← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శివః śivaḥ

Original — తెలుగు
  1. “నిస్త్రై గుణ్యతయా శుద్ధత్వాత్ శివం” (శ్రీశంకరః)

(సత్వరజస్తమములను త్రిగుణములు లేనివాడగుటచేత శివుడని చెప్పబడుచున్నాడు - పరిశుద్ధుడు).

  1. శివ ప్రదః; శుభావహః; సౌమ్యరూపః -

(మంగలమును - ఆనందమును - ఇచ్చువాడు; శుభము కలుగచేయువాడు; సౌమ్యరూపము గలవాడు)

  1. సర్వమస్మిన్ శేతే ఇతి శివః; సర్వస్మిన్ సేతే ఇతి వా శివః -

(అన్నియు ఇతనియందే శయనించి యుండును; - కనుక శివుడని చెప్పబడుచున్నాడు - పురిశయనాత్ పురుషః = పురమందు - ఉపాధియందు శయనించి యుండువాడు - కనుక శివుడు)

  1. ఆయురారోగ్యమైశ్వర్యం విత్తం కామాశ్చ పుష్కలాన్ |

సదదాతి మనుష్యేభ్యః స చ న క్షీయతే పినః |

శివమిచ్చన్ పురుషాణాం తస్మా దేష శివః స్మృతః ||. (మహాభారతే)

(శుభమును కోరు పురుషులకు ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, కోరికలు పుష్కలముగానిచ్చువాడు కనుక శివుడని చెప్పబడుచున్నాడు).

  1. “స్వనామస్తుతి పాత్రేణ పావయన్ శివః” (శ్రీశంకరః)

(తన నామమును స్తోత్రము చేసినంత మాత్రమున పావనము చేయువాడు)

  1. అపరిమిత కల్యాణ పుణ్య స్వభావః -

(పరిమితి లేని - అంతము లేని కల్యాణ పుణ్య స్వభావము కలవాడు).

  1. శ్రేయః - భక్త కల్యాణదాయీ -

(శ్రేయస్సు కలుగచేయువాడు - శ్రేయస్సు తానే అయినవాడు, భక్తులకు శుభము కలుగచేయువాడు)

  1. శివఏవ పరం బ్రహ్మ కారణం జగతో(అ)వ్యయం |

తతో విష్ణు స్తతోత్వం చ, బ్రహ్మాన్ సర్వమభూత్ జగత్ ||. (బ్రహ్మాండపురాణే)

(అవ్యయుడైన శివుడే జగత్తుకు కారణము - జగత్తును పుట్టించినవాడు - పరబ్రహ్మ. అతని నుండే చతుర్ముఖబ్రహ్మ, విష్ణువు పుట్టిరి.)

  1. సర్వానన శిరోగ్రీవ స్సర్వా భూత గుహాశయః |

సర్వ వ్యాపీ చ భగవాన్ తాస్మాత్ సర్వాగతిః శివాః ||. (వాయువీయ సంహితాయాం)

(సమస్త ప్రాణుల ఆననములు, శిరస్సులు, కంఠములు శివునవే, సమస్త భూతముల హృదయమందు శయనించువాడు శివుడే; అన్నింటిలోను వ్యాపించియుండువాడు అందుచేత శివుడు అన్నింటియందుండువాడు)

  1. “సర్వమన్యత్ పరిత్యజ్య శివ ఏవ శివం కరః |

ధ్యేయ ఇత్యాహ పరమా శ్రుతి రాధర్వణీ ఖలు ||“. (పరాశరోప పురాణము)

(మిగిలినవాటినన్నింటిని విడిచిపెట్టి శివుడే శుభమును - మంగళమును - కూర్చువాడు. అందుచేత ధ్యానము చేయతగినవాడు - అని ఉత్కృష్టమైన అధర్వణ శ్రుతి చెప్పుచున్నది).

  1. “భోక్తారః పశివస్సర్వే శివో భోజయితా పరః ||”.

