← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శిక్ష śikṣa

Original — తెలుగు

వేదాంగము. దీని కర్త పాణిని. వేదశబ్దములందు అక్షరములయొక్క స్థానజ్ఞానము, మఱియు ఉదాత్తానుదాత్త స్వరితములు, 1; 2; 3 వీటియొక్క జ్ఞానము శిక్షవలన కలుగును. వేదముల వ్యాఖ్యాన రూపమైన అనేక విధ ప్రాతి శాఖ్య గ్రంధములు ఏవి గలవో అవియును శిక్షకు అంతర్భూతములుగా నున్నవి.

“శిక్ష వేదములకు రెండవ అంగము - వేదపఠనమునకు, దాని కంఠస్థమునకు వలయు మార్గములనిది తెలుపును. వర్ణములయొక్క భావోత్పత్తిని, వానికి గల గుణములను దేహమునందే యే స్థానమునుండి యే యంగమునుండి ప్రయత్నపూర్వకముగ శబ్ద ముచ్చ్రింపబడునో ఆయా స్థానములను, వాని నామధేయములను, వానికి సంబంధించిన శాసనములను ఈ శాస్త్రము బోధించును. వద ఋక్కులయందు గల పద ప్రయోగ విధానము, దాని యుచ్ఛారణా విధానము, పదమునకు పదమునకు మధ్య గలుగు సంధుల విథానము, సందులలోగల తారతమ్యము మున్నగు నంశములను శిక్షా శాస్త్రము విశదీకరించును - పదముల యుచ్ఛారణా విధానములో జరుగు పొరపాటుల వలన గలుగు ననర్థములను, ఇతరులకు నష్టము కలుగచేయవలయునన్న మంత్రముల నుచ్చరించు విధాన క్రమమును, లాభము కలుగ చేయవలయునన్న నట్టి క్రమమును మున్నగు విషయములు శిక్షా శాస్త్రమునందలి చర్చనీయాంశములు” - (చూడుము - “శీక్షా”).

Transliteration

vēdāṃgamu. dīni karta pāṇini. vēdaśabdamulaṃdu akṣaramulayokka sthānajñānamu, maṟiyu udāttānudātta svaritamulu, 1; 2; 3 vīṭiyokka jñānamu śikṣavalana kalugunu. vēdamula vyākhyāna rūpamaina anēka vidha prāti śākhya graṃdhamulu ēvi galavō aviyunu śikṣaku aṃtarbhūtamulugā nunnavi.

“śikṣa vēdamulaku reṃḍava aṃgamu - vēdapaṭhanamunaku, dāni kaṃṭhasthamunaku valayu mārgamulanidi telupunu. varṇamulayokka bhāvōtpattini, vāniki gala guṇamulanu dēhamunaṃdē yē sthānamunuṃḍi yē yaṃgamunuṃḍi prayatnapūrvakamuga śabda muccriṃpabaḍunō āyā sthānamulanu, vāni nāmadhēyamulanu, vāniki saṃbaṃdhiṃcina śāsanamulanu ī śāstramu bōdhiṃcunu. vada ṛkkulayaṃdu gala pada prayōga vidhānamu, dāni yucchāraṇā vidhānamu, padamunaku padamunaku madhya galugu saṃdhula vithānamu, saṃdulalōgala tāratamyamu munnagu naṃśamulanu śikṣā śāstramu viśadīkariṃcunu - padamula yucchāraṇā vidhānamulō jarugu porapāṭula valana galugu nanarthamulanu, itarulaku naṣṭamu kalugacēyavalayunanna maṃtramula nuccariṃcu vidhāna kramamunu, lābhamu kaluga cēyavalayunanna naṭṭi kramamunu munnagu viṣayamulu śikṣā śāstramunaṃdali carcanīyāṃśamulu” - (cūḍumu - “śīkṣā”).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.