← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్కార్యవాదము satkāryavādamu

Original — తెలుగు
  1. సత్కారవాద్యమనగా ఉన్నవస్తువుకారణమువలననే కార్యము (కార్యవస్తువు) పుట్టును అను వేదాంతులు చేయు వాదము).

  2. “పదార్థము నశించునదుకాదు మాయయే పదార్థము - అది అవసరమునుబట్టి రూపాంతరము నందుచుండునే గాని నశింపదు కొత్తవస్తువుగా ఉత్పన్నముకాదు. మట్టిచే ఎద్దు బొమ్మను చేయవచ్చును - దానిని మరల ముద్దగా చేసి ఆ బురదతోనే గుఱ్ఱము బొమ్మను చేయవచ్చును. మట్టి ఎద్దుగా, గుఱ్ఱముగా రూపాంతరము మారినదేగాని మట్టికి భిన్నమైన మఱియొక వస్తువుగా మారలేదు - శివుడు (బ్రహ్మ) లేనిదానిని సృష్టించడు, ఉన్నదానిని నశింపచేయడు. పదార్థము నశించునదికాదు - ఈ రీతిగాప్రకృతి మారుతకు ‘సత్’ పదార్థము కారణము. ఈ మార్పు సత్పదార్థముయొక్క కార్యము - దీనినే సత్కార్యవాదమందురు”.

  3. నిత్యపదార్థములు మూడు - చిత్తు (జీవుడు), అచిత్తు ప్రకృతి (ఈశ్వరుడు), పరమాత్మ. ఈమూడు ఓదార్థములు కలియుటయే ప్రపంచము. (తత్వత్రయము) - సృష్టికి పూర్వము ప్రళయదశలో జీవ ప్రకృతులు రెండునూ సూక్ష్మావస్థలో ఉంటాయి - ఆ అవస్థలో జలం, పృధ్వి అను వేరు వేరు తత్వములుండవు. సృష్ట్యవస్థలోనే జీవ ప్రకృతులు రెండూ స్థూలావస్థను పొంది, వివిధనామరూపాలను పొందుచున్నారు - ఇట్లు సూక్ష్మావస్థనుండి స్థూలావస్థను పొందడమే ఉత్పత్తి అని, స్థూలావస్థనుండి సూక్ష్మావస్థను పొందుటే వినాశం అంటారు. దీనినే సత్కార్యవాదమని అంటారు“.

Transliteration
  1. satkāravādyamanagā unnavastuvukāraṇamuvalananē kāryamu (kāryavastuvu) puṭṭunu anu vēdāṃtulu cēyu vādamu).

  2. “padārthamu naśiṃcunadukādu māyayē padārthamu - adi avasaramunubaṭṭi rūpāṃtaramu naṃducuṃḍunē gāni naśiṃpadu kottavastuvugā utpannamukādu. maṭṭicē eddu bommanu cēyavaccunu - dānini marala muddagā cēsi ā buradatōnē guṟṟamu bommanu cēyavaccunu. maṭṭi eddugā, guṟṟamugā rūpāṃtaramu mārinadēgāni maṭṭiki bhinnamaina maṟiyoka vastuvugā māralēdu - śivuḍu (brahma) lēnidānini sṛṣṭiṃcaḍu, unnadānini naśiṃpacēyaḍu. padārthamu naśiṃcunadikādu - ī rītigāprakṛti mārutaku ‘sat’ padārthamu kāraṇamu. ī mārpu satpadārthamuyokka kāryamu - dīninē satkāryavādamaṃduru”.

  3. nityapadārthamulu mūḍu - cittu (jīvuḍu), acittu prakṛti (īśvaruḍu), paramātma. īmūḍu ōdārthamulu kaliyuṭayē prapaṃcamu. (tatvatrayamu) - sṛṣṭiki pūrvamu praḷayadaśalō jīva prakṛtulu reṃḍunū sūkṣmāvasthalō uṃṭāyi - ā avasthalō jalaṃ, pṛdhvi anu vēru vēru tatvamuluṃḍavu. sṛṣṭyavasthalōnē jīva prakṛtulu reṃḍū sthūlāvasthanu poṃdi, vividhanāmarūpālanu poṃducunnāru - iṭlu sūkṣmāvasthanuṃḍi sthūlāvasthanu poṃdaḍamē utpatti ani, sthūlāvasthanuṃḍi sūkṣmāvasthanu poṃduṭē vināśaṃ aṃṭāru. dīninē satkāryavādamani aṃṭāru”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.