← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శ్రద్ధా śraddhā

Original — తెలుగు
  1. ఆస్తిక్య బుద్ధిః

(‘కలడు’ - ‘దేవుడు కలడు’ అను బుద్ధి కలిగియుండుట)

  1. సర్వత్రాస్తికతా శ్రద్ధా

(అన్నింటియందును - అన్నిచోట్ల కలడు అను భావము కలిగియుండుట)

  1. కర్మసు ఆస్తిక్య బుద్ధిః -

(కర్మలు చేయునపుడు దీనికి ఫలము కలిగియుండుట. భగవంతుడున్నాడను నమ్మకముతో కర్మలు చేయుట.)

  1. అదృష్టార్థేషు కర్మసు ఆస్తిక్య బుద్ధిః, దేవతాదిషు చ.

(ప్రయోజనము కనబడని కర్మలు చేయుటలోను, దేవతలందును నమ్మకము కలిగి చేయుట)

  1. “శాస్త్రస్య గురువాక్యస్య సత్యా బుద్ధ్యావధారణా |

సా శ్రద్ధ కథితా సద్భిః యయావస్తూవలభ్యతే ||“. (వివేకచూడామణి)

(శాస్త్రమునందును గురువు చెప్పినదానియందును ‘ఇది సత్యమైనది, నిజమైనది’ అను బుద్ధి కలిగియుండుట. ఎట్టి శ్రద్ధచేత బ్రహ్మజ్ఞానము కలుగునో అదియే శ్రద్ధ)

  1. “గురు వేదాంత వాక్యేషు శ్రద్ధాస్తిశ్యమతిః స్మృతా ||”. (గీతాభావప్రకాశము - 4 - 234)

(గురువు చెప్పిన వాక్యములందు, వేదాంతవాక్యముకందు - ఉపనిషత్తులలోను బ్రహ్మను గుఱించి చెప్పిన వాక్యములందు ‘అవి నిజమైనవి’ అను బుద్ధి - నమ్మకము - కలిగియుండుట)

  1. గురూపదిష్ట వేదాంత వాక్యేషు విశ్వాసః శ్రద్ధా, దృఢతర విశ్వాసః - ఆస్తిక్యం -

(గురువు ఉపదేశించిన వేదాంతవాక్యములందు దృఢమైన నమ్మకము - ఆస్తిక్యబుద్ధి)

  1. “యస్యతు ఈశ్వరా చార్య వేదవాక్యాదిషు పూజ్యత్వ గ్రహేణ ప్రేమాతిసయరూపా నిరతిశయ భక్తిః సంజాయతే తస్యైవ వేదశాస్త్రాచార్యాదిషు శ్రద్ధా జాయతే, నేతరస్య. అతః శ్రద్ధాభక్తిం అపేక్షతే.”

(భగవంతుని యందును, గురువునందును, ఉపనిషద్వాక్యములందును “ఇవి పూజ్యములు - పూజించ తగినవి” అని గ్రహించి గొప్ప భక్తి ఎవనికి కలుగునో అటి వానికే వేదములందును, శాస్త్రములందును, గురువునందును, మొదలగువాటియందు శ్రద్ధ కలుగును - ఇతరులకు భక్తిలేనివారికి, శ్రద్ధ కలుగదు. అందుచేత భక్తియుండిననే శ్రద్ధ కలుగును.)

  1. స్వాభిమతం సాధయతి ఏతత్ ఇతి విశ్వాస పూర్వికా సాధనే త్వరా -

(తన అభిమతమును - కోరికను - ఇది సాధించును అను నమ్మకముతో చేయు సాధన).

  1. విశ్వాసం తథా శ్రద్ధాం వినా తు కించిదపి న భవతి. సంశయాత్మనస్తు పతనమేవ భవతి - “సంశయాత్మా వినశ్యతి”

(శ్రీమద్భగవద్గీత - 4 - 40)

(నమ్మకము, శ్రద్ధా లేనిదే ఏ పని యైనను నెఱవేరదు. సంశయించినవాడు పతితుడగును. “సంశయించువాడు నశించును” అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పియున్నాడు)

  1. అదేవ విద్యయా కరోతి, శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి (ఛాందోగ్యము - 1 - 1 - 10)

(దేనిని జ్ఞానముతోను - చేయుచున్నదాని యర్థము తెలుసుకొని - ఉపనిషత్తులలో చెప్పినదానియందు శ్రద్ధ కలిగి, చేయునో అది మిక్కిలి శ్రద్ధవంతమగును).

