← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శేషుడు śēṣuḍu

Original — తెలుగు
  1. ఆది శేషువు; విష్ణువు; బలరాముడు.

  2. శర్వ నాశేసతి అవశిష్టః -

(అన్నియును నశించిపోగా మిగిలియుండువాడు - విష్ణువొక్కడే)

  1. స్వమాత్రత్వం అవశిష్టత్వాత్ -

(పరతత్వమొక్కటే మిగిలియుండుటచేత శేషుడు)

  1. “స్వయం మృత్వా స్వయం భూత్వా స్వయమేవావ శిష్యతే” ఇతి శ్రుతేః -

(తానే చనిపోయి, తానే తిరిగి పుట్టి, తానే మిగిలి యుండువాడు - ప్రపంచరూపములో పుటి ప్రపంచరూపములో చనిపోయి - లయమైపోయి, తానే మిగిలియుండువాడు.)

  1. ఆది శేషువు - సృష్టికిముందుండి - సృష్టి నశించగా మిగిలియుండువాడు.

  2. “బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగంబులు నశింపగ పెద్ద భూతగణమౌ

సూక్ష్మభూతమందు జొరగ, ప్రకృతి వోయి వ్యక్తమందు జొరగ, వ్యక్తమడంగను

శేష సంజ్ఞ నీవు సెలువమగుదు - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 -)

  1. శేషత్వం నామ చందన కుసుమ తాంబూలాదివత్ తస్య ఇష్ట వినియోగార్హత్వం - శేషత్వం వినియోగార్హత్వం-

(చందనము, పువ్వులు, తాంబూలములవలె భగవంతునికి వినియోగపడుటకు తగియుండుట - కైంకర్యము).

  1. “శయ్యాసనం(ఆ)తప్త్రాదిరూపీ త్వత్పాద సేవకః |

శేషో బహు సహస్రాక్షః - ||“.

శేషొ మహత్తపస్తప్త్యా త్వమారాధ్య జగత్పతిం |

త్వత్ప్రసాదా న్మహా భాగ్యం యద్య ప్యాప సుదుర్లభం |

శయ్యాసనం పాదుకేచ హ్యత పత్రమభూత్తవ ||. (శ్రీవేంకటేశ మహాత్మ్యము - 2 - 47; 48)

(శేషుడు గొప్ప తపస్సు చేసి జగత్పతివైన నిన్ను (శ్రీవేంకటేశుని) ఆరాధించి, నీ ప్రసాదమువలన దుర్లభమైన గొప్ప భాగ్యమును పొందెను. నీకు శయ్యగాను, పాదుకలుగాని గొడుగుగాను ఆయెను).

(“పడక, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలకడ, ఛత్రము, చాందినీ మున్నగు విధముల సర్వేశ్వరునకు తన సరీరమును భిన్న భిన్న రూపములుగ కూర్చి యుపయోగిపడినవాడు శేషుడు”).

  1. “జీవుడు పరమాత్మకే చెందినవాడుకాడు. తనకుగాని, ఇతరులకుగాని చెందినవాడు కాడు.”- - - తాను చేయగలిగిన వ్యపారములయందు పరమాత్మచే నియోగింపబడి ప్రవర్తించును - ఆ వ్యాపరములచే గలుగు ఫలము పరమాత్మకే చెందును - అందుచే పరార్థమైన ప్రవృత్తి గలవాడు - జీవుడు -. పరార్థమై యుండు దానిని శేషమందురు-

  2. “అగ్నేశ్శేషం, ఋణాచ్ఛేషం శత్రోశ్శేషం న శేషయేత్ ||”.

(అగ్నియొక్క శేషముగాని, ఋనముయొక్క శేషముగాని, శత్రువుయొక్క శేషముగాని మిగల్చకూడది - అగ్నిశేషమున్నయడల అది మరల రగుల్కొని విజృంభించును - ఋణము శేషించియుంచిన అది వడ్డీతో వృద్ధిపొందును - శతౄశేషము మిగిలియున్న శత్రువు మరల బ;లమౌను సమకూర్చుకొని ఎత్తుకొని రాగలడు).