(అజ్ఞానులగుటవలన పశువులతో సమానమైన జనులందరు భోక్తలు - పుణ్యపాపఫలములననుభవించువారు - శివుడు అనుభవింపచేయువాడు)

  1. “విద్యాసు శ్రుతిరుత్కృష్టారు ద్రైకాదశినీ శ్రుతౌ |

తత్ర పంచాక్షరీ తస్యాం శివ ఇత్యక్షర ద్వయం ||“. (శ్రీమద్భాగవతే)

(విద్యలందు వేదము ఉత్కృష్టమైనది, వేదములో రుద్రైకారశీ శ్రేష్టము, అందులో పంచాక్షరీమంత్రము శ్రేష్తమైనది. దానిలో శివః అను రెండక్షరములు శ్రేష్టమైనవి)

  1. “సర్వసామేవ విద్యానాయుత్కృష్టా శ్రుతిరుచ్యతే |

ఋగ్యజస్సామ వేదానాం శతరుద్రీయముత్తమం |

ఏకాదశాను వా కానామష్టమస్త్విష్టదాయకః |

త్రయస్త్రిం శన్మనూనాంతు షణ్మంతాఃసిద్ధి దాయకాః |

షణ్ణాం మనూనాం ద్వాదేవతయోరాద్యాః ప్రశస్యతే |

తన్మధ్యే పరతత్వం స్యాచ్ఛివ ఇత్యక్షర ద్వయం |

పంచాక్షరీ శివపదేన విభాతి రుద్రాధ్యాయ స్తయా స్ఫురతి తేన చతుర్ధకాండః |

కాండేన సర్వయజురేవ విభాతి తేన ఋక్సామ మధ్యమణినాచ విభాతి వేదాః ||“. (బ్రహ్మవైవర్తే)

విద్యలన్నింటిలోను (వేదము) ఉత్కృష్టమైనది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములలో శతరుద్రీయము ఉత్తమమైనది. ఏకాదశ అనువాకములలోను ఎనిమిదవది ఇష్టదాయకము - ముప్పదిమూడు మంత్రములలోను రెండు మంత్రములు వాటిలో మొదటిది ప్రశస్తమైనది. దానిలో పరతత్వమగు “శివ” అను రెండక్షరములున్నవి - పంచాక్షరీమంత్రము - ఓం నమశ్శివాయ - లో శివ అను పదమున్నది. దానివలన రుద్రాధ్యాయము (శతరుద్రీయము) స్ఫురణకు వచ్చును - దానివలన చతుర్దకాండ స్ఫురణకు వచ్చును - చతుర్దకాండవలన యజుర్వేదమంతయు స్ఫురణకు వచ్చును - దానివలన ఋగ్వేదము, సామవేదము స్ఫురించును)

  1. “శివస్వరూపో భగవాన్ శిచాధిష్టాతృ దేవతా |

శివం భవతి తస్మాచ్చ శివం తేన విదుర్భుథాః ||“. (దేవీభాగవతం)

(మంగళస్వరూపుడు, మంగళమునకధిదేవత అగుటవలన, ఇతనివలన మంగళము కలుగును కనుక ఈతను శువుడు అని పండితులు చెప్పుదురు)

  1. అనాది మల సంశ్లేష ప్రాగభవాత్ స్వభావతః |

అత్యంత పరిశుద్ధాత్మేనత్యతో(అ)యం శివ ఉచ్యతే |

అధవా అశేష కల్యాణ గుణైకఘన ఈశ్వరః |

శివ ఇంత్యుచతే సద్భిః శివశబ్దార్ధ వేదినిః || (కూర్మపురాణే)

(స్వభావముచేత పరిశుద్ధుడు, అనాదికాలమునుండి ఏ విధమైన దోషములు లేనివాడు కనుక శివుడు అని చెప్పబడుచున్నాడు - లేక, - ‘శివుడు’ అను మాటకు అర్ధము తెలిసిన సత్పురుషులు కల్యానగుణముల గని అయినవాడు అని చెప్పుదురు)

  1. శివత్సం నిరుపాధిక శుద్ధమత్వం -

(ఉపాధి లేకుండుటవలన శుద్ధముగా నుండుటే శివత్వము)

  1. “సీ. అనయంబు శివయను నస్ఖరద్వయ మర్థి వాక్కున కలుక, భావమున దలప

సర్వజీవపాప సంఘముల్ సెడు - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 4 - 87)

  1. విష్ణువు - “సర్వశ్శర్వశ్శివః” -

“తస్యాః శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవ స్తి తః |

సబ్రహ్మ, సశివ స్సహరిస్సేంద్రస్సో (అ)కరః పరమస్వరాట్ ||“. (మంత్రపుష్పము - 12)

(పరమాత్మయే బ్రహ్మ, శివుడు, హరి(విష్ణువు), ఇంద్రుడు, అక్షరుడు, పరముడు, స్వరాట్).

