← Back to స · Booklets 51–60 (digitized file 6)

సావిత్రీ sāvitrī

Original — తెలుగు
  1. సూయతే ప్రాణి ప్రసవంకరోతి సావిత్రీ - ఇతి వ్యుత్పత్తేః -

(ప్రాణులను - జీవులను పుట్టింపచేయునది, పుట్టించునది అని సావిత్రి యను పదమునకు ఉత్పత్యర్థము చెప్పబడినది).

  1. “సవితుశ్చాధి దేవీయా మంత్రాధి ష్టాతృ దేవతా |

సావిత్రీహ్యపి వేదానాం సావిత్రీ తేన కీర్తితా ||“. (శ్రీదేవీభాగవతము)

(సూర్యమండలాత్మక సవితురధి దేవీ తదంతర్యామీ బ్రహ్మరూపిణీ మంత్రః సూర్యాతర్గత బ్రహ్మ ప్రతిపాదకో గాయత్రీ రూపః, తదధిష్ఠాత్రీ చ దేవతా యదః, తతో భగవత్యాః గాయత్ర్యాః సావిత్రీ నామ ఇత్యర్థః. సవితురియం సావిత్రీతి వ్యుత్పత్తేః. కించ వేదానాం సావిత్రీ జననీ, తేషాం ఉత్పాదనకర్త్రీ భవతి. తతః అపి సావితీనామ.

(సూర్యమండలము సవిత యని చెప్పబడుచున్నది. ఆ సూర్యమండలములో అంతర్యామిగా (లోపల శక్తి రూపముతో) సంచరించునది; ఆ సూర్యమండలమునకు వేడిమిని, శక్తిని (Energy), కాంతిని ఇచ్చుటకు కారణమైనది - “యదాతూగతం తేజః - - తత్తేజో విద్ధి మామకం” (సూర్యునిలో నున్న తేజస్సు నాదియని తెలుసుకొనుము). సూర్యునిలోనుండు పరబ్రహ్మాత్మకమైన గాయత్రీ రూపము కలది. గాయత్రీ మంత్రమునకు అధిష్ఠాన దేవత అయినది. ఇందుచేతనే భగవతి అయిన గాయత్రికి సావిత్రి అను పేరు కలిగినది. సవితా అనగా సూర్యుడు, సూర్యునకు సంబంధించినది కనుక సావిత్రి యని పదమునకు ఉత్పత్యర్థము. వేదములను ఉత్పాదించినది - పుట్టించునది, వేదములకు తల్లి, అందువలన కూడా సావిత్రీ యను పేరు కలిగినది).

  1. సవితుః ప్రేరకస్య అంతర్యామిణః సంబంధినీ -

(సవిత యనగా సూర్యుడు - ప్రేరకుడు - అన్నింటికి తన కిరణములద్వారా శక్తినిచ్చి వాటి వాటి పనులలో ప్రేరేపించువాడు). (That which gives Enery to all living creatures). సూర్యుని లోపలనుండి ప్రేరేపించుశక్తి, దానికి సంబందించినది కనుక సావిత్రి. సూర్యుని తేజస్సునకు, కాంతికి, శక్తికి కారణమైనది).

  1. సవితః ద్యోతనాత్ సైవ సావిత్రీ ప్రకీర్తితా -

(సూర్యుని యొక్క ద్యోతన శక్తి అగుటవలన సావిత్రి యని చెప్పబడినది).

  1. యా సంధ్యా సాజగత్సూతిః మాయా తీతా హి నిష్కళా |

ఈశ్వరీ కేవలా శక్తిః తత్వత్రయ సముద్భవా |

స చ జీవాత్మనోర్భిన్నా గాయత్రీ బ్రహ్మరూపిణీ |

చిచ్చాయావేశితశ్శక్తిః చేతనేన విభాతి సా ||.

(మాయకు అతీతమైనది, నిష్కలము, ప్రపంచమును సృష్టించినదియు సంధ్యా యను పేరుగలదియు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు - లేక, బ్రహ్మ, ప్రకృతి జీవుడు, అను మూడు తత్వముల ఏకరూపము కేవలము (ఉన్నదంతయు ఆమెయే - దేవియే) శక్తి స్వరూపమైన ఈశ్వరి. ఈశ్వరి జీవుని కంటె ఆత్మకంటె వేఱు అయినది, గాయత్రి యని చెప్పబడుచున్నది; పరబ్రహ్మ స్వరూపమైనది - చైతన్య రూపమైనది - జీవులలోని చైతన్యరూపముగా తెలియబడుచున్నది).

  1. “సావిత్రీ పాదత్రయాత్, వేదత్రయ,లోకత్రయ, అగ్న్యాది తేజస్త్రయ పూర్వక సర్వ బ్రహ్మాండ సృష్టిః సావిత్రీ త ఏవోక్తా తథా సర్వ వేదేషు, పురాణేషు చ”.

(సావిత్రి మూడు పాదములు మూడు వేదములు - ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము; అగ్ని మొదలగు మూడు తేజస్సులు, అనగా, అగ్ని, సూర్యుడు, చంద్రుడు - వీటితో కూడిన బ్రహ్మాండ సృష్టియే సావిత్రియని వేదములు,పురణములు చెప్పుచున్నవి).

  1. సరస్వతి; పార్వతి.

  2. “సవితుర్ద్యోతికత్వాచ్చ భక్తేష్ట ప్రసవేరతా |

చరాచర ప్రసవితా సావిత్రీ కమలా స్మృతా ||“. (శ్రీవేంకటేశమాహత్మ్యము - 11 - 11)

(సూర్యుని లోపలనుండి అతనిని ప్రకాశింపచేటవలను, భక్తుల కోరికలను సఫలము చేయుటయందును, రక్తిగలది యగుటచేతను చరాచర రూపములుగల జగత్తును సృష్టించనదగుటచేతను, శ్రీమహాలక్ష్మియే సావిత్రియని చెప్పబడుచున్నది).

