← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వరాట్ svarāṭ

Original — తెలుగు
  1. స్వయం రాజతే ఇతి స్వరాట్ -

(స్వయముగా ప్రకాశించువాడు - ప్రకాశించుటకు ఇతరుల సహాయము అవసరము లేనివాడు. సూర్య చంద్రులు, అగ్ని పరమాత్మ తేజస్సు వారిలో యుండుటచేతనే వారు ప్రకాశించుచున్నారు.)

“యదాదిత్యగతం తేజః - - - |

యత్ చంద్ర మసః, యదగ్నౌ తత్తేజో విద్ధి మామకం ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

((సూర్య చంద్రాగ్నుల యందుండు తేజస్సు నాదే - భగవంతునిదే - యని తెలుసుకొనుము).

  1. స్వయమేవ రా జా - (స్వయముగా ప్రకాశించువాడు)

  2. స్వయం ప్రకాశః (స్వయముగా ప్రకాశించువాడు)

  3. స్వమాత్రతయా రాజమానిత్వాత్

(తనంతట తానే ప్రకాశించువాడు).

  1. బాహ్య సాధన మనపేక్ష్య తైజసాత్మనా స్వయమేవ రాజతే ఇతి స్వరాట్.

(ఇతర సాధనముల నపేక్షింపకనే, తాను తేజోమాత్రుడైనందువలన, ప్రకాశించువాడు - “జ్యోతిషామపి తజ్జోతిః” - (తేజస్సుగలవాటిలోని తేజస్సు తానే అయినవాడు)

  1. నిరాడాదీన్ అనపేక్ష్య స్యేన రూపేణ రాజతే ఇతి స్వరాట్.

(అనేక రూపములతో, అనేక విధములుగా ప్రకాశించు విరాడ్రూపము - విశ్వరూపము - మొదలగు వాటిని అపేక్షించకనే, తన స్వంత తేజోరూపముతో ప్రకాశించువాడు).

  1. స్వే మహిమ్ని రాజమానః, స్వ మహిమ్ని రాజతే ఇతి -

(తన మహిమ యందే, తన ఆధిక్యత (అన్ని విధముల ఆధిక్యత) కలిగియే యుండువాడు)

  1. స్వయమేవ రాజా అధిపతిర్భవతి.

(తానే రాజు అయినవాడు - అన్నింటికి అయినవాడు).

  1. పారతంత్ర్యా భావాత్ స్వరాట్ - స్వయమేవ రాజా -

(స్వతంత్రుడగుటచేత - పరతంత్రుడు కానివాడగుటచేత - ఇతరులకు వశము కానివాడగుటచేత స్వరాట్ - స్వయముగా రాజిల్లువాడు - స్వయముగా ప్రకాశించువాడు).

  1. స్వతంత్రః - అకర్మ వశ్యః, కర్మవశ్యానాం ప్రేరకశ్చ -

(స్వతంత్రుడు; కర్మఫలమునకు వశుడు కానివాడు - కర్మకు వశులైనవారిని ప్రేరేపించువాడు).

  1. ఇంద్రియాది నైరపేక్ష్యేణ స్వయమేవ రాజతే ఇతి - అవ్యాకృతాభిమానీ ఈశ్వరః -

(ఇంద్రియముల అపేక్షలేకుండా స్వయముగా ప్రకాశించువాడు - అవ్యాకృతము నభిమానించువాడు) - (అవిశేష పరబ్రహ్మ).

  1. స్వతస్సిద్ధ జ్ఞానీ -

(స్వయముగా సిద్ధించిన జ్ఞానము కలవాడు).

  1. స్వాత్మానం స్వయమేవ రాజయతి, ప్రకాశయతి, న పరేచ్ఛయా ఇతి.

(తనను తానే ప్రకాశింప చేయువాడు - ఇతరుల కోరికపైన కాదు)

  1. “విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతమనెడి యీశ్వరుని మాయోపాధి శరీరాలకు సాక్షి స్వరూపమైనదే మూల ప్రకృతి, అదే స్వరాట్, అదే పంచభూతాలకున్నూ హేతువు”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము)

  2. “సో(అ)క్షరః పరమః స్వరాట్” ఇతి శ్రుతిః

(అతనే అక్షరుడు - నాశము లేనివాడు - అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు, అతనే స్వరాట్, పరబ్రహ్మ)

  1. అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె. అతని వలన స్వయంప్రకాశుండైన స్వరాట్టు సంభవించె. అందు చరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబయిన జగత్తు గలిగె. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)

  2. “సీ. - - - - ఆ వాసుదేవుని నాభి యందు సహస్ర సూర్య ప్రదీప్తి

దనరుచు, సకల జీవ నికాయ యుతమగు పంకజాతంబు సంభవమునొందె,

బరగంగ నందులో భగవదధిష్టుతుండై స్వరాట్టగు చతురాననుండు”

తే. జననమందెను,దత్పద్మ సంభవుండు

నామ రూప గుణాది సంజ్ఞాసమేతు

డగుచు నిర్మాణమొనరించె నఖిల జగము

- - -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 20 - 719)

  1. తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |

స బ్రహ్మ, స శివ స్సహరిస్సేందస్సో(అ)క్షరః పరమః స్వరాట్ - (మంత్రపుష్పము - 12)

(ఆ దీప శిఖవంటి దాని మధ్యమందు పరమాత్మ యున్నాడు - అతనే బ్రహ్మ, అతనే శివుడు, అతనే విష్ణువు, అతనే ఇంద్రుడు, అతనే అక్షరుడు, పరముడు, స్వరాట్).