(ఇన్ని రూపములు ధరించినవాడొకడే -)

Transliteration
  1. “nistrai guṇyatayā śuddhatvāt śivaṃ” (śrīśaṃkaraḥ)

(satvarajastamamulanu triguṇamulu lēnivāḍaguṭacēta śivuḍani ceppabaḍucunnāḍu - pariśuddhuḍu).

  1. śiva pradaḥ; śubhāvahaḥ; saumyarūpaḥ -

(maṃgalamunu - ānaṃdamunu - iccuvāḍu; śubhamu kalugacēyuvāḍu; saumyarūpamu galavāḍu)

  1. sarvamasmin śētē iti śivaḥ; sarvasmin sētē iti vā śivaḥ -

(anniyu itaniyaṃdē śayaniṃci yuṃḍunu; - kanuka śivuḍani ceppabaḍucunnāḍu - puriśayanāt puruṣaḥ = puramaṃdu - upādhiyaṃdu śayaniṃci yuṃḍuvāḍu - kanuka śivuḍu)

  1. āyurārōgyamaiśvaryaṃ vittaṃ kāmāśca puṣkalān |

sadadāti manuṣyēbhyaḥ sa ca na kṣīyatē pinaḥ |

śivamiccan puruṣāṇāṃ tasmā dēṣa śivaḥ smṛtaḥ ||. (mahābhāratē)

(śubhamunu kōru puruṣulaku āyurdāyamu, ārōgyamu, aiśvaryamu, dhanamu, kōrikalu puṣkalamugāniccuvāḍu kanuka śivuḍani ceppabaḍucunnāḍu).

  1. “svanāmastuti pātrēṇa pāvayan śivaḥ” (śrīśaṃkaraḥ)

(tana nāmamunu stōtramu cēsinaṃta mātramuna pāvanamu cēyuvāḍu)

  1. aparimita kalyāṇa puṇya svabhāvaḥ -

(parimiti lēni - aṃtamu lēni kalyāṇa puṇya svabhāvamu kalavāḍu).

  1. śrēyaḥ - bhakta kalyāṇadāyī -

(śrēyassu kalugacēyuvāḍu - śrēyassu tānē ayinavāḍu, bhaktulaku śubhamu kalugacēyuvāḍu)

  1. śivaēva paraṃ brahma kāraṇaṃ jagatō(a)vyayaṃ |

tatō viṣṇu statōtvaṃ ca, brahmān sarvamabhūt jagat ||. (brahmāṃḍapurāṇē)

(avyayuḍaina śivuḍē jagattuku kāraṇamu - jagattunu puṭṭiṃcinavāḍu - parabrahma. atani nuṃḍē caturmukhabrahma, viṣṇuvu puṭṭiri.)

  1. sarvānana śirōgrīva ssarvā bhūta guhāśayaḥ |

sarva vyāpī ca bhagavān tāsmāt sarvāgatiḥ śivāḥ ||. (vāyuvīya saṃhitāyāṃ)

(samasta prāṇula ānanamulu, śirassulu, kaṃṭhamulu śivunavē, samasta bhūtamula hṛdayamaṃdu śayaniṃcuvāḍu śivuḍē; anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu aṃducēta śivuḍu anniṃṭiyaṃduṃḍuvāḍu)

  1. “sarvamanyat parityajya śiva ēva śivaṃ karaḥ |

dhyēya ityāha paramā śruti rādharvaṇī khalu ||“. (parāśarōpa purāṇamu)

(migilinavāṭinanniṃṭini viḍicipeṭṭi śivuḍē śubhamunu - maṃgaḷamunu - kūrcuvāḍu. aṃducēta dhyānamu cēyataginavāḍu - ani utkṛṣṭamaina adharvaṇa śruti ceppucunnadi).

  1. “bhōktāraḥ paśivassarvē śivō bhōjayitā paraḥ ||”.

