← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాశ్వతః śāśvataḥ

Original — తెలుగు
  1. శశ్వత్ సర్షేషు కాలేషు భవతి ఇతి శాశ్వతః; శశ్వత్ భవః శాస్వతః; నిత్యః.

(అన్నికాలములందు - భూతభవిష్యద్వర్తమాన కాలములందు - ఉండువాడు -; ఎల్లపుడు ఉండువాడు)

  1. నాసరహితం; వినాసరహితం; నిత్యం.

(నాశము లేనివాడు; వినాశము లేనివాడు; నిత్యుడు - ఎల్లపుడు నుండువాడు)

  1. నిరంతరం వర్తమానత్వాత్ శాశ్వతః; ధ్రువః.

(ఎల్లపుడు నుండువాడు; ధ్రువుడు - ధ్రువముగా నుండువాడు - స్థిరముగా నుండువాడు)

  1. చిరంతనత్వాత్ శాశ్వతః

(చాలాకాలమునుండి యున్నవాడు కనుక శాశ్వతుడు)

  1. అపక్షయ వర్జితత్వాత్ శాశ్వతః -

(అపక్షయము లేనివాడు - క్షీణించుట లేనివాడు కనుక శాశ్వతుడు)

“యోహి అశాశ్వతః సోప్యపక్షీయతే, అయంతు శాశ్వతః అత ఏన పురాణః”

(శాశ్వతముగా నుండనివాడు క్షీణించును. భగవంతుడు శాశ్వతుడు, అపక్షయము లేనివాడు - అందుచేత చిరకాలమునుండు యున్నవాడు)

  1. శాశ్వతం ఇతి అపక్షయలక్షణా విక్రియ ప్రతిషిద్ధ్యతే.

(అపక్షయము - క్షీణించుట - అను లక్షణము - (గుణము) - మార్పు - లేకుండుటను సూచించుటకు శాశ్వతుడు అని చెప్పబడినది).

  1. న అపక్షీయతే స్వరూపేణ, నిరవయత్వాత్, నిర్గుణత్వాత్ చ, నాపి గుణక్షయేణ అపక్షయః.

(అవయవములు లేనివాడు కనుక, రూపములో క్షీణించుట లేనివాడు, త్రిగుణములు క్షీణించుటవలన క్షీణించకుండుటకాదు).

  1. సదా ఏకరూపం (ఎల్లపుడు ఒకే రూపముతో నుండువాడు).

  2. ‘సర్వదైక ర్సం’ (గీతాభావప్రకాశము - 10 - 64)

(ఎల్లపుడు ఒకే సత్తా - (హెచ్చు తగ్గులు లేకుండ) కలిగి యుండువాడు)

  1. విశ్వస్యాస్య సమస్తస్య పరోత్కృష్టస్త్వ మాశ్రయః |

అత ఏవాసి నిత్యస్త్వం శాశ్వతో - - - ||. (గీతాభావప్రకాశము - 11 - 67, 68)

(ఈ విశ్వమునకంతకు నీవు ఉత్కృష్టుడవు - ఆశ్రయుడవు - అందుచేత నీవు నిత్యుడవు, శాశ్వతుడవు).

  1. “నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా (అ)భవితా వా న భూయః |

ఆద్యో నిత్యః శాశ్వతోమయం పురాణో న హన్యతే హవ్యమానే శరీరే ||” (శ్రీమద్బ్గవద్గీత - 2 - 20)

(ఈ ఆత్మ ఎప్పుడును పుట్టియుండలేదు, చనిపోవునదికాదు - ఒకప్పుడుండి ఇంకొకప్పుడు లేకుండునదికాదు. ఇది అన్నింటికి - సృష్టికి, సృష్టిలో నుండు వస్తువులన్నింటికీ - మొదటిది, కారనమైనది - నిత్యముగా నుండునది, శాశ్వతమైనది - చాలాకాలమునుండి యున్నది; శరీరము నశించినను తాను నశించనిది.)

