బ్రహ్మ, ఆత్మ,
అవినాశి
(నాశము లేనిది, నిత్యమైనది, ఎల్లకాలములందుండునది)
(భూత భవిష్యద్వర్తమాన కాలములందు చెడముండునది సత్ అని చెప్పబడుచున్నది - ఈ మూడు కాలములందు చెడకుండునది కనుక చైతన్యమే సత్ - చైతన్యము లేక ఆత్మ కానిది సత్ కాదు).
(భూతభవిష్యద్వర్తమానములందు నివృత్తి లేనిది ‘సత్’ అని చెప్పబడుచున్నది).
(నిత్యమైనది పరబ్రహ్మ సత్).
(పరమ పురుషార్థమునకు మోక్షమునకు సంబంధించునది - మోక్షరూపమైనది - సత్, సన్మాత్రము అవి కానిది అంతయు అసత్).
యం వినా న జగత్తస్మై సదా సాక్షాత్సతే నమః ||“. (సూత సంహితాయాం)
(ఎవని చైతన్యశక్తిచైతన్యముగల జగద్రూపముగా కనబడుచున్నదో, ఎవని సత్తా లేక, (చైతన్యశక్తి లేక) జగత్తులేదోఅట్టి సాక్షాత్ సత్పదార్థమే తాను అయిన వానికొఱకు నమస్కారము)
(ఏది ప్రవర్తించునో - చలనము కలిగియుండునో (Activity) అది సత్-
(సత్ స్వభావముగల ఆత్మకు అభావము (వినాశము లేకుండుట) లేదు)
(సత్ అనగా వికారము లేనిది - మార్పు లేనిది. అందుచేత ఎల్లపుడూ ఒకటే అయిన చైతన్యరూపముతో ఉండునది చేతనము)
(ఉండునది - ఎల్లపుడు ఉండునది - స్ప్ప్క్ష్మమైనది, నిర్విశేషము, (విశేషము లేనిది - అవయవములు లేనిది), అన్నింటిలోను ఉండునది; ఒకటిగానే ఉండునది, నిరంజనము, అని ఉపనిషత్తులన్నింటిలోను ఏది చెప్పబడుచున్నదో అది సత్ అని చెప్పబడుచున్నది.
నిత్యేన విభునా సర్వ మిదం వ్యాప్తం జడానృతం |
స్వసత్తా స్ఫూర్తి దానేన సర్వం స్వస్మిన్నివేశితం |
పరిచ్ఛేదం న కోప్యస్యా పరోక్షస్యా వ్యయచ్చస్య చ |
సర్వాను స్యూతరూపస్య సతః కర్తు మిహార్హతి ||“. (గీతాభావప్రకాశము - 2 - 210 to 212)
(చిదాత్మ నిత్యుడు, విభుడు అయిన యే ఒక్కనిచేత ఈ ప్రపంచమంతయు వ్యాప్తమై యున్నదో (వ్యాపించబడుయున్నదో) అదియే సత్తు. దీనియొక్క సత్తాస్ఫూర్తివలననే అంతయు దీనిలోనే ఆవేశించబడియున్నది. అవ్యయము, అపరోక్షము, అంతటిలోను, అన్నింటిలోను నిండియుండి ఆవేశించుకొని యున్నది అయిన యీ సత్తుకు పరిచ్ఛేదము కల్పించుటకు - దేశకాలవస్తు పరిచ్ఛేదము ఎవరికినీ శక్యము కాదు).
నను సత్యమనంతం చ |
కథా సమ్యక్ ప్రతీయతే |
దేశకాలాది హేతుత్వాదిదానీం విభావ్యతే |
వస్తుతో దేశ తశ్చైవ కాలతశ్చ త్రిధోచ్యతే |
ఆనంత్యం బ్రహ్మణశ్చాతః సత్యాద్యపి చ సిద్ధతి |
నానంత్య డేశతో ద్యోమ దేశవత్ప్రకృతిత్వతః |
కరణే నైక దేశం హి కార్యం నాన్య త్రవర్తతే |
కార్యత్వా త్కాలతో నాన్య వస్తు తశ్చ విహాయనః |
వస్త్వంతరస్య సద్భావా దానంత్యం వస్తుతో విన |
కాలాకాశయోనిత్వా త్సర్వాత్మత్వా త్తథాత్మనః |
వస్త్వంతరస్య వ్చానత్వా న్ముఖ్యానంత్యంపరాత్మనః |
కల్పితే న పరిచ్ఛేదో నహ్య కల్పిత వస్తునః |
కల్పితశ్చేహ కాలాది వాచారంభణ శాస్త్రతః |
కల్పితా నా వధిష్ఠాన తయా సత్య మబాధితం |
దేహాది సర్వ విశ్వస్యానత్యత్వం సిద్ధమత్యలం ||“. (గీతాభావప్రకాశము - 2 - 220 తొ 227)
(వార్తికమందు సత్యపదము - సత్ - నిర్ణయించబడినది. సత్యం, అనంతం అను పదము ఏ ప్రకారముగా తెలుపబడుచున్నదనగా - దేశము, కాలము, వస్తువు - ఇవి కారణములుగా తెలియబడుచున్న వి త్రివిధపరిచ్ఛేదము వలన - అనగా, దేశపరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము, వస్తుపరిచ్ఛేదము - ఈ త్రివిధపరిచ్ఛేదము లేనందువలన బ్రహ్మ అనంతుడు అని, సత్ అని చెప్పబడుచున్నాడు - ఒక దేశమందుండి ఇంకొక దేశమందు లేకపోవుట దేశ పరిచ్ఛేదము - ఒక కాలమందుండి ఇంకొక కాలమందు లేకపోవుట కాలపరిచ్ఛేదము - వస్తుపరిచ్చేదమనగా ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువులో లేకపోవుట. ఈ మూడు విధములైన పరిచ్ఛేదము లేనివాడు భగవంతుడు. ఈ మూడువిధముల అంతము లేనివాడు కనుక అనంతుడు. ‘సత్’ (సత్యం) అను పదమునకు కూడా యిదియే అర్థము - శాశ్వతముగా (అన్ని కాలములందును ఉండువాడు, అన్ని స్థలములందు ఉండువాడు, అన్ని వస్తువులందును విచక్షణ లేకుండ నుండువాడు. ఆకాసమునకు దేశపరిచ్ఛేదము కలదు - అందుచేత అనంతము కాదు - ఆకాశము కార్యము - అందుచేత కాలపరిమితి కలది. ఆత్మ సర్వమునకు ఆత్మయగుటవలన, కాలమునకు, ఆకాశమునకు కారణమగుటవలన కాలపరిచేదము, వస్తు పరిచ్ఛేదము లేనిది. అందువలన అనంతము - అనంతమే సత్యము, సత్యమే సత్)
అభావో (అ)సత్యతా నాస్తి పరిచ్ఛిన్నత్వ లక్షణః |
సర్వత్రా వ్యభిచారత్వా దనున్యూతన్య చిత్సతః |
ఏవం సదన తోరా త్తానాత్మనో రనయోర్జ్వయోః |
నిర్ణయః సత్సదేవాన స దేవేతి నాన్యదా ||“. (గీతాభావప్రకాసము - 2 - 201 to 203)
(చిదానందము, అపరిచ్ఛేదము అయిన సత్ వస్తువునకు అభావము లేకుండుటలేదు - పరిచ్ఛిన్నమను లక్షణము లేదు - ఎక్కడ చూచినను మార్పు లేకుండనుండునది, అంతటను వ్యాపించియుండునది కనుక ‘సత్’ - ‘సత్’ ఎప్పుడూ సత్తే, అసత్ ఎప్పుడూ అసత్తే)
(ఓ శాతుడా | ఈ ప్రజలందరకు, ప్రాణులందరికి సత్పదార్థమైన భగవంతుడే మూలము - కారణము - అవన్నియు సత్పదార్థమే ఆయతనముగా గలవి, వానిలోనే ప్రతిష్ఠింపబడియున్నవి - నిలిచియున్నవి).
