← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాస్త్రః śāstraḥ

Original — తెలుగు
  1. ఋగ్వేదాది శాస్త్రము; యోనిః కారణము శాస్త్రః యోనిః యస్య సః -

  2. (ఋగ్వేదాది శాస్త్రము కారణముగా - ప్రమాణముగా గలవాడు) (వేదమే ప్రమాణముగా గలవాడు). వేదము ద్వరానే తెలియబడువాడు - శ్రుతి - ” తంత్వౌపనిషధం పురుషం” (ఉపనిషత్తుల మూలముగనే తెలియబడు వాడు - ఇతర మార్గములచేతగాని, ఇతర ప్రమాణములచేతగాని తెలుసుకొనుటకు వీలు కానివాడు)

  3. శాస్త్రస్య ఋగ్వేదాదేః సర్వజ్ఞ కల్పస్య యోనిః, కారణం, తస్య భావః తత్వం, తస్మాత్ వేదకర్తృత్వాత్ సర్వజ్ఞత్వం సాదయతి.

(శాస్త్రమనగా ఋగ్వేదము మొదలగునవి. వేదము సమస్త విషయములగుఱించి అయిన జ్ఞానము క్లిగియున్నది. వేదమునకు కారణమైనవాడు పరబ్రహ్మ. అట్టి వేదమునకు కర్తయగుటవలన పరబ్రహ్మ సర్వజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు)

  1. శాస్త్రం ఋగ్వేదాది యోనిః ప్రమాణం యస్య తత్తథోక్తం; తస్య భావః తత్వం, తస్మాత్ వేదైక ప్రమాణకత్వాత్ ఏవ గమ్యత్వం సమర్పయతి.

(ఋగ్వేదము మొదలగునవి ప్రమాణముగా గలవాడు ఆ వేద భావమే తత్వము - భగవత్తత్వము - అందుచేత వేదము ప్రమాణముగా గలవాడు కనుక వేదము చేతనే తెలియ తగినవాడు).

  1. ప్రమాణాంతరా గోచరత్వేన శాస్త్రైక విషయత్వాత్ శాస్త్ర యోనిః బ్రహ్మ.

(ఇంకొక ప్రమాణముచేత తెలుసుకొనుటకు వీలు లేదు కనుక వేదమునకే విషయమగునది కనుక బ్రహ్మ గుఱించి వేదమే ప్రమాణము).

  1. “వేదమయ నిశ్వాసితంబువలన శాస్త్ర యోనివనియును” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -684)

వేదాత్మక నిశ్వాసః - (పరబ్రహ్మయొక్క నిశ్వాసమ వేదముగా నుద్భవించెను) కనుక వేదమునకు కారణమైనవాడు పరబ్రహ్మ - నిశ్వాసమువలె సునాయాసముగా వేదమును చెప్పినవాడు).

  1. “శాస్త్రం యస్య యోనిః కారణం కారణం ప్రమాణం తద్బ్రహ్మ- - - అత్యంతా తీంద్రియత్వేన ప్రత్యక్షాది ప్రమాణ విషయతయా బ్రహ్మణః శాస్త్రైక ప్రమాణకత్వాత్ ఉక్తస్య రూపం బ్రహ్మ”. (శ్రీమాన్ రామానుజః)

(శాస్త్రము ప్రమాణముగా గలవాడు. ఇంద్రియ దృష్టికి గోచరము కాక మిక్కిలి సూక్ష్మమైన వాడగుటచేత ప్రత్యక్షాది ప్రమాణములచేత తెలుసుకొనుటకు వీలుకానివాడగుటచేత శాస్త్రము (వేదము) ఒక్కదాని వలననే గోచరముగువాడగుటచేత, పరబ్రహ్మ ఎట్టివాడో వేదము ఒక్కదానివలననే తెలియ వీలగుచున్నందున వేదమే (శాస్త్రమే) పరబ్రహ్మ విషయమై ప్రమాణము - పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొనవలెననిన వేదము ద్వారానే తెలుసుకొన గలుగుదుము).