  1. “ఉ. సర్వఫలప్రదాతయును, సర్వ శరణ్యుడు సర్వ శక్తుడున్

సర్వ జగత్ప్రసిద్ధుడును, సర్వగతుండగు చక్రపాని, యీ

సర్వ శరీరులున్ విగమసంగతి జెంది విశీర్యమాణులై

సర్వనచో న భంగగతి బ్రహ్మము తా చెడకుండునెప్పుడున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7)

(ఈ జగత్తులోనుండు సమస్త వస్తువులు నశించిపోయినపుడు - ప్రళయకాలమందు - పరబ్రహ్మమొక్కడే వాటితోపాటు నశించకుంద మిగిలియుండువాదు, అందుచేత అతను శాశ్వతుడు).

  1. “పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్ |

పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 12)

(పరబ్రహ్మ, పరం ధామము, పరమ పవిత్రము, పురుషుడు - శరీరమను పురమందుండువాడు - శాశ్వతుడవు, దివ్యమైనవాడవు, ఆది దేవుడవు, జన్మలేనివాడవు, విభుడు - ఇవన్నీ నీవే).

  1. శశ్వద్భవశ్శాశ్వతః నాప క్షీయతే స్వరూపేణ - నిరవయవత్వాత్, నిర్గుణత్వాత్ చ, నాపి గుణక్షయేణ అపక్షయః -

(శాశ్వతముగా నుండువాడు, అపక్షయము లేనివాడు. అపక్షయము రెండు విధములు - స్వరూపముచేతను, గుణములచేతను అపక్షయము లేనివాడు, అవయవములు లేనివాడుకనుక స్వరూపములో అపక్షయములేదు - అత్మ నిర్గుణముకనుక గుణములలో అపక్షయములేనివాడు - అందుచేత శాశ్వతుడు).

  1. “సీ. - - -

బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగంబులు నశింపగ బెద్ద భూతగణము

ఆ. సూక్ష్మభూతమందు జొరగ నా భూతంబు

ప్రక్ర్తిలోన జొరగ, బ్రకృతి వోయి

వ్యక్తమందు జొరగ, వ్యక్తమణంగను

శేష సంజ్ఞ నీవు చెలువ మగుదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - 3 - 125)

Transliteration
  1. śaśvat sarṣēṣu kālēṣu bhavati iti śāśvataḥ; śaśvat bhavaḥ śāsvataḥ; nityaḥ.

(annikālamulaṃdu - bhūtabhaviṣyadvartamāna kālamulaṃdu - uṃḍuvāḍu -; ellapuḍu uṃḍuvāḍu)

  1. nāsarahitaṃ; vināsarahitaṃ; nityaṃ.

(nāśamu lēnivāḍu; vināśamu lēnivāḍu; nityuḍu - ellapuḍu nuṃḍuvāḍu)

  1. niraṃtaraṃ vartamānatvāt śāśvataḥ; dhruvaḥ.

(ellapuḍu nuṃḍuvāḍu; dhruvuḍu - dhruvamugā nuṃḍuvāḍu - sthiramugā nuṃḍuvāḍu)

  1. ciraṃtanatvāt śāśvataḥ

(cālākālamunuṃḍi yunnavāḍu kanuka śāśvatuḍu)

  1. apakṣaya varjitatvāt śāśvataḥ -

(apakṣayamu lēnivāḍu - kṣīṇiṃcuṭa lēnivāḍu kanuka śāśvatuḍu)

“yōhi aśāśvataḥ sōpyapakṣīyatē, ayaṃtu śāśvataḥ ata ēna purāṇaḥ”

(śāśvatamugā nuṃḍanivāḍu kṣīṇiṃcunu. bhagavaṃtuḍu śāśvatuḍu, apakṣayamu lēnivāḍu - aṃducēta cirakālamunuṃḍu yunnavāḍu)

  1. śāśvataṃ iti apakṣayalakṣaṇā vikriya pratiṣiddhyatē.

(apakṣayamu - kṣīṇiṃcuṭa - anu lakṣaṇamu - (guṇamu) - mārpu - lēkuṃḍuṭanu sūciṃcuṭaku śāśvatuḍu ani ceppabaḍinadi).

  1. na apakṣīyatē svarūpēṇa, niravayatvāt, nirguṇatvāt ca, nāpi guṇakṣayēṇa apakṣayaḥ.