(దేని సంబంధము కలుగుటవలన ఏది విద్యమానమగుచిన్నదో - కనబడుచున్నదో, లేక, తెలియ బడుచున్నదో - అది ‘సత్’; అది కానిది అసత్).
సత్యము; శ్రేష్టము, సాధువు, పూజ్యము, సుకృతము -
“తదౌ తద్బ్రహ్మ పూర్వమనప్పరమనంతరమ బాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూః”. (బృహదారణ్యకోపనిషత్ - 5 - 19)
(బ్రహ్మకు ముందేమియును లేదు, తర్వాత కూడ - వెనుకను కూడనే,ఇయును లేదు -, దానిలోను, దాని బైతగాని ఏదియును లేదు - ఉన్నదంతా బ్రహ్మమే - బ్రహ్మ తప్ప ఇంకేమియు లేదు)
సర్వత్ర సర్వమదమస్తి యదానుభృతం నో కించన క్వ చిదిహాస్తి న చాను భూతం |
శాంత, సదేకమిదమా తతమద్ధమాస్తే, సంత్యక్త శంశమప భేద మతస్త్వమాస్వ ||“. (వాసిష్టే)
“యదనుభూతం అనుభవానుసారేణ సర్వం సర్వత్రాస్తే, న చేదనుభూతం తర్హి కించన క్వచిన్నాస్తి శాంతం నమ్రాపమేకం వస్తు ఇత్థ మాతతం వ్యాప్తం సత్ ఇదం నిశమాస్తే, జగద్రూపేణ భాతి. అతః కారణాత్ సంత్యక్త శంకమపభేదంచ ఆస్వ - శంకాం, భేదం చ విహాయ సుఖం తిష్టేత్యర్థః”.
(అసత్ పదార్థము తేజస్సుకాదు, చీకటి కాదు, పేరు లేనిది, కనబదబిది అయిన ‘సత్’ ఒక్కటే మిగిలి యుండునది అను భావమువలన అన్ని చోట్ల, అన్నింటిలోనుండునది, అనుభవము లేనిది ఎక్కడ ఏ కొంచెము లేదు - అందుచేత అది సత్, రూపము ఒకటే వ్యాపించియున్నది అనుమానము భేదబుద్ధివదలి యుండుము).
(భగవంతుడు ఒకడే ఉన్నవాడైనను అనేక రూపములతోను నామములతోను వేరు వేరుగా విభక్తమైయున్నట్లు - కనబడువాడు).
స్థూల జగత్తు సత్పదార్థము - సత్యస్వరూపుడైన భగవంతుడు - మూడుకాలములందు నాశములేని పరబ్రహ్మరూపము)
మూర్త పృధివ్యాది భూతత్రయం -
(రూపముగల - కంటికి కనబడు - భూమి మొదలగు మూడు భూతములు - భూమి, నీరు, అగ్ని).
బ్రహ్మ
స్థూలకార్యం, ఆకాశాది సత్కర్యావస్థం కార్యం -
(స్థూలరూపములోనున్న కార్యవస్తువు - ఆకాశము మొదలగు సత్ యొక్క కార్యావస్థను పొందినది).
(ఆకాశము, వాయువు - ఆకారములేని రెండు భూతములు -)
(ఇంద్రియములచే తెలియబడునది) (అసత్ అనగా పరోక్షము)
(సత్ అసత్ కూడ నేనే - భగవంతుడే)
(అభివ్యక్తరూపము కలది కనుక సత్ కార్యమని చెప్పబడుచున్నది) (శ్రీ ఆనందతీర్థః)
సర్వజ్ఞః సర్వశక్తిశ్చ సర్వాత్మా ధ్రువః |
జగజ్జనిస్థితిధ్వంసహేతురేష న ఈశ్వరః |
యః పృధివ్యామమఋతస్సోసావాంతర్యామి జగద్గురుః |
హరిర్బ్రహ్మవినాకేతి బహుదైకోపి గీయతే ||” (సర్వేశ్వర వార్తికే)
(“సదేవసోమ్య, ఇదమగ్ర ఆసీత్” “ఇప్పుడు ఈ కనబడు ప్రపంచమంతయు సృష్టికి ముందు సత్ పదార్థముగనే - ఆత్మగనే - యుండెను” అని శ్రుతి చెప్పినపుడు కారణబ్రహ్మ (నిర్గుణబ్రహ్మ) గుఱించియే చెప్పియుండెను - సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు, జగత్తునకు సృష్టి స్థితి సమ్హారములు చేయువాడు ఈశ్వరుడు, పృధివిలోనంతర్యామిగా నుండువాడు, జగద్గురువు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అని యీ ఒక్కడే అనేక ప్రకారములుగా చెప్పబడుచున్నాడు -)
(అన్యన అయమర్థః - “యస్యాత్మా శరీరం, యస్యాక్షరం సరీరం, యస్యపృధివీ శరీరం, యస్యావక్తం శరీరం, ఏష సర్వభూతాంతరాత్మా, అపహతపాప్మా దివ్యో దేవ ఏకో నారాయణః” ఇత్యాది శ్రుతేః బ్రహ్మణః సర్వదా చిదచిద్వస్తు శరీరకతయా నామరూప విభాగా సర్వం ఏకమేవా సీత్ ||“. (శ్రీమాన్ రామానుజః)
(ఓ సౌమ్యుడా ! ఆ కనబడు ప్రపంచమంతయు ప్రళయకాలమందు - సృష్తికి ముందు – ‘సత్’ పదార్థముగానే - ఆత్మగానే యుండెను - దీని యర్థము ఈ రీతిగానున్నది _ “ఎవనికి ఆత్మ శరీరముగా నున్నదో, ఎవనికి భూమి శరీరమో, ఎవనికి అవ్యక్తము (ప్రకృతి) శరీరమో, అట్టివాడు భూతములన్నింటిలోను అంతరాత్మ అయినవాడు, పాపములు లేనివాడు, దివ్యమైనవాడు (దివ్యముగా ప్రకాశించువాడు) ఒక్కడే యగు నారాయణుడు” అని శ్రుతి చెప్పుటవలన బ్రహ్మ ‘చిత్’ అచిత్ - ఆత్మ, అనాత్మ వస్తువులు రెండునూ శరీరములుగా గలవాడగుటచేత ప్రళయకాలమందు, అనగా సృష్టికి పూర్వము వేరు వేరుగా నామరూపములు కలిగి సూక్ష్మరూపమును పొందిన ‘చిత్’ ‘అచిత్’ వస్తువుల శరీరములు కలిగియుండుటచేత - వేరు వేరుగా నామరూపములు కలిగినట్లుండుటకు వీలుకాని స్థితిలో నుండుటచేత అన్నియు తానొకటే వస్తువు అయిన ‘సత్’ (ఆత్మ) పదార్థముగా నుండెను -
భగవంతుడు తాను సృష్టిచేసిన వాటి అన్నింటిలోను ప్రవేశించెను - ప్రవేశించియున్నాడు - అట్లు సౄష్టించినవాటి అన్నింటిలోను ప్రవేశించియుండి ‘సత్’ పదార్థము, అసత్ పదార్థము తానే ఆయెను. ‘సత్’ అనగా భగవంతునియొక్క చైతన్యశక్తి, లేక, తన చైతన్యశక్తిరూపములో పరాశక్తిగా భగవంతుడే. ప్రకృతి అసత్ - జదము - ఇది కూడ భగవంతుని శక్తియే - అపరాశక్తి. ప్రకృతిలో భగవంతుడు తన పరాశక్తి రూపములో - చైతన్యశక్తి, చిచ్ఛక్తి - రూపములో ప్రవేశించుటచేత ప్రకృతి చైతన్యవంతమై దానిలోనుండిసృష్టిలోని వస్తువులన్నింటిని పుట్టించగలిగెను - చైతన్యశక్తియు ప్రకృతియు ఈ రెండింటి సం యోగమువలన - పరాశక్తిరూపములోనున్న భగవంతుడు - పురుషుడు - అపరాశక్తియగు ప్రకృతి - ఈ రెండింటి సం యోగమువలన పుట్టిన ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతుని రూపములే అగుతవలన భగవంతుడే ‘సత్’, ‘అసత్’ కూడ తనే ఆయెను - అని చెప్పబడినది. సత్యం = సత్ + త్యత్ - ఈ రెండు కలిసి సత్యమను పదము కలిగినది. “సత్ = మూడు కాలములందుండు చైతన్యరూపమైన భగవంతుడు, ’త్యత్’అనగా ప్రకృతికి సంబంధించిన వస్తువులన్నియు - ప్రకృతి పరిణామములన్నియు -” యచ్చ కించిత్ జగత్సత్యం (సర్వం) దృశ్యతే శ్రూయతే పివా, అతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితిః” (మంత్రపుష్పం)
‘సత్’ ‘అసత్’ (సత్ అసత్ రూపమైన ఈ జగత్తు అంటటిలోను లోపల, పైన భగవంతుడు పూర్తిగా వ్యాపించియున్నాడు).