  1. మహతః ఋగ్వేదాదేః శాస్త్రస్య అనేక విద్యాస్థానోప బృం హితస్య ప్రదీప వత్సర్వార్థావద్యోది తనః

సర్వజ్ఞ కల్పస్య యోనిః కారణం బ్రహ్మ. న హీదృశస్య శాస్త్రస్య ఋగ్వేదాది లక్షణస్య సర్వజ్ఞ గుణాన్వితస్య సర్వజ్ఞాత్ అన్యతే సంభవో అస్తి - - - అధవా, యధోక్తం ఋగ్వేదాది శాస్త్రం యోనిః కారణం ప్రమాణస్య బ్రహ్మణః యధావత్స్వరూపావగమే - శాస్త్రాదేన ప్రమాణాత్ జగతః జన్మాది కారణం బ్రహ్మ అధిగమ్యతే.

(అనేక విద్యలను - శాస్త్రములను - కలిగి దీపమువలె వెలిగి అన్ని అర్థములను తెలియచేయుచు సర్వజ్ఞ కల్పమువలె నుండు గొప్పదైన ఋగ్వేదము మొదలగు శాస్త్రములకు కారణమైనవాడు బ్రహ్మ. సర్వజ్ఞత్వము గల ఇటువంటి ఋగ్వేదము మొదలగు శాస్త్రము ఇంకొకరి వలన - బ్రహ్మకాక ఇంకొకరి వలన కలుగుట సంభవముకాదు - అందుచేత శాస్త్ర యోనిః అనగా పరబ్రహ్మ, లేక, ఋగ్వేదము మొదలగు శాస్త్రము ద్వారానే జగత్తునకు పరబ్రహ్మ కారణమని తెలియచున్నది).

  1. శాస్త్రంతు నకలేతర ప్రమాణ పరిదృష్ట సమస్త వస్తు విసజాతీయం సార్వ జ్ఞ సత్య సంకల్పత్వాది మిశ్రానవధికారిశయా పరిమితో దారగుణ సాగరం, నిఖిల హేయ ప్రత్యనీక స్వరూపం ప్రతిపాదయతీతి స ప్రమాణాంతరా వసిత వస్తుసాధర్మ్య ప్రయుక్తదోష గంధ ప్రసంగః యత్తు నిమిత్తోపాదాన యారైక్యమాకాశాదేర్ని రవయవ ద్రవ్యస్య కార్యత్వం చానుపలబ్దం అశక్య ప్రతిపాద న మిత్యుక్తం; తథా ప్ర్యవిరుద్ధమితి - “ప్రకృతిశ్చ ప్రప్రతిజ్ఞా దృష్టాంతానురోధాత్” - “నవియ దిశ్రుతేః” ఇత్యత్ర ప్రతిపాదయిష్యతే - అతః ప్రమాణాంతరా గోచరత్వేన శాస్త్రైక విషయత్వాత్ “యతోవా ఇమాని భూతాని” ఇతి వాక్య ముక్త లక్షణం బ్రహ్మ ప్రతిపాదయతీ తి సిద్ధం (శ్రీమాన్ రామానుజః)
Transliteration
  1. ṛgvēdādi śāstramu; yōniḥ kāraṇamu śāstraḥ yōniḥ yasya saḥ -

  2. (ṛgvēdādi śāstramu kāraṇamugā - pramāṇamugā galavāḍu) (vēdamē pramāṇamugā galavāḍu). vēdamu dvarānē teliyabaḍuvāḍu - śruti - ” taṃtvaupaniṣadhaṃ puruṣaṃ” (upaniṣattula mūlamuganē teliyabaḍu vāḍu - itara mārgamulacētagāni, itara pramāṇamulacētagāni telusukonuṭaku vīlu kānivāḍu)

  3. śāstrasya ṛgvēdādēḥ sarvajña kalpasya yōniḥ, kāraṇaṃ, tasya bhāvaḥ tatvaṃ, tasmāt vēdakartṛtvāt sarvajñatvaṃ sādayati.

(śāstramanagā ṛgvēdamu modalagunavi. vēdamu samasta viṣayamulaguṟiṃci ayina jñānamu kligiyunnadi. vēdamunaku kāraṇamainavāḍu parabrahma. aṭṭi vēdamunaku kartayaguṭavalana parabrahma sarvajñuḍu ani ceppabaḍucunnāḍu)

  1. śāstraṃ ṛgvēdādi yōniḥ pramāṇaṃ yasya tattathōktaṃ; tasya bhāvaḥ tatvaṃ, tasmāt vēdaika pramāṇakatvāt ēva gamyatvaṃ samarpayati.

(ṛgvēdamu modalagunavi pramāṇamugā galavāḍu ā vēda bhāvamē tatvamu - bhagavattatvamu - aṃducēta vēdamu pramāṇamugā galavāḍu kanuka vēdamu cētanē teliya taginavāḍu).

