(వ్యాహృతులు నాలుగు విధములుగా చెప్పబడుచున్నవి: -
(1) “భూః” అనగా ఈ లోకము; భువః అనగా అంతరిక్షము; “సువః” అనగా ఈ లోకము; “మహః” అనగా ఆదిత్యుడు, ఆదిత్యుని చేతనే సమస్త లోకములు ప్రకాశము చేయబడుచున్నవి.
(2) “భూః” అనగా అగ్ని; “భువః” అనగా వాయువు, “సువః” అనగా ఆదిత్యుడు; “మహః” అనగా చంద్రుడు - ఈ చంద్రునిచేతనే నక్షత్రములన్నియు (ప్రకాశరూపములన్నియు) ప్రకాశింప చేయబడుచున్నవి)
(3) “భూః” అనగా ఋగ్వేదము, “భువః”అనగా సామవేదము, “సువః” అనగా యజుర్వేదము, “మహః” అనగా బ్రహ్మ - బ్రహ్మవలననే వేదములన్నియు ప్రకాశము చేయబడుచున్నవి.
(4) “భూః” అనగా ప్రాణము, “భువః” అనగా అపానము, “సువః” అనగా వ్యానము, “మహః” అనగా అన్నము - అన్నము చేతనే ప్రాణములన్నియు ప్రకాశించుచున్నవి.
పైన చెప్పిన ప్రకారము నాలుగు వ్యాహృతులు ఒక్కొక్కటి నాలుగు విధములుగా చెప్పబడినందున ఇవన్నియు కలిసి పదహారు వ్యాహృతులు అని తైత్తెరీయోపనిషత్తు చెప్పుచున్నది.
(శ్రీరంగరామానుజః)
(భూః అను మొదలగునవి వ్యాహృతులు నాలుగే అయినను పైన చెప్పబడిన ప్రకారము ఒక్కొక్కటి నాలుగుగా నున్నవి. అందుచేత మొత్తము పదహారు వ్యాహృతులని చెప్పబడినవి).
(vyāhṛtulu nālugu vidhamulugā ceppabaḍucunnavi: -
(1) “bhūḥ” anagā ī lōkamu; bhuvaḥ anagā aṃtarikṣamu; “suvaḥ” anagā ī lōkamu; “mahaḥ” anagā ādityuḍu, ādityuni cētanē samasta lōkamulu prakāśamu cēyabaḍucunnavi.
(2) “bhūḥ” anagā agni; “bhuvaḥ” anagā vāyuvu, “suvaḥ” anagā ādityuḍu; “mahaḥ” anagā caṃdruḍu - ī caṃdrunicētanē nakṣatramulanniyu (prakāśarūpamulanniyu) prakāśiṃpa cēyabaḍucunnavi)
(3) “bhūḥ” anagā ṛgvēdamu, “bhuvaḥ”anagā sāmavēdamu, “suvaḥ” anagā yajurvēdamu, “mahaḥ” anagā brahma - brahmavalananē vēdamulanniyu prakāśamu cēyabaḍucunnavi.
(4) “bhūḥ” anagā prāṇamu, “bhuvaḥ” anagā apānamu, “suvaḥ” anagā vyānamu, “mahaḥ” anagā annamu - annamu cētanē prāṇamulanniyu prakāśiṃcucunnavi.
paina ceppina prakāramu nālugu vyāhṛtulu okkokkaṭi nālugu vidhamulugā ceppabaḍinaṃduna ivanniyu kalisi padahāru vyāhṛtulu ani taitterīyōpaniṣattu ceppucunnadi.
(śrīraṃgarāmānujaḥ)
(bhūḥ anu modalagunavi vyāhṛtulu nālugē ayinanu paina ceppabaḍina prakāramu okkokkaṭi nālugugā nunnavi. aṃducēta mottamu padahāru vyāhṛtulani ceppabaḍinavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.