Transliteration
  1. sūyatē prāṇi prasavaṃkarōti sāvitrī - iti vyutpattēḥ -

(prāṇulanu - jīvulanu puṭṭiṃpacēyunadi, puṭṭiṃcunadi ani sāvitri yanu padamunaku utpatyarthamu ceppabaḍinadi).

  1. “savituścādhi dēvīyā maṃtrādhi ṣṭātṛ dēvatā |

sāvitrīhyapi vēdānāṃ sāvitrī tēna kīrtitā ||“. (śrīdēvībhāgavatamu)

(sūryamaṃḍalātmaka savituradhi dēvī tadaṃtaryāmī brahmarūpiṇī maṃtraḥ sūryātargata brahma pratipādakō gāyatrī rūpaḥ, tadadhiṣṭhātrī ca dēvatā yadaḥ, tatō bhagavatyāḥ gāyatryāḥ sāvitrī nāma ityarthaḥ. savituriyaṃ sāvitrīti vyutpattēḥ. kiṃca vēdānāṃ sāvitrī jananī, tēṣāṃ utpādanakartrī bhavati. tataḥ api sāvitīnāma.

(sūryamaṃḍalamu savita yani ceppabaḍucunnadi. ā sūryamaṃḍalamulō aṃtaryāmigā (lōpala śakti rūpamutō) saṃcariṃcunadi; ā sūryamaṃḍalamunaku vēḍimini, śaktini (Energy), kāṃtini iccuṭaku kāraṇamainadi - “yadātūgataṃ tējaḥ - - tattējō viddhi māmakaṃ” (sūryunilō nunna tējassu nādiyani telusukonumu). sūryunilōnuṃḍu parabrahmātmakamaina gāyatrī rūpamu kaladi. gāyatrī maṃtramunaku adhiṣṭhāna dēvata ayinadi. iṃducētanē bhagavati ayina gāyatriki sāvitri anu pēru kaliginadi. savitā anagā sūryuḍu, sūryunaku saṃbaṃdhiṃcinadi kanuka sāvitri yani padamunaku utpatyarthamu. vēdamulanu utpādiṃcinadi - puṭṭiṃcunadi, vēdamulaku talli, aṃduvalana kūḍā sāvitrī yanu pēru kaliginadi).

  1. savituḥ prērakasya aṃtaryāmiṇaḥ saṃbaṃdhinī -

(savita yanagā sūryuḍu - prērakuḍu - anniṃṭiki tana kiraṇamuladvārā śaktinicci vāṭi vāṭi panulalō prērēpiṃcuvāḍu). (That which gives Enery to all living creatures). sūryuni lōpalanuṃḍi prērēpiṃcuśakti, dāniki saṃbaṃdiṃcinadi kanuka sāvitri. sūryuni tējassunaku, kāṃtiki, śaktiki kāraṇamainadi).

  1. savitaḥ dyōtanāt saiva sāvitrī prakīrtitā -

(sūryuni yokka dyōtana śakti aguṭavalana sāvitri yani ceppabaḍinadi).

  1. yā saṃdhyā sājagatsūtiḥ māyā tītā hi niṣkaḷā |

īśvarī kēvalā śaktiḥ tatvatraya samudbhavā |

sa ca jīvātmanōrbhinnā gāyatrī brahmarūpiṇī |

ciccāyāvēśitaśśaktiḥ cētanēna vibhāti sā ||.

(māyaku atītamainadi, niṣkalamu, prapaṃcamunu sṛṣṭiṃcinadiyu saṃdhyā yanu pērugaladiyu. brahma viṣṇu mahēśvarulu - lēka, brahma, prakṛti jīvuḍu, anu mūḍu tatvamula ēkarūpamu kēvalamu (unnadaṃtayu āmeyē - dēviyē) śakti svarūpamaina īśvari. īśvari jīvuni kaṃṭe ātmakaṃṭe vēṟu ayinadi, gāyatri yani ceppabaḍucunnadi; parabrahma svarūpamainadi - caitanya rūpamainadi - jīvulalōni caitanyarūpamugā teliyabaḍucunnadi).

  1. “sāvitrī pādatrayāt, vēdatraya,lōkatraya, agnyādi tējastraya pūrvaka sarva brahmāṃḍa sṛṣṭiḥ sāvitrī ta ēvōktā tathā sarva vēdēṣu, purāṇēṣu ca”.

(sāvitri mūḍu pādamulu mūḍu vēdamulu - ṛgvēdamu, sāmavēdamu, yajurvēdamu; agni modalagu mūḍu tējassulu, anagā, agni, sūryuḍu, caṃdruḍu - vīṭitō kūḍina brahmāṃḍa sṛṣṭiyē sāvitriyani vēdamulu,puraṇamulu ceppucunnavi).

  1. sarasvati; pārvati.

  2. “saviturdyōtikatvācca bhaktēṣṭa prasavēratā |

carācara prasavitā sāvitrī kamalā smṛtā ||“. (śrīvēṃkaṭēśamāhatmyamu - 11 - 11)

(sūryuni lōpalanuṃḍi atanini prakāśiṃpacēṭavalanu, bhaktula kōrikalanu saphalamu cēyuṭayaṃdunu, raktigaladi yaguṭacētanu carācara rūpamulugala jagattunu sṛṣṭiṃcanadaguṭacētanu, śrīmahālakṣmiyē sāvitriyani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.