(ఉపనిషత్తులలో కొన్ని చోట్ల ‘అసత్’ నుండి సత్పుట్టినది అని చెప్పబడినది. కాని అసత్ నుండి ‘సత్’ ఎట్లు పుట్టును? - అసత్ నుండి సత్ పుట్టదని అర్థము).
నా సతోవిద్యతే భావో ‘నాభావో’ విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో (అ)oతస్తత్త్వవన యోస్త త్వదర్శిభిః ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 16)
(అసద్వస్తువునకు భావము - ఉనికి - లేదు. సద్వస్తువునకు అభావము - లేకుండుత - లేదు. కాని తత్వమును తెలిసినవారు ఈ రెండింటియొక్క తారతమ్యమును తెలిసికొనిరి).
“పరిచ్ఛిన్నం హి యద్వస్తు దేశుతః కాలతో (అ)ర్థతః |
తజ్జన్మనాసశీలత్వాన సద్రజ్ఞు భుజంగవత్ |
యధా స్వాప్నం బంధ శబ్దేన ప్రోక్తం విశ్వం మృషాఖిలం |
నాధ్యిస్తం సత్కదాచిద్\త్స్యా త్స్యాప్నం కుంభాధ్కం యథా |
అసతో(అ)విద్యమానస్య శీతోష్ణాదేర్న చాస్తితా |
సహితోః నిష్ప్రమానత్వాత్ వికరాచ్చాలత్వతః |
ఘటాంకురాది యత్కార్యం దృష్టం సత్కారణం హి తత్ |
ఆకాశాది చ నః కార్యం తదప్యేవం ప్రతీయతాం |
అసతశ్చేదిదంకార్యం సర్వం స్యాదసదన్వితం |
అసతః కారణత్వంచనిరాత్మా త్వాన్న సిద్ధ్యతి |
ధ్రువః సత్కురుతే కార్యం అయస్కాంతో మణిర్యధా |
కారణత్వం చ భవేదేవం కుర్వతో అతిశయః కుతః ||
- - - యధా ఘటాది సంస్థానం మృదో భిన్నం న చక్షుషా |
గృహ్య సకలం తద్వాత్సతో భిన్నం జగన్నహి |
శతోష్ణాదేః ప్రవరాదస్య సహేతో ర్నాస్తి సత్యతా |
- - - తస్మాత్ బంధస్య దేహాదేః సహేతోర్నాస్తి సత్యతా |
తస్మాత్ బంధస్య దేహాదేః న హేతోర్నాస్తి సత్యతా |
తథా సతశ్చిదానందా పరిచ్ఛిన్న స్య వస్త్గునః |
అభావో (అ)సత్యతా నాస్తి పరిచ్ఛిన్నత్వలక్షణః |
సర్వత్రా భిచారిత్వా దను స్యూతస్య చిత్సితః |
ఏవం సదసతో రాత్మా నాత్మయో అనయోర్ద్వ యోః |
నిర్ణయః సత్సో దేవాసదే వాసదే వేతి నాన్యథా |
దృష్టః తద్బ్రహ్మ తద్భావో తద్భావఓ యాధాత్మ్యంబ్రహ్మణః సతః |
సత్వం ద్రష్టుం సదా శీలం యేషాంతైః తత్వ దర్శిభిః |
- -- దృశ్యం స్వరూపతో(అ)ధ్యస్తం చిద్ఘనే (అ)నృతాత్మకం |
సంసర్గమాత్ర మధ్యస్త మాత్మనో (అ)స్మిననాత్మని |
ప్రాతీతిక శరీరత్వా ద్దృశ్యం మిథ్యా జడం క్షరం |
అబాద్యత్వా చ్చిదాత్మత్వా దాత్మా సత్యః స్వయం ప్రభః ||“. (గీతాభావప్రకాశము - 2 - 187 to 193, 200 to 207)
(పరిచ్ఛిన్నమైన వస్తువు, అనగా, ఒకస్థలమందుండి ఇంకొక స్థలమందు లేనిది, ఒకప్పుడు ఉండి యింకొకప్పుడు లేకుండునది, ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువులో లేకుండినది, చావు పుట్టుకలు కలదగుటచేతను, త్రాడును చూచి పాము అనుకొనునట్లు - అది అసత్, స్వప్నములో జరిగినది నిజము కానట్లే - అంతయు మన్ను, కుండ అయినట్లే - కుండ అసత్ - మట్టితో చేయబడియుండుటచేత అది నిజముగా మట్టియే, మట్టియే సత్, కుండ పగిలి మరల మట్టిగా మారును కనుక అది అసత్ స్వప్నం కుండవలె ఎప్పుడును సత్ అధ్యక్తముకాదు - అసత్ కనబడనిది కనుక శీతోష్ణములవలె దానికి అస్తిత్వము లేనిదే - కారణము కలిగియున్నదగుటచేతను, ప్రమాణము లేనిదగుటవలనను, వికారమగుటవలనను మార్పు అయినదగుటవల్నను, చలనముగలదగుటవలనను కుండ మొలకవలె కార్యమగు వస్తువువలె కారణము కలది. సత్ దానికి కారణము. ఈ ప్రపంచమంతయు - ఈ ప్రపంచములోని వస్తువులన్నియు అసత్ తోనే కూడియున్నవైనయడల (కుండ మట్టితో కూడియున్నట్లు) (మట్టిమయమైనట్లు) అసత్ ఆత్మ కాకపోవుటవలన అది కారణము కాజాలదు. ధౄవముగా - స్థిరముగా నుండు సద్వస్తువే కార్య వస్తువును చేయగలదు - కుండలన్నియు వేరుకానట్లు సత్ కంటె యీ ప్రపంచము వేరు కాదు -శీతోష్ణములుగల యీ ప్రపంచము కారణముకలదగుటచేత అది సత్తు కాదు. అందుచేత కారణముగల యీ జగత్తు సత్తుకాదు - అందుచేత చిదానందుడు, అపరిచ్ఛిన్నుడు అయిన వస్తువగు సత్ కు పరిచ్ఛిన్నత్వలక్షణమైన అభావము అసత్ అగుట కలుగదు. అన్నింటిలోను ప్రవేశించియుండు చిత్ వస్తువగు సత్ కు అభావము లేకుండుట - లేదు. సత్ అసత్ ల లక్షణము ఇట్లున్నది. సత్ సత్తే, అసత్ అసత్తే. ఇంకొక రీతిగా నుండవు. సత్పదార్థమైన పరబ్రహ్మయొక్క యాదాత్మ్యము ఉన్నది యున్నట్లుగా చూచు శీలముగకవారు తత్వదర్శనులు. వారు సత్తు అసత్తుల తత్వము పైవిధముగా నుండునని తెలుసుకొనిరి. ఈ దృశ్య ప్రపంచము చైతన్యఘనుడగు సద్వస్తువునందు అధ్యస్తమే - బ్రహ్మయొక్క (సత్ యొక్క) ప్రతీకమైనందువలన ఈ దృశ్యప్రపంచము మిధ్య, జడము, క్షరము, నశించునది. ఆత్మ నాశము లేనిది, చైతన్యరూప గలదగుటచేత ఆత్మ సద్వస్తువు - సత్యమైనది (సత్). మూడుకాలములందుండునది స్యయంప్రభ గలది, స్వంతముగా ప్రకాశించునది).