(ajñānulaguṭavalana paśuvulatō samānamaina janulaṃdaru bhōktalu - puṇyapāpaphalamulananubhaviṃcuvāru - śivuḍu anubhaviṃpacēyuvāḍu)

  1. “vidyāsu śrutirutkṛṣṭāru draikādaśinī śrutau |

tatra paṃcākṣarī tasyāṃ śiva ityakṣara dvayaṃ ||“. (śrīmadbhāgavatē)

(vidyalaṃdu vēdamu utkṛṣṭamainadi, vēdamulō rudraikāraśī śrēṣṭamu, aṃdulō paṃcākṣarīmaṃtramu śrēṣtamainadi. dānilō śivaḥ anu reṃḍakṣaramulu śrēṣṭamainavi)

  1. “sarvasāmēva vidyānāyutkṛṣṭā śrutirucyatē |

ṛgyajassāma vēdānāṃ śatarudrīyamuttamaṃ |

ēkādaśānu vā kānāmaṣṭamastviṣṭadāyakaḥ |

trayastriṃ śanmanūnāṃtu ṣaṇmaṃtāḥsiddhi dāyakāḥ |

ṣaṇṇāṃ manūnāṃ dvādēvatayōrādyāḥ praśasyatē |

tanmadhyē paratatvaṃ syācchiva ityakṣara dvayaṃ |

paṃcākṣarī śivapadēna vibhāti rudrādhyāya stayā sphurati tēna caturdhakāṃḍaḥ |

kāṃḍēna sarvayajurēva vibhāti tēna ṛksāma madhyamaṇināca vibhāti vēdāḥ ||“. (brahmavaivartē)

vidyalanniṃṭilōnu (vēdamu) utkṛṣṭamainadi. ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamulalō śatarudrīyamu uttamamainadi. ēkādaśa anuvākamulalōnu enimidavadi iṣṭadāyakamu - muppadimūḍu maṃtramulalōnu reṃḍu maṃtramulu vāṭilō modaṭidi praśastamainadi. dānilō paratatvamagu “śiva” anu reṃḍakṣaramulunnavi - paṃcākṣarīmaṃtramu - ōṃ namaśśivāya - lō śiva anu padamunnadi. dānivalana rudrādhyāyamu (śatarudrīyamu) sphuraṇaku vaccunu - dānivalana caturdakāṃḍa sphuraṇaku vaccunu - caturdakāṃḍavalana yajurvēdamaṃtayu sphuraṇaku vaccunu - dānivalana ṛgvēdamu, sāmavēdamu sphuriṃcunu)

  1. “śivasvarūpō bhagavān śicādhiṣṭātṛ dēvatā |

śivaṃ bhavati tasmācca śivaṃ tēna vidurbhuthāḥ ||“. (dēvībhāgavataṃ)

(maṃgaḷasvarūpuḍu, maṃgaḷamunakadhidēvata aguṭavalana, itanivalana maṃgaḷamu kalugunu kanuka ītanu śuvuḍu ani paṃḍitulu ceppuduru)

  1. anādi mala saṃślēṣa prāgabhavāt svabhāvataḥ |

atyaṃta pariśuddhātmēnatyatō(a)yaṃ śiva ucyatē |

adhavā aśēṣa kalyāṇa guṇaikaghana īśvaraḥ |

śiva iṃtyucatē sadbhiḥ śivaśabdārdha vēdiniḥ || (kūrmapurāṇē)

(svabhāvamucēta pariśuddhuḍu, anādikālamunuṃḍi ē vidhamaina dōṣamulu lēnivāḍu kanuka śivuḍu ani ceppabaḍucunnāḍu - lēka, - ‘śivuḍu’ anu māṭaku ardhamu telisina satpuruṣulu kalyānaguṇamula gani ayinavāḍu ani ceppuduru)

  1. śivatsaṃ nirupādhika śuddhamatvaṃ -

(upādhi lēkuṃḍuṭavalana śuddhamugā nuṃḍuṭē śivatvamu)

  1. “sī. anayaṃbu śivayanu naskharadvaya marthi vākkuna kaluka, bhāvamuna dalapa

sarvajīvapāpa saṃghamul seḍu - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 4 - 87)

  1. viṣṇuvu - “sarvaśśarvaśśivaḥ” -

“tasyāḥ śśikhāyā madhyē paramātmā vyava sti taḥ |

sabrahma, saśiva ssaharissēṃdrassō (a)karaḥ paramasvarāṭ ||“. (maṃtrapuṣpamu - 12)

(paramātmayē brahma, śivuḍu, hari(viṣṇuvu), iṃdruḍu, akṣaruḍu, paramuḍu, svarāṭ).

(inni rūpamulu dhariṃcinavāḍokaḍē -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.