Transliteration
  1. ādi śēṣuvu; viṣṇuvu; balarāmuḍu.

  2. śarva nāśēsati avaśiṣṭaḥ -

(anniyunu naśiṃcipōgā migiliyuṃḍuvāḍu - viṣṇuvokkaḍē)

  1. svamātratvaṃ avaśiṣṭatvāt -

(paratatvamokkaṭē migiliyuṃḍuṭacēta śēṣuḍu)

  1. “svayaṃ mṛtvā svayaṃ bhūtvā svayamēvāva śiṣyatē” iti śrutēḥ -

(tānē canipōyi, tānē tirigi puṭṭi, tānē migili yuṃḍuvāḍu - prapaṃcarūpamulō puṭi prapaṃcarūpamulō canipōyi - layamaipōyi, tānē migiliyuṃḍuvāḍu.)

  1. ādi śēṣuvu - sṛṣṭikimuṃduṃḍi - sṛṣṭi naśiṃcagā migiliyuṃḍuvāḍu.

  2. “brahma reṃḍava yarthaṃbu tudi jagaṃbulu naśiṃpaga pedda bhūtagaṇamau

sūkṣmabhūtamaṃdu joraga, prakṛti vōyi vyaktamaṃdu joraga, vyaktamaḍaṃganu

śēṣa saṃjña nīvu seluvamagudu - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 -)

  1. śēṣatvaṃ nāma caṃdana kusuma tāṃbūlādivat tasya iṣṭa viniyōgārhatvaṃ - śēṣatvaṃ viniyōgārhatvaṃ-

(caṃdanamu, puvvulu, tāṃbūlamulavale bhagavaṃtuniki viniyōgapaḍuṭaku tagiyuṃḍuṭa - kaiṃkaryamu).

  1. “śayyāsanaṃ(ā)taptrādirūpī tvatpāda sēvakaḥ |

śēṣō bahu sahasrākṣaḥ - ||“.

śēṣo mahattapastaptyā tvamārādhya jagatpatiṃ |

tvatprasādā nmahā bhāgyaṃ yadya pyāpa sudurlabhaṃ |

śayyāsanaṃ pādukēca hyata patramabhūttava ||. (śrīvēṃkaṭēśa mahātmyamu - 2 - 47; 48)

(śēṣuḍu goppa tapassu cēsi jagatpativaina ninnu (śrīvēṃkaṭēśuni) ārādhiṃci, nī prasādamuvalana durlabhamaina goppa bhāgyamunu poṃdenu. nīku śayyagānu, pādukalugāni goḍugugānu āyenu).

(“paḍaka, āsanamu, vastramu, pādukalu, talakaḍa, chatramu, cāṃdinī munnagu vidhamula sarvēśvarunaku tana sarīramunu bhinna bhinna rūpamuluga kūrci yupayōgipaḍinavāḍu śēṣuḍu”).

  1. “jīvuḍu paramātmakē ceṃdinavāḍukāḍu. tanakugāni, itarulakugāni ceṃdinavāḍu kāḍu.”- - - tānu cēyagaligina vyapāramulayaṃdu paramātmacē niyōgiṃpabaḍi pravartiṃcunu - ā vyāparamulacē galugu phalamu paramātmakē ceṃdunu - aṃducē parārthamaina pravṛtti galavāḍu - jīvuḍu -. parārthamai yuṃḍu dānini śēṣamaṃduru-

  2. “agnēśśēṣaṃ, ṛṇācchēṣaṃ śatrōśśēṣaṃ na śēṣayēt ||”.

(agniyokka śēṣamugāni, ṛnamuyokka śēṣamugāni, śatruvuyokka śēṣamugāni migalcakūḍadi - agniśēṣamunnayaḍala adi marala ragulkoni vijṛṃbhiṃcunu - ṛṇamu śēṣiṃciyuṃcina adi vaḍḍītō vṛddhipoṃdunu - śatṝśēṣamu migiliyunna śatruvu marala ba;lamaunu samakūrcukoni ettukoni rāgalaḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.