(సత్వము, రజస్సు, తమము అనునవి ప్రకృతియొక్క గుణములు, ఆత్మగుణములు కావు - పరమాత్మ గుణములుకావు. పరమాత్మ యొక్క శరీరమైన ప్రకృతి యొక్క స్వరూపమునకు చెందినవికావు. ఈ సత్వాది గుణములు హెచ్చు తగ్గులు ఒక్కమారుగ జరుగవు. వారి వారి కర్మ పరిపాకమువలన కాలానుగుణముగ ఒకపర్యాయము హ్రసము, ఒకపర్యాయము ఉల్లాసము కలుగుచుండును.
(సత్వరజస్తమోగుణములకు హ్రాసము ఉల్లాసము అనెడి మార్పులు, ఆయా జీవుల కర్మ పరిపాకమగు కాలముననుసరించి కలుగుచుండుట సిద్ధము).
(అన్నింటిలోను ఆత్మగానుండు ఈశ్వరుడు - భగవంతుడు - ఎప్పుడు ఏ ఒకనికో విజయమున్నూ, ఏ ఇంకొకరికో పరాజయమున్నూ కలుగచేయడు - కాని ఆయా దేవతులు మొదలగువారియొక్క కర్మలు పరిపాకమునకు వచ్చిన కాలమునందు సత్వరజస్తమోగుణములు ఉద్భవించుకాలమునందు ఆ దేవతులు మొదలగువారికి విజ్యము సమకూర్చును. ఇతరులకు పరాజయమును కలిగించును - సత్వము మొదలగు గుణములు కలుగుట వారి వారి కర్మలవలన కలుగునవి కనుక - వారి వారి కర్మాధీనములు కనుక - వాటికి అనుగుణముగానే వారి ప్రవృత్తి కలుగుచున్నది. కాని, ఈశ్వరుని వైషమ్యము - (విషమ స్వభావము) ఒకరియందు దౌఅ, ఇంకొకరియందు నిర్దయ కలుగుటలేదు)
(సత్వము కలవి, చైతన్యముకలవి, భూతములు ప్రానము కలవి).
(satvamu, rajassu, tamamu anunavi prakṛtiyokka guṇamulu, ātmaguṇamulu kāvu - paramātma guṇamulukāvu. paramātma yokka śarīramaina prakṛti yokka svarūpamunaku ceṃdinavikāvu. ī satvādi guṇamulu heccu taggulu okkamāruga jarugavu. vāri vāri karma paripākamuvalana kālānuguṇamuga okaparyāyamu hrasamu, okaparyāyamu ullāsamu kalugucuṃḍunu.
(satvarajastamōguṇamulaku hrāsamu ullāsamu aneḍi mārpulu, āyā jīvula karma paripākamagu kālamunanusariṃci kalugucuṃḍuṭa siddhamu).
(anniṃṭilōnu ātmagānuṃḍu īśvaruḍu - bhagavaṃtuḍu - eppuḍu ē okanikō vijayamunnū, ē iṃkokarikō parājayamunnū kalugacēyaḍu - kāni āyā dēvatulu modalaguvāriyokka karmalu paripākamunaku vaccina kālamunaṃdu satvarajastamōguṇamulu udbhaviṃcukālamunaṃdu ā dēvatulu modalaguvāriki vijyamu samakūrcunu. itarulaku parājayamunu kaligiṃcunu - satvamu modalagu guṇamulu kaluguṭa vāri vāri karmalavalana kalugunavi kanuka - vāri vāri karmādhīnamulu kanuka - vāṭiki anuguṇamugānē vāri pravṛtti kalugucunnadi. kāni, īśvaruni vaiṣamyamu - (viṣama svabhāvamu) okariyaṃdu daua, iṃkokariyaṃdu nirdaya kaluguṭalēdu)
(satvamu kalavi, caitanyamukalavi, bhūtamulu prānamu kalavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.