← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్తా మాత్రము sattā mātramu

Original — తెలుగు
  1. సత్తా సామాన్యత్వాత్ సత్తామాత్రః -

(సత్తా - సత్ - చైతన్యశక్తి ఓకటే సామాన్యముగా నుండుటచేత సత్తామాత్రుడు).

  1. సర్వ కాలములందును, సర్వ దేశములందును, సర్వ వస్తువులందును ఒకటే విధముగా నుండుటయే స్వరూపముగా గలవాడు నిత్యుడు.

  2. ఎల్లపుడు సత్తయే ఉండుటయే స్వరూపముగా గలవాడు - దేశ కాల వస్తువులవలన కలుగు మార్పులు లేనివాడు.

  3. స్వగత భేద రహితః.

(ఒకచెట్టులో అనేక భేదములు - వేళ్ళూ, మాను, కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, పువ్వులు, కాయలు అను వేరు వేరు భాగములుండును. ఇవి అన్నియు కలిసి చెట్టు అని చెప్పబడును. అట్లు తనలో భేదములు లేక ఉన్నదంతా ఒకే రసముగా, ఒకే విధముగా నుండునది - విశేషములేక యుండునది.)

  1. మొధ్యాభూతము, జడము, అవిద్యా, అవ్యక్తము అగు ప్రకృతికి, దాని కార్యమగు ప్రపంచమునకు సత్తాను (చైతన్యమును) ఇచ్చి చైతన్యవంతముగా చేసి వ్యవహరింప చేయు ఒకే శక్తి కలవాడు)

  2. “ఆత్మ ద్రవ్యం స్వయం శుద్ధం సత్యజ్ఞానాది లక్షణం |

సత్తామాత్రేన దోషాస్తి స్వతస్సిద్ధం యతః సదా |

యది సత్తా స్వతో (అ)శుద్ధా దుష్టం సర్వం చ వేత్తదా |

- - - సత్తా శూన్యంతు తుచ్ఛం స్యాత్ సత్తా శుద్ధా స్వతస్వతః |

సత్యాత్మ లక్షణం త్వాత్మ ద్రవ్యం శుద్ధం తతస్త్వతః ||“. (సూతసంహితాయాం)

(ఆత్మ తత్వము స్వయముగా శుద్ధమైనది, దేనితోను కలియనిది, ఏ దోషముకాని, విశేషముకాని లేనిది. స్వతస్సిద్ధమైనదగుటచేత సత్తామాత్రము అయిన ఆత్మలో ఏ విధమైన దోషము లేదు. సత్తా స్వయముగా దోషము కలదియే అయినయడల అంతయు - సత్తాతో పూర్తిగా నిండియున్న ప్రపంచమంతయు - దోషయుక్తమైనదే అయి యుండవలెను. సత్తా లేనిది - చైతన్యములేనిది తుచ్ఛమైనది).

  1. “శ్లో||. గగన పవన తేజో నారి మహ్యా వివర్తా |

భగవతః ఇతి సిద్ధం సర్వవేదాంత జాలే |

నహి తృణమపి విష్ణోర్భిన్న సత్తాం లభేత |

విధి శతమపి తద్వన్నైవ విష్ణో ర్విభిన్నం ||“. (గీతాభావప్రకాశము - 9 - 63)

(ఆకాశము - వాయువు, అగ్ని, నీరు, భూమి - ఇవన్నియు భగవంతునియొక్కవివర్తములే - అని ఉపనిషత్తులన్నియు సిద్ధాంతము చేయుచున్నవి. అందుచేత అవన్నియు - వాటి సం యోగమువలన కలిగిన ప్రపంచములోని వస్తువులన్నియు - భగవంతుని సత్తా (చిదంశము, చైతన్యశక్తి - కలిగియున్నవే. ఒక గడ్డిపోచ అయినను భగవంతుని సత్తాకంటె వేరైనది లేదు - విష్ణువు కానిది, విష్ణునికంటె వేరైనది లేదు) - ఎందుచేతననగా - ‘మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా’ (శ్రీమద్భగవద్గీత - 9 - 4)

కంటికి కనబడని రూపముగల ఈ జగత్తు అంతటిలోను నేను పూర్తిగా వ్యాపించియున్నాను. (“ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన, వింటే) (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

“సుమతీరాముడు నిర్వికారము, సదా శుద్ధంబు - - - సత్తా మాత్రము, నిర్విశేషము - -”. (సీతారామాంజనేయ సంవాదము -)

Transliteration
  1. sattā sāmānyatvāt sattāmātraḥ -

(sattā - sat - caitanyaśakti ōkaṭē sāmānyamugā nuṃḍuṭacēta sattāmātruḍu).