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా || (శ్రీమద్భగవద్గీత - 17 - 23)
(ఓం అని తత్ అని సత్ అని పరబ్రహ్మ మూడువిధములుగా చెప్పబడుచున్నాడు - ఓం అనినను; తత్ అనినను, సత్ అనినను పరబ్రహ్మ అనియే యర్థము. బ్రాహ్మణములు, వేదములు, యజ్ఞములు ఈ మూడింటిలోను చెప్పబడినవి).
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ||
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మచైవ తార్థీయం సదిత్యేవాభి ధీయ ||” (శ్రీమద్భగవద్గీత - 17 - 27)
(సద్భావమందు - ఉన్నది, మూడు కాలములందుండునది, మంచిది అను అర్థము ఇచ్చునపుడు, ‘సత్’ అనుమాట ఉపయోగింపబడుచున్నది. ప్రపంచమంతయు నశించినను నశింపనిది సత్ - పరబ్రహ్మ -- సద్గుణము, సత్కర్మ, సజ్జనుడు, మొదలగునవి ప్రశస్తమైన కర్మ (మంచిపని) యని చెప్పునపుడు కూడ ‘సత్’ వాడుక చేయబడుచున్నది).
(సద్భావమనగా ఉన్నది, కనబడుచున్నది. సాధుభావమనగా కల్యాణభావము - శుభము అని అర్థము నిచ్చునపుడు - ఈ రెండింటియందు ‘సత్’ అను పదము లోకమునందు, వేదములోను వాడుక చేయబడుచున్నది. మఱియు, ఎవడైనను చేయు ప్రశస్తమైన కర్మ, శుభమైన కర్మయందు కూడ సత్ అను మాట వాడుక చేయబడుచున్నది).
ప్రసస్థే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ||
యజ్ఞే తపసి దానే చ స్థితిః సది అచోచ్యతే |
కర్మచైవతార్థీయం సదిత్యేవాభిధీయతే || (శ్రీమద్భగవద్గీత 17 - 26, 27)
(సద్భావమందు - ఉన్నది, మూడుకాలములందుండునది, మంచిది అను అర్థము ఇచ్చునపుడును, ‘సత్’ అనుమాట ఉపయోగించబడుచున్నది. ప్రపంచమనతయు నశించినను నశింపనిది సత్ - పరబ్రహ్మ - అద్గుణము, సత్కర్మ, సజ్జనుడు, మొదలగునవి ప్రశస్తమైన కర్మ (మంచి పని) యని చెప్పునపుడుకూడ ‘సత్’ వాడుక చేయబడుచున్నది).
(సద్భావమనగా ఉన్నది, కనబడుచున్నది - సాధుభావమనగా కల్యాణభావము - శుభము అని అర్థము నిచ్చునపుడు ఈ రెండింటియందు ‘సత్’ అను పదము లోకమునందు, వేదముళొను వాడుక చేయబడుచున్నది. మఱియు, ఎవడైనను చేయు ప్రశస్తమైనకర్మ, శుభమైన కర్మయందు కూడసత్ అనుమాట వాడుక చేయబడుచున్నది).
(సద్భావమనగా అనునది సత్ అని చెప్పునపుడు - కనబడని పుత్రుని జన్మ గుఱించి చెప్పునపుడు వాడుక చేయబడుచున్నది. సద్భావమునందును, సాధుభావమునందును, ‘సత్’ అను పరబ్రహ్మయొక్క పేరు వాడుక చేయబడుచున్నది. సాధుభావము సత్కర్మ - వివాహము మొదలగు వాటియందును సత్ వాడుక చేయబడుచున్నది).
కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 27)
(యజ్ఞము, తపస్సు, దానము - ఈ మూడుకర్మలయందు నిష్ఠకలిగియుండుట ‘సత్’ అని చెప్పబడినది. భగవంతుని గుఱించి, భగవంతునుద్దేశించి చదెయుకర్మలు అన్నియు ‘సత్’ అని చెప్పబడుచున్నవి.)
“యజ్ఞే యజ్ఞకర్మణి యాస్థితిః సా ‘సత్’ ఇతి శ ఉచ్యతే విద్వద్భిః కర్మచ తదర్థయం యజ్ఞదాన తపో అర్భీయం - అధవా, యస్య అభిదానత్రియం ప్రకృతం తదర్థీయం - ఈశ్వరార్థీయం - ఇత్యేతత్ ‘సత్’ ఇత్యేవ అభిధీయతే. తత్ ఏ తత్ యజ్ఞదాన తప ఆదికర్మ అనాత్వికం వి గుణమపి శ్రద్ధా పూర్వకం బ్రహ్మణః అభ్దానత్రయ ప్రయోగేణ సగున సాత్వికం సంపాదితం భవతి”. (శ్రీశంకరః)
(యజ్ఞకర్మయందు చేయు నిష్ఠయు, దానకర్మయందు చేయు నిష్ఠయు విద్వాంసులచేత ‘సత్’ అని చెప్పబడుచున్నది. యజ్ఞ, దాన, తపస్సుల నిమిత్తము - వాటికి సంబంధించి చేయుకర్మ - లేక యజ్ఞము, దానము, తపస్సు అని పేర్లుతో చెప్పబడు భగవంతుని గుఱించి అయిన కర్మ ‘సత్’ అని చెప్పబడుచున్నది. ఈ యజ్ఞ దాన తపస్సులగుఱించి అయిన కర్మ అసాత్వికమైనదైనను, విగుణమైనదైనను, శ్రద్ధతో చేసినది అయిన యడల అది సగుణమైన సాత్వికమైనదియే యగును).
(వైదికులు, త్రైవర్ణికులు చేత యజ్ఞమునను, తపస్సునందు, దానమునను నిష్ఠకలిగియుండుట కల్యాణకరమని (శుభము) అగుటచేత ‘సత్’ అని చెప్పుచున్నారు. త్రైవర్ణికులు కోరి చేయుకర్మ యజ్ఞము, దానము మొదలగునవికూడ ‘సత్’ అనియే చెప్పబడుచున్నది. అందుచేత వేదములు, వైదిక కర్మలు, బ్రాహ్మణములని చెప్పబడు త్రైవర్ణికకర్మలు ‘ఓం తత్ సత్’ అను బ్రహ్మపేర్లు అగు లక్షణములు కలిగియుండుటచేత వైదికులు కానివారు వ్యావృత్తులని తెలియ తగినవి).
ఇదమగ్ర ఆసీత్” (బృహదారణ్యకము - 4 - 3 - 7 - 1)
మొదట సృష్టికి పూర్వము ఇప్పుడీ కనబడు నామరూపములతోనుండు జగమంతయు ‘సత్’ పదార్థముగానే యుండెను - అని చెప్పుటవలన ‘సత్’ అనగా ఆత్మయే.