(avayavamulu lēnivāḍu kanuka, rūpamulō kṣīṇiṃcuṭa lēnivāḍu, triguṇamulu kṣīṇiṃcuṭavalana kṣīṇiṃcakuṃḍuṭakādu).

  1. sadā ēkarūpaṃ (ellapuḍu okē rūpamutō nuṃḍuvāḍu).

  2. ‘sarvadaika rsaṃ’ (gītābhāvaprakāśamu - 10 - 64)

(ellapuḍu okē sattā - (heccu taggulu lēkuṃḍa) kaligi yuṃḍuvāḍu)

  1. viśvasyāsya samastasya parōtkṛṣṭastva māśrayaḥ |

ata ēvāsi nityastvaṃ śāśvatō - - - ||. (gītābhāvaprakāśamu - 11 - 67, 68)

(ī viśvamunakaṃtaku nīvu utkṛṣṭuḍavu - āśrayuḍavu - aṃducēta nīvu nityuḍavu, śāśvatuḍavu).

  1. “najāyatē mriyatē vā kadā cinnāyaṃ bhūtvā (a)bhavitā vā na bhūyaḥ |

ādyō nityaḥ śāśvatōmayaṃ purāṇō na hanyatē havyamānē śarīrē ||” (śrīmadbgavadgīta - 2 - 20)

(ī ātma eppuḍunu puṭṭiyuṃḍalēdu, canipōvunadikādu - okappuḍuṃḍi iṃkokappuḍu lēkuṃḍunadikādu. idi anniṃṭiki - sṛṣṭiki, sṛṣṭilō nuṃḍu vastuvulanniṃṭikī - modaṭidi, kāranamainadi - nityamugā nuṃḍunadi, śāśvatamainadi - cālākālamunuṃḍi yunnadi; śarīramu naśiṃcinanu tānu naśiṃcanidi.)

  1. “u. sarvaphalapradātayunu, sarva śaraṇyuḍu sarva śaktuḍun

sarva jagatprasiddhuḍunu, sarvagatuṃḍagu cakrapāni, yī

sarva śarīrulun vigamasaṃgati jeṃdi viśīryamāṇulai

sarvanacō na bhaṃgagati brahmamu tā ceḍakuṃḍuneppuḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7)

(ī jagattulōnuṃḍu samasta vastuvulu naśiṃcipōyinapuḍu - praḷayakālamaṃdu - parabrahmamokkaḍē vāṭitōpāṭu naśiṃcakuṃda migiliyuṃḍuvādu, aṃducēta atanu śāśvatuḍu).

  1. “paraṃ brahma, paraṃ dhāma, pavitraṃ paramaṃ bhavān |

puruṣaṃ śāśvataṃ divyamādidēvamajaṃ vibhuṃ ||“. (śrīmadbhagavadgīta - 10 - 12)

(parabrahma, paraṃ dhāmamu, parama pavitramu, puruṣuḍu - śarīramanu puramaṃduṃḍuvāḍu - śāśvatuḍavu, divyamainavāḍavu, ādi dēvuḍavu, janmalēnivāḍavu, vibhuḍu - ivannī nīvē).

  1. śaśvadbhavaśśāśvataḥ nāpa kṣīyatē svarūpēṇa - niravayavatvāt, nirguṇatvāt ca, nāpi guṇakṣayēṇa apakṣayaḥ -

(śāśvatamugā nuṃḍuvāḍu, apakṣayamu lēnivāḍu. apakṣayamu reṃḍu vidhamulu - svarūpamucētanu, guṇamulacētanu apakṣayamu lēnivāḍu, avayavamulu lēnivāḍukanuka svarūpamulō apakṣayamulēdu - atma nirguṇamukanuka guṇamulalō apakṣayamulēnivāḍu - aṃducēta śāśvatuḍu).

  1. “sī. - - -

brahma reṃḍava yarthaṃbu tudi jagaṃbulu naśiṃpaga bedda bhūtagaṇamu

ā. sūkṣmabhūtamaṃdu joraga nā bhūtaṃbu

prakrtilōna joraga, brakṛti vōyi

vyaktamaṃdu joraga, vyaktamaṇaṃganu

śēṣa saṃjña nīvu celuva magudu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - 3 - 125)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.