← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శుక్లం śuklaṃ

Original — తెలుగు
  1. శుద్ధం; అవిద్యా తత్కార్య వినుర్ముక్తం -

(శుద్ధమైనది - pure energy - అవిద్య, దాని కార్యములవలన కలుగు దోషములు లేనిది. అవిద్య యనగా ప్రకృతి. ప్రకృతి సత్వరజస్తమములను త్రిగుణములు కలది. ఈ త్రిగుణములవలననే అన్ని విధముల దోషములు కలుగుచున్నవి. త్రిగుణములు లేనివాడు వాటికి అతీతుడు. అందుచేత శుద్ధుడు - శుక్లము)

  1. ప్రాణ స్వరూపం (ప్రాణ రూపమైనది).

  2. చక్షుర్మధ్యే యత్తేజః తత్ శుక్లం.

(కండ్ల మధ్యనుండు తేజస్సు)

  1. నృ బీజం, శరీరోత్పత్తి కారణం, అనేక యోని ప్రాప్తలక్షణం.

(మానవ జన్మకు విత్తనము, శరీరము కలుగుటకు - జన్మకు - కారణము - అనేక యోనులందు పుట్టుచుండుటకు కారణమైనది) (చూడుము - శుక్రం)

  1. శుక్లాధిక్యము వలన పురుషుడు, శోణితాధిక్యం వల్ల స్త్రీ, శుక్ల శోణిత అస్మత్వం వల్ల నపుంసకుడు - అదెలాగంటే

శుక్లాధిక్యే భవేత్పుంసః, నారీ రక్తాధికే నతు |

శుక్ల రక్త సమత్వేన నపున్సకః ఇతీరితః ||. (బ్రహ్మవిద్యా సుధార్నవము - 1)

Transliteration
  1. śuddhaṃ; avidyā tatkārya vinurmuktaṃ -

(śuddhamainadi - pure energy - avidya, dāni kāryamulavalana kalugu dōṣamulu lēnidi. avidya yanagā prakṛti. prakṛti satvarajastamamulanu triguṇamulu kaladi. ī triguṇamulavalananē anni vidhamula dōṣamulu kalugucunnavi. triguṇamulu lēnivāḍu vāṭiki atītuḍu. aṃducēta śuddhuḍu - śuklamu)

  1. prāṇa svarūpaṃ (prāṇa rūpamainadi).

  2. cakṣurmadhyē yattējaḥ tat śuklaṃ.

(kaṃḍla madhyanuṃḍu tējassu)

  1. nṛ bījaṃ, śarīrōtpatti kāraṇaṃ, anēka yōni prāptalakṣaṇaṃ.

(mānava janmaku vittanamu, śarīramu kaluguṭaku - janmaku - kāraṇamu - anēka yōnulaṃdu puṭṭucuṃḍuṭaku kāraṇamainadi) (cūḍumu - śukraṃ)

  1. śuklādhikyamu valana puruṣuḍu, śōṇitādhikyaṃ valla strī, śukla śōṇita asmatvaṃ valla napuṃsakuḍu - adelāgaṃṭē

śuklādhikyē bhavētpuṃsaḥ, nārī raktādhikē natu |

śukla rakta samatvēna napunsakaḥ itīritaḥ ||. (brahmavidyā sudhārnavamu - 1)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.