← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్పురుషులు satpuruṣulu

Original — తెలుగు
  1. సాధువులు

  2. నిరస్త దురితాః (పాపము పోగొట్టుకొనినవాడు)

  3. అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుః -

(‘బ్రహ్మ కలడు’ అని తెలిసినవాడు)

  1. “శ్లో||. తృష్ణాం భింది, భజక్రమాం జహి మదం పాడే రతిం మా కృథాః |

సత్యం బ్రూహి అను యాహి సాధుపదవీం, సేవస్య విద్వజ్జనం |

మాన్యాన్మానయ విద్విషోప్యను నయం ప్రఖ్యాపయ ప్రశ్రయం |

కీర్తిం పాలయ దుఃఖితే కురుదయాం ఏతత్సతాం చేష్టితం“. (భర్తృహరి)

(తృష్ణను - అత్యాశను - విడిచి పెట్టుము; ఓర్మి కలిగి యుండుము. మదమును వదలివేయుము. పాపపు పనులు చేయుటయందు మనస్సును పోనీయకుము, నిజమునే పలుకుము. సాధువుల, సత్పురుషుల - మార్గము నవలంభించుము. పండితులను సేవించుము - పూజ్యులను మన్నించుము. శత్రువులనైనను చక్కగ చూడుము. పెద్దలయందు అణకువ కలిగి యుండుము - కీర్తికి భంగము రాకుండ చూచుకొనుము - బాధపడుచుండువారి యడల దయ కలిగి యుండుము - ఇవి స్తపురుషుల లక్షణములు -).

  1. ” ఏషా సంస్మరణాత్పుంసాం సద్యః శుద్ధ్యంతి వై గృహాః |

కిం పునర్దర్శన స్పర్శ పాదశౌ బాసనాదిభిః |

సాన్నిధ్యాత్తే మహాయోగిన్ పాతకాని మహాంత్యమి |

సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరివ సురేతరాః ||“. (శ్రీమద్భాగవతం - 1 - 19 - 3334)

(సత్పురుషులను స్మరించినమాత్రమున - తలచుకొనినంతమాత్రమున - గృహములు అప్పుడే - తక్షణమే - పావనములవును - అటువంటప్పుడు వారిని దర్శించుట, తాకుట, పాదములను కడుగుట, వారికి ఆసనములిచ్చుట మొదలగు వాటిచేతను, వారి సన్నిధిలో (దగ్గర) నుండుటచేతను, మహాపాపములైనను అప్పటికప్పుడేనశించును - అని చెప్పనేల? విష్ణువును స్మరించుట మొదలగునవి చేసినయడల పైన చెప్పిన ఫలములు కలుగునట్లే సత్పురుషుల మూలముగా కూడ కలుగును - సత్పురుషులు విష్ణుస్వరూపులు).

  1. “మ. అవధూతోత్తమ మంటి, నేడు నిను డాయంగంటి నీవంటి

ప్రవరుం చేర్కొనినంతన్ భసీతమౌ చాపంబు నా చోటికిన్

భవదాలోకన భాష ణార్చన పద ప్రక్షాలణ స్పర్శనా

ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే“.

  1. “వ. సహనశీలురు, సమస్త శరీరధారులకు సుహృత్తులును, బరమ శాంతులును, గారుణికులునునై పరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్ట స్వజన బంధు జనులునై మత్పదాశ్రయులును, మద్గుణ ధ్యాన పారీణులును, మత్కథా ప్రసంగ సంబరిత శ్రవణానందులును, నగుచు మదీయుల కథల నొడుపుచు, వినిచునుండు పరమ భాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రియంబు దపింప జేయం జాలదు - అట్టి సర్వసంగ వివర్జితులగు పరమ భాగవత జనుల సంగంబపేక్షణీయంబు - అది సకల దోష నివారకంబగు. అట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణ రసాయనంబులగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - 870)

  2. వ. ఉదకమయంబులైన తీర్థంబులును, మృచ్ఛిలామయంబులైన దేవగణంబులును దీర్ఘ దేవతారూపంబులు గాకుండుట లేదైనవి చిరకాల సేవనార్చనలంగాని పావనంబులు సేయవు. సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదురు“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా - 1120,1121)

  1. మహా పాతకోవా యుక్తో వాచో వపాతకైః |

పరం పదం ప్రయాత్యేవ మహద్భిరవలోకితాః |

కలేబరం వా తద్భస్మ తద్ధూమం వాపి సత్తమ |

యది పశ్యతి పుణ్యాత్మా సప్రయాతి పరాంగతిం ||“. (నారదః)

(మహాపాపములను చేసినవాడైనను, ఉపపాతకములను చేసినవాడైనను మహాత్ముల (సత్పురుషుల) దృష్టి పడినచో పరమపదమగు మోక్షమును పొందుదురు. అట్టి సత్పురుషుల కలేబరములుకాని, వారి భస్మముకాని, పొగగాని చూచిన పుణ్యాత్ముడు పరమపదమును పొందును).

