఆత్మ ఒకటేయని చూచువాడు సర్వత్ర సమదర్శినుడు).

  1. “స్వాత్మనః పరేషాం చ భూతానాం ప్రకృతి వియుక్త స్వరూపాణాం జ్ఞానైకాకారతయా సామ్యాత్ వైషమ్యస్య చ ప్రకృతి గతత్వాత్ యోగ యుక్తాత్మా ప్రకృత వియుక్తేషు ఆత్మసు సర్వత్ర జ్ఞానైకాకారతయా సమదర్శినః సర్వ భూతస్థం స్వాత్మానం సర్వభూతాని చ స్వాత్మని ఈక్షతే. సర్వ భూతసమానాకారం స్వాత్మానం స్వాత్మ సమానాకారాణి చ సర్వ భూతాని పశ్యతి ఇత్యర్థః. ఏకస్మి న్నాత్మని ద్రష్టే సర్వస్య ఆత్మవస్తునః తత్సామ్యాత్ సర్వం ఆత్మ వస్తు దృష్టం భవతి ఇత్యర్థః”.

(ఆత్మరూపుడైన తనయందు ప్రకృతి కలిసియుండు సమస్త భూతములందు నుండు జ్ఞానము (చైతన్యము) ఒకటే యగుటచేతను, వాటిలో ఒకదానికి ఇంకొక దానికి నుండు తేడా ప్రకృతివలన కలుగుటచేతను, ఈ రెండింటి యందును సమాహితమైన మనస్సు కలవాడు - సమముగానే చూచువాడు - “స్వాత్మానం” అనగా సర్వ భూతములతోను సమానమైన ఆకారముగల తనలో సర్వ భూతములను, సర్వ భూతములలో తనలోనుండి ఆత్మగానే చూచువాడు. ఒక దానిలోనున్న ఆత్మను చూచిన అత్మ అన్నింటిలో నుండునది ఒకటే కనుక, అన్ని భూతములలోని ఆత్మను చూచినట్లే యగునని యర్థము).

Transliteration
  1. “sarva bhūtasthaṃ (sarvēṣu bhūtēṣu sthitaṃ) svaṃ ātmānaṃ, sarvabhūtāni ca (brahmādi staṃbaparyaṃtādīni ca sarva bhūtāni) ātmani ēkatāṃ gatāni ikṣatē (paśyatē), yōgayuktātmā (samāhitānataḥ karaṇassan), sarvatra samadarśanaḥ (sarvēṣu brahmādi sthāvarāṃtēṣaṃ), samaṃ (nirviśēṣaṃ) brahmātmaika viṣayaṃ darśanaṃ jñānaṃ yasya saḥ”. (śrī śaṃkaraḥ)

(samasta bhūtamulaṃdu ātma yunnaṭlu, ātmalō samasta bhūtamulu unnaṭlu, anagā, ī reṃḍiṃṭini okaṭiga cūcuvāḍu samāhitamaina manassugalavāḍu - caturmukha brahma modalu sthāvaramula vaṟaku galavāṭiyaṃdu ēmiyu tēḍā lēnaṭlu - aṃtā okaṭē anagā brahma (paramātma), ātma okaṭēyani cūcuvāḍu sarvatra samadarśinuḍu).

  1. “svātmanaḥ parēṣāṃ ca bhūtānāṃ prakṛti viyukta svarūpāṇāṃ jñānaikākāratayā sāmyāt vaiṣamyasya ca prakṛti gatatvāt yōga yuktātmā prakṛta viyuktēṣu ātmasu sarvatra jñānaikākāratayā samadarśinaḥ sarva bhūtasthaṃ svātmānaṃ sarvabhūtāni ca svātmani īkṣatē. sarva bhūtasamānākāraṃ svātmānaṃ svātma samānākārāṇi ca sarva bhūtāni paśyati ityarthaḥ. ēkasmi nnātmani draṣṭē sarvasya ātmavastunaḥ tatsāmyāt sarvaṃ ātma vastu dṛṣṭaṃ bhavati ityarthaḥ”.

(ātmarūpuḍaina tanayaṃdu prakṛti kalisiyuṃḍu samasta bhūtamulaṃdu nuṃḍu jñānamu (caitanyamu) okaṭē yaguṭacētanu, vāṭilō okadāniki iṃkoka dāniki nuṃḍu tēḍā prakṛtivalana kaluguṭacētanu, ī reṃḍiṃṭi yaṃdunu samāhitamaina manassu kalavāḍu - samamugānē cūcuvāḍu - “svātmānaṃ” anagā sarva bhūtamulatōnu samānamaina ākāramugala tanalō sarva bhūtamulanu, sarva bhūtamulalō tanalōnuṃḍi ātmagānē cūcuvāḍu. oka dānilōnunna ātmanu cūcina atma anniṃṭilō nuṃḍunadi okaṭē kanuka, anni bhūtamulalōni ātmanu cūcinaṭlē yagunani yarthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.