రావి పండు బద్దలు చదెయగా దాని లోపలనుండు చిన్నగింజను బ్రద్దలుకొట్టగా లోపల కంటికి కనబడని సూక్ష్మరూపములో రావి చెట్టు ఉన్నది. అందులోనున్నది ‘సత్’ పదార్థమే గాని, అందులో ఏమియు కనబడనంతమాత్రమున ఏమియును లేదు అనకూడదు. ఆ కనబడని ‘సత్’ పదార్థము రావి చెట్టుకు కారణమైనట్లే కంటికి కనబడని ‘సత్’ పదార్థమైన పరబ్రహ్మయే సృష్టికి కారణము - ‘సత్’ లోనుండియే ప్రపంచము పుట్టినది. ఏదీ కనబడనంతమాత్రమున ‘అసత్’ ఏమియు లేదని, అట్టి ‘అసత్’ నుండి ప్రపంచము పుట్టినదనుట అసంభవము - సత్ అనగా శూన్యము ఏమియు లేకుండుట. ఏమియు లేనిదానినుండి ఏదైనను ఏట్లు పుట్టును? “కథ మసతః సజ్జా యేత” (అసత్తునుండి సత్తు ఎట్లు పుట్టును?). (చూడుము - 31).
brahma, ātma,
avināśi
(nāśamu lēnidi, nityamainadi, ellakālamulaṃduṃḍunadi)
(bhūta bhaviṣyadvartamāna kālamulaṃdu ceḍamuṃḍunadi sat ani ceppabaḍucunnadi - ī mūḍu kālamulaṃdu ceḍakuṃḍunadi kanuka caitanyamē sat - caitanyamu lēka ātma kānidi sat kādu).
(bhūtabhaviṣyadvartamānamulaṃdu nivṛtti lēnidi ‘sat’ ani ceppabaḍucunnadi).
(nityamainadi parabrahma sat).
(parama puruṣārthamunaku mōkṣamunaku saṃbaṃdhiṃcunadi - mōkṣarūpamainadi - sat, sanmātramu avi kānidi aṃtayu asat).
yaṃ vinā na jagattasmai sadā sākṣātsatē namaḥ ||“. (sūta saṃhitāyāṃ)
(evani caitanyaśakticaitanyamugala jagadrūpamugā kanabaḍucunnadō, evani sattā lēka, (caitanyaśakti lēka) jagattulēdōaṭṭi sākṣāt satpadārthamē tānu ayina vānikoṟaku namaskāramu)
(ēdi pravartiṃcunō - calanamu kaligiyuṃḍunō (Activity) adi sat-
(sat svabhāvamugala ātmaku abhāvamu (vināśamu lēkuṃḍuṭa) lēdu)
(sat anagā vikāramu lēnidi - mārpu lēnidi. aṃducēta ellapuḍū okaṭē ayina caitanyarūpamutō uṃḍunadi cētanamu)
(uṃḍunadi - ellapuḍu uṃḍunadi - sppkṣmamainadi, nirviśēṣamu, (viśēṣamu lēnidi - avayavamulu lēnidi), anniṃṭilōnu uṃḍunadi; okaṭigānē uṃḍunadi, niraṃjanamu, ani upaniṣattulanniṃṭilōnu ēdi ceppabaḍucunnadō adi sat ani ceppabaḍucunnadi.
nityēna vibhunā sarva midaṃ vyāptaṃ jaḍānṛtaṃ |
svasattā sphūrti dānēna sarvaṃ svasminnivēśitaṃ |
paricchēdaṃ na kōpyasyā parōkṣasyā vyayaccasya ca |
sarvānu syūtarūpasya sataḥ kartu mihārhati ||“. (gītābhāvaprakāśamu - 2 - 210 to 212)
(cidātma nityuḍu, vibhuḍu ayina yē okkanicēta ī prapaṃcamaṃtayu vyāptamai yunnadō (vyāpiṃcabaḍuyunnadō) adiyē sattu. dīniyokka sattāsphūrtivalananē aṃtayu dīnilōnē āvēśiṃcabaḍiyunnadi. avyayamu, aparōkṣamu, aṃtaṭilōnu, anniṃṭilōnu niṃḍiyuṃḍi āvēśiṃcukoni yunnadi ayina yī sattuku paricchēdamu kalpiṃcuṭaku - dēśakālavastu paricchēdamu evarikinī śakyamu kādu).
nanu satyamanaṃtaṃ ca |
kathā samyak pratīyatē |
dēśakālādi hētutvādidānīṃ vibhāvyatē |
vastutō dēśa taścaiva kālataśca tridhōcyatē |
ānaṃtyaṃ brahmaṇaścātaḥ satyādyapi ca siddhati |
nānaṃtya ḍēśatō dyōma dēśavatprakṛtitvataḥ |
karaṇē naika dēśaṃ hi kāryaṃ nānya travartatē |
kāryatvā tkālatō nānya vastu taśca vihāyanaḥ |
vastvaṃtarasya sadbhāvā dānaṃtyaṃ vastutō vina |
kālākāśayōnitvā tsarvātmatvā ttathātmanaḥ |
vastvaṃtarasya vcānatvā nmukhyānaṃtyaṃparātmanaḥ |
kalpitē na paricchēdō nahya kalpita vastunaḥ |
kalpitaścēha kālādi vācāraṃbhaṇa śāstrataḥ |
kalpitā nā vadhiṣṭhāna tayā satya mabādhitaṃ |
dēhādi sarva viśvasyānatyatvaṃ siddhamatyalaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 220 to 227)
(vārtikamaṃdu satyapadamu - sat - nirṇayiṃcabaḍinadi. satyaṃ, anaṃtaṃ anu padamu ē prakāramugā telupabaḍucunnadanagā - dēśamu, kālamu, vastuvu - ivi kāraṇamulugā teliyabaḍucunna vi trividhaparicchēdamu valana - anagā, dēśaparicchēdamu, kālaparicchēdamu, vastuparicchēdamu - ī trividhaparicchēdamu lēnaṃduvalana brahma anaṃtuḍu ani, sat ani ceppabaḍucunnāḍu - oka dēśamaṃduṃḍi iṃkoka dēśamaṃdu lēkapōvuṭa dēśa paricchēdamu - oka kālamaṃduṃḍi iṃkoka kālamaṃdu lēkapōvuṭa kālaparicchēdamu - vastupariccēdamanagā oka vastuvulōnuṃḍi iṃkoka vastuvulō lēkapōvuṭa. ī mūḍu vidhamulaina paricchēdamu lēnivāḍu bhagavaṃtuḍu. ī mūḍuvidhamula aṃtamu lēnivāḍu kanuka anaṃtuḍu. ‘sat’ (satyaṃ) anu padamunaku kūḍā yidiyē arthamu - śāśvatamugā (anni kālamulaṃdunu uṃḍuvāḍu, anni sthalamulaṃdu uṃḍuvāḍu, anni vastuvulaṃdunu vicakṣaṇa lēkuṃḍa nuṃḍuvāḍu. ākāsamunaku dēśaparicchēdamu kaladu - aṃducēta anaṃtamu kādu - ākāśamu kāryamu - aṃducēta kālaparimiti kaladi. ātma sarvamunaku ātmayaguṭavalana, kālamunaku, ākāśamunaku kāraṇamaguṭavalana kālaparicēdamu, vastu paricchēdamu lēnidi. aṃduvalana anaṃtamu - anaṃtamē satyamu, satyamē sat)
abhāvō (a)satyatā nāsti paricchinnatva lakṣaṇaḥ |
sarvatrā vyabhicāratvā danunyūtanya citsataḥ |
ēvaṃ sadana tōrā ttānātmanō ranayōrjvayōḥ |
nirṇayaḥ satsadēvāna sa dēvēti nānyadā ||“. (gītābhāvaprakāsamu - 2 - 201 to 203)
(cidānaṃdamu, aparicchēdamu ayina sat vastuvunaku abhāvamu lēkuṃḍuṭalēdu - paricchinnamanu lakṣaṇamu lēdu - ekkaḍa cūcinanu mārpu lēkuṃḍanuṃḍunadi, aṃtaṭanu vyāpiṃciyuṃḍunadi kanuka ‘sat’ - ‘sat’ eppuḍū sattē, asat eppuḍū asattē)
(ō śātuḍā | ī prajalaṃdaraku, prāṇulaṃdariki satpadārthamaina bhagavaṃtuḍē mūlamu - kāraṇamu - avanniyu satpadārthamē āyatanamugā galavi, vānilōnē pratiṣṭhiṃpabaḍiyunnavi - niliciyunnavi).
