సత్వము, రజస్సు, తమము అను ప్రకృతి గుణములలో మొదటిది.
“సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః |
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం |
తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయం |
సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 5,6)
(సత్వము, రజస్సు, తమము అను మూడుగుణములు ప్రకృతివలన కలిగినవి. ఇవి దేహి అయిన జీవుని దేహమందు బంధించుచున్నవి. వాటిలో సత్వగుణము నిర్మలమైనదగుటచేత - శుద్ధమైనదగుటచేత, జ్ఞానమును కలిగించుటచేత బంధము కలుగచేయుచున్నది).
(సత్వగుణమువలన అంతట సుఖములు కలుగును. అన్నింటివలన సుఖము కలుగుటవలన వాటియందు ప్రీతి కలుగును. అందుచేత సత్వగుణము ప్రీత్యాత్మకము).
(సత్వగుణమువలన జ్ఞానము కలుగును).
“అధికసత్వాత్ జ్ఞానం, ఆత్మ యాధాత్మ్య అపరోక్ష జ్ఞానం జాయతే”.
(సత్వగుణము అధికముగా నుండుటచేత అపరోక్షజ్ఞానము ఆత్మయొక్క నిజతత్వజ్ఞానము కలుగును).
జ్ఞానం యథా తథా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత ||“. (శ్ర్రీమద్భగవద్గీత - 14 -11)
(సర్వ ద్వారేషు, ఆత్మనః ఉపలబ్ది ద్వ్రాణి శ్రోత్రాదీని సర్వాణి కరణాని తేషు సర్వేషు ద్వారేషు అంతః కరణస్య బుద్ధేః వ్యాప్తిః ప్రకాశః, ఉపజాయతే, తదేన జ్ఞానం, యదా యేవం ప్రకాశో జ్ఞానాఖ్యః ఉపజాయతే తదా జ్ఞాన ప్రకాశేన లింగేన విద్యాత్ వివృద్ధం ఉద్భూతం సత్వం ఇతి (శ్రీశంకరః)
(ఎప్పుడు ఈ శరీరములోని ద్వారములైన శ్రోత్రము మొదలగు ఇంద్రియములు ఆత్మ తన చైతన్యశక్తిచేత వాటిని తమ వృత్తులను చేయగలుగునట్లు చేయుచుండునో, అందువలన బుద్ధి ప్రకాశించుచుండునో అప్పుడు సత్వగుణము బాగుగా వృద్ధిపొందియున్నదని తెలియనగును)
తదోత్తమవిదాం లోకాన్ అంలాన్ ప్రతిపద్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 14 - 14)
“సత్వే ప్రవృద్ధే మృతః ఆత్మవిదాం కులేషు జనిత్వా ఆత్మ యాథాత్మ్య జ్ఞానసాధనేషు పుణ్య కర్మసు అధికరోతి” (శ్రీమాన్ రామానుజః)
(సత్వగుణము వృద్ధిపొంది యుండగా మరణించినవాడు గొప్ప జ్ఞానులు, నిర్మలమైనవారు నివసించులోకమును పొందెదరు, ఆత్మజ్ఞానము సంపాదించు కర్మలను చేయుదురు).
(సత్వగుణము రజోగునమును తమోగుణమునణచి వేయగలుగును - శరీరములోని త్రిగుణములు సమానముగా నున్న ఆరోగ్యము - ఒకగుణము మిగిలిన రెండింటిని అణచి వేయగలుగును. దానిని బట్టి ఆ ప్రబలిన గుణముల దోషములవలన శరీరారోగ్యము మారుచుండును, రజస్తమోగుణములను అనచివేసి సత్వగుణము ప్రబలముగా నున్నపుడు బ్రహ్మయాథాత్మ్య జ్ఞానము కలుగును).
(సత్వగుణము అధికముగా గలవారు ఊర్ధ్వలోకములను, మనుష్య గంధర్వ లోకములనుండి సత్యలోకము (బ్రహ్మలోకమువఱకు గల లోకములను చెందుదురు)
(సత్యవృతి కలిగియుండుటవలన రజోగుణముయొక్క, తమోగుణముయొక్క వృత్తులను, వ్యాపారములను జయించవచ్చును. సత్వమును సత్వముచేతనే జయింపవచ్చును - (సత్వముచేతననగా, సత్యము, దయ మొదలగు ఉపశమములచేత అని అర్థము - సాత్విక పదార్థముల సేవించుటచేత సత్వ గుణము వృద్ధియగును)
(సత్వగుణము సుఖముతో కలిగియుండుటే ప్రథానముగా గలది, సుఖమును కలిగించునది - జ్ఞానము కలిగియుండుటకూడ సుఖమును కలిగించుటకే).