  1. pramāṇāṃtarā gōcaratvēna śāstraika viṣayatvāt śāstra yōniḥ brahma.

(iṃkoka pramāṇamucēta telusukonuṭaku vīlu lēdu kanuka vēdamunakē viṣayamagunadi kanuka brahma guṟiṃci vēdamē pramāṇamu).

  1. “vēdamaya niśvāsitaṃbuvalana śāstra yōnivaniyunu” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -684)

vēdātmaka niśvāsaḥ - (parabrahmayokka niśvāsama vēdamugā nudbhaviṃcenu) kanuka vēdamunaku kāraṇamainavāḍu parabrahma - niśvāsamuvale sunāyāsamugā vēdamunu ceppinavāḍu).

  1. “śāstraṃ yasya yōniḥ kāraṇaṃ kāraṇaṃ pramāṇaṃ tadbrahma- - - atyaṃtā tīṃdriyatvēna pratyakṣādi pramāṇa viṣayatayā brahmaṇaḥ śāstraika pramāṇakatvāt uktasya rūpaṃ brahma”. (śrīmān rāmānujaḥ)

(śāstramu pramāṇamugā galavāḍu. iṃdriya dṛṣṭiki gōcaramu kāka mikkili sūkṣmamaina vāḍaguṭacēta pratyakṣādi pramāṇamulacēta telusukonuṭaku vīlukānivāḍaguṭacēta śāstramu (vēdamu) okkadāni valananē gōcaramuguvāḍaguṭacēta, parabrahma eṭṭivāḍō vēdamu okkadānivalananē teliya vīlagucunnaṃduna vēdamē (śāstramē) parabrahma viṣayamai pramāṇamu - parabrahma svarūpamunu telusukonavalenanina vēdamu dvārānē telusukona galugudumu).

  1. mahataḥ ṛgvēdādēḥ śāstrasya anēka vidyāsthānōpa bṛṃ hitasya pradīpa vatsarvārthāvadyōdi tanaḥ

sarvajña kalpasya yōniḥ kāraṇaṃ brahma. na hīdṛśasya śāstrasya ṛgvēdādi lakṣaṇasya sarvajña guṇānvitasya sarvajñāt anyatē saṃbhavō asti - - - adhavā, yadhōktaṃ ṛgvēdādi śāstraṃ yōniḥ kāraṇaṃ pramāṇasya brahmaṇaḥ yadhāvatsvarūpāvagamē - śāstrādēna pramāṇāt jagataḥ janmādi kāraṇaṃ brahma adhigamyatē.

(anēka vidyalanu - śāstramulanu - kaligi dīpamuvale veligi anni arthamulanu teliyacēyucu sarvajña kalpamuvale nuṃḍu goppadaina ṛgvēdamu modalagu śāstramulaku kāraṇamainavāḍu brahma. sarvajñatvamu gala iṭuvaṃṭi ṛgvēdamu modalagu śāstramu iṃkokari valana - brahmakāka iṃkokari valana kaluguṭa saṃbhavamukādu - aṃducēta śāstra yōniḥ anagā parabrahma, lēka, ṛgvēdamu modalagu śāstramu dvārānē jagattunaku parabrahma kāraṇamani teliyacunnadi).

  1. śāstraṃtu nakalētara pramāṇa paridṛṣṭa samasta vastu visajātīyaṃ sārva jña satya saṃkalpatvādi miśrānavadhikāriśayā parimitō dāraguṇa sāgaraṃ, nikhila hēya pratyanīka svarūpaṃ pratipādayatīti sa pramāṇāṃtarā vasita vastusādharmya prayuktadōṣa gaṃdha prasaṃgaḥ yattu nimittōpādāna yāraikyamākāśādērni ravayava dravyasya kāryatvaṃ cānupalabdaṃ aśakya pratipāda na mityuktaṃ; tathā pryaviruddhamiti - “prakṛtiśca prapratijñā dṛṣṭāṃtānurōdhāt” - “naviya diśrutēḥ” ityatra pratipādayiṣyatē - ataḥ pramāṇāṃtarā gōcaratvēna śāstraika viṣayatvāt “yatōvā imāni bhūtāni” iti vākya mukta lakṣaṇaṃ brahma pratipādayatī ti siddhaṃ (śrīmān rāmānujaḥ)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.