(dēni saṃbaṃdhamu kaluguṭavalana ēdi vidyamānamagucinnadō - kanabaḍucunnadō, lēka, teliya baḍucunnadō - adi ‘sat’; adi kānidi asat).
satyamu; śrēṣṭamu, sādhuvu, pūjyamu, sukṛtamu -
“tadau tadbrahma pūrvamanapparamanaṃtarama bāhyaṃ ayamātmā brahma sarvānubhūḥ”. (bṛhadāraṇyakōpaniṣat - 5 - 19)
(brahmaku muṃdēmiyunu lēdu, tarvāta kūḍa - venukanu kūḍanē,iyunu lēdu -, dānilōnu, dāni baitagāni ēdiyunu lēdu - unnadaṃtā brahmamē - brahma tappa iṃkēmiyu lēdu)
sarvatra sarvamadamasti yadānubhṛtaṃ nō kiṃcana kva cidihāsti na cānu bhūtaṃ |
śāṃta, sadēkamidamā tatamaddhamāstē, saṃtyakta śaṃśamapa bhēda matastvamāsva ||“. (vāsiṣṭē)
“yadanubhūtaṃ anubhavānusārēṇa sarvaṃ sarvatrāstē, na cēdanubhūtaṃ tarhi kiṃcana kvacinnāsti śāṃtaṃ namrāpamēkaṃ vastu ittha mātataṃ vyāptaṃ sat idaṃ niśamāstē, jagadrūpēṇa bhāti. ataḥ kāraṇāt saṃtyakta śaṃkamapabhēdaṃca āsva - śaṃkāṃ, bhēdaṃ ca vihāya sukhaṃ tiṣṭētyarthaḥ”.
(asat padārthamu tējassukādu, cīkaṭi kādu, pēru lēnidi, kanabadabidi ayina ‘sat’ okkaṭē migili yuṃḍunadi anu bhāvamuvalana anni cōṭla, anniṃṭilōnuṃḍunadi, anubhavamu lēnidi ekkaḍa ē koṃcemu lēdu - aṃducēta adi sat, rūpamu okaṭē vyāpiṃciyunnadi anumānamu bhēdabuddhivadali yuṃḍumu).
(bhagavaṃtuḍu okaḍē unnavāḍainanu anēka rūpamulatōnu nāmamulatōnu vēru vērugā vibhaktamaiyunnaṭlu - kanabaḍuvāḍu).
sthūla jagattu satpadārthamu - satyasvarūpuḍaina bhagavaṃtuḍu - mūḍukālamulaṃdu nāśamulēni parabrahmarūpamu)
mūrta pṛdhivyādi bhūtatrayaṃ -
(rūpamugala - kaṃṭiki kanabaḍu - bhūmi modalagu mūḍu bhūtamulu - bhūmi, nīru, agni).
brahma
sthūlakāryaṃ, ākāśādi satkaryāvasthaṃ kāryaṃ -
(sthūlarūpamulōnunna kāryavastuvu - ākāśamu modalagu sat yokka kāryāvasthanu poṃdinadi).
(ākāśamu, vāyuvu - ākāramulēni reṃḍu bhūtamulu -)
(iṃdriyamulacē teliyabaḍunadi) (asat anagā parōkṣamu)
(sat asat kūḍa nēnē - bhagavaṃtuḍē)
(abhivyaktarūpamu kaladi kanuka sat kāryamani ceppabaḍucunnadi) (śrī ānaṃdatīrthaḥ)
sarvajñaḥ sarvaśaktiśca sarvātmā dhruvaḥ |
jagajjanisthitidhvaṃsahēturēṣa na īśvaraḥ |
yaḥ pṛdhivyāmamaṛtassōsāvāṃtaryāmi jagadguruḥ |
harirbrahmavinākēti bahudaikōpi gīyatē ||” (sarvēśvara vārtikē)
(“sadēvasōmya, idamagra āsīt” “ippuḍu ī kanabaḍu prapaṃcamaṃtayu sṛṣṭiki muṃdu sat padārthamuganē - ātmaganē - yuṃḍenu” ani śruti ceppinapuḍu kāraṇabrahma (nirguṇabrahma) guṟiṃciyē ceppiyuṃḍenu - sarvajñuḍu sarvaśaktimaṃtuḍu, jagattunaku sṛṣṭi sthiti samhāramulu cēyuvāḍu īśvaruḍu, pṛdhivilōnaṃtaryāmigā nuṃḍuvāḍu, jagadguruvu, brahma, viṣṇuvu, śivuḍu ani yī okkaḍē anēka prakāramulugā ceppabaḍucunnāḍu -)
(anyana ayamarthaḥ - “yasyātmā śarīraṃ, yasyākṣaraṃ sarīraṃ, yasyapṛdhivī śarīraṃ, yasyāvaktaṃ śarīraṃ, ēṣa sarvabhūtāṃtarātmā, apahatapāpmā divyō dēva ēkō nārāyaṇaḥ” ityādi śrutēḥ brahmaṇaḥ sarvadā cidacidvastu śarīrakatayā nāmarūpa vibhāgā sarvaṃ ēkamēvā sīt ||“. (śrīmān rāmānujaḥ)
(ō saumyuḍā ! ā kanabaḍu prapaṃcamaṃtayu praḷayakālamaṃdu - sṛṣtiki muṃdu – ‘sat’ padārthamugānē - ātmagānē yuṃḍenu - dīni yarthamu ī rītigānunnadi _ “evaniki ātma śarīramugā nunnadō, evaniki bhūmi śarīramō, evaniki avyaktamu (prakṛti) śarīramō, aṭṭivāḍu bhūtamulanniṃṭilōnu aṃtarātma ayinavāḍu, pāpamulu lēnivāḍu, divyamainavāḍu (divyamugā prakāśiṃcuvāḍu) okkaḍē yagu nārāyaṇuḍu” ani śruti ceppuṭavalana brahma ‘cit’ acit - ātma, anātma vastuvulu reṃḍunū śarīramulugā galavāḍaguṭacēta praḷayakālamaṃdu, anagā sṛṣṭiki pūrvamu vēru vērugā nāmarūpamulu kaligi sūkṣmarūpamunu poṃdina ‘cit’ ‘acit’ vastuvula śarīramulu kaligiyuṃḍuṭacēta - vēru vērugā nāmarūpamulu kaliginaṭluṃḍuṭaku vīlukāni sthitilō nuṃḍuṭacēta anniyu tānokaṭē vastuvu ayina ‘sat’ (ātma) padārthamugā nuṃḍenu -
bhagavaṃtuḍu tānu sṛṣṭicēsina vāṭi anniṃṭilōnu pravēśiṃcenu - pravēśiṃciyunnāḍu - aṭlu sṝṣṭiṃcinavāṭi anniṃṭilōnu pravēśiṃciyuṃḍi ‘sat’ padārthamu, asat padārthamu tānē āyenu. ‘sat’ anagā bhagavaṃtuniyokka caitanyaśakti, lēka, tana caitanyaśaktirūpamulō parāśaktigā bhagavaṃtuḍē. prakṛti asat - jadamu - idi kūḍa bhagavaṃtuni śaktiyē - aparāśakti. prakṛtilō bhagavaṃtuḍu tana parāśakti rūpamulō - caitanyaśakti, cicchakti - rūpamulō pravēśiṃcuṭacēta prakṛti caitanyavaṃtamai dānilōnuṃḍisṛṣṭilōni vastuvulanniṃṭini puṭṭiṃcagaligenu - caitanyaśaktiyu prakṛtiyu ī reṃḍiṃṭi saṃ yōgamuvalana - parāśaktirūpamulōnunna bhagavaṃtuḍu - puruṣuḍu - aparāśaktiyagu prakṛti - ī reṃḍiṃṭi saṃ yōgamuvalana puṭṭina prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtuni rūpamulē agutavalana bhagavaṃtuḍē ‘sat’, ‘asat’ kūḍa tanē āyenu - ani ceppabaḍinadi. satyaṃ = sat + tyat - ī reṃḍu kalisi satyamanu padamu kaliginadi. “sat = mūḍu kālamulaṃduṃḍu caitanyarūpamaina bhagavaṃtuḍu, ’tyat’anagā prakṛtiki saṃbaṃdhiṃcina vastuvulanniyu - prakṛti pariṇāmamulanniyu -” yacca kiṃcit jagatsatyaṃ (sarvaṃ) dṛśyatē śrūyatē pivā, atarbahiśca tatsarvaṃ vyāpyanārāyaṇa sthitiḥ” (maṃtrapuṣpaṃ)
‘sat’ ‘asat’ (sat asat rūpamaina ī jagattu aṃṭaṭilōnu lōpala, paina bhagavaṃtuḍu pūrtigā vyāpiṃciyunnāḍu).
