స్నానములు మూడు రకములు - నైమిత్తికము, నిత్యము, కామ్యము. అస్పృస్యత స్పర్శనము, నిద్రపోయి లేచుట, మలవిసర్జనము మొదలగు సందర్భములలో కలిగిన అశుచిని పోగొట్టుకొనుటకై చేయు స్నానము నైమిత్తికము - ప్రాతఃకాల సంధ్యాది కృత్యములు, మాధ్యాహ్నిక సంధ్యాది కృత్యములు చేసుకొను నధికారము కలుగుటకై చేయు స్నానములు నిత్యములు, ఏకాదశి, అమావశ్య మొదలగు పర్వములయందు పుణ్యకామనతో చేయు స్నానము కామ్యము.
“శ్లో||. తతస్తుగత్వా సద్యాదౌ ప్రాతస్నానం విశోధనం |
సమాచరేన్ముని శ్రేష్ట దేహ సంశుద్ధి హేతువే |
అత్యంత మలినో దేహో నవద్వారైర్మలం వహన్ |
తదాస్త్వే తచ్చోదదాయ ప్రాతస్నానం విధీయతే |
తస్మాత్ చరేత్ స్నానం విధీయతే |
- - - అస్నాతస్య క్రియా సర్వా భవంతి విఫలాయతః |
తస్మాత్ చరేత్ స్నానం నిత్యమేవ దినే దినే ||“. (శ్రీదేవీభాగవతం)
(దేహము నవద్వారములు మలముతో నిండియుండుటచేత చాలా మలినమైనది - కల్మషముతో నిండియుండునది - అందుచేత నది మొదలగు వాటికి వెళ్ళి దేహమును శుద్ధి చేయుటకు ప్రాతస్నానము చేయవలయును - స్నానము చేయనివాడు చేసిన కార్యములన్నియు విఫలములే - ఫలము లేనివే యగును - అందుచేత ప్రతిరోజు స్నానము చేయవలయును).
snānamulu mūḍu rakamulu - naimittikamu, nityamu, kāmyamu. aspṛsyata sparśanamu, nidrapōyi lēcuṭa, malavisarjanamu modalagu saṃdarbhamulalō kaligina aśucini pōgoṭṭukonuṭakai cēyu snānamu naimittikamu - prātaḥkāla saṃdhyādi kṛtyamulu, mādhyāhnika saṃdhyādi kṛtyamulu cēsukonu nadhikāramu kaluguṭakai cēyu snānamulu nityamulu, ēkādaśi, amāvaśya modalagu parvamulayaṃdu puṇyakāmanatō cēyu snānamu kāmyamu.
“ślō||. tatastugatvā sadyādau prātasnānaṃ viśōdhanaṃ |
samācarēnmuni śrēṣṭa dēha saṃśuddhi hētuvē |
atyaṃta malinō dēhō navadvārairmalaṃ vahan |
tadāstvē taccōdadāya prātasnānaṃ vidhīyatē |
tasmāt carēt snānaṃ vidhīyatē |
- - - asnātasya kriyā sarvā bhavaṃti viphalāyataḥ |
tasmāt carēt snānaṃ nityamēva dinē dinē ||“. (śrīdēvībhāgavataṃ)
(dēhamu navadvāramulu malamutō niṃḍiyuṃḍuṭacēta cālā malinamainadi - kalmaṣamutō niṃḍiyuṃḍunadi - aṃducēta nadi modalagu vāṭiki veḷḷi dēhamunu śuddhi cēyuṭaku prātasnānamu cēyavalayunu - snānamu cēyanivāḍu cēsina kāryamulanniyu viphalamulē - phalamu lēnivē yagunu - aṃducēta pratirōju snānamu cēyavalayunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.