← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వప్రకాశం svaprakāśaṃ

Original — తెలుగు
  1. “అనన్యాధీన ప్రకాశరూపం చిన్మయం ఇతి యావత్”. (విచారసాగరము)

(ఇతరుల ఆధీనములో నుండి కాక ప్రకాశించు రూపము కలది. ఇతరులమీద ఆధారపడక స్వయముగనే ప్రకాశించువాడు - చైతన్యమయుడు)

  1. స్వయమేవ ప్రకాశ స్వభావత్వం - చిన్మాత్ర శబ్ద వాచ్యత్వాత్ -

(స్వయముగనే ప్రకాశించు స్వభావము కలిగి యుండువాడు - చైతన్యమే రూపముగ గలవాడు అగుటచేత).

  1. ప్రమాణాంతర నైరపేక్ష్యేణ స్వయమేవ ప్రకాశిత ఇత్యర్థః -

(ఇంకొక ప్రమాణము అవసరము లేకుండగనే, స్వయముగనే ప్రకాశించువాడు - తెలియబడువాడు)

  1. ఎవని ప్రకాశింపచేయుటయందు తనుతప్ప మరెవ్వడును సమర్థుడుకాడో. మఱియు, అన్నింటిని ప్రకాశింపచేయువాడెవడో, వాడు స్వయంప్రకాశము).

  2. “ఆత్మ సంబోధవిషయం -”

(ఆత్మను - తనను - లేక పరమాత్మను - తెలియచేయువాడు తానే అయినవాడు)

  1. చైతన్య స్వభావతా హి స్వయం ప్రకాశతా - యః ప్రకాశస్వ భావః సో అనన్యాధీన ప్రకాశః, దీపవత్.

(చైతన్య స్వభావము కలిగియుండుటే స్వయముగా ప్రకాశించుట. ప్రకాశించుటకు దీపము వలె ఇతరుల ఆధీనములో నుండక స్వయముగా ప్రకాశించువాడు).

  1. సర్వం యః ప్రదీపవత్ ప్రకాశయతి, స్వభాస్య కామాది ఘటాద్య భావే ప్రకాశమాత్రతయా స్వయమివశిష్యతే - ఇతి చ తురీయోంకారః ప్రకాశః.

(దీపమువలె అన్నింటిని ఏది ప్రకాశింపచేయునో, తను ప్రకాశింపచేయువస్తువులు లేకపోయినను తానే ప్రకాశించుచు మిగిలియుండునో, అదియే తురీయము ఓంకారము - స్వయముగా ప్రకాశించునది).

Transliteration
  1. “ananyādhīna prakāśarūpaṃ cinmayaṃ iti yāvat”. (vicārasāgaramu)

(itarula ādhīnamulō nuṃḍi kāka prakāśiṃcu rūpamu kaladi. itarulamīda ādhārapaḍaka svayamuganē prakāśiṃcuvāḍu - caitanyamayuḍu)

  1. svayamēva prakāśa svabhāvatvaṃ - cinmātra śabda vācyatvāt -

(svayamuganē prakāśiṃcu svabhāvamu kaligi yuṃḍuvāḍu - caitanyamē rūpamuga galavāḍu aguṭacēta).

  1. pramāṇāṃtara nairapēkṣyēṇa svayamēva prakāśita ityarthaḥ -

(iṃkoka pramāṇamu avasaramu lēkuṃḍaganē, svayamuganē prakāśiṃcuvāḍu - teliyabaḍuvāḍu)

  1. evani prakāśiṃpacēyuṭayaṃdu tanutappa marevvaḍunu samarthuḍukāḍō. maṟiyu, anniṃṭini prakāśiṃpacēyuvāḍevaḍō, vāḍu svayaṃprakāśamu).

  2. “ātma saṃbōdhaviṣayaṃ -”

(ātmanu - tananu - lēka paramātmanu - teliyacēyuvāḍu tānē ayinavāḍu)

  1. caitanya svabhāvatā hi svayaṃ prakāśatā - yaḥ prakāśasva bhāvaḥ sō ananyādhīna prakāśaḥ, dīpavat.

(caitanya svabhāvamu kaligiyuṃḍuṭē svayamugā prakāśiṃcuṭa. prakāśiṃcuṭaku dīpamu vale itarula ādhīnamulō nuṃḍaka svayamugā prakāśiṃcuvāḍu).

  1. sarvaṃ yaḥ pradīpavat prakāśayati, svabhāsya kāmādi ghaṭādya bhāvē prakāśamātratayā svayamivaśiṣyatē - iti ca turīyōṃkāraḥ prakāśaḥ.

(dīpamuvale anniṃṭini ēdi prakāśiṃpacēyunō, tanu prakāśiṃpacēyuvastuvulu lēkapōyinanu tānē prakāśiṃcucu migiliyuṃḍunō, adiyē turīyamu ōṃkāramu - svayamugā prakāśiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.