(శ్రీమాన్ రామాను జః)
(జ్ఞానద్వారములైన కండ్లు మొదలగువాటియందు - కండ్లు మొదలగువాటిద్వారా - వస్తువుయొక్క యదార్థరూపము తెలియబడుచున్నపుడు ఆ దేహమందు సత్వగుణము వృద్ధి అయినది యని తెలుసుకొనవలెను)
(శ్రీమాన్ రామానుజః)
(సత్వముయొక్క స్వరూపము నిర్మలమైనదగుటచేత ప్రకాశము. ప్రకాశసుభావరణ స్వభావము లేనందున నిర్మలము. ప్రకాశ సుఖ జననైకాంత స్వభావమువలన ప్రకాశ సుఖములకు కారణమైనవి. ప్రకాశము వస్తువుయొక్క యాధాత్మ్యమును బోధించునది అనామయము - ఆమయయమను కార్యము లేనిది. అనామయం - రోగము లేకుండుటకు కారణమైనది. సత్వమను పేరుగల గుణము దేహిని సుఖ సంగమువలన, జ్ఞానసంగమువలన బంధము కలిగించును - అనగా, పురుషునికి సుఖసంగము, జ్ఞానముతో సంగము కలిగించును - జ్ఞానసంగము, సుఖసంగము కలుగగనే వాటికి లౌకిక సాధనములు, వైదిక సాధనములును ప్రవర్తించును - దానివలన దాని ఫలముననుభవించు సాధనములైన యోనులందు జన్మించును - ఈ రీతిగా సత్వము సుఖ సంగము వలనను, జ్ఞానసంగము వలనను పురుషునికి బంధము కలుగచేయును - జ్ఞాన సుఖ జనకములలో సంగ జననము సత్వం అని చెప్పబడును).
“కాష్టంబుకంటె ధూమంబు, ధూమంబుకంటె త్రయీమయంబైన వహ్ని యెట్లు విశేషంబగునట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మ ప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 -)
“సత్వగుణంబు వలన మనసాద్యంతఃకరణ చతుష్టయం శ్రోత్రాది జ్ఞానేంద్రియ పంచకంబును బుట్టును”. (వివేకచింతామణి -)
“సత్వం సత్వవతామహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 36)
(సత్వగుణము గలవారిలోని సత్వగుణము నేనే - భగవంతుడే).
భక్తి యుతముగ జిత్తంబు భవ్యమగును
హృదయ పద్మంబునం దోలి నెఱుగబడిన
యట్టి నీకు నమస్కారమయ్య, వరద”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 428)
(1) శుద్ధ సత్వము - రజస్తమో గుణములు కలియనిది
(2) మలిన సత్వము - రజస్తమోగుణములతో కలిసినది.
satvamu, rajassu, tamamu anu prakṛti guṇamulalō modaṭidi.
“satvaṃ rajastama iti guṇāḥ prakṛti saṃbhavāḥ |
nibadhnaṃti mahābāhō dēhē dēhinamavyayaṃ |
tatra satvaṃ nirmalatvāt prakāśaka manāmayaṃ |
sukha saṃgēna badhnāti jñāna saṃgēna cānagha ||“. (śrīmadbhagavadgīta - 14 - 5,6)
(satvamu, rajassu, tamamu anu mūḍuguṇamulu prakṛtivalana kaliginavi. ivi dēhi ayina jīvuni dēhamaṃdu baṃdhiṃcucunnavi. vāṭilō satvaguṇamu nirmalamainadaguṭacēta - śuddhamainadaguṭacēta, jñānamunu kaligiṃcuṭacēta baṃdhamu kalugacēyucunnadi).
(satvaguṇamuvalana aṃtaṭa sukhamulu kalugunu. anniṃṭivalana sukhamu kaluguṭavalana vāṭiyaṃdu prīti kalugunu. aṃducēta satvaguṇamu prītyātmakamu).
(satvaguṇamuvalana jñānamu kalugunu).
“adhikasatvāt jñānaṃ, ātma yādhātmya aparōkṣa jñānaṃ jāyatē”.
(satvaguṇamu adhikamugā nuṃḍuṭacēta aparōkṣajñānamu ātmayokka nijatatvajñānamu kalugunu).
jñānaṃ yathā tathā vidyāt vivṛddhaṃ satvamityuta ||“. (śrrīmadbhagavadgīta - 14 -11)
(sarva dvārēṣu, ātmanaḥ upalabdi dvrāṇi śrōtrādīni sarvāṇi karaṇāni tēṣu sarvēṣu dvārēṣu aṃtaḥ karaṇasya buddhēḥ vyāptiḥ prakāśaḥ, upajāyatē, tadēna jñānaṃ, yadā yēvaṃ prakāśō jñānākhyaḥ upajāyatē tadā jñāna prakāśēna liṃgēna vidyāt vivṛddhaṃ udbhūtaṃ satvaṃ iti (śrīśaṃkaraḥ)
(eppuḍu ī śarīramulōni dvāramulaina śrōtramu modalagu iṃdriyamulu ātma tana caitanyaśakticēta vāṭini tama vṛttulanu cēyagalugunaṭlu cēyucuṃḍunō, aṃduvalana buddhi prakāśiṃcucuṃḍunō appuḍu satvaguṇamu bāgugā vṛddhipoṃdiyunnadani teliyanagunu)
tadōttamavidāṃ lōkān aṃlān pratipadyatē ||” (śrīmadbhagavadgīta - 14 - 14)
“satvē pravṛddhē mṛtaḥ ātmavidāṃ kulēṣu janitvā ātma yāthātmya jñānasādhanēṣu puṇya karmasu adhikarōti” (śrīmān rāmānujaḥ)
(satvaguṇamu vṛddhipoṃdi yuṃḍagā maraṇiṃcinavāḍu goppa jñānulu, nirmalamainavāru nivasiṃculōkamunu poṃdedaru, ātmajñānamu saṃpādiṃcu karmalanu cēyuduru).
