← Back to స · Booklets 51–60 (digitized file 6)

సతీ satī

Original — తెలుగు
  1. దేవీ, పార్వతి, మహాపతివ్రతా -

  2. “సతీసతీ యోగవిసృష్ట దేహో తాం జన్మనే శైలవధూం ప్రపేదౌ |”. (కుమారసంభవము - కాళిదాసు)

(మహా పతివ్రత అయిన సతీదేవి యోగము చేత దేహమును విడిచి - యోగాగ్నిచే శరీరమును భస్మము చేసుకొని - పర్వత రాజైన హిమవంతుని భార్యను మరల జన్మించుత్కు పొందెను).

  1. “తస్యాం నామ సతీం చక్రే సత్యత్వాత్ పరనందిదిః” (దేవీభాగవతము)

(“పరసంవిదో బ్రహ్మరూపిణ్యాః సత్యత్వాత్ తదవతారత్వాత్ అస్యాః సతీ ఇతి నామ చక్రే ఇత్యర్థః”)

(పరసంవిత్ బ్రహ్మరూపిణి అయిన దేవి సత్యమైనదగుటవలన - మూడుకాలములందుండునదికనుక, ‘సత్’ అవతారమగుటచేత సతీ అని పేరు పెట్టబడినది).

  1. “గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీ భి సత్యవాది భిః |

అలుబ్దైర్దాన శీలైశ్చ సప్తభిర్థార్యతే జగత్“.

(గోవులు,బ్రాహ్మణులు, వేదములు, సతీమణులు, సత్యవాదులు, లుబ్దులుగానివారు, దాతలు - ఈ ఏడుగురుచేత భూమి ధరించబడుచున్నది - ఈ ఏడుగురు ఉన్నందువలననే పాప భూయిష్టమైన నరుల బరువు మోయుచున్నను యీ భూమి క్రుంగిపోవుటలేదు - ఈ ఏడుగురుండుట వలననే యింకను భూమి తన భారమును ధరించుచున్నది - ధరా).

Transliteration
  1. dēvī, pārvati, mahāpativratā -

  2. “satīsatī yōgavisṛṣṭa dēhō tāṃ janmanē śailavadhūṃ prapēdau |”. (kumārasaṃbhavamu - kāḷidāsu)

(mahā pativrata ayina satīdēvi yōgamu cēta dēhamunu viḍici - yōgāgnicē śarīramunu bhasmamu cēsukoni - parvata rājaina himavaṃtuni bhāryanu marala janmiṃcutku poṃdenu).

  1. “tasyāṃ nāma satīṃ cakrē satyatvāt paranaṃdidiḥ” (dēvībhāgavatamu)

(“parasaṃvidō brahmarūpiṇyāḥ satyatvāt tadavatāratvāt asyāḥ satī iti nāma cakrē ityarthaḥ”)

(parasaṃvit brahmarūpiṇi ayina dēvi satyamainadaguṭavalana - mūḍukālamulaṃduṃḍunadikanuka, ‘sat’ avatāramaguṭacēta satī ani pēru peṭṭabaḍinadi).

  1. “gōbhirvipraiśca vēdaiśca satī bhi satyavādi bhiḥ |

alubdairdāna śīlaiśca saptabhirthāryatē jagat”.

(gōvulu,brāhmaṇulu, vēdamulu, satīmaṇulu, satyavādulu, lubdulugānivāru, dātalu - ī ēḍugurucēta bhūmi dhariṃcabaḍucunnadi - ī ēḍuguru unnaṃduvalananē pāpa bhūyiṣṭamaina narula baruvu mōyucunnanu yī bhūmi kruṃgipōvuṭalēdu - ī ēḍuguruṃḍuṭa valananē yiṃkanu bhūmi tana bhāramunu dhariṃcucunnadi - dharā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.