(upaniṣattulalō konni cōṭla ‘asat’ nuṃḍi satpuṭṭinadi ani ceppabaḍinadi. kāni asat nuṃḍi ‘sat’ eṭlu puṭṭunu? - asat nuṃḍi sat puṭṭadani arthamu).
nā satōvidyatē bhāvō ‘nābhāvō’ vidyatē sataḥ |
ubhayōrapi dṛṣṭō (a)otastattvavana yōsta tvadarśibhiḥ ||“. (śrīmadbhagavadgīta - 2 - 16)
(asadvastuvunaku bhāvamu - uniki - lēdu. sadvastuvunaku abhāvamu - lēkuṃḍuta - lēdu. kāni tatvamunu telisinavāru ī reṃḍiṃṭiyokka tāratamyamunu telisikoniri).
“paricchinnaṃ hi yadvastu dēśutaḥ kālatō (a)rthataḥ |
tajjanmanāsaśīlatvāna sadrajñu bhujaṃgavat |
yadhā svāpnaṃ baṃdha śabdēna prōktaṃ viśvaṃ mṛṣākhilaṃ |
nādhyistaṃ satkadācid\tsyā tsyāpnaṃ kuṃbhādhkaṃ yathā |
asatō(a)vidyamānasya śītōṣṇādērna cāstitā |
sahitōḥ niṣpramānatvāt vikarāccālatvataḥ |
ghaṭāṃkurādi yatkāryaṃ dṛṣṭaṃ satkāraṇaṃ hi tat |
ākāśādi ca naḥ kāryaṃ tadapyēvaṃ pratīyatāṃ |
asataścēdidaṃkāryaṃ sarvaṃ syādasadanvitaṃ |
asataḥ kāraṇatvaṃcanirātmā tvānna siddhyati |
dhruvaḥ satkurutē kāryaṃ ayaskāṃtō maṇiryadhā |
kāraṇatvaṃ ca bhavēdēvaṃ kurvatō atiśayaḥ kutaḥ ||
- - - yadhā ghaṭādi saṃsthānaṃ mṛdō bhinnaṃ na cakṣuṣā |
gṛhya sakalaṃ tadvātsatō bhinnaṃ jagannahi |
śatōṣṇādēḥ pravarādasya sahētō rnāsti satyatā |
- - - tasmāt baṃdhasya dēhādēḥ sahētōrnāsti satyatā |
tasmāt baṃdhasya dēhādēḥ na hētōrnāsti satyatā |
tathā sataścidānaṃdā paricchinna sya vastgunaḥ |
abhāvō (a)satyatā nāsti paricchinnatvalakṣaṇaḥ |
sarvatrā bhicāritvā danu syūtasya citsitaḥ |
ēvaṃ sadasatō rātmā nātmayō anayōrdva yōḥ |
nirṇayaḥ satsō dēvāsadē vāsadē vēti nānyathā |
dṛṣṭaḥ tadbrahma tadbhāvō tadbhāvaō yādhātmyaṃbrahmaṇaḥ sataḥ |
satvaṃ draṣṭuṃ sadā śīlaṃ yēṣāṃtaiḥ tatva darśibhiḥ |
- -- dṛśyaṃ svarūpatō(a)dhyastaṃ cidghanē (a)nṛtātmakaṃ |
saṃsargamātra madhyasta mātmanō (a)sminanātmani |
prātītika śarīratvā ddṛśyaṃ mithyā jaḍaṃ kṣaraṃ |
abādyatvā ccidātmatvā dātmā satyaḥ svayaṃ prabhaḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 187 to 193, 200 to 207)
(paricchinnamaina vastuvu, anagā, okasthalamaṃduṃḍi iṃkoka sthalamaṃdu lēnidi, okappuḍu uṃḍi yiṃkokappuḍu lēkuṃḍunadi, okavastuvulōnuṃḍi iṃkoka vastuvulō lēkuṃḍinadi, cāvu puṭṭukalu kaladaguṭacētanu, trāḍunu cūci pāmu anukonunaṭlu - adi asat, svapnamulō jariginadi nijamu kānaṭlē - aṃtayu mannu, kuṃḍa ayinaṭlē - kuṃḍa asat - maṭṭitō cēyabaḍiyuṃḍuṭacēta adi nijamugā maṭṭiyē, maṭṭiyē sat, kuṃḍa pagili marala maṭṭigā mārunu kanuka adi asat svapnaṃ kuṃḍavale eppuḍunu sat adhyaktamukādu - asat kanabaḍanidi kanuka śītōṣṇamulavale dāniki astitvamu lēnidē - kāraṇamu kaligiyunnadaguṭacētanu, pramāṇamu lēnidaguṭavalananu, vikāramaguṭavalananu mārpu ayinadaguṭavalnanu, calanamugaladaguṭavalananu kuṃḍa molakavale kāryamagu vastuvuvale kāraṇamu kaladi. sat dāniki kāraṇamu. ī prapaṃcamaṃtayu - ī prapaṃcamulōni vastuvulanniyu asat tōnē kūḍiyunnavainayaḍala (kuṃḍa maṭṭitō kūḍiyunnaṭlu) (maṭṭimayamainaṭlu) asat ātma kākapōvuṭavalana adi kāraṇamu kājāladu. dhṝvamugā - sthiramugā nuṃḍu sadvastuvē kārya vastuvunu cēyagaladu - kuṃḍalanniyu vērukānaṭlu sat kaṃṭe yī prapaṃcamu vēru kādu -śītōṣṇamulugala yī prapaṃcamu kāraṇamukaladaguṭacēta adi sattu kādu. aṃducēta kāraṇamugala yī jagattu sattukādu - aṃducēta cidānaṃduḍu, aparicchinnuḍu ayina vastuvagu sat ku paricchinnatvalakṣaṇamaina abhāvamu asat aguṭa kalugadu. anniṃṭilōnu pravēśiṃciyuṃḍu cit vastuvagu sat ku abhāvamu lēkuṃḍuṭa - lēdu. sat asat la lakṣaṇamu iṭlunnadi. sat sattē, asat asattē. iṃkoka rītigā nuṃḍavu. satpadārthamaina parabrahmayokka yādātmyamu unnadi yunnaṭlugā cūcu śīlamugakavāru tatvadarśanulu. vāru sattu asattula tatvamu paividhamugā nuṃḍunani telusukoniri. ī dṛśya prapaṃcamu caitanyaghanuḍagu sadvastuvunaṃdu adhyastamē - brahmayokka (sat yokka) pratīkamainaṃduvalana ī dṛśyaprapaṃcamu midhya, jaḍamu, kṣaramu, naśiṃcunadi. ātma nāśamu lēnidi, caitanyarūpa galadaguṭacēta ātma sadvastuvu - satyamainadi (sat). mūḍukālamulaṃduṃḍunadi syayaṃprabha galadi, svaṃtamugā prakāśiṃcunadi).