(satvaguṇamu rajōgunamunu tamōguṇamunaṇaci vēyagalugunu - śarīramulōni triguṇamulu samānamugā nunna ārōgyamu - okaguṇamu migilina reṃḍiṃṭini aṇaci vēyagalugunu. dānini baṭṭi ā prabalina guṇamula dōṣamulavalana śarīrārōgyamu mārucuṃḍunu, rajastamōguṇamulanu anacivēsi satvaguṇamu prabalamugā nunnapuḍu brahmayāthātmya jñānamu kalugunu).
(satvaguṇamu adhikamugā galavāru ūrdhvalōkamulanu, manuṣya gaṃdharva lōkamulanuṃḍi satyalōkamu (brahmalōkamuvaṟaku gala lōkamulanu ceṃduduru)
(satyavṛti kaligiyuṃḍuṭavalana rajōguṇamuyokka, tamōguṇamuyokka vṛttulanu, vyāpāramulanu jayiṃcavaccunu. satvamunu satvamucētanē jayiṃpavaccunu - (satvamucētananagā, satyamu, daya modalagu upaśamamulacēta ani arthamu - sātvika padārthamula sēviṃcuṭacēta satva guṇamu vṛddhiyagunu)
(satvaguṇamu sukhamutō kaligiyuṃḍuṭē prathānamugā galadi, sukhamunu kaligiṃcunadi - jñānamu kaligiyuṃḍuṭakūḍa sukhamunu kaligiṃcuṭakē).
(śrīmān rāmānu jaḥ)
(jñānadvāramulaina kaṃḍlu modalaguvāṭiyaṃdu - kaṃḍlu modalaguvāṭidvārā - vastuvuyokka yadārtharūpamu teliyabaḍucunnapuḍu ā dēhamaṃdu satvaguṇamu vṛddhi ayinadi yani telusukonavalenu)
(śrīmān rāmānujaḥ)
(satvamuyokka svarūpamu nirmalamainadaguṭacēta prakāśamu. prakāśasubhāvaraṇa svabhāvamu lēnaṃduna nirmalamu. prakāśa sukha jananaikāṃta svabhāvamuvalana prakāśa sukhamulaku kāraṇamainavi. prakāśamu vastuvuyokka yādhātmyamunu bōdhiṃcunadi anāmayamu - āmayayamanu kāryamu lēnidi. anāmayaṃ - rōgamu lēkuṃḍuṭaku kāraṇamainadi. satvamanu pērugala guṇamu dēhini sukha saṃgamuvalana, jñānasaṃgamuvalana baṃdhamu kaligiṃcunu - anagā, puruṣuniki sukhasaṃgamu, jñānamutō saṃgamu kaligiṃcunu - jñānasaṃgamu, sukhasaṃgamu kalugaganē vāṭiki laukika sādhanamulu, vaidika sādhanamulunu pravartiṃcunu - dānivalana dāni phalamunanubhaviṃcu sādhanamulaina yōnulaṃdu janmiṃcunu - ī rītigā satvamu sukha saṃgamu valananu, jñānasaṃgamu valananu puruṣuniki baṃdhamu kalugacēyunu - jñāna sukha janakamulalō saṃga jananamu satvaṃ ani ceppabaḍunu).
“kāṣṭaṃbukaṃṭe dhūmaṃbu, dhūmaṃbukaṃṭe trayīmayaṃbaina vahni yeṭlu viśēṣaṃbagunaṭlu tamōguṇaṃbukaṃṭe rajōguṇaṃbu, rajōguṇaṃbukaṃṭe brahma prakāśaṃbagu satvaguṇaṃbu viśiṣṭaṃbagu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 -)
“satvaguṇaṃbu valana manasādyaṃtaḥkaraṇa catuṣṭayaṃ śrōtrādi jñānēṃdriya paṃcakaṃbunu buṭṭunu”. (vivēkaciṃtāmaṇi -)
“satvaṃ satvavatāmahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 36)
(satvaguṇamu galavārilōni satvaguṇamu nēnē - bhagavaṃtuḍē).
bhakti yutamuga jittaṃbu bhavyamagunu
hṛdaya padmaṃbunaṃ dōli neṟugabaḍina
yaṭṭi nīku namaskāramayya, varada”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 428)
(1) śuddha satvamu - rajastamō guṇamulu kaliyanidi
(2) malina satvamu - rajastamōguṇamulatō kalisinadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.