  1. sarva kālamulaṃdunu, sarva dēśamulaṃdunu, sarva vastuvulaṃdunu okaṭē vidhamugā nuṃḍuṭayē svarūpamugā galavāḍu nityuḍu.

  2. ellapuḍu sattayē uṃḍuṭayē svarūpamugā galavāḍu - dēśa kāla vastuvulavalana kalugu mārpulu lēnivāḍu.

  3. svagata bhēda rahitaḥ.

(okaceṭṭulō anēka bhēdamulu - vēḷḷū, mānu, kommalu, ciguḷḷu, ākulu, puvvulu, kāyalu anu vēru vēru bhāgamuluṃḍunu. ivi anniyu kalisi ceṭṭu ani ceppabaḍunu. aṭlu tanalō bhēdamulu lēka unnadaṃtā okē rasamugā, okē vidhamugā nuṃḍunadi - viśēṣamulēka yuṃḍunadi.)

  1. modhyābhūtamu, jaḍamu, avidyā, avyaktamu agu prakṛtiki, dāni kāryamagu prapaṃcamunaku sattānu (caitanyamunu) icci caitanyavaṃtamugā cēsi vyavahariṃpa cēyu okē śakti kalavāḍu)

  2. “ātma dravyaṃ svayaṃ śuddhaṃ satyajñānādi lakṣaṇaṃ |

sattāmātrēna dōṣāsti svatassiddhaṃ yataḥ sadā |

yadi sattā svatō (a)śuddhā duṣṭaṃ sarvaṃ ca vēttadā |

- - - sattā śūnyaṃtu tucchaṃ syāt sattā śuddhā svatasvataḥ |

satyātma lakṣaṇaṃ tvātma dravyaṃ śuddhaṃ tatastvataḥ ||“. (sūtasaṃhitāyāṃ)

(ātma tatvamu svayamugā śuddhamainadi, dēnitōnu kaliyanidi, ē dōṣamukāni, viśēṣamukāni lēnidi. svatassiddhamainadaguṭacēta sattāmātramu ayina ātmalō ē vidhamaina dōṣamu lēdu. sattā svayamugā dōṣamu kaladiyē ayinayaḍala aṃtayu - sattātō pūrtigā niṃḍiyunna prapaṃcamaṃtayu - dōṣayuktamainadē ayi yuṃḍavalenu. sattā lēnidi - caitanyamulēnidi tucchamainadi).

  1. “ślō||. gagana pavana tējō nāri mahyā vivartā |

bhagavataḥ iti siddhaṃ sarvavēdāṃta jālē |

nahi tṛṇamapi viṣṇōrbhinna sattāṃ labhēta |

vidhi śatamapi tadvannaiva viṣṇō rvibhinnaṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 63)

(ākāśamu - vāyuvu, agni, nīru, bhūmi - ivanniyu bhagavaṃtuniyokkavivartamulē - ani upaniṣattulanniyu siddhāṃtamu cēyucunnavi. aṃducēta avanniyu - vāṭi saṃ yōgamuvalana kaligina prapaṃcamulōni vastuvulanniyu - bhagavaṃtuni sattā (cidaṃśamu, caitanyaśakti - kaligiyunnavē. oka gaḍḍipōca ayinanu bhagavaṃtuni sattākaṃṭe vērainadi lēdu - viṣṇuvu kānidi, viṣṇunikaṃṭe vērainadi lēdu) - eṃducētananagā - ‘mayā tatamidaṃ sarvaṃ jagadavyakta mūrtinā’ (śrīmadbhagavadgīta - 9 - 4)

kaṃṭiki kanabaḍani rūpamugala ī jagattu aṃtaṭilōnu nēnu pūrtigā vyāpiṃciyunnānu. (“ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu vaṃśapāvana, viṃṭē) (śrīmadāṃdhramahābhāgavatamu -)

“sumatīrāmuḍu nirvikāramu, sadā śuddhaṃbu - - - sattā mātramu, nirviśēṣamu - -”. (sītārāmāṃjanēya saṃvādamu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.