brāhmaṇāstēna vēdāśca yajñāśca vihitāḥ purā || (śrīmadbhagavadgīta - 17 - 23)
(ōṃ ani tat ani sat ani parabrahma mūḍuvidhamulugā ceppabaḍucunnāḍu - ōṃ aninanu; tat aninanu, sat aninanu parabrahma aniyē yarthamu. brāhmaṇamulu, vēdamulu, yajñamulu ī mūḍiṃṭilōnu ceppabaḍinavi).
praśastē karmaṇi tathā sacchabdaḥ pārtha yujyatē ||
yajñē tapasi dānē ca sthitiḥ saditi cōcyatē |
karmacaiva tārthīyaṃ sadityēvābhi dhīya ||” (śrīmadbhagavadgīta - 17 - 27)
(sadbhāvamaṃdu - unnadi, mūḍu kālamulaṃduṃḍunadi, maṃcidi anu arthamu iccunapuḍu, ‘sat’ anumāṭa upayōgiṃpabaḍucunnadi. prapaṃcamaṃtayu naśiṃcinanu naśiṃpanidi sat - parabrahma -- sadguṇamu, satkarma, sajjanuḍu, modalagunavi praśastamaina karma (maṃcipani) yani ceppunapuḍu kūḍa ‘sat’ vāḍuka cēyabaḍucunnadi).
(sadbhāvamanagā unnadi, kanabaḍucunnadi. sādhubhāvamanagā kalyāṇabhāvamu - śubhamu ani arthamu niccunapuḍu - ī reṃḍiṃṭiyaṃdu ‘sat’ anu padamu lōkamunaṃdu, vēdamulōnu vāḍuka cēyabaḍucunnadi. maṟiyu, evaḍainanu cēyu praśastamaina karma, śubhamaina karmayaṃdu kūḍa sat anu māṭa vāḍuka cēyabaḍucunnadi).
prasasthē karmaṇi tathā sacchabdaḥ pārtha yujyatē ||
yajñē tapasi dānē ca sthitiḥ sadi acōcyatē |
karmacaivatārthīyaṃ sadityēvābhidhīyatē || (śrīmadbhagavadgīta 17 - 26, 27)
(sadbhāvamaṃdu - unnadi, mūḍukālamulaṃduṃḍunadi, maṃcidi anu arthamu iccunapuḍunu, ‘sat’ anumāṭa upayōgiṃcabaḍucunnadi. prapaṃcamanatayu naśiṃcinanu naśiṃpanidi sat - parabrahma - adguṇamu, satkarma, sajjanuḍu, modalagunavi praśastamaina karma (maṃci pani) yani ceppunapuḍukūḍa ‘sat’ vāḍuka cēyabaḍucunnadi).
(sadbhāvamanagā unnadi, kanabaḍucunnadi - sādhubhāvamanagā kalyāṇabhāvamu - śubhamu ani arthamu niccunapuḍu ī reṃḍiṃṭiyaṃdu ‘sat’ anu padamu lōkamunaṃdu, vēdamuḷonu vāḍuka cēyabaḍucunnadi. maṟiyu, evaḍainanu cēyu praśastamainakarma, śubhamaina karmayaṃdu kūḍasat anumāṭa vāḍuka cēyabaḍucunnadi).
(sadbhāvamanagā anunadi sat ani ceppunapuḍu - kanabaḍani putruni janma guṟiṃci ceppunapuḍu vāḍuka cēyabaḍucunnadi. sadbhāvamunaṃdunu, sādhubhāvamunaṃdunu, ‘sat’ anu parabrahmayokka pēru vāḍuka cēyabaḍucunnadi. sādhubhāvamu satkarma - vivāhamu modalagu vāṭiyaṃdunu sat vāḍuka cēyabaḍucunnadi).
karmacaiva tadarthīyaṃ sadityēvābhidhīyatē ||“. (śrīmadbhagavadgīta - 17 - 27)
(yajñamu, tapassu, dānamu - ī mūḍukarmalayaṃdu niṣṭhakaligiyuṃḍuṭa ‘sat’ ani ceppabaḍinadi. bhagavaṃtuni guṟiṃci, bhagavaṃtunuddēśiṃci cadeyukarmalu anniyu ‘sat’ ani ceppabaḍucunnavi.)
“yajñē yajñakarmaṇi yāsthitiḥ sā ‘sat’ iti śa ucyatē vidvadbhiḥ karmaca tadarthayaṃ yajñadāna tapō arbhīyaṃ - adhavā, yasya abhidānatriyaṃ prakṛtaṃ tadarthīyaṃ - īśvarārthīyaṃ - ityētat ‘sat’ ityēva abhidhīyatē. tat ē tat yajñadāna tapa ādikarma anātvikaṃ vi guṇamapi śraddhā pūrvakaṃ brahmaṇaḥ abhdānatraya prayōgēṇa saguna sātvikaṃ saṃpāditaṃ bhavati”. (śrīśaṃkaraḥ)
(yajñakarmayaṃdu cēyu niṣṭhayu, dānakarmayaṃdu cēyu niṣṭhayu vidvāṃsulacēta ‘sat’ ani ceppabaḍucunnadi. yajña, dāna, tapassula nimittamu - vāṭiki saṃbaṃdhiṃci cēyukarma - lēka yajñamu, dānamu, tapassu ani pērlutō ceppabaḍu bhagavaṃtuni guṟiṃci ayina karma ‘sat’ ani ceppabaḍucunnadi. ī yajña dāna tapassulaguṟiṃci ayina karma asātvikamainadainanu, viguṇamainadainanu, śraddhatō cēsinadi ayina yaḍala adi saguṇamaina sātvikamainadiyē yagunu).
(vaidikulu, traivarṇikulu cēta yajñamunanu, tapassunaṃdu, dānamunanu niṣṭhakaligiyuṃḍuṭa kalyāṇakaramani (śubhamu) aguṭacēta ‘sat’ ani ceppucunnāru. traivarṇikulu kōri cēyukarma yajñamu, dānamu modalagunavikūḍa ‘sat’ aniyē ceppabaḍucunnadi. aṃducēta vēdamulu, vaidika karmalu, brāhmaṇamulani ceppabaḍu traivarṇikakarmalu ‘ōṃ tat sat’ anu brahmapērlu agu lakṣaṇamulu kaligiyuṃḍuṭacēta vaidikulu kānivāru vyāvṛttulani teliya taginavi).
idamagra āsīt” (bṛhadāraṇyakamu - 4 - 3 - 7 - 1)
modaṭa sṛṣṭiki pūrvamu ippuḍī kanabaḍu nāmarūpamulatōnuṃḍu jagamaṃtayu ‘sat’ padārthamugānē yuṃḍenu - ani ceppuṭavalana ‘sat’ anagā ātmayē.
rāvi paṃḍu baddalu cadeyagā dāni lōpalanuṃḍu cinnagiṃjanu braddalukoṭṭagā lōpala kaṃṭiki kanabaḍani sūkṣmarūpamulō rāvi ceṭṭu unnadi. aṃdulōnunnadi ‘sat’ padārthamē gāni, aṃdulō ēmiyu kanabaḍanaṃtamātramuna ēmiyunu lēdu anakūḍadu. ā kanabaḍani ‘sat’ padārthamu rāvi ceṭṭuku kāraṇamainaṭlē kaṃṭiki kanabaḍani ‘sat’ padārthamaina parabrahmayē sṛṣṭiki kāraṇamu - ‘sat’ lōnuṃḍiyē prapaṃcamu puṭṭinadi. ēdī kanabaḍanaṃtamātramuna ‘asat’ ēmiyu lēdani, aṭṭi ‘asat’ nuṃḍi prapaṃcamu puṭṭinadanuṭa asaṃbhavamu - sat anagā śūnyamu ēmiyu lēkuṃḍuṭa. ēmiyu lēnidāninuṃḍi ēdainanu ēṭlu puṭṭunu? “katha masataḥ sajjā yēta” (asattunuṃḍi sattu eṭlu puṭṭunu?). (cūḍumu - 31).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.