  1. పురుషార్థ సాధనోపాయః -

(ధర్మార్థ కామ మోక్షములను నాలుగు విధముల పురుషార్థములను సాధించుటకు ఉపాయము)

  1. “భగవంతునియందలి శ్రద్దయు - - - అపవర్గదంబగు తత్కథా శ్రవణాదులయందత్యతాసక్తియు, పుణ్య తీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 -)

  2. “శ్లో ||. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |

సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తం శౄణు ||“. (శ్రీభగవద్గీత - 17 - 2)

(దేహులకు శ్రద్ధ మూడు విధములు - అది వారి వారి స్వభావములన కలుగును - సాత్వికీ శ్రద్ధా, రాజసీ శ్రద్ధా, తామసీ శ్రద్ధా).

శ్రద్ధా త్రివిదా - సాత్వికీ, రాజసీ, తామసీ - సాత్వికీ సత్య నిర్వృత్త, దేవ పూజాది విషయా, రాజసీ రాజో నిర్వృత్తా, యక్ష రక్షః పూజాది విషయా, తామసీ తమో నిర్వృత్తా - ప్రేత పొఇశాచ పూజాది విషయా.

(శ్రద్ధ మూడు విధములు - సాత్వికీ శ్రద్ధా, రాజసీ శ్రద్ధా, తామసీ శ్రద్ధ. సత్వగుణము కలది సాత్వికీ శ్రద్ధ - దేవతులకు పూజ చేయుట మొదలగునవి. రాజసీ శ్రద్ధ రజోగుణము కలది - యక్షులును, రాక్షసులును పూజచేయుట మొదలగునవి. తామసీ శ్రద్ధ - తమోగుణము గలది. ప్రేతములకు, పిశాచములకు పూజచేయుట మొదలగునవి).

  1. “రజస్తమో మయీం త్యక్త్వా శ్రద్ధాం సవమయీం శ్రితః |

తత్వజ్ఞానే అధికారస్యాదితి సప్త దేశే స్థితం ||“.

(రాజసీ శ్రద్ధను, తామసీ శ్రద్ధను వదలి సాత్విక శ్రద్ధను అవలంభించువాడు తత్వజ్ఞానమందు - భగవత్తత్త్వమును తెలుసుకొనుటకు - అధికారి య్గును)

  1. “శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం” (తైత్తిరీయోపనిషత్)

(శ్రద్ధతో దానము చేయవలయును, శ్రద్ధ లేనిదే దానము చేయకూడదు)

  1. శ్రద్ధా దేవుడు, లేక, వైవస్వతుడు అను మనువుయొక్క భార్య - వీరి కుమారుడు ఇక్ష్వాకుడు -
Transliteration
  1. āstikya buddhiḥ

(‘kalaḍu’ - ‘dēvuḍu kalaḍu’ anu buddhi kaligiyuṃḍuṭa)

  1. sarvatrāstikatā śraddhā

(anniṃṭiyaṃdunu - annicōṭla kalaḍu anu bhāvamu kaligiyuṃḍuṭa)

  1. karmasu āstikya buddhiḥ -

(karmalu cēyunapuḍu dīniki phalamu kaligiyuṃḍuṭa. bhagavaṃtuḍunnāḍanu nammakamutō karmalu cēyuṭa.)

  1. adṛṣṭārthēṣu karmasu āstikya buddhiḥ, dēvatādiṣu ca.

(prayōjanamu kanabaḍani karmalu cēyuṭalōnu, dēvatalaṃdunu nammakamu kaligi cēyuṭa)

  1. “śāstrasya guruvākyasya satyā buddhyāvadhāraṇā |

sā śraddha kathitā sadbhiḥ yayāvastūvalabhyatē ||“. (vivēkacūḍāmaṇi)

(śāstramunaṃdunu guruvu ceppinadāniyaṃdunu ‘idi satyamainadi, nijamainadi’ anu buddhi kaligiyuṃḍuṭa. eṭṭi śraddhacēta brahmajñānamu kalugunō adiyē śraddha)

  1. “guru vēdāṃta vākyēṣu śraddhāstiśyamatiḥ smṛtā ||”. (gītābhāvaprakāśamu - 4 - 234)

(guruvu ceppina vākyamulaṃdu, vēdāṃtavākyamukaṃdu - upaniṣattulalōnu brahmanu guṟiṃci ceppina vākyamulaṃdu ‘avi nijamainavi’ anu buddhi - nammakamu - kaligiyuṃḍuṭa)

  1. gurūpadiṣṭa vēdāṃta vākyēṣu viśvāsaḥ śraddhā, dṛḍhatara viśvāsaḥ - āstikyaṃ -

(guruvu upadēśiṃcina vēdāṃtavākyamulaṃdu dṛḍhamaina nammakamu - āstikyabuddhi)

  1. “yasyatu īśvarā cārya vēdavākyādiṣu pūjyatva grahēṇa prēmātisayarūpā niratiśaya bhaktiḥ saṃjāyatē tasyaiva vēdaśāstrācāryādiṣu śraddhā jāyatē, nētarasya. ataḥ śraddhābhaktiṃ apēkṣatē.”