Transliteration
  1. sādhuvulu

  2. nirasta duritāḥ (pāpamu pōgoṭṭukoninavāḍu)

  3. asti brahmēti cēdvēda saṃtamēnaṃ tatō viduḥ -

(‘brahma kalaḍu’ ani telisinavāḍu)

  1. “ślō||. tṛṣṇāṃ bhiṃdi, bhajakramāṃ jahi madaṃ pāḍē ratiṃ mā kṛthāḥ |

satyaṃ brūhi anu yāhi sādhupadavīṃ, sēvasya vidvajjanaṃ |

mānyānmānaya vidviṣōpyanu nayaṃ prakhyāpaya praśrayaṃ |

kīrtiṃ pālaya duḥkhitē kurudayāṃ ētatsatāṃ cēṣṭitaṃ”. (bhartṛhari)

(tṛṣṇanu - atyāśanu - viḍici peṭṭumu; ōrmi kaligi yuṃḍumu. madamunu vadalivēyumu. pāpapu panulu cēyuṭayaṃdu manassunu pōnīyakumu, nijamunē palukumu. sādhuvula, satpuruṣula - mārgamu navalaṃbhiṃcumu. paṃḍitulanu sēviṃcumu - pūjyulanu manniṃcumu. śatruvulanainanu cakkaga cūḍumu. peddalayaṃdu aṇakuva kaligi yuṃḍumu - kīrtiki bhaṃgamu rākuṃḍa cūcukonumu - bādhapaḍucuṃḍuvāri yaḍala daya kaligi yuṃḍumu - ivi stapuruṣula lakṣaṇamulu -).

  1. ” ēṣā saṃsmaraṇātpuṃsāṃ sadyaḥ śuddhyaṃti vai gṛhāḥ |

kiṃ punardarśana sparśa pādaśau bāsanādibhiḥ |

sānnidhyāttē mahāyōgin pātakāni mahāṃtyami |

sadyō naśyaṃti vai puṃsāṃ viṣṇōriva surētarāḥ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 19 - 3334)

(satpuruṣulanu smariṃcinamātramuna - talacukoninaṃtamātramuna - gṛhamulu appuḍē - takṣaṇamē - pāvanamulavunu - aṭuvaṃṭappuḍu vārini darśiṃcuṭa, tākuṭa, pādamulanu kaḍuguṭa, vāriki āsanamuliccuṭa modalagu vāṭicētanu, vāri sannidhilō (daggara) nuṃḍuṭacētanu, mahāpāpamulainanu appaṭikappuḍēnaśiṃcunu - ani ceppanēla? viṣṇuvunu smariṃcuṭa modalagunavi cēsinayaḍala paina ceppina phalamulu kalugunaṭlē satpuruṣula mūlamugā kūḍa kalugunu - satpuruṣulu viṣṇusvarūpulu).

  1. “ma. avadhūtōttama maṃṭi, nēḍu ninu ḍāyaṃgaṃṭi nīvaṃṭi

pravaruṃ cērkoninaṃtan bhasītamau cāpaṃbu nā cōṭikin

bhavadālōkana bhāṣa ṇārcana pada prakṣālaṇa sparśanā

di vidhānaṃbula mukti cēpaḍuṭa ciṃtiṃpaṃga nāścaryamē”.

  1. “va. sahanaśīluru, samasta śarīradhārulaku suhṛttulunu, barama śāṃtulunu, gāruṇikulununai parityakta karmaphala svabhāvulunu visṛṣṭa svajana baṃdhu janulunai matpadāśrayulunu, madguṇa dhyāna pārīṇulunu, matkathā prasaṃga saṃbarita śravaṇānaṃdulunu, nagucu madīyula kathala noḍupucu, vinicunuṃḍu parama bhāgavatōttamula nādhyātmikādi tāpatriyaṃbu dapiṃpa jēyaṃ jāladu - aṭṭi sarvasaṃga vivarjitulagu parama bhāgavata janula saṃgaṃbapēkṣaṇīyaṃbu - adi sakala dōṣa nivārakaṃbagu. aṭṭi satsaṃgaṃbuna sarvaprāṇi hṛtkarṇa rasāyanaṃbulagu madīya kathā prasaṃgaṃbulu galugu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - 870)

  2. va. udakamayaṃbulaina tīrthaṃbulunu, mṛcchilāmayaṃbulaina dēvagaṇaṃbulunu dīrgha dēvatārūpaṃbulu gākuṃḍuṭa lēdainavi cirakāla sēvanārcanalaṃgāni pāvanaṃbulu sēyavu. satpuruṣulu darśanamātraṃbunaṃ bāvanaṃbu sēyuduru”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā - 1120,1121)

  1. mahā pātakōvā yuktō vācō vapātakaiḥ |

paraṃ padaṃ prayātyēva mahadbhiravalōkitāḥ |

kalēbaraṃ vā tadbhasma taddhūmaṃ vāpi sattama |

yadi paśyati puṇyātmā saprayāti parāṃgatiṃ ||“. (nāradaḥ)

(mahāpāpamulanu cēsinavāḍainanu, upapātakamulanu cēsinavāḍainanu mahātmula (satpuruṣula) dṛṣṭi paḍinacō paramapadamagu mōkṣamunu poṃduduru. aṭṭi satpuruṣula kalēbaramulukāni, vāri bhasmamukāni, pogagāni cūcina puṇyātmuḍu paramapadamunu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.