Transliteration
  1. svayaṃ rājatē iti svarāṭ -

(svayamugā prakāśiṃcuvāḍu - prakāśiṃcuṭaku itarula sahāyamu avasaramu lēnivāḍu. sūrya caṃdrulu, agni paramātma tējassu vārilō yuṃḍuṭacētanē vāru prakāśiṃcucunnāru.)

“yadādityagataṃ tējaḥ - - - |

yat caṃdra masaḥ, yadagnau tattējō viddhi māmakaṃ ||“. (śrīmadbhagavadgīta - 15 - 12)

((sūrya caṃdrāgnula yaṃduṃḍu tējassu nādē - bhagavaṃtunidē - yani telusukonumu).

  1. svayamēva rā jā - (svayamugā prakāśiṃcuvāḍu)

  2. svayaṃ prakāśaḥ (svayamugā prakāśiṃcuvāḍu)

  3. svamātratayā rājamānitvāt

(tanaṃtaṭa tānē prakāśiṃcuvāḍu).

  1. bāhya sādhana manapēkṣya taijasātmanā svayamēva rājatē iti svarāṭ.

(itara sādhanamula napēkṣiṃpakanē, tānu tējōmātruḍainaṃduvalana, prakāśiṃcuvāḍu - “jyōtiṣāmapi tajjōtiḥ” - (tējassugalavāṭilōni tējassu tānē ayinavāḍu)

  1. nirāḍādīn anapēkṣya syēna rūpēṇa rājatē iti svarāṭ.

(anēka rūpamulatō, anēka vidhamulugā prakāśiṃcu virāḍrūpamu - viśvarūpamu - modalagu vāṭini apēkṣiṃcakanē, tana svaṃta tējōrūpamutō prakāśiṃcuvāḍu).

  1. svē mahimni rājamānaḥ, sva mahimni rājatē iti -

(tana mahima yaṃdē, tana ādhikyata (anni vidhamula ādhikyata) kaligiyē yuṃḍuvāḍu)

  1. svayamēva rājā adhipatirbhavati.

(tānē rāju ayinavāḍu - anniṃṭiki ayinavāḍu).

  1. pārataṃtryā bhāvāt svarāṭ - svayamēva rājā -

(svataṃtruḍaguṭacēta - parataṃtruḍu kānivāḍaguṭacēta - itarulaku vaśamu kānivāḍaguṭacēta svarāṭ - svayamugā rājilluvāḍu - svayamugā prakāśiṃcuvāḍu).

  1. svataṃtraḥ - akarma vaśyaḥ, karmavaśyānāṃ prērakaśca -

(svataṃtruḍu; karmaphalamunaku vaśuḍu kānivāḍu - karmaku vaśulainavārini prērēpiṃcuvāḍu).

  1. iṃdriyādi nairapēkṣyēṇa svayamēva rājatē iti - avyākṛtābhimānī īśvaraḥ -

(iṃdriyamula apēkṣalēkuṃḍā svayamugā prakāśiṃcuvāḍu - avyākṛtamu nabhimāniṃcuvāḍu) - (aviśēṣa parabrahma).

  1. svatassiddha jñānī -

(svayamugā siddhiṃcina jñānamu kalavāḍu).

  1. svātmānaṃ svayamēva rājayati, prakāśayati, na parēcchayā iti.

(tananu tānē prakāśiṃpa cēyuvāḍu - itarula kōrikapaina kādu)

  1. “virāṭ hiraṇyagarbha avyākṛtamaneḍi yīśvaruni māyōpādhi śarīrālaku sākṣi svarūpamainadē mūla prakṛti, adē svarāṭ, adē paṃcabhūtālakunnū hētuvu”. (brahmavidyā sudhārṇavamu)

  2. “sō(a)kṣaraḥ paramaḥ svarāṭ” iti śrutiḥ

(atanē akṣaruḍu - nāśamu lēnivāḍu - anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu, atanē svarāṭ, parabrahma)

  1. anniṃṭi saṃghātaṃbuna viśvarūpuṃḍaina virāṭpuruṣuṃḍu puṭṭe. atani valana svayaṃprakāśuṃḍaina svarāṭṭu saṃbhaviṃce. aṃdu carācara rūpaṃbula sthāvara jaṃgamātmakaṃbayina jagattu galige. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)

  2. “sī. - - - - ā vāsudēvuni nābhi yaṃdu sahasra sūrya pradīpti

danarucu, sakala jīva nikāya yutamagu paṃkajātaṃbu saṃbhavamunoṃde,

baragaṃga naṃdulō bhagavadadhiṣṭutuṃḍai svarāṭṭagu caturānanuṃḍu”

tē. jananamaṃdenu,datpadma saṃbhavuṃḍu

nāma rūpa guṇādi saṃjñāsamētu

ḍagucu nirmāṇamonariṃce nakhila jagamu

- - -. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 20 - 719)

  1. tasyāḥ śikhāyā madhyē paramātmā vyavasthitaḥ |

sa brahma, sa śiva ssaharissēṃdassō(a)kṣaraḥ paramaḥ svarāṭ - (maṃtrapuṣpamu - 12)

(ā dīpa śikhavaṃṭi dāni madhyamaṃdu paramātma yunnāḍu - atanē brahma, atanē śivuḍu, atanē viṣṇuvu, atanē iṃdruḍu, atanē akṣaruḍu, paramuḍu, svarāṭ).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.