(bhagavaṃtuni yaṃdunu, guruvunaṃdunu, upaniṣadvākyamulaṃdunu “ivi pūjyamulu - pūjiṃca taginavi” ani grahiṃci goppa bhakti evaniki kalugunō aṭi vānikē vēdamulaṃdunu, śāstramulaṃdunu, guruvunaṃdunu, modalaguvāṭiyaṃdu śraddha kalugunu - itarulaku bhaktilēnivāriki, śraddha kalugadu. aṃducēta bhaktiyuṃḍinanē śraddha kalugunu.)

  1. svābhimataṃ sādhayati ētat iti viśvāsa pūrvikā sādhanē tvarā -

(tana abhimatamunu - kōrikanu - idi sādhiṃcunu anu nammakamutō cēyu sādhana).

  1. viśvāsaṃ tathā śraddhāṃ vinā tu kiṃcidapi na bhavati. saṃśayātmanastu patanamēva bhavati - “saṃśayātmā vinaśyati”

(śrīmadbhagavadgīta - 4 - 40)

(nammakamu, śraddhā lēnidē ē pani yainanu neṟavēradu. saṃśayiṃcinavāḍu patituḍagunu. “saṃśayiṃcuvāḍu naśiṃcunu” ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇuḍu ceppiyunnāḍu)

  1. adēva vidyayā karōti, śraddhayōpaniṣadā tadēva vīryavattaraṃ bhavati (chāṃdōgyamu - 1 - 1 - 10)

(dēnini jñānamutōnu - cēyucunnadāni yarthamu telusukoni - upaniṣattulalō ceppinadāniyaṃdu śraddha kaligi, cēyunō adi mikkili śraddhavaṃtamagunu).

  1. puruṣārtha sādhanōpāyaḥ -

(dharmārtha kāma mōkṣamulanu nālugu vidhamula puruṣārthamulanu sādhiṃcuṭaku upāyamu)

  1. “bhagavaṃtuniyaṃdali śraddayu - - - apavargadaṃbagu tatkathā śravaṇādulayaṃdatyatāsaktiyu, puṇya tīrthāvagāhana mahatsēvādulacē siddhiṃcu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 -)

  2. “ślō ||. trividhā bhavati śraddhā dēhināṃ sā svabhāvajā |

sātvikī rājasī caiva tāmasī cēti taṃ śṝṇu ||“. (śrībhagavadgīta - 17 - 2)

(dēhulaku śraddha mūḍu vidhamulu - adi vāri vāri svabhāvamulana kalugunu - sātvikī śraddhā, rājasī śraddhā, tāmasī śraddhā).

śraddhā trividā - sātvikī, rājasī, tāmasī - sātvikī satya nirvṛtta, dēva pūjādi viṣayā, rājasī rājō nirvṛttā, yakṣa rakṣaḥ pūjādi viṣayā, tāmasī tamō nirvṛttā - prēta poiśāca pūjādi viṣayā.

(śraddha mūḍu vidhamulu - sātvikī śraddhā, rājasī śraddhā, tāmasī śraddha. satvaguṇamu kaladi sātvikī śraddha - dēvatulaku pūja cēyuṭa modalagunavi. rājasī śraddha rajōguṇamu kaladi - yakṣulunu, rākṣasulunu pūjacēyuṭa modalagunavi. tāmasī śraddha - tamōguṇamu galadi. prētamulaku, piśācamulaku pūjacēyuṭa modalagunavi).

  1. “rajastamō mayīṃ tyaktvā śraddhāṃ savamayīṃ śritaḥ |

tatvajñānē adhikārasyāditi sapta dēśē sthitaṃ ||“.

(rājasī śraddhanu, tāmasī śraddhanu vadali sātvika śraddhanu avalaṃbhiṃcuvāḍu tatvajñānamaṃdu - bhagavattattvamunu telusukonuṭaku - adhikāri ygunu)

  1. “śraddhayā dēyaṃ aśraddhayā adēyaṃ” (taittirīyōpaniṣat)

(śraddhatō dānamu cēyavalayunu, śraddha lēnidē dānamu cēyakūḍadu)

  1. śraddhā dēvuḍu, lēka, vaivasvatuḍu anu manuvuyokka bhārya - vīri kumāruḍu ikṣvākuḍu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.