← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వాయుః sarvāyuḥ

Original — తెలుగు
  1. సర్వస్య ఆయుః, జీవనం - “యతోవా ఇమాని భూతాని జీవంతి” ఇత్యుపదిష దుక్త లక్షణం బ్రహ్మ.

(అన్నింటికి ఆయువు అయినది - జీవనమైనది - “దేనినుండి ఈ భూతములన్నియు పుట్టుచున్నవో” అని బ్రహ్మ యొక్క లక్షణము ఉపనిషత్తులో చెప్పబడినది. దీనిని బట్టి అన్నింటిని జీవింపచేయునది, అన్నింటికి ఆయుస్సు అయినది పరబ్రహ్మ).

  1. “ప్రాణోహి భూతానా మాయుః - తస్మాత్ సర్వాయుషముచ్యతే” (తైత్తిరీయోపనిషత్తు)

“యస్మాత్ భూతానాం ప్రాణినాం ప్రాణ ఏవ ఆయుః, జీవనం, తస్మాత్ సర్వషాం ఆయురేవ సర్వాయుష ముచ్యతే - ప్రసిద్ధం హి లోకే ప్రాణస్య సర్వాయుషత్వం, ప్రాణాపగతః మరణ ప్రసిద్ధేః - అతః అన్నమయాత్మనః ఆపోహ్య తదంతరం, ప్రాణమయాత్మా”.

(భూతములకు ప్రాణమే - ప్రాణవాయువే - ఆయువు. అందుచేత అది ‘సర్వాయుః’ - అన్నింటికి ఆయువు అని చెప్పబడినది, అనగా జీవనమని చెప్పబడినది. ప్రాణము పోవుటయే మరణమని లోకములో ప్రసిద్ధిగానుండుటచేత ప్రాణమే సర్వాయువు. ఇందువలననే అన్నమయమని చెప్పబడు శరీరములో నుండునది ప్రాణమయము).

  1. యస్మాత్ సర్వేషాం భూతానాం యావత్ హి యస్మిన్ శరీరే ప్రాణోవసతి, తావదాయురితి. ప్రాణస్య ఉచ్చ్వస నిశ్వసనాది లక్షణ సర్వ భూతాయుర్హేతుత్వం - అతః ఏవ ప్రాణ ఏవ సర్వేషాం ఆయురిత్యుచ్యతే ఇత్యర్థః.

(సమస్త భూతములకు శరీరములో ప్రాణమున్నంతవఱకే ఆయువు అని చెప్పబడియుండుటవలన ప్రాణవాయువే సమస్త భూతములకు ఉచ్ఛ్వాస నిశ్వాస లక్షణములు గల ఆయుర్దాయ హేతువు - అందుచేత ప్రాణమే అన్నింటికి ఆయువు - సర్వాయువే సర్వాయుషము).

Transliteration
  1. sarvasya āyuḥ, jīvanaṃ - “yatōvā imāni bhūtāni jīvaṃti” ityupadiṣa dukta lakṣaṇaṃ brahma.

(anniṃṭiki āyuvu ayinadi - jīvanamainadi - “dēninuṃḍi ī bhūtamulanniyu puṭṭucunnavō” ani brahma yokka lakṣaṇamu upaniṣattulō ceppabaḍinadi. dīnini baṭṭi anniṃṭini jīviṃpacēyunadi, anniṃṭiki āyussu ayinadi parabrahma).

  1. “prāṇōhi bhūtānā māyuḥ - tasmāt sarvāyuṣamucyatē” (taittirīyōpaniṣattu)

“yasmāt bhūtānāṃ prāṇināṃ prāṇa ēva āyuḥ, jīvanaṃ, tasmāt sarvaṣāṃ āyurēva sarvāyuṣa mucyatē - prasiddhaṃ hi lōkē prāṇasya sarvāyuṣatvaṃ, prāṇāpagataḥ maraṇa prasiddhēḥ - ataḥ annamayātmanaḥ āpōhya tadaṃtaraṃ, prāṇamayātmā”.

(bhūtamulaku prāṇamē - prāṇavāyuvē - āyuvu. aṃducēta adi ‘sarvāyuḥ’ - anniṃṭiki āyuvu ani ceppabaḍinadi, anagā jīvanamani ceppabaḍinadi. prāṇamu pōvuṭayē maraṇamani lōkamulō prasiddhigānuṃḍuṭacēta prāṇamē sarvāyuvu. iṃduvalananē annamayamani ceppabaḍu śarīramulō nuṃḍunadi prāṇamayamu).

  1. yasmāt sarvēṣāṃ bhūtānāṃ yāvat hi yasmin śarīrē prāṇōvasati, tāvadāyuriti. prāṇasya uccvasa niśvasanādi lakṣaṇa sarva bhūtāyurhētutvaṃ - ataḥ ēva prāṇa ēva sarvēṣāṃ āyurityucyatē ityarthaḥ.

(samasta bhūtamulaku śarīramulō prāṇamunnaṃtavaṟakē āyuvu ani ceppabaḍiyuṃḍuṭavalana prāṇavāyuvē samasta bhūtamulaku ucchvāsa niśvāsa lakṣaṇamulu gala āyurdāya hētuvu - aṃducēta prāṇamē anniṃṭiki āyuvu - sarvāyuvē sarvāyuṣamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.