← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వర్గం svargaṃ

Original — తెలుగు
  1. సుఖరూపము - సుఖమే అయినది - క్షీణించు స్వభావముగల సుఖము కలది.

  2. అభ్యుదయః - (శ్రేయస్సు)

  3. నాకలోకం; సురలోకం (దేవలోకము)

  4. నిరతిశయ సుఖం

(అన్నింటికి మించిన సుఖము)

  1. నిరతిశయానందః; తాదృక్ రూపో లోకః -

(అన్నింటికి మించిన ఆనందము - అట్టి లోకము; పరమపదము - ఉత్కృష్టమైన పదము, స్థానము)

  1. సర్వ పుణ్య కృన్నివాసం

(పుణ్యకర్మలు చేయువారందఱు నివసించునది).

  1. పరమాత్మైవ స్వర్గ శబ్దార్థః -

(స్వర్గమనగా పరమాత్మయే)

  1. “సత్సంసర్గస్స్వర్గః -” (నిరాలంబోపనిషత్)

(సజ్జనులతోడి సంబంధము కలిగియుండుట; లేక సత్ అనగా పరబ్రహ్మ - సత్యమగు పరబ్రహ్మతోడి సంబంధము).

  1. “యా న దుః ఖేన సంభిన్నం, న చ గ్రస్తమనంతరం |

అభిలాషోపనీతం చ తత్సుఖం స్వః పదాస్పదం ||“.

(దుఃఖము కలుగుటచేత తెగిపోని సుఖము, ఆ సుఖము తర్వాత దుఃఖము కలుగునదియగు సుఖము. స్వః అను పదమునకు అర్థము - ఈ విధమైన సుఖము ఈ లోకములో జీవునకు దేహముతో నుండగా కలుగదు, చనిపోయిన తర్వాత కలుగును).

  1. ధర్మస్య ఫలం

(ధర్మము వలన కలుగు ఫలము. ధర్మ మార్గమున ప్రవర్తించుటవలన - దానధర్మములవలన - కలుగు ఫలము).

  1. “ధర్మవంతులెల్ల దప్పక స్వర్గంబు

నందు భోగసమితి బొందుచుందు

రెలమి; బుణ్యపాపముల శేషముల వల్ల

బుట్టుచుందురవని, బుణ్య చరిత||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 163)

  1. “స్వర్గ శబ్దోహి -” యస్మిన్ నోష్ణం, న శీతలం, యన్న దుఃఖేన సం భిన్నం న చ గ్రస్తుమనంతరం |

అభిలాషోపనీతం తత్సుఖం స్వర్గపదాస్పదం ||“.

ఇతి నిరతిశయ సుఖ విశేషే వ్యుత్పన్నః. దేశ విశేషస్తు తాదృశ సుఖ భోగస్థానతయా స్వర్గః ధర్మాణాం చ స్వతః నిరతిశయ సుఖసాధనత్వం స్వభావః.

(స్వర్గమనగా వేడిమి లేనిది, చలి లేనిది, మధ్యను సుఖము నిచ్చు చుండుటవలనమధ్య మధ్య తెగిపోనిది అయిన సుఖము - ఆ సుఖము తర్వాత దుఃఖము రానిది అని చెప్పబడుటవలన నిరతిశయ సుఖవిశేషము - అట్టి సుఖము భోగస్థానమగుటచేత స్వర్గమని చెప్పబడినది. ధర్మములకు నిరతిశయమైన సుఖమును సాదించుటే స్వభావము)

  1. స్వర్గము కర్మవలన కలుగునది కనుక నిత్యముకాదు.

  2. “స్నాన తపో యజ్ఞ వసన భూహణాన్న ప్రదానాది సత్కర్మములవలన స్వర్గాది పుణ్యలోక ప్రాప్తియు - - - సిద్ధంబు. స్వర్గ నరకాది సంబంధంబులు జీవులకు స్వకర్మ ఫల భోగిక విన్యాసంబులు కావునం బునర్జనన కారణంబులై యుండు”.

(కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122)

  1. “త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థ యంతే |

తే పుణ్యమాసాద్య సురేంద్ర లోకమశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ |

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్నాః గతాగతం కామకామా లభంతే ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)

(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదివినవారు అగ్నిష్టోమాది యజ్ఞములను చేసినవారు, యజ్ఞదేవత యగు విష్ణువగు నన్నే ఉపాసించి స్వార్థపరులై స్వర్గమును పొందకోరుచున్నారు - ఇందువలన పుణ్యమును సంపాదించి దేవేంద్రలోకము (స్వర్గలోకము) ను పొంది, అచ్చట దివ్యమైన ఆ లోకభోగములననుభవించి ఆ అనుభవము వలన చేసిన పుణ్యము క్షీణించగా, మరల గర్భవాసము మొదలగు యాతనలుగల మానవులుగా మనుష్యలోకములో పుట్టుదురు. మరల మానవ లోకములో యజ్ఞ యాగాదులను చేసి మరల స్వర్గమును పొంది, మరల భూలోకమునకు వచ్చుచుందురు - ఈ ప్రకారముగా భూలోకమునుండి స్వగలోకమునకు, స్వర్గలోకమునుండి భూలోకమునకు తిరుగుచుందురు - దీనిని బట్టి స్వర్గలోక సుఖము శాశ్వతముకాదని తేలుచున్నది)

  1. “జ్యోతిష్టో మేవ స్వర్గకామోయజేత”

(స్వర్గమును పొందకోరువారు జ్యోతిష్టామమను యజ్ఞము చేయవలయును).

  1. నిరతిశయానంద ప్రకాశరూపః పరమాత్మైవాత్ర స్వర్గ శబ్దార్థః - ప్రకరణాత్ తస్యైవ సుఖరూపత్వాత్ తదంశత్వాత్ చేతరస్య సుఖస్య.

(నిరతిశయానంద ప్రకాశరూపము అగు పరమాత్మయే ఇక్కడ స్వర్గశబ్దమున కర్థము. అది సుఖరూపము, ఇతర సుఖము దాని అంశయే).

  1. “స్వర్గే పుణ్యస్య సామగ్ర్యా భుజ్యంతే పరమం సుఖం |

ఉత్తమేన తు పుణ్యేన ప్రాప్నోతి సర్గముత్తమం |

మధ్యమేన తథా మధ్యః స్వర్గో భవతి నాన్యథా |

కనిష్టేన తు పుణ్యేన స్వర్గో భవతి తాద్రుశః |

పరోత్కర్షా సహిష్ణు త్వం స్పర్థా చైవ సమైశ్చతైః |

కనిష్టేషు చ సంతోషో యావత్ పుణ్యక్షయో భవేత్ |

క్షీణే పుణ్యే విశంత్యేతం మర్త్యలోకం చ మానవాః |

ఇత్యాది గుణ దోషాశ్చ స్వర్గే రాజన్నవథితాః ||” (యోగవాశిష్టము - 0 - 1 - 36 to 38)

(చేసిన పుణ్యము కొలది స్వర్గమందు గొప్ప సుఖము ననుభవించెదరు. ఉత్తమమైన పుణ్యము చేయుటవలన ఉత్తమమైన స్వర్గమును పొందుదురు, మధ్యమమైన పుణ్యము చేసినందువలన మధ్యమ స్వర్గమును పొందుదురు - తక్కువ పుణ్యము చేసినందువలన తక్కువ స్వర్గమును పొందుదురు - ఇట్లు అనుభవము కలుగుటవలన చేసిన పుణ్యము క్షీణించగా మానవులు మర్త్యలోకమును ప్రవేశించేదరు - ఇట్లు స్వర్గమందు గుణ దోషములవలనవ్యత్యాస ఫలము కలుగును).

  1. “స్వధర్మ త్యాగినాం స్వర్గః స్వప్నేప్యత్యంత దుర్లభః |” (గీతాభావప్రకాశము -2 - 21)

(స్వధర్మమును వదలివేసినవారికి స్వర్గము కలలో కూడ పొందుట దుర్లభము).

  1. “జన్మాంతరములేమి స్వర్గమైన విష్ణుభక్తుల సంగంబు వెలకురాదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 407)

  2. “యస్త్వయా సహ సస్వర్గః, నిరయో యస్త్వయావినా ||”.

(నీతో కలిసి యుండుటయే స్వర్గము - నీతో కలిసి యుండకుండుటయే నరకము) (సీతామహాదేవి).

Transliteration
  1. sukharūpamu - sukhamē ayinadi - kṣīṇiṃcu svabhāvamugala sukhamu kaladi.

  2. abhyudayaḥ - (śrēyassu)

  3. nākalōkaṃ; suralōkaṃ (dēvalōkamu)

  4. niratiśaya sukhaṃ

(anniṃṭiki miṃcina sukhamu)

  1. niratiśayānaṃdaḥ; tādṛk rūpō lōkaḥ -

(anniṃṭiki miṃcina ānaṃdamu - aṭṭi lōkamu; paramapadamu - utkṛṣṭamaina padamu, sthānamu)

  1. sarva puṇya kṛnnivāsaṃ

(puṇyakarmalu cēyuvāraṃdaṟu nivasiṃcunadi).

  1. paramātmaiva svarga śabdārthaḥ -

(svargamanagā paramātmayē)

  1. “satsaṃsargassvargaḥ -” (nirālaṃbōpaniṣat)

(sajjanulatōḍi saṃbaṃdhamu kaligiyuṃḍuṭa; lēka sat anagā parabrahma - satyamagu parabrahmatōḍi saṃbaṃdhamu).

  1. “yā na duḥ khēna saṃbhinnaṃ, na ca grastamanaṃtaraṃ |

abhilāṣōpanītaṃ ca tatsukhaṃ svaḥ padāspadaṃ ||“.

(duḥkhamu kaluguṭacēta tegipōni sukhamu, ā sukhamu tarvāta duḥkhamu kalugunadiyagu sukhamu. svaḥ anu padamunaku arthamu - ī vidhamaina sukhamu ī lōkamulō jīvunaku dēhamutō nuṃḍagā kalugadu, canipōyina tarvāta kalugunu).

  1. dharmasya phalaṃ

(dharmamu valana kalugu phalamu. dharma mārgamuna pravartiṃcuṭavalana - dānadharmamulavalana - kalugu phalamu).

  1. “dharmavaṃtulella dappaka svargaṃbu

naṃdu bhōgasamiti boṃducuṃdu

relami; buṇyapāpamula śēṣamula valla

buṭṭucuṃduravani, buṇya carita||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 163)

  1. “svarga śabdōhi -” yasmin nōṣṇaṃ, na śītalaṃ, yanna duḥkhēna saṃ bhinnaṃ na ca grastumanaṃtaraṃ |

abhilāṣōpanītaṃ tatsukhaṃ svargapadāspadaṃ ||“.

iti niratiśaya sukha viśēṣē vyutpannaḥ. dēśa viśēṣastu tādṛśa sukha bhōgasthānatayā svargaḥ dharmāṇāṃ ca svataḥ niratiśaya sukhasādhanatvaṃ svabhāvaḥ.

(svargamanagā vēḍimi lēnidi, cali lēnidi, madhyanu sukhamu niccu cuṃḍuṭavalanamadhya madhya tegipōnidi ayina sukhamu - ā sukhamu tarvāta duḥkhamu rānidi ani ceppabaḍuṭavalana niratiśaya sukhaviśēṣamu - aṭṭi sukhamu bhōgasthānamaguṭacēta svargamani ceppabaḍinadi. dharmamulaku niratiśayamaina sukhamunu sādiṃcuṭē svabhāvamu)

  1. svargamu karmavalana kalugunadi kanuka nityamukādu.

  2. “snāna tapō yajña vasana bhūhaṇānna pradānādi satkarmamulavalana svargādi puṇyalōka prāptiyu - - - siddhaṃbu. svarga narakādi saṃbaṃdhaṃbulu jīvulaku svakarma phala bhōgika vinyāsaṃbulu kāvunaṃ bunarjanana kāraṇaṃbulai yuṃḍu”.

(kulaśēkharamahīpāla caritra - 2 - 122)

  1. “traividyā māṃ sōmapāḥ pūtapāpāḥ yajñairiṣṭvā svargatiṃ prārtha yaṃtē |

tē puṇyamāsādya surēṃdra lōkamaśnaṃti divyān divi dēvabhōgān |

tē taṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti |

ēvaṃ trayī dharma manu prapannāḥ gatāgataṃ kāmakāmā labhaṃtē ||“. (śrīmadbhagavadgīta - 9 - 20, 21)

(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu cadivinavāru agniṣṭōmādi yajñamulanu cēsinavāru, yajñadēvata yagu viṣṇuvagu nannē upāsiṃci svārthaparulai svargamunu poṃdakōrucunnāru - iṃduvalana puṇyamunu saṃpādiṃci dēvēṃdralōkamu (svargalōkamu) nu poṃdi, accaṭa divyamaina ā lōkabhōgamulananubhaviṃci ā anubhavamu valana cēsina puṇyamu kṣīṇiṃcagā, marala garbhavāsamu modalagu yātanalugala mānavulugā manuṣyalōkamulō puṭṭuduru. marala mānava lōkamulō yajña yāgādulanu cēsi marala svargamunu poṃdi, marala bhūlōkamunaku vaccucuṃduru - ī prakāramugā bhūlōkamunuṃḍi svagalōkamunaku, svargalōkamunuṃḍi bhūlōkamunaku tirugucuṃduru - dīnini baṭṭi svargalōka sukhamu śāśvatamukādani tēlucunnadi)

  1. “jyōtiṣṭō mēva svargakāmōyajēta”

(svargamunu poṃdakōruvāru jyōtiṣṭāmamanu yajñamu cēyavalayunu).

  1. niratiśayānaṃda prakāśarūpaḥ paramātmaivātra svarga śabdārthaḥ - prakaraṇāt tasyaiva sukharūpatvāt tadaṃśatvāt cētarasya sukhasya.

(niratiśayānaṃda prakāśarūpamu agu paramātmayē ikkaḍa svargaśabdamuna karthamu. adi sukharūpamu, itara sukhamu dāni aṃśayē).

  1. “svargē puṇyasya sāmagryā bhujyaṃtē paramaṃ sukhaṃ |

uttamēna tu puṇyēna prāpnōti sargamuttamaṃ |

madhyamēna tathā madhyaḥ svargō bhavati nānyathā |

kaniṣṭēna tu puṇyēna svargō bhavati tādruśaḥ |

parōtkarṣā sahiṣṇu tvaṃ sparthā caiva samaiścataiḥ |

kaniṣṭēṣu ca saṃtōṣō yāvat puṇyakṣayō bhavēt |

kṣīṇē puṇyē viśaṃtyētaṃ martyalōkaṃ ca mānavāḥ |

ityādi guṇa dōṣāśca svargē rājannavathitāḥ ||” (yōgavāśiṣṭamu - 0 - 1 - 36 to 38)

(cēsina puṇyamu koladi svargamaṃdu goppa sukhamu nanubhaviṃcedaru. uttamamaina puṇyamu cēyuṭavalana uttamamaina svargamunu poṃduduru, madhyamamaina puṇyamu cēsinaṃduvalana madhyama svargamunu poṃduduru - takkuva puṇyamu cēsinaṃduvalana takkuva svargamunu poṃduduru - iṭlu anubhavamu kaluguṭavalana cēsina puṇyamu kṣīṇiṃcagā mānavulu martyalōkamunu pravēśiṃcēdaru - iṭlu svargamaṃdu guṇa dōṣamulavalanavyatyāsa phalamu kalugunu).

  1. “svadharma tyāgināṃ svargaḥ svapnēpyatyaṃta durlabhaḥ |” (gītābhāvaprakāśamu -2 - 21)

(svadharmamunu vadalivēsinavāriki svargamu kalalō kūḍa poṃduṭa durlabhamu).

  1. “janmāṃtaramulēmi svargamaina viṣṇubhaktula saṃgaṃbu velakurādu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 407)

  2. “yastvayā saha sasvargaḥ, nirayō yastvayāvinā ||”.

(nītō kalisi yuṃḍuṭayē svargamu - nītō kalisi yuṃḍakuṃḍuṭayē narakamu) (sītāmahādēvi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.