రస్యాః స్నిగ్థాః ఆహారాః సాత్విక ప్రియాః || (శ్రీమద్భగవద్గీత - 17 - 8)
“రసోపేతాః, స్నేహవంతః దేహే చిరకాలస్థాయినః, హృదయప్రియాః, ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్థనాః - దేహేస్థిరాః = చిరకాల స్థాయినః నత దైవ ఫక్వాః భవంతి తథాహి ఆజ్యాదయః” (శ్రీ ఆనందతీర్థః)
(తదా ఏవ = అచిరకాల ఏవ; పక్వాః నిర్వృత్తపాకాః - చిరకాలం దేహే గుణప్రదాః ఇత్యర్థః. (శీ జయతీర్థమునిః)
(ఆయుర్దాయమును, సత్వమును, బలమైన ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని వృద్ధి చేయునవి - రసము (సారము) గలవి - ఎండిపోయినవి, వాడిపోయినవి కానివి - నెయ్యి మొదలగు చమురు గలవియు, దేహములో చిరకాలముండునవియు - అనగా, అప్పుడే పక్వమునకు రానివి (శరీరములోనికి వెళ్ళిన తర్వాత పక్వమునకు వచ్చుట ఆరంభించునవి, చిరకాలము దేహములో వాటి గుణమును నిలిపి యుంచునవి) ఇవి సత్వగుణముగలవారి ఆహారము -
(ధాతు వృద్ధిని, జ్ఞానమును, ఆరోగ్యమును, ఆయుర్వృద్ధిని, శారీరక మానసిక బలమును వృద్ది చేయునవియగు నెయ్యి. తేనె, వెన్న, పాలు, మినుములు, గోధుమలు, పెసలు - ఇవి సాత్వికాహారము).
(లోకములో ఉన్మాదమును కలిగించు ద్రవ్యమలను తినుటచే ఉద్వేగమును కలిగించు కర్మల ద్వారా పురుషునకు అప్రీతి నివృద్ధి పొందునట్లే, ఆ ప్రకారముగానే సత్వగుణమునకు కారణమైనవిన్నీ, శుభమైనవి, లోకములో ఉపకారము చేయునవిన్నీ, పరలోకమున హితములైనటువంటిన్నీ అయిన కర్మలందు ప్రేరేపించి దాని ద్వారా ప్రీతిని కలిగించును).
(ఆహారము శుద్ధమైనదైన యడల సత్వము శుద్ధిగానుండును. ఆహారమును బట్టి మనస్తత్వమేర్పడును. మనస్సు బుద్ధి ప్రకృతికి సంబంధించినవి. ఆహార వస్తువులుకూడ ప్రకృతికి సంబంధించినవే. అందుచేత సాత్వికాహారము వలన సాత్విక మనస్సు కలుగును - సాత్వికాగారమువలన శరీరము నిష్కల్మషముగా నుండుటచేత అందుకోని భగవదంశ యగు జీవుడు - శుద్ధమైన అద్దములోవలె - శరీరములో ప్రకాశించును. (Tell me what you eat and I will tell you what you are) (After Savarin).
rasyāḥ snigthāḥ āhārāḥ sātvika priyāḥ || (śrīmadbhagavadgīta - 17 - 8)
“rasōpētāḥ, snēhavaṃtaḥ dēhē cirakālasthāyinaḥ, hṛdayapriyāḥ, āyussatva balārōgya sukhaprīti vivarthanāḥ - dēhēsthirāḥ = cirakāla sthāyinaḥ nata daiva phakvāḥ bhavaṃti tathāhi ājyādayaḥ” (śrī ānaṃdatīrthaḥ)
(tadā ēva = acirakāla ēva; pakvāḥ nirvṛttapākāḥ - cirakālaṃ dēhē guṇapradāḥ ityarthaḥ. (śī jayatīrthamuniḥ)
(āyurdāyamunu, satvamunu, balamaina ārōgyamunu, sukhamunu, prītini vṛddhi cēyunavi - rasamu (sāramu) galavi - eṃḍipōyinavi, vāḍipōyinavi kānivi - neyyi modalagu camuru galaviyu, dēhamulō cirakālamuṃḍunaviyu - anagā, appuḍē pakvamunaku rānivi (śarīramulōniki veḷḷina tarvāta pakvamunaku vaccuṭa āraṃbhiṃcunavi, cirakālamu dēhamulō vāṭi guṇamunu nilipi yuṃcunavi) ivi satvaguṇamugalavāri āhāramu -
(dhātu vṛddhini, jñānamunu, ārōgyamunu, āyurvṛddhini, śārīraka mānasika balamunu vṛddi cēyunaviyagu neyyi. tēne, venna, pālu, minumulu, gōdhumalu, pesalu - ivi sātvikāhāramu).
(lōkamulō unmādamunu kaligiṃcu dravyamalanu tinuṭacē udvēgamunu kaligiṃcu karmala dvārā puruṣunaku aprīti nivṛddhi poṃdunaṭlē, ā prakāramugānē satvaguṇamunaku kāraṇamainavinnī, śubhamainavi, lōkamulō upakāramu cēyunavinnī, paralōkamuna hitamulainaṭuvaṃṭinnī ayina karmalaṃdu prērēpiṃci dāni dvārā prītini kaligiṃcunu).
(āhāramu śuddhamainadaina yaḍala satvamu śuddhigānuṃḍunu. āhāramunu baṭṭi manastatvamērpaḍunu. manassu buddhi prakṛtiki saṃbaṃdhiṃcinavi. āhāra vastuvulukūḍa prakṛtiki saṃbaṃdhiṃcinavē. aṃducēta sātvikāhāramu valana sātvika manassu kalugunu - sātvikāgāramuvalana śarīramu niṣkalmaṣamugā nuṃḍuṭacēta aṃdukōni bhagavadaṃśa yagu jīvuḍu - śuddhamaina addamulōvale - śarīramulō prakāśiṃcunu. (Tell me what you eat and I will tell you what